← Back to news

దక్షిణాదికి దారుణమైన శిక్ష

By aravinda nyayapati· 15 Apr 2026· Telugu Report· Hyderabad
దక్షిణాదికి దారుణమైన శిక్ష

మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ల అమలు, పార్లమెంటులో సీట్ల సంఖ్యను 850 వరకు పెంచడానికి వీలుగా కేంద్రం తీసుకువస్తున్న 131 రాజ్యాంగ సవరణ బిల్లు-2026 పొలిటికల్ గా హీట్ పెంచుతోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇది దక్షిణాదిపై కేంద్రం పన్నిన కుట్రని మండిపడ్డారు. దక్షిణాది రాష్ట్రాలన్నీ ఏకమై ఈ బిల్లుని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. సీట్లు పెంచకుండా నియోజకవర్గాలు పెంచితే తమకు ఓకేనంటూ ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఈ బిల్లుని అడ్డుకోవాలంటూ ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి సీఎంలకు రేవంత్ లేఖలు రాశారు. ప్రోరేటా అంటే జనాభా ఆధారంగా సీట్లు పెంచడం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందని అన్నారు.

దక్షిణాదికి దారుణమైన శిక్ష
దక్షిణాదికి దారుణమైన శిక్ష

More in Politics