త్వరలో తెలంగాణకు రాబోతున్న అభిజీత్ దీప్కే

పాలిటెక్నిక్ కాలేజీలను కాపాడుకునేందుకు పోరాడుతున్న తెలంగాణ స్టూడెంట్స్‌కు CJP ఫౌండర్ అభిజీత్ దీప్కే పూర్తి మద్దతు ప్రకటించారు. తన తండ్రి కూడా డిప్లొమా చదివే ఉద్యోగం సాధించారని, స్టూడెంట్స్‌కు పాలిటెక్నిక్ ఎంత ముఖ్యమో తనకు తెలుసన్నారు. హక్కుల కోసం వెనక్కి తగ్గకుండా పోరాడాలని, తమ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. విద్యార్థుల డిమాండ్లకు సపోర్ట్ చేస్తూ త్వరలోనే తాను తెలంగాణకు వస్తానని, పూర్తి సహాయం అందిస్తామని వీడియొ కాల్ లో మాట్లాడారు.


