Latest

బావిలో పడిన ట్రాక్టర్
Local· 21 Aug 2026

బావిలో పడిన ట్రాక్టర్

TG: నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం బావపూర్లో విషాదం నెలకొంది. పొలం దున్నుతున్న సమయంలో ట్రాక్టర్‌ను రివర్స్ చేస్తుండగా అదుపుతప్పి వ్యవసాయ బావిలో పడిపోయింది. ప్రమాదంలో డ్రైవర్ గంగాధర్ ట్రాక్టర్‌తోపాటు బావిలోని బురదలో చిక్కుకుని మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు, గ్రామస్థులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

ఓటరు నమోదుకు మంచి అవకాశం
Local· 21 Aug 2026

ఓటరు నమోదుకు మంచి అవకాశం

AP : గుంటూరు జిల్లాలో ఈ నెల 22, 23, 29, 30 తేదీల్లో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సాయికాంత్ వర్మ చెప్పారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అన్ని పోలింగ్ కేంద్రాల్లో బీఎల్‌ఓలు అందుబాటులో ఉంటారు. ఓటర్లు తమ వివరాలు చూసుకొని, కొత్తగా పేరు నమోదుకు, మార్పులు చేర్పులకు 6, 7, 8 ఫారాలు ఇచ్చి సరిచేసుకోవచ్చని కలెక్టర్ సూచించారు. అర్హులందరూ ఈ అవకాశాన్ని వాడుకోవాలని కోరారు.

కనీస రోడ్లు,సదుపాయాలు లేక స్థానిక ప్రజలు నరకయాతన
Local· 21 Aug 2026

కనీస రోడ్లు,సదుపాయాలు లేక స్థానిక ప్రజలు నరకయాతన

AP: తిరుపతి జిల్లా సత్యవేడు మండలం వెంకటరాజులకండ్రిగలో మౌలిక వసతులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సిమెంట్‌ రోడ్లు లేక వర్షాలకు రహదారులు బురదమయమవుతున్నాయని, రోడ్లు ఇరుకుగా ఉండటంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని గ్రామస్తులు తెలిపారు. అటవీ ప్రాంతం కావడంతో పాములు సంచరిస్తున్నా వీధి దీపాలు సక్ర మంగా వెలగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

తప్పిపోయిన బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు
Local· 21 Aug 2026

తప్పిపోయిన బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు

AP: తల్లిదండ్రులు మందలించడంతో ఇంటి నుంచి వెళ్లిపోయిన బాలుడిని అన్నమయ్య జిల్లా రాయచోటి అర్బన్ పోలీసులు సకాలంలో గుర్తించారు. అర్బన్ సీఐ వెంకట చలపతి ఆదేశాలతో ఎస్‌ఐ చండ్రాయుడు సిబ్బందితో కలిసి గాలింపు చేపట్టారు. సీసీ ఫుటేజీలను పరిశీలించి బాలుడు జగనన్న కాలనీలో ఉన్నట్లు గుర్తించారు. బాలుడిని క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు.

వెలుగొండ ప్రాజెక్ట్ టైల్ రన్ వాయిదా
Local· 21 Aug 2026

వెలుగొండ ప్రాజెక్ట్ టైల్ రన్ వాయిదా

AP: మార్కాపురం జిల్లా పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ ఈనెల 22న నిర్వహించాల్సిన ట్రయల్ రన్ వాయిదా పడింది. రెండో సొరంగంలో పనులు చేస్తుండగా ఇటీవల ప్రమాదవశాత్తు ఓ కార్మికుడు మృతి చెందడంతో రెండు, మూడు రోజులపాటు పనులను నిలిపివేశారు. కొన్ని పనులు పెండింగ్ ఉండటంతో రేపు జరగాల్సిన ట్రయల్ రన్ను అధికారులు వాయిదా వేశారు. పెండింగ్ పనులు పూర్తయిన తర్వాత కొత్త తేదీని ఖరారు చేయనున్నట్లు అధికారులు చెప్పారు

త్వరలో మనం కూడా స్పేస్‌కి వెళ్లొచ్చా?
Technology· 21 Aug 2026

త్వరలో మనం కూడా స్పేస్‌కి వెళ్లొచ్చా?

