← Back to news

ఆడవాళ్ల షర్ట్‌లు.. ఎడమవైపున బటన్స్ ఎందుకు?

By Vishi· 21h ago
ఆడవాళ్ల షర్ట్‌లు.. ఎడమవైపున బటన్స్ ఎందుకు?

ఎప్పుడైనా గమనించారా? అబ్బాయిల షర్టులకు బటన్లు కుడి వైపున ఉంటే, అమ్మాయిల షర్టులకు ఎడమ వైపున ఉంటాయి. ఇలా ఎందుకుంటాయో ఆలోచించారా? 13వ శతాబ్దపు రాజుల కాలంలో షర్టులు ధరించడం రాచరిక కుటుంబాల మహిళలకే సాధ్యమయ్యేది. వాటిని తొడిగించడానికి పరిచారికలు ఉండేవారు. ఎదురుగా నిలబడి దుస్తుల బటన్లు వేసేటప్పుడు, కుడిచేతి వాటం ఉన్న దాసీలకు మహిళల షర్టు బటన్లు ఎడమ వైపున ఉంటే వేయడం చాలా సులభంగా ఉండేది. అందుకే మహిళల దుస్తులకు ఎడమ వైపున బటన్లు కుట్టడం స్టార్ట్ అయ్యింది.

More in Infotainment