Latest

నువ్వు లేకుండా ఆడలేను- మెస్సీ
Sports· 12 Aug 2026

నువ్వు లేకుండా ఆడలేను- మెస్సీ

తన తండ్రి, ఏజెంట్ జోర్జ్ మెస్సీ హఠాన్మరణం(ఆగస్టు 8)తో అర్జెంటీనా ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ <a href="https://www.instagram.com/p/Db8MYnQjYsC/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ==">మెస్సీ</a> తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. "నువ్వు లేవు అంటే నమ్మలేకపోతున్నా.. నువ్వు లేకుండా ఎలా ముందుకు సాగాలో అర్థం కావట్లేదు" అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాశారు. ఇకపై ఎక్కువ కాలం ఫుట్‌బాల్ ఆడటంపై తనకు సీరియస్ డౌట్స్ ఉన్నాయని షాకింగ్ కామెంట్స్ చేశారు. చిన్నప్పటి నుండి తనకు నాన్న, ఫ్రెండ్, ప్రతినిధిగా అండగా నిలిచారని, ఆయనను చాలా మిస్ అవుతున్నట్లు ఎమోషనల్ పోస్ట్ చేశారు.

ఇల్లు కూల్చివేతలపై సుప్రీంకోర్టు కామెంట్స్
Legal· 12 Aug 2026

ఇల్లు కూల్చివేతలపై సుప్రీంకోర్టు కామెంట్స్

అక్రమ గృహాలను కూల్చివేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతుందో, ఆ బాధితులకు పునరావాసం కల్పించాల్సిన బాధ్యత కూడా అంతే ఉందని సుప్రీంకోర్టు స్టేట్మెంట్ ఇచ్చింది. కూల్చివేత మరియు పునరావాసం రెండూ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న "జంట బాధ్యతలు"(Twin Responsibilities) అని స్పష్టం చేసింది. ఇల్లు కోల్పోయిన కుటుంబాలను ఆదుకోవడం ప్రభుత్వ కనీస ధర్మమని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది.

Blinkit లైసెన్స్ రద్దు, Zepto గోడౌన్ సీజ్🤯
News· 12 Aug 2026

Blinkit లైసెన్స్ రద్దు, Zepto గోడౌన్ సీజ్🤯

సిటీల్లో సరుకులకు BlinkIt, Zepto apps పై ఆధారపడే వాళ్లు భారీగా పెరిగారు. కానీ ఆ సంస్థలు ఫుడ్ సేఫ్టీ విషయంలో కాంప్రమైజ్ అయ్యాయని తాజా తనిఖీలు చెప్తున్నాయ్. ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలు ఫాలో అవలేదని ముంబై మలాడ్ Blinkit స్టోర్ లైసెన్స్‌ రద్దు చేశారు. బెంగళూరు Zepto గోడౌన్ సీజ్ చేశారు. పురుగులు, అపరిశుభ్రత తప్పుడు లేబుల్స్ ఐడెంటిఫై చేశారు. మే 25- జూలై 31 మధ్య ముంబైలో 3,137 చోట్ల తనిఖీ చేసి 764 నోటీసులు, 165 సస్పెన్షన్లు చేశారు. లోపాలు సరిదిద్దుకుంటే మళ్లీ లైసెన్ ఇస్తామని FDA కమిషనర్ తుకారాం ముండే చెప్పారు.

DNAను Repair చేయడం వల్ల జీవితకాలం పెరగొచ్చా? 🧬
Science· 12 Aug 2026

DNAను Repair చేయడం వల్ల జీవితకాలం పెరగొచ్చా? 🧬

మన DNAలో రోజూ ఎన్నో చిన్నచిన్న నష్టాలు జరుగుతుంటాయి. వాటిని మన శరీరంలోని కణాలు సహజంగానే రిపేర్ చేస్తుంటాయి. వయసు పెరిగేకొద్దీ ఈ రిపేర్ సామర్థ్యం తగ్గడం వల్ల DNAలో నష్టం పేరుకుపోవచ్చు. అందుకే DNAను మరింత సమర్థంగా రిపేర్ చేయగలిగితే వృద్ధాప్యాన్ని నెమ్మదించవచ్చా అనే దానిపై రీసెర్చ్ జరుగుతోంది. 2026లో వచ్చిన కొత్త రీసెర్చ్‌లు కూడా DNA రిపేర్, దీర్ఘాయుష్షు మధ్య సంబంధంపై దృష్టి పెడుతున్నాయి. అయితే మనుషుల జీవితకాలాన్ని పెంచే నిరూపితమైన చికిత్స ఇంకా లేదు.