ఇప్పటివరకు స్పేస్‌కి వెళ్లడం అంటే ఆస్ట్రోనాట్స్‌కి మాత్రమే. కానీ చైనా దాన్ని మార్చే ప్రయత్నం చేస్తోంది. అక్కడి ప్రైవేట్ కంపెనీలు సాధారణ వ్యక్తులను కొన్ని నిమిషాల పాటు అంతరిక్ష అంచుల వరకు తీసుకెళ్లే ప్రయాణాలపై పని చేస్తున్నాయి. ఒక కంపెనీ 2028 నాటికి తొలి ప్రయాణాలను ప్లాన్ చేస్తూ, ఇప్పటికే టికెట్ల బుకింగ్ కూడా మొదలుపెట్టింది. మరోవైపు రాకెట్‌లను తిరిగి ల్యాండ్ చేసి మళ్లీ వాడే టెక్నాలజీ కూడా వేగంగా అభివృద్ధి చేస్తోంది. దీంతో ప్రయోగాల ఖర్చు తగ్గితే స్పేస్ టూరిజం మరింత అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

అక్రమ ఇసుక రవాణా, నిల్వలపై నిఘా పెంచాలి
Local· 21 Aug 2026

అక్రమ ఇసుక రవాణా, నిల్వలపై నిఘా పెంచాలి

మంచిర్యాల జిల్లా ఆన్‌లైన్ ద్వారా ఇసుక సరఫరాను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. జైపూర్ వేలాల ఇసుక రీచ్‌ను పరిశీలించారు. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న వారికి సకాలంలో ఇసుక అందించాలని సూచించారు. అక్రమ రవాణా, నిల్వలపై నిఘా పెంచి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు

దాతల సహకారంతో అదనపు తరగతిగదులు ప్రారంభం
Local· 21 Aug 2026

దాతల సహకారంతో అదనపు తరగతిగదులు ప్రారంభం

AP: గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరులో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో దాతల సహకారంతో నిర్మించిన అదనపు తరగతి గదులను ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ ప్రారంభించారు. నిర్మాణానికి కృషి చేసిన గ్రామ సీనియర్ నాయకుడు వాసిరెడ్డి జయరామయ్యను అభినందించారు. పాఠశాల అభివృద్ధికి సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు మెరుగుపరచడంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతోందన్నారు. ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యమని ఆయన అన్నారు.

30 వేల మంది ఓటర్లకు రెండో దశ SIR నోటీసులు
Local· 21 Aug 2026

30 వేల మంది ఓటర్లకు రెండో దశ SIR నోటీసులు

మంచిర్యాల్ జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో 30 వేల మంది ఓటర్లకు రెండో దశ SIRలో నోటీసులు అందనున్నాయని BJP జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్ గౌడ్ తెలిపారు. కిష్టంపేటలోని BMR గార్డెన్లో జరిగిన SIR వర్క్‌షాప్‌లో రాష్ట్ర SIR కన్వీనర్ ఆంథోనీ రెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. నోటీసులు అందినవారికి కార్యకర్తలు అండగా ఉండి సరైన సమాధానాలు సమర్పించేలా చూడాలన్నారు.

ఢిల్లీలో H1N1... ఒక్కరోజులో 114 కేసులు!
Health· 21 Aug 2026

ఢిల్లీలో H1N1... ఒక్కరోజులో 114 కేసులు!

ఢిల్లీలో ఫ్లూ కేసులు ఒక్కసారిగా పెరగడంతో ఇప్పుడు ఆరోగ్య శాఖ ఫోకస్ పెట్టింది. ఆగస్టు 20న ఒక్కరోజే 159 ఇన్‌ఫ్లుయెంజా కేసులు నమోదైతే, అందులో 114 H1N1 కేసులే ఉన్నాయి. దీంతో ఈ ఏడాది ఢిల్లీలో H1N1 కేసుల సంఖ్య 1,777కి చేరింది. వర్షాలు, ఉక్కపోత, మారుతున్న వాతావరణం, ఎక్కువగా ఇండోర్‌లో గడపడం వల్ల ఫ్లూ వ్యాప్తి పెరుగుతోందని డాక్టర్లు చెబుతున్నారు. జ్వరం, దగ్గు, గొంతునొప్పి లాంటి లక్షణాలను తేలిగ్గా తీసుకోకుండా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. భయపడాల్సిన అవసరం లేదు… కానీ లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి.

