కరెంట్ సమస్య పరిష్కరించాలంటూ రైతుల ధర్నా

TG: సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట సబ్‌స్టేషన్ ఎదుట మల్లారెడ్డిపేట రైతులు ధర్నా చేపట్టారు. వేళాపాళా లేని విద్యుత్ సరఫరాతో పంటలకు నీరు అందక ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ఆందోళనతో ప్రధాన రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు జోక్యం చేసుకుని సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.

