← Back to news

పంటలు పోయే.. కరెంటు రాదాయే.!

By Krishna· 3h ago· X

తెలంగాణ ప్రభుత్వం రైతులకు నాణ్యమైన కరెంటు ఇస్తున్నామని చెబుతుంటే.. సీఎం సొంత గ్రామంలో రైతులు.. పంటలు ఎండిపోతున్నాయంటూ, తీవ్ర ఆవేదనతో పాటలు పాడుతూ, తమ గోడు చెబుతూ.. ధర్నా చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా.. కొండారెడ్డిపల్లి దగ్గర్లోని శ్రీశైలం-హైదరాబాద్ నేషనల్ హైవేపై రైతులు ఈ మెరుపు ధర్నా చేపట్టారు. తమకు రోజూ 6 నుంచి 8 గంటలు మాత్రమే కరెంటు వస్తోందని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 24 గంటల కరెంట్ ఇచ్చేవరకు ఆందోళన విరమించేది లేదని రైతులు హెచ్చరించారు.

More in TG