ఉత్తర కొరియా మరో Ballistic Missile ప్రయోగం! 🚀
World· 12 Aug 2026

ఉత్తర కొరియా మరో Ballistic Missile ప్రయోగం! 🚀

ఉత్తర కొరియా మరోసారి బాలిస్టిక్ మిసైల్‌ను ప్రయోగించింది. బుధవారం తూర్పు తీరంలోని వోన్‌సాన్ ప్రాంతం నుంచి ప్రయోగించిన ఈ మిసైల్ సుమారు 700 కిలోమీటర్లు ప్రయాణించి కొరియా ద్వీపకల్పం, జపాన్ మధ్య సముద్రంలో పడినట్లు దక్షిణ కొరియా, జపాన్ అధికారులు తెలిపారు. ఇది వారం రోజుల్లో ఉత్తర కొరియా చేసిన రెండో బాలిస్టిక్ మిసైల్ ప్రయోగం. ఈ నెల 17 నుంచి అమెరికా, దక్షిణ కొరియా వార్షిక సైనిక విన్యాసాలు ప్రారంభించనున్న నేపథ్యంలో ఈ ప్రయోగం జరగడం ఆ ప్రాంతంలో టెన్షన్‌ను మరింత పెంచింది.

CJP సౌరవ్ దాస్ ఫ్యామిలీకి బెదిరింపులు
Politics· 12 Aug 2026

CJP సౌరవ్ దాస్ ఫ్యామిలీకి బెదిరింపులు

పాండిచ్చేరి పోలీసులు తన ఫ్యామిలీ మెంబర్స్‌ను క్వశ్చన్ చేస్తూ వేధింపులకు గురిచేశారని CJP స్పోక్స్ పర్సన్ <a href="https://x.com/SauravDassss/status/2087534766874910808?s=20">సౌరవ్ దాస్</a> ‘X’ వేదికగా పోస్ట్ పెట్టారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకే పోలీసులు ఈ బెదిరింపులకు పాల్పడ్డారని, ఇది చట్టబద్ధమైన విధానం కాదని ఆరోపించారు. తానెవరికీ భయపడేది లేదని, తనను సైలెంట్‌గా ఉంచేందుకు ఇలాంటి చర్యలు పనిచేయవని చెప్తూ, పోలీసుల ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

AI వచ్చినా..అమ్మకు రెస్ట్ లేదు
Viral· 12 Aug 2026

AI వచ్చినా..అమ్మకు రెస్ట్ లేదు

ప్రస్తుతం AI కాలం నడుస్తోంది. ప్రతి పనికీ ఏఐ వాడేసి, పనిని సులభంగా చేసేయడం ట్రెండ్‌గా మారిపోయింది. పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఎంప్లాయిస్‌ను తగ్గించి, ఏఐ ద్వారా పనులు చేయిస్తోంది. అయితే AI వచ్చినా అమ్మ చేసే పనులకు రెస్ట్ లేదు అంటూ స్వర్ణిక శుక్లా అనే కంటెంట్ క్రియేటర్ చేసిన వీడియో నెట్‌లో వైరల్ అవుతోంది. AI ఎంత అడ్వాన్స్ అయినా పిల్లల్ని చూసుకునే పనిని ఇంకా తల్లులకే అంటగడుతున్న సమాజం మీద సెటైర్ లాంటి వీడియో ఇది.

NTR సర్జరీ సక్సెస్
News· 12 Aug 2026

NTR సర్జరీ సక్సెస్

జూనియర్ <a href="https://x.com/tarak9999/status/2087524661877932480?s=20">NTR</a>కు కిమ్స్ హాస్పిటల్‌లో సర్జరీ సక్సెస్ ఫుల్‌గా జరిగింది. తన హెల్త్ అప్‌డేట్‌ను ‘ఎక్స్’ వేదికగా తానే స్వయంగా షేర్ చేశారు. "నా కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. డాక్టర్ల టీమ్‌కి నా గ్రాటిట్యూడ్. మీ ప్రేమే నా బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్.. త్వరలోనే కలుద్దాం!" అని పోస్ట్ చేశారు. రీసెంట్‌గా జిమ్‌లో వర్కవుట్స్ చేస్తుండగా ఆయన భుజానికి గాయం కావడం అందరికీ తెలిసిందే.

