← Back to news

షర్టు జేబు ఎడమవైపే ఎందుకు ఉంటుందో తెలుసా?

By Nani Garikina· 19h ago
షర్టు జేబు ఎడమవైపే ఎందుకు ఉంటుందో తెలుసా?

మనం రోజూ వేసుకునే షర్టుల్లో ఓ కామన్ విషయం ఎప్పుడైనా గమనించారా? దాదాపు అన్ని షర్టుల్లో జేబు ఎడమవైపే ఉంటుంది. ఇది కేవలం డిజైన్ కోసం కాదు. దీని వెనక ఓ రీజన్ ఉంది. ప్రపంచంలో 85-90% మంది కుడిచేతితోనే పనులు చేస్తారు. అందుకే షర్టు జేబును ఎడమవైపు పెడితే, కుడిచేతితో అందులో ఉన్న పెన్, డబ్బులు, ఐడీ కార్డ్ లాంటి వాటిని ఈజీగా తీసుకోవచ్చు. ఇదే డిజైన్ తర్వాత స్టాండర్డ్‌గా మారిపోయి, ఇప్పటికీ చాలా షర్టుల్లో అలాగే కొనసాగుతోంది.

More in General