← Back to news

మళ్లీ జనసేన లోకి తోట?

By DS· 14 Apr 2026· Telugu Report· visakhapatnam
మళ్లీ జనసేన లోకి తోట?

మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్ మళ్లీ జనసేనలో జాయిన్ అవుతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కలవడంతో దీనిపై క్లారిటీ వచ్చింది. గతంలో జనసేననుంచే ఆయన బీఆర్ ఎస్ లో చేరారు. ఏపి నుంచి తెలంగాణ పార్టీ అయిన బీఆర్ ఎస్ లో చేరడం అప్పట్లో సెన్సేషన్ అయింది. ఇప్పుడు కూటమి పవర్ లోకి రావడంతో మళ్లీ సొంత గూటికి చేరుకుంటున్నారు. తొందరలోనే అధికారికంగా ఒక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది. తోట చంద్రశేఖర్ గతంలో 99 టివిని కొన్నాళ్లు నిర్వహించారు.

More in Politics