చెన్నైలో Anti-Caste కవిత్వ ప్రదర్శన
General· 12 Aug 2026

చెన్నైలో Anti-Caste కవిత్వ ప్రదర్శన

భారతదేశంలో తొలి Anti-Caste కవిత్వం బృందం ‘ది రిజర్వ్డ్ కంపార్ట్‌మెంట్’ చెన్నైలో ప్రత్యేక కవిత్వ ప్రదర్శన నిర్వహించనుంది. ఆగస్టు 22న అల్వార్‌పేటలోని ‘ది మెడై’ వేదికపై ఈ కార్యక్రమం జరుగుతుంది. కుల వ్యవస్థకు వ్యతిరేకంగా రాసిన కవితల ద్వారా సామాజిక అవగాహన కలిగించడమే ఈ బృందం లక్ష్యం. కవిత్వం ద్వారా మార్పు తీసుకురావాలని కోరుకునే వారందరికీ ఈ ప్రదర్శన అరుదైన అవకాశమని నిర్వాహకులు అంటున్నారు. ఈవెంట్‌లో పాల్గొనాలనుకునేవారు ఈ <a href="https://forms.gle/qq2pivo84zd3e72w5">లింక్ </a>ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

🌏 గ్లోబల్ మార్కెట్ల ఫోకస్ అంతా US Inflation  డేటాపైనే! 👀
World· 12 Aug 2026

🌏 గ్లోబల్ మార్కెట్ల ఫోకస్ అంతా US Inflation డేటాపైనే! 👀

గ్లోబల్ మార్కెట్లలో ఈరోజు అందరి ఫోకస్ US Inflation డేటాపైనే ఉంది! 👀📊 జూలై నెల కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (CPI) డేటా ఈరోజు విడుదల కానుంది. ఈ డేటా కోసం ఇన్వెస్టర్స్, ట్రేడర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. Inflation 3.4 శాతానికి తగ్గొచ్చని అంచనాలు ఉన్నాయి. అంచనాల కంటే తక్కువగా వస్తే వడ్డీ రేట్ల విషయంలో కొంత రిలీఫ్ ఉండొచ్చని, ఎక్కువగా వస్తే మార్కెట్లలో వోలాటిలిటీ పెరగొచ్చని అనలిస్ట్స్ చెబుతున్నారు. అందుకే ఈ డేటా ఈరోజు గ్లోబల్ మార్కెట్లకు చాలా ఇంపార్టెంట్‌గా మారింది.

ఆ అధికారి వల్ల చికెన్ రంగు మారింది!
National· 12 Aug 2026

ఆ అధికారి వల్ల చికెన్ రంగు మారింది!

మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) కమిషనర్, ఐఏఎస్ అధికారి తుకారాం ముండే వల్ల ముంబైలో రెస్టారెంట్లలో చికెన్ రంగు మారింది. ఎలాగో తెలుసా? ఫుడ్ ఇన్స్‌ఫెక్షన్‌లో ఆయన చూపిన స్ట్రిక్ట్‌నెస్ వల్ల ముంబయిలో రెస్టారెంట్లు, స్ట్రీట్ ఫుడ్ వ్యాపారులు వంటల్లో ఆర్టిఫిషియల్ కలర్స్ వాడటం మానేశారు. చికెన్ లాలిపాప్, మంచూరియన్ లాంటి వంటలను ఎలాంటి రంగులు కలపకుండా కస్టమర్లకు అందిస్తున్నారు.

Gen Z Attention Span నిజంగానే తగ్గిందా?
Gen Z· 12 Aug 2026

Gen Z Attention Span నిజంగానే తగ్గిందా?

Gen Zకి చాలా తక్కువ Attention Span ఉంటుందని చాలామంది అంటుంటారు. కానీ అది అందరికీ వర్తిస్తుందని చెప్పలేం. ముఖ్యంగా షార్ట్ వీడియోలు, వరుసగా వచ్చే సోషల్ మీడియా కంటెంట్ ఎక్కువగా చూస్తే, ఎక్కువసేపు ఒకే పనిపై ఫోకస్ చేయడం కొంతమందికి కష్టంగా అనిపించొచ్చు. 2026లో పుణేలో 18–25 ఏళ్ల 110 మంది GenZలపై చేసిన రీసెర్చ్‌లో, షార్ట్ వీడియోలు ఎక్కువగా చూసేవారిలో ఎక్కువసేపు చేసే పనులపై ఫోకస్ తగ్గినట్లు కనిపించింది. అయితే దీనివల్ల షార్ట్ వీడియోలే కారణమని ఖచ్చితంగా చెప్పలేం. మీకు ఇలా అనిపిస్తుందా? కామెంట్‌లో చెప్పండి.

