25 వేల ఖాళీలు.. నోటిఫికేషన్ 7 వేలకేనా?

TG: రాష్ట్రంలో ఇటీవల పోలీస్ శాఖలోని వివిధ పోస్టుల భర్తీకి ప్రభుత్వం 7,437 ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే, రాష్ట్రంలో 25 వేల పోలీసు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, ఇంత తక్కువ పోస్టులతో నిరుద్యోగ యువతకు న్యాయం జరగదని హరీశ్ రావు విమర్శించారు. హైదరాబాద్ సహా పలు జిల్లాలకు కానిస్టేబుల్ పోస్టులు కేటాయించలేదని ఆయన అన్నారు. ఖాళీలన్నీ భర్తీ చేసి, పోస్టులను 25 వేలకు పెంచి, నిరుద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.



