ఎన్నికల వేళ.. వాహనాలపై పోలీసుల నిఘా

విజయనగరం జిల్లా రాజాం మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ముమ్మర వాహన తనిఖీలు చేపట్టారు. అక్రమ మద్యం, నగదు రవాణాను అడ్డుకునేందుకు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పట్టణ ఇన్‌స్పెక్టర్ డి. నవీన్ కుమార్ తెలిపారు. ఎన్నికలు ముగిసే వరకు తనిఖీలు కొనసాగుతాయని, అక్రమ వస్తువులు పట్టుబడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవసరాల కోసం అధిక మొత్తంలో నగదు తీసుకెళ్లేవారు సంబంధిత ఆధారాలను వెంట ఉంచుకోవాలని సూచించారు.



