స్కిజోఫ్రెనియా.. ముందే ఎలా గుర్తించాలి?

లేనిది ఉన్నట్లుగా, జరగనిది జరిగినట్లుగా భావించడం, బలంగా నమ్మడం స్కిజోఫ్రెనియా లక్షణం. తొలి దశలోనే గుర్తిస్తే, కంట్రోల్ చెయ్యవచ్చు. మాయో క్లినిక్ ప్రకారం.. ఈ వ్యాధి వచ్చే దశలో వ్యక్తి.. ఒంటరితనాన్ని ఇష్టపడతారు. పరిశుభ్రత పాటించరు. ఆసక్తి చూపరు. ఎప్పుడూ ఒకేలా చూస్తారు. అసందర్భంగా నవ్వుతారు లేదా కోపడతారు. అనుమానిస్తారు. ఎవరో హాని చెయ్యబోతున్నారని నమ్ముతారు. ఏదేదో మాట్లాడతారు. కాంతి, శబ్దాల్ని భరించలేరు. ఈ లక్షణాలు ఉంటే, వెంటనే డాక్టర్‌ని కలవాలి.



