ఒకప్పుడు నితీష్ నే ఎదిరించి.. ఇప్పుడు సీఎం గా !!

బీహార్ కొత్త సీఎం సమ్రాట్ చౌదరి కి పదవులు కేక్ వాక్..మొదట్లో లాలూ యాదవ్ వెంట, నితీష్ కుమార్ వెంట ఉన్న సమ్రాట్ ఆ తర్వాత వారిపై తిరుగుబాటు చేసి బీజేపి పంచన చేరారు. అక్కడ నుంచి రకరకాల మంత్రి పదవులు అందుకుంటూ వచ్చారు. ఇప్పుడు అలయెన్స్ గవర్నమెంట్ లో బీహార్ కొత్త సీఎంగా ఎన్నికయ్యారు. తారాపూర్ నియోజక వర్గం వీరికి పెట్టని కోట. అక్కడనుంచే తండ్రి, తల్లి, సమ్రాట్ కూడా ఎన్నికయ్యారు. 12 ఏళ్లుగా ఈ నియోజక వర్గం వీరి గుప్పిట్లోనే ఉంది.



