← Back to news

దొంగతనం కాదు.. మరి చంపేసిందెవరు?

By sahani· 12 Aug 2026· Nalgonda
దొంగతనం కాదు.. మరి చంపేసిందెవరు?

TG: నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డి(45) దారుణ హత్యకు గురయ్యారు. భర్త హైదరాబాద్ వెళ్లిన సమయంలో కొందరు వ్యక్తులు ఇంట్లోకి చొరబడి కత్తులతో పొడిచి చంపేశారు. ఇంట్లో దొంగతనం జరగలేదని, భార్యాభర్తల మధ్య గొడవలు కూడా లేవని, నిన్న సాయంత్రం నుంచే ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్‌లో ఉందని ఇంటి కింద అద్దెకు ఉన్నవాళ్లు చెప్పారు. ఘటనా స్థలాన్ని DSP, క్లూస్ టీమ్ పరిశీలించారు. నిందితుల కోసం పోలీసులు మూడు స్పెషల్ టీమ్స్‌తో సెర్చ్ చేస్తున్నారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 7h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.