మైనర్ అబ్బాయిలపై క్యాథలిక ఫాదర్ లైంగికదాడి

కర్ణాటక రాష్ట్రం మంగళూరులో దారుణం జరిగింది. వాలెన్సియా సెయింట్ విన్సెంట్ ఫెర్రర్ చర్చికి చెందిన ఫాదర్ సిప్రియన్ పింటో చర్చికి ప్రేయర్ కోసం వచ్చిన 14 ఏళ్ల బాలుడిపై లైంగికదాడి పాల్పడ్డాడు. బాలుడిని ఒక గదికి తీసుకెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించాడని పోలీసులు తెలిపారు. బాలుడు ఈ విషయాన్ని తన స్నేహితులతో పంచుకోగా, మరో ఐదుగురు పిల్లలు కూడా ఇలాంటి వేధింపులనే ఎదుర్కొన్నట్లు బయటపడింది. ఫాదర్ పరారవ్వగా, పోలీసులు అతణ్ని అదుపులోకి తీసుకుని పోక్సో కేసు పెట్టారు.