ఆస్పత్రి బెడ్ నుంచే దేవేంద్ర నాథ్ మహతో లెటర్!
National· 12 Aug 2026

ఆస్పత్రి బెడ్ నుంచే దేవేంద్ర నాథ్ మహతో లెటర్!

JPSC-JSSC అవినీతిపై రాంచీలోని జైపాల్ సింగ్ ముండా స్టేడియంలో దేవేంద్ర నాథ్ మహతో చేపట్టిన నిరాహార దీక్ష 11వ రోజుకు చేరింది. ప్రస్తుతం సదర్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఆయన, తనను తిరిగి సత్యాగ్రహ స్థలానికి వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని సివిల్ సర్జన్‌కు లెటర్ రాశారు. "నా శరీరం ఆస్పత్రి బెడ్‌పై ఉన్నప్పటికీ, నా ఆత్మ, సంకల్పం విద్యార్థుల న్యాయ పోరాటం వద్దే ఉంది" అని దేవేంద్ర నాథ్ అందులో పేర్కొన్నారు.

రవితేజ ‘ఇరుముడి’ ట్రైలర్ రిలీజ్
Cinema· 12 Aug 2026

రవితేజ ‘ఇరుముడి’ ట్రైలర్ రిలీజ్

రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో రాబోతున్న సినిమా ‘ఇరుముడి’. ప్రియా భవాని శంకర్ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాకు జి.వి.ప్రకాశ్ మ్యూజిక్ అందించారు. దీని ట్రైలర్ ఇవాళ విడుదలైంది. ఈనెల 21న థియేటర్లలో రిలీజ్ కానుంది. ట్రైలర్‌ని రవితేజ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీలవుతున్నారు.

‘అర్థశాస్త్ర విమర్శ’ పుస్తకం
Books· 12 Aug 2026

‘అర్థశాస్త్ర విమర్శ’ పుస్తకం

మార్క్సిజానికి మూలమైన కార్ల్ మార్క్స్ 1844లో పారిస్‌లో అర్థశాస్త్రంపై రీసెర్చ్ ప్రారంభించి జీవితాంతం కొనసాగించారు. ఈ క్రమంలో ‘Contribution to the Critique of Political Economy’ అని 1859లో ఓ పుస్తకం రాశారు. ఆయన రీసెర్చ్ ప్రారంభించిన 15 సంవత్సరాల తర్వాత వచ్చిన ఈ పుస్తకాన్ని మార్క్స్ ఆర్థిక సిద్ధాంతాల అభివృద్ధిలో కీలక మైలురాయిగా చెప్పుకుంటారు. ఎ.గాంధీ దీన్ని తెలుగులోకి అనువదించారు. పీకాక్ బుక్స్ దీన్ని ప్రచురించింది. దీని ధర రూ.220. దీన్ని కొనే <a href="https://www.telugubooks.in/collections/a-gandhi/products/karl-marks-1859-ardhasastra-vimarsha">లింక్.</a>

దొంగతనం కాదు.. మరి చంపేసిందెవరు?
Crime· 12 Aug 2026

దొంగతనం కాదు.. మరి చంపేసిందెవరు?

TG: నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డి(45) దారుణ హత్యకు గురయ్యారు. భర్త హైదరాబాద్ వెళ్లిన సమయంలో కొందరు వ్యక్తులు ఇంట్లోకి చొరబడి కత్తులతో పొడిచి చంపేశారు. ఇంట్లో దొంగతనం జరగలేదని, భార్యాభర్తల మధ్య గొడవలు కూడా లేవని, నిన్న సాయంత్రం నుంచే ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్‌లో ఉందని ఇంటి కింద అద్దెకు ఉన్నవాళ్లు చెప్పారు. ఘటనా స్థలాన్ని DSP, క్లూస్ టీమ్ పరిశీలించారు. నిందితుల కోసం పోలీసులు మూడు స్పెషల్ టీమ్స్‌తో సెర్చ్ చేస్తున్నారు.