రైలులో సీటు కింద సూట్‌కేసుల్లో గంజాయి పట్టివేత
Local· 21 Aug 2026

రైలులో సీటు కింద సూట్‌కేసుల్లో గంజాయి పట్టివేత

TG: సాయి షిర్డీ ఎక్స్‌ప్రెస్‌లో గంజాయి రవాణా జరుగుతోందన్న సమాచారంతో RPF పోలీసులు, నిజామాబాద్ ఎక్సైజ్ SHO ఆధ్వర్యంలో సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఇద్దరు వ్యక్తులు సీటు కింద రెండు సూట్‌కేసులతో అనుమానాస్పదంగా ప్రయాణిస్తుండగా పట్టుకుని సోదా చేశారు. 24.3 కిలోల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాకు చెందిన గణేష్ పోలి(20), దీపక్ సాహు(21)లను అరెస్ట్ చేశారు.

ఆసిఫాబాద్‌లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
Local· 21 Aug 2026

ఆసిఫాబాద్‌లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

TG : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రమైన ఆసిఫాబాద్ బజార్‌వాడి కాలనీలో రేషన్ షాపులో లబ్ధిదారులకు మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ MD అహ్మద్ స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలకు సేవలు తేలిగ్గా అందించేందుకే ఈ కార్డులు ఇస్తున్నామని చెప్పారు. అర్హులైన వారందరికీ కార్డులు ఇస్తున్నామని, ఇంకా తీసుకోని వారు వెంటనే తమ రేషన్ డీలర్‌ను కలవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, BRS నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

రహదారి సమస్య కోసం వినతి ఇచ్చిన గిరిజనులు
Local· 21 Aug 2026

రహదారి సమస్య కోసం వినతి ఇచ్చిన గిరిజనులు

AP: అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి(మం) వలస గురువు రహదారి సమస్యను పరిష్కరించి ప్రజలకు రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. జిసిసి, చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. తాము నిత్యం వినియోగించే రహదారి చాలా కాలంగా సమస్యాత్మకంగా ఉందని తెలిపారు. రహదారి సక్రమంగా లేకపోవడంతో గ్రామస్తులు, విద్యార్థులు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

పేదింటి యువతి వివాహానికి అండగా ఆలయ ఫౌండేషన్
Local· 21 Aug 2026

పేదింటి యువతి వివాహానికి అండగా ఆలయ ఫౌండేషన్

TG: పెద్దపల్లి జిల్లా రామగుండానికి చెందిన సోదరి కల్లెడ దివ్య వివాహానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని ఆలయ ఫౌండేషన్‌కు తెలియజేయడంతో మాజీ కార్పొరేటర్ పుష శివ కుమార్ దాతల సహకారంతో రూ.35,000 ఆర్థిక సాయం అందించారు. భోజన ఏర్పాట్లు కూడా చేశారు. రాజ్యలక్ష్మి కాలనీవాసులు, స్వచ్ఛంద సంఘాల సభ్యులు గొలివాడ చంద్రకళ ఇతర సభ్యులు కలిసి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై దుష్ప్రచారం మానుకోవాలి
Local· 21 Aug 2026

రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై దుష్ప్రచారం మానుకోవాలి

రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌పై తప్పుడు ప్రచారం చేస్తూ ‘కల్పిత నాయకుడు’ పేరుతో పుస్తకం ప్రచురించేందుకు ప్రయత్నిస్తున్న హమారా ప్రసాద్‌ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని సమతా సైనిక్‌ దళ్‌ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్‌ మార్షల్‌ దుర్గం నగేష్‌ అన్నారు. అంబేద్కర్‌ ఆశయాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారిని అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతి అంబేద్కర్‌ వాదిపై ఉందన్నారు. తప్పుడు ప్రచారాన్ని అడ్డుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాల్లో నిరసన కార్యక్రమాలతో పాటు చట్టపర చర్యలు తీసుకుంటామన్నారు.

లడఖ్ “Gen-Z” వీడియోలో కొత్త ట్విస్ట్
Gen Z· 21 Aug 2026

లడఖ్ “Gen-Z” వీడియోలో కొత్త ట్విస్ట్

ఐదు గంటలు వెయిట్ చేయడంతో లడఖ్‌లో భద్రతా సిబ్బందితో వాగ్వాదానికి దిగిన మహిళా టూరిస్ట్ వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. “We are Gen Z” అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఇప్పుడు అదే మహిళ ఆర్మీ, జమ్మూ కశ్మీర్ పోలీస్, లడఖ్ పోలీసులకు క్షమాపణ చెప్పింది. రోడ్ ఎందుకు మూసేశారో తనకు తెలియదని, గంటల తరబడి వేచి ఉండటంతో కోపంలో అలా మాట్లాడానని ఆమె చెప్పింది. వైరల్ అయిన కొన్ని సెకన్ల వీడియో వెనుక పూర్తి కథ ఎంత ముఖ్యమో ఈ ఘటన మరోసారి చూపించింది.

