Latest

Gen Z Attention Span నిజంగానే తగ్గిందా?
Gen Zకి చాలా తక్కువ Attention Span ఉంటుందని చాలామంది అంటుంటారు. కానీ అది అందరికీ వర్తిస్తుందని చెప్పలేం. ముఖ్యంగా షార్ట్ వీడియోలు, వరుసగా వచ్చే సోషల్ మీడియా కంటెంట్ ఎక్కువగా చూస్తే, ఎక్కువసేపు ఒకే పనిపై ఫోకస్ చేయడం కొంతమందికి కష్టంగా అనిపించొచ్చు. 2026లో పుణేలో 18–25 ఏళ్ల 110 మంది GenZలపై చేసిన రీసెర్చ్‌లో, షార్ట్ వీడియోలు ఎక్కువగా చూసేవారిలో ఎక్కువసేపు చేసే పనులపై ఫోకస్ తగ్గినట్లు కనిపించింది. అయితే దీనివల్ల షార్ట్ వీడియోలే కారణమని ఖచ్చితంగా చెప్పలేం. మీకు ఇలా అనిపిస్తుందా? కామెంట్‌లో చెప్పండి.

ఆస్పత్రి బెడ్ నుంచే దేవేంద్ర నాథ్ మహతో లెటర్!
JPSC-JSSC అవినీతిపై రాంచీలోని జైపాల్ సింగ్ ముండా స్టేడియంలో దేవేంద్ర నాథ్ మహతో చేపట్టిన నిరాహార దీక్ష 11వ రోజుకు చేరింది. ప్రస్తుతం సదర్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఆయన, తనను తిరిగి సత్యాగ్రహ స్థలానికి వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని సివిల్ సర్జన్‌కు లెటర్ రాశారు. "నా శరీరం ఆస్పత్రి బెడ్‌పై ఉన్నప్పటికీ, నా ఆత్మ, సంకల్పం విద్యార్థుల న్యాయ పోరాటం వద్దే ఉంది" అని దేవేంద్ర నాథ్ అందులో పేర్కొన్నారు.

రవితేజ ‘ఇరుముడి’ ట్రైలర్ రిలీజ్
రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో రాబోతున్న సినిమా ‘ఇరుముడి’. ప్రియా భవాని శంకర్ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాకు జి.వి.ప్రకాశ్ మ్యూజిక్ అందించారు. దీని ట్రైలర్ ఇవాళ విడుదలైంది. ఈనెల 21న థియేటర్లలో రిలీజ్ కానుంది. ట్రైలర్‌ని రవితేజ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీలవుతున్నారు.

‘అర్థశాస్త్ర విమర్శ’ పుస్తకం
మార్క్సిజానికి మూలమైన కార్ల్ మార్క్స్ 1844లో పారిస్‌లో అర్థశాస్త్రంపై రీసెర్చ్ ప్రారంభించి జీవితాంతం కొనసాగించారు. ఈ క్రమంలో ‘Contribution to the Critique of Political Economy’ అని 1859లో ఓ పుస్తకం రాశారు. ఆయన రీసెర్చ్ ప్రారంభించిన 15 సంవత్సరాల తర్వాత వచ్చిన ఈ పుస్తకాన్ని మార్క్స్ ఆర్థిక సిద్ధాంతాల అభివృద్ధిలో కీలక మైలురాయిగా చెప్పుకుంటారు. ఎ.గాంధీ దీన్ని తెలుగులోకి అనువదించారు. పీకాక్ బుక్స్ దీన్ని ప్రచురించింది. దీని ధర రూ.220. దీన్ని కొనే <a href="https://www.telugubooks.in/collections/a-gandhi/products/karl-marks-1859-ardhasastra-vimarsha">లింక్.</a>

దొంగతనం కాదు.. మరి చంపేసిందెవరు?
TG: నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డి(45) దారుణ హత్యకు గురయ్యారు. భర్త హైదరాబాద్ వెళ్లిన సమయంలో కొందరు వ్యక్తులు ఇంట్లోకి చొరబడి కత్తులతో పొడిచి చంపేశారు. ఇంట్లో దొంగతనం జరగలేదని, భార్యాభర్తల మధ్య గొడవలు కూడా లేవని, నిన్న సాయంత్రం నుంచే ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్‌లో ఉందని ఇంటి కింద అద్దెకు ఉన్నవాళ్లు చెప్పారు. ఘటనా స్థలాన్ని DSP, క్లూస్ టీమ్ పరిశీలించారు. నిందితుల కోసం పోలీసులు మూడు స్పెషల్ టీమ్స్‌తో సెర్చ్ చేస్తున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ హెల్త్ అప్‌డేట్
హీరో జూనియర్ ఎన్టీఆర్ భుజానికి సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో సర్జరీ సక్సెస్‌ఫుల్‌గా జరిగింది. సర్జరీ తర్వాత ఎన్టీఆర్ ప్రస్తుతం డాక్టర్స్ పర్యవేక్షణలో ఉన్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వాళ్లు వెల్లడించారు. సర్జరీ కారణంగా ఎన్టీఆర్ కొంతకాలం షూటింగ్‌కు దూరంగా ఉంటారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
మూడోసారి పోటీ చేయాలని ఉంది- ట్రంప్
2028 USA ప్రెసిడెంట్ ఎలక్షన్లలో మూడోసారి పోటీ చేయాలన్న అంశంపై డొనాల్డ్ ట్రంప్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ప్రెసిడెంట్‌గా మూడోసారి పోటీ చేయమని జనాలు తనను అడుగుతున్నారని చెప్పారు. తనకు కూడా పోటీ చేయాలని ఉందన్న ట్రంప్.. ఈ విషయంలో అమెరికా చట్టం చాలా స్ట్రిక్ట్‌గా ఉందని గుర్తుచేశారు. అమెరికా రాజ్యాంగం ప్రకారం, ప్రెసిడెంట్ పదవిలో ఎవరూ రెండు సార్లకు మించి ఉండకూడదు.

అలా వండితే..చేప వెజిటేరియనే: యూపీ మంత్రి
చేప వెజిటేరియన్ ఆహారమే అంటూ ఉత్తరప్రదేశ్ మంత్రి, నిషాద్ పార్టీ అధినేత సంజయ్ నిషాద్ సంచలన కామెంట్ చేశారు. ‘బదల్తా పూర్వీ ఉత్తరప్రదేశ్’ ఈవెంట్‌లో ఆయన మాట్లాడుతూ వెల్లుల్లి, ఉల్లిపాయ లేకుండా వండిన చేపల కూర శాకాహారమే అన్నారు. గతంలో తను ఈ మాట చెప్పినప్పుడు ఏ మహారాజ్ జీ కూడా దీన్ని కౌంటర్ చేయలేదని, వాళ్ల మౌనమే అంగీకారమని ఆయన సమర్థించుకున్నారు. ఈ విషయం నెట్‌లో వైరల్ అయ్యింది.

CDలు, DVDలు తెచ్చుకుని సినిమాలు చూసిన రోజులు! 💿
ఇప్పుడంటే సినిమా చూడాలంటే OTTలు ఉన్నాయి. కానీ ఒకప్పుడు VCD, DVDల్లో సినిమాలు చూసేవాళ్లు. వాటికంటే ముందు వీడియో క్యాసెట్ల కాలం ఉండేది. VCRలో క్యాసెట్ పెట్టి టీవీలో సినిమా చూస్తుంటే, చుట్టుపక్కల వాళ్లంతా ఒకచోట చేరేవాళ్లు. ఆ తర్వాత VCD, DVDలు వచ్చాయి. షాప్‌కి వెళ్లి నచ్చిన సినిమా డిస్క్ తీసుకొచ్చి, ప్లేయర్‌లో పెట్టి చూసే రోజులు కూడా చాలామందికి ఇప్పటికీ గుర్తుండే ఉంటాయి. ఇప్పుడు ఒక్క క్లిక్‌తో సినిమా వస్తున్నా.. అప్పటి ఆ చిన్న చిన్న ఆనందాలు మాత్రం స్పెషల్. ఆ రోజులు గుర్తున్నాయా? కామెంట్‌లో చెప్పండి.
త్వరలో జంతర్-మంతర్ 2!
CJP ఫౌండర్ అభిజీత్ దిప్కే కీలక ప్రకటన చేశారు. 'జంతర్-మంతర్' సీజన్ 2 ఎప్పుడు స్టార్ట్ అవుతుందని ఇన్స్టాగ్రామ్‌లో చాలా మంది కామెంట్స్ చేస్తున్నారని ఆయన తెలిపారు. వాళ్లందరి కోసం త్వరలోనే 'జంతర్-మంతర్' సీజన్ 2 ని స్టార్ట్ చేయబోతున్నామని క్లారిటీ ఇచ్చారు. ఈ అప్‌డేట్‌తో నెక్స్ట్ రాజీనామా ఎవరిది అంటూ ఫాలోవర్స్ ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు.

'ద్రవిడ - వివక్షపై దక్షిణ స్వరం' పుస్తకం
మలుపు బుక్స్, ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక కలిసి తీసుకొచ్చిన పుస్తకం 'ద్రవిడ - వివక్షపై దక్షిణ స్వరం'. రచయితలు కల్లూరి భాస్కరం, సౌదా అరుణ, డా.జిలుకర శ్రీనివాస్, రాహుల్, కె.శ్రీనివాస్, కె.ఎన్.మల్లీశ్వరి, కాత్యాయనీ విద్మహే, సి.మృణాళిని రాసిన పదకొండు ఆర్టికల్స్ ఇందులో ఉన్నాయి. ద్రావిడ జాతులపై వివక్ష, ద్రవిడ భాష, సంస్కృతి, సాహిత్యం ద్వారా అస్మిత నిర్మాణం లాంటి అంశాలు ఇందులో ఉన్నాయి. ఈ పుస్తకానికి ఎడిటర్స్‌గా కె.ఎన్.మల్లీశ్వరి, కాత్యాయనీ విద్మహే ఉన్నారు. పుస్తకం ధర రూ.150. పుస్తకం కొనేందుకు <a href="https://www.telugubooks.in/products/dravida-vivakshapai-dakshina-swaram?srsltid=AfmBOoqOJwWA4xUicb-zqftKrUpqFkRMq-DrY2VrCkDrfuIxhL5bboDB">లింక్</a>.

ఈ మర్డర్‌కు ఇన్‌స్టా చాట్ కారణమా?
చెన్నైలో భార్యపై అనుమానంతో భర్త ఘోరానికి పాల్పడ్డాడు. ఇన్స్టాగ్రామ్‌లో ఫ్రెండ్స్‌తో చాట్ చేస్తుందని గొడవపడి, "పిల్లల కోసం కలిసి ఉందాం" అని భార్య దేవకి(24)ని నమ్మించి ఇంటికి రప్పించాడు చిన్న(34). ఆ తర్వాత ఆటోలో ఒక ఒంటరి ప్రదేశానికి తీసుకెళ్లి నైఫ్‌తో గొంతు కోసి మర్డర్ చేశాడు. లోకల్స్ ఇన్ఫర్మేషన్‌తో పోలీసులు సీన్‌లోకి ఎంటర్ అయి నిందితుడిని అరెస్ట్ చేశారు. ఎఫైర్ ఉందనే డౌట్‌తోనే ప్లాన్ చేసి చంపినట్లు హజ్బెండ్ యాక్సెప్ట్ చేశాడు.

లైఫ్‌స్టైల్ ఎఫెక్ట్!
భారత్‌లో 15–49 ఏళ్ల మహిళల్లో Obesity వేగంగా పెరుగుతోంది. సెంట్రల్ గవర్నమెంట్ NFHS-6 సర్వే ప్రకారం.. 30.7% మంది మహిళలు ఓవర్‌వెయిట్‌తో ఉన్నారు. గతంలో ఇది 24% మాత్రమే. పురుషుల్లో కూడా ఈ సమస్య 22.9% నుంచి 27.3%కి పెరిగింది. మారుతున్న లైఫ్‌స్టైల్ వల్ల ఫెర్టిలిటీ సమస్యలు వస్తున్నాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. అందుకే ప్లానింగ్ సమయంలోనే పేరెంట్స్ ఇద్దరూ హెల్త్ చెకప్స్ చేయించుకొని తగిన జాగ్రత్తలు తీసుకుంటే ప్రెగ్నెన్సీ రిస్క్స్ అస్సలు ఉండవని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు.

Fieldwork as a Sex Object నవల..రేపు విడుదల
ప్రముఖ రచయిత్రి మీనా కందసామి రాసిన నవల ‘Fieldwork as a Sex Object’. ఇంటర్నెట్ మాబ్స్‌ని ఎదుర్కొనే ఒక కార్యకర్త కథగా సాగే ఈ నవల డిజిటల్ హింస, డీప్‌ఫేక్ టెక్నాలజీ, ఆన్‌లైన్ స్త్రీద్వేషం, రాజకీయ తీవ్రవాదం గురించి వివరిస్తుంది. రేపు సాయంత్రం హైదరాబాద్ నగరంలోని లామకాన్‌లో సాయంత్రం 7 గంటలకు ఈ నవల విడుదల కానుంది. ఆమెతో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ రీసెర్చ్ స్కాలర్, విద్యార్థి కార్యకర్త తరుణి ముఖాముఖి నిర్వహిస్తారు.

NEET పేపర్ లీక్ కేస్‌లో బిగ్ ట్విస్ట్
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన NEET పేపర్ లీక్ కేస్‌లో ఢిల్లీ కోర్టు బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేస్‌కు సంబంధించి CBI దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌ను ఢిల్లీలోని ప్రత్యేక కోర్టు విచారణకు స్వీకరించింది. CBI సేకరించిన ఆధారాలు, నివేదికను పరిశీలించిన న్యాయస్థానం దీనిపై నెక్స్ట్ లీగల్ యాక్షన్ తీసుకోనుంది. కోర్టు ఛార్జ్‌షీట్‌ను యాక్సెప్ట్ చేయడంతో ఈ స్కామ్‌లో ఉన్న నిందితులపై త్వరలోనే విచారణ ట్రయల్ వేగవంతం కానుంది.

మోదీకి బంగారు విగ్రహంతో త్వరలో ఆలయం?
ప్రధాని నరేంద్ర మోదీకి బంగారు విగ్రహంతో ఆలయం నిర్మించాలని బిహార్ స్టేట్ కిన్నర్ వెల్ఫేర్ బోర్డు (ట్రాన్స్‌జెండర్ వెల్ఫేర్ బోర్డు) ప్లాన్ చేసింది. ఆలయ నిర్మాణం కోసం ప్రభుత్వం నుంచి 5 ఎకరాల భూమి, రూ.112 కోట్ల నిధులు కేటాయించాలని బోర్డు కోరింది. బోర్డు తొలి సమావేశంలో సభ్యుడు డా.రాజన్ సింగ్ ఈ ప్రతిపాదన పెట్టారు. బోర్డు సభ్యులు దీన్ని ఆమోదించారు. ఈ ప్రతిపాదన క్యాబినెట్ సెక్రటేరియట్‌కు వెళ్లనుంది. ప్రభుత్వం భూమి, నిధులు ఇవ్వకపోయినా డొనేషన్లు సేకరించి ఆలయం నిర్మిస్తామని బోర్డు సభ్యులు చెప్పారు.

NTR హాస్పిటల్‌లో అడ్మిట్!
NTRకి షోల్డర్ సర్జరీ జరుగుతోంది. రీసెంట్‌గా జిమ్‌లో వర్కవుట్స్ చేస్తుండగా ఆయన భుజానికి గాయం కావడంతో డాక్టర్ల అడ్వైస్ మేరకు కొద్దిరోజులు రెస్ట్ తీసుకున్నారు. అయితే బుధవారం మార్నింగ్ సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్‌లో అడ్మిట్ అవ్వగా, డాక్టర్స్ ప్రస్తుతం ఆయనకు ట్రీట్మెంట్ చేస్తున్నారు. హాస్పిటల్‌లో NTR ఫ్యామిలీ మెంబర్స్, క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. సర్జరీ కంప్లీట్ అయ్యాక ఆయన హెల్త్ కండిషన్‌పై డాక్టర్స్ ఫుల్ డిటైల్స్ అనౌన్స్ చేయనున్నారు.
ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టా..స్విమ్మింగ్ పూలా?
ప్రధాని నరేంద్ర మోదీ మార్చి 28న ప్రారంభించిన నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ వర్షం నీటితో నిండిపోయింది. భారీ వర్షం కారణంగా టెర్మినల్ నుంచి పార్కింగ్ ఏరియాకు వెళ్లే పాసేజ్‌లో నీళ్లు చేరి వాటర్‌లాగింగ్ ఏర్పడింది. ఎయిర్‌పోర్ట్ అధికారులు 30 నిమిషాల్లో ఆ నీటిని తొలగించారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఎయిర్‌పోర్ట్‌లో ఇలా జరగడంతో ప్రయాణికులు డ్రైనేజీ వ్యవస్థపై డౌట్ వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టా..స్విమ్మింగ్ పూలా అని కామెంట్ చేస్తున్నారు.

చర్చకు మేం సిద్ధం..ప్రతిపక్షం అడ్డుకుంటోంది: అమిత్ షా
పార్లమెంట్ సమావేశాలు స్టార్ట్ అయినప్పటినుంచి ప్రతిపక్షం రెండు సభల్లోనూ గందరగోళం చేస్తోందని, అందుకే సభలోకి వెళ్లడం వల్ల ప్రయోజనం లేదని హోం మంత్రి అమిత్ షా ఆరోపించారు. ‘మిస్సింగ్’, ‘ఫ్యూజిటివ్స్’ లాంటి పదాలు ఇటీవల పార్లమెంటరీ చర్చల్లో వినిపించడం మొదలైందని అన్నారు. NEET విద్యార్థుల నిరసనలతోసహా అన్ని అంశాలపై చర్చకు ప్రభుత్వం సిద్ధమేనన్న విషయం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు ఇప్పటికే చెప్పారన్నారు. అయినా ప్రతిపక్షమే అడ్డుకొంటోందని అన్నారు.

అమెరికాలో ఫైర్ యాక్సిడెంట్.. తెలుగు యువకుడు మృతి
TG: అమెరికాలో జరిగిన అగ్నిప్రమాదంలో తీవ్రంగా గాయపడిన హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం గంటూరుపల్లికి చెందిన భరత్‌చందర్‌రెడ్డి (29) మృత్యువుతో పోరాడి కన్నుమూశారు. జూలై 25న ఫ్లోరిడాలోని టాంపాలో జరిగిన అగ్నిప్రమాదంలో ఆయనకు 75శాతం కాలిన గాయాలయ్యాయి. అప్పటి నుంచి టాంపా జనరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భరత్, 15రోజులపాటు మృత్యువుతో పోరాడి తుదిశ్వాస విడిచారు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. మృతదేహాన్ని త్వరగా స్వగ్రామానికి తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు.
Gen Zకి మోదీ అడ్వైస్!
యూత్ ఎక్కువగా సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు, రీల్స్ వైపు ఎట్రాక్ట్ అవుతున్నారని మోదీ కామెంట్స్ చేశారు. రైల్వే స్టేషన్లలో ఉండే "షార్ట్‌కట్ విల్ కట్ యు షార్ట్" అనే బోర్డును గుర్తుచేస్తూ, లైఫ్‌లో సక్సెస్ అవ్వడానికి షార్ట్‌కట్స్ వెతకొద్దని యంగ్ జెనరేషన్‌కు అడ్వైస్ ఇచ్చారు. మాజీ ప్రెసిడెంట్ రామ్‌నాథ్ కోవింద్ ఆటోబయోగ్రఫీ బుక్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్న మోదీ, హిస్టరీని క్లియర్‌గా అర్థం చేసుకోవడానికి ఆటోబయోగ్రఫీలు చాలా హెల్ప్ అవుతాయని, ఈ బుక్ ఫ్యూచర్ జెనరేషన్స్‌కు మంచి ఇన్సిపిరేషన్ అని పిలుపునిచ్చారు.