జూనియర్ ఎన్టీఆర్‌ హెల్త్ అప్‌డేట్
Cinema· 12 Aug 2026

జూనియర్ ఎన్టీఆర్‌ హెల్త్ అప్‌డేట్

హీరో జూనియర్ ఎన్టీఆర్‌ భుజానికి సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆస్పత్రిలో సర్జరీ సక్సెస్‌ఫుల్‌గా జరిగింది. సర్జరీ తర్వాత ఎన్టీఆర్‌ ప్రస్తుతం డాక్టర్స్ పర్యవేక్షణలో ఉన్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వాళ్లు వెల్లడించారు. సర్జరీ కారణంగా ఎన్టీఆర్ కొంతకాలం షూటింగ్‌కు దూరంగా ఉంటారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

మూడోసారి పోటీ చేయాలని ఉంది- ట్రంప్
Politics· 12 Aug 2026

మూడోసారి పోటీ చేయాలని ఉంది- ట్రంప్

2028 USA ప్రెసిడెంట్ ఎలక్షన్లలో మూడోసారి పోటీ చేయాలన్న అంశంపై డొనాల్డ్ ట్రంప్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ప్రెసిడెంట్‌గా మూడోసారి పోటీ చేయమని జనాలు తనను అడుగుతున్నారని చెప్పారు. తనకు కూడా పోటీ చేయాలని ఉందన్న ట్రంప్.. ఈ విషయంలో అమెరికా చట్టం చాలా స్ట్రిక్ట్‌గా ఉందని గుర్తుచేశారు. అమెరికా రాజ్యాంగం ప్రకారం, ప్రెసిడెంట్ పదవిలో ఎవరూ రెండు సార్లకు మించి ఉండకూడదు.

అలా వండితే..చేప వెజిటేరియనే: యూపీ మంత్రి
National· 12 Aug 2026

అలా వండితే..చేప వెజిటేరియనే: యూపీ మంత్రి

చేప వెజిటేరియన్ ఆహారమే అంటూ ఉత్తరప్రదేశ్ మంత్రి, నిషాద్ పార్టీ అధినేత సంజయ్ నిషాద్ సంచలన కామెంట్ చేశారు. ‘బదల్తా పూర్వీ ఉత్తరప్రదేశ్’ ఈవెంట్‌లో ఆయన మాట్లాడుతూ వెల్లుల్లి, ఉల్లిపాయ లేకుండా వండిన చేపల కూర శాకాహారమే అన్నారు. గతంలో తను ఈ మాట చెప్పినప్పుడు ఏ మహారాజ్ జీ కూడా దీన్ని కౌంటర్ చేయలేదని, వాళ్ల మౌనమే అంగీకారమని ఆయన సమర్థించుకున్నారు. ఈ విషయం నెట్‌లో వైరల్ అయ్యింది.

CDలు, DVDలు తెచ్చుకుని సినిమాలు చూసిన రోజులు! 💿
General· 12 Aug 2026

CDలు, DVDలు తెచ్చుకుని సినిమాలు చూసిన రోజులు! 💿

ఇప్పుడంటే సినిమా చూడాలంటే OTTలు ఉన్నాయి. కానీ ఒకప్పుడు VCD, DVDల్లో సినిమాలు చూసేవాళ్లు. వాటికంటే ముందు వీడియో క్యాసెట్ల కాలం ఉండేది. VCRలో క్యాసెట్ పెట్టి టీవీలో సినిమా చూస్తుంటే, చుట్టుపక్కల వాళ్లంతా ఒకచోట చేరేవాళ్లు. ఆ తర్వాత VCD, DVDలు వచ్చాయి. షాప్‌కి వెళ్లి నచ్చిన సినిమా డిస్క్ తీసుకొచ్చి, ప్లేయర్‌లో పెట్టి చూసే రోజులు కూడా చాలామందికి ఇప్పటికీ గుర్తుండే ఉంటాయి. ఇప్పుడు ఒక్క క్లిక్‌తో సినిమా వస్తున్నా.. అప్పటి ఆ చిన్న చిన్న ఆనందాలు మాత్రం స్పెషల్. ఆ రోజులు గుర్తున్నాయా? కామెంట్‌లో చెప్పండి.

త్వరలో జంతర్-మంతర్ 2!
Politics· 12 Aug 2026

త్వరలో జంతర్-మంతర్ 2!

CJP ఫౌండర్ అభిజీత్ దిప్కే కీలక ప్రకటన చేశారు. 'జంతర్-మంతర్' సీజన్ 2 ఎప్పుడు స్టార్ట్ అవుతుందని ఇన్స్టాగ్రామ్‌లో చాలా మంది కామెంట్స్ చేస్తున్నారని ఆయన తెలిపారు. వాళ్లందరి కోసం త్వరలోనే 'జంతర్-మంతర్' సీజన్ 2 ని స్టార్ట్ చేయబోతున్నామని క్లారిటీ ఇచ్చారు. ఈ అప్‌డేట్‌తో నెక్స్ట్ రాజీనామా ఎవరిది అంటూ ఫాలోవర్స్ ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు.