ఇంటర్ పాసైతే చాలు.. రైల్వేలో 1,688 ఉద్యోగాలు!

రైల్వే RRB NTPC UG 2026-27లో మొత్తం 1,688 పోస్టులకు <a href="https://www.rrbapply.gov.in/#/auth/landing">నోటిఫికేషన్</a> రిలీజ్ అయ్యింది. కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ (700), జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ (600), అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ (200), ట్రైన్స్ క్లర్క్ (188) పోస్టులున్నాయి. అక్టోబర్ 15 నుంచి నవంబర్ 13 వరకు ఆన్లైన్లో <a href="https://www.rrbapply.gov.in/#/auth/home">అప్లై చేయొచ్చు.</a> గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్ పాస్ అయి ఉండాలి. ఏజ్ 18–30 ఏళ్లు (జనవరి 1, 2027 నాటికి). జనరల్/OBCలకు ₹500, ఇతరులకు ₹250 ఫీజు ఉంటుంది.