తాళం వేసిన మూడు ఇళ్లలో చోరీ!
Local· 21 Aug 2026

తాళం వేసిన మూడు ఇళ్లలో చోరీ!

TG: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలోని వైఎన్ కాలనీలో తాళం వేసి ఉన్న మూడు ఇళ్లలో చోరీలు జరిగాయి. అర్ధరాత్రి ముసుగులు ధరించిన ముగ్గురు అనుమానితులు సంచరిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. మూడు ఇళ్లలో కలిపి సుమారు 10 తులాల వెండి వస్తువులు చోరీకి గురైనట్లు సమాచారం. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

భూ రీసర్వే, గృహ నిర్మాణంపై మంత్రి సమీక్ష
Local· 21 Aug 2026

భూ రీసర్వే, గృహ నిర్మాణంపై మంత్రి సమీక్ష

TG: ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో చేపడుతున్న భూ రీసర్వే, గృహ నిర్మాణం, రెవెన్యూ అంశాలపై రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. ఆయా శాఖల పనితీరును సమీక్షిస్తూ అధికారులకు సూచనలు, ఆదేశాలు జారీ చేస్తున్నారు. సమావేశంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్లు, రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల అధికారులు పాల్గొన్నారు.

మీ పేరుపై ఉన్న SIMలపై కొత్త రూల్!
National· 21 Aug 2026

మీ పేరుపై ఉన్న SIMలపై కొత్త రూల్!

మీరు SIM మార్చుకునే ముందు ఒకసారి ఇది తెలుసుకోవాలి. ఆగస్టు 24 నుంచి మీ పేరుపై ఇప్పటికే 9 మొబైల్ కనెక్షన్లు ఉంటే కొత్త SIM తీసుకోవడంపై పరిమితి ఉండనుంది. కొత్త కనెక్షన్ ఇచ్చే ముందు మీ పేరుపై ఉన్న నంబర్లను టెలికాం కంపెనీలు చెక్ చేయాల్సి ఉంటుంది. ఈ రూల్ ప్రధానంగా ఇతరుల పేర్లపై SIMలు తీసుకుని జరిగే మోసాలను తగ్గించడానికే. సాధారణంగా ఒకటి, రెండు SIMలు వాడేవారికి పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. కానీ మీ పేరుపై తెలియకుండా ఏదైనా నంబర్ ఉంటే? అదే ఇప్పుడు చెక్ చేసుకోవాల్సిన అసలు విషయం.

బీసీ మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు
Local· 21 Aug 2026

బీసీ మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు

మంచిర్యాల్ జిల్లాలోని BC వర్గాలకు చెందిన నిరుద్యోగ మహిళలకు 100% రాయితీపై ఆటోమేటిక్ కుట్టు మిషన్లు అందించనున్నట్లు జిల్లా BC అభివృద్ధి అధికారిణి నీరటి రాజేశ్వరి తెలిపారు. అర్హులైన మహిళలు సెప్టెంబర్ 13లోగా ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులను గ్రామీణులు MPDO, పట్టణవాసులు మున్సిపల్ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.

MRO కార్యాలయం కోసం నడిరోడ్డుపై వంటావార్పు
Local· 21 Aug 2026

MRO కార్యాలయం కోసం నడిరోడ్డుపై వంటావార్పు

ప్రజలకు అందుబాటులో ప్రభుత్వ కార్యాలయాలుండాలి కానీ, ఎక్కడో ఊరి చివరన నిర్మిస్తామంటే ఎట్ల అని ప్రజలు అడుగుతున్నారు. రాష్ర్ట వ్యాప్తంగా అనేక జిల్లాల్లో మండల కార్యాలయాలు మండల కేంద్రంలోనే ఏర్పాటు చేయాలనే డిమాండు ఊపందుకుంటున్నది. తాజాగా మంచిర్యాల జిల్ల కన్నెపల్లి మండల కేంద్రంలోనే MRO కార్యాలయం నిర్మించాలని డిమాండ్ చేస్తూ మండల ప్రజలు, ప్రజాసంఘాలు, ఉద్యమకారులు రోడ్డెక్కారు. శుక్రవారం ఆటో స్టాండ్ వద్ద నడిరోడ్డుపై వంటావార్పు, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.