Latest

విద్యార్థినులపై అనుచిత ప్రవర్తన.. అధికారులు సీరియస్
Crime· 12 Aug 2026

విద్యార్థినులపై అనుచిత ప్రవర్తన.. అధికారులు సీరియస్

AP: అనంతపురం జిల్లా యల్లనూరు ZP ఉన్నత పాఠశాలలో విద్యార్థినుల పట్ల అనుచితంగా ప్రవర్తించారనే ఆరోపణలపై ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడు శ్రీరామమూర్తిపై విద్యాశాఖ చర్యలు తీసుకుంది. విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించడంతో తల్లిదండ్రులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులపై విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టగా ఆరోపణలు నిజమని తేలింది. టీచర్‌ను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థినుల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని, ఇలాంటి ఘటనలను ఉపేక్షించబోమని అధికారులు స్పష్టం చేశారు.

ఆలియా నటనలో 'అమ్మ' పాత్రే టాప్: మహేష్ భట్!
Cinema· 12 Aug 2026

ఆలియా నటనలో 'అమ్మ' పాత్రే టాప్: మహేష్ భట్!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ నటనను దర్శకుడు, ఆమె తండ్రి మహేష్ భట్ మెచ్చుకున్నారు. 'హైవే', 'గంగూభాయి' చిత్రాల్లో ఆలియా నటన నన్ను ఆశ్చర్యపరిచింది. కానీ ఈరోజుల్లో ఆమె పోషిస్తున్న 'అమ్మ' పాత్రే అత్యుత్తమమైనది అని అన్నారు.<br>ఆలియా ఒకవైపు సినిమాలు చేస్తూనే, మరోవైపు భార్యగా, తల్లిగా బాధ్యతలు చక్కగా నిర్వర్తిస్తోందన్నారు. మనవరాలు 'రాహా' వచ్చిన తర్వాత ఇంట్లో కొత్త ఉత్సాహం వచ్చిందని, ఆమె తమ కుటుంబంలో ఒక ప్రత్యేకమైన వెలుగు అని చెప్పారు.

ఆస్పత్రిలోనే బాలింత సూసైడ్
TG· 12 Aug 2026

ఆస్పత్రిలోనే బాలింత సూసైడ్

TG: నల్గొండ జిల్లా మునుగోడు మండలం చీకటిమామిడి గ్రామానికి చెందిన మమత (27) ప్రసవం కోసం నల్గొండ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది. ప్రసవం అనంతరం ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్న ఆమె బుధవారం తెల్లవారుజామున వార్డు నుంచి బయటకు వచ్చి హాస్పిటల్ ఆవరణలో చెట్టుకు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. వరుసగా నలుగురు ఆడపిల్లలే పుట్టడంతో కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయని, అత్తింటి వేధింపులే మమత ఆత్మహత్యకు కారణం అని ఆమె బంధువులు ఆరోపించారు.

AI తో చిప్స్!
Infotainment· 12 Aug 2026

AI తో చిప్స్!

మనం ఎంతగానో ఇష్టపడే ‘ప్రింగిల్స్’ చిప్స్ ఇప్పుడు మరింత రుచిగా, అసలు విరిగిపోకుండా రాబోతున్నాయి. ఇందుకోసం కంపెనీ AI టెక్నాలజీని వాడుతుంది. పోలాండ్‌లోని ఫ్యాక్టరీలో సీమెన్స్ కంపెనీతో కలిసి సుమారు రూ. 40 కోట్లు ఖర్చు చేసి ఈ కొత్త సిస్టమ్‌ను తెచ్చారు. పిండి తేమ, బంగాళదుంపల నాణ్యత లాంటి 200 విషయాలను ఈ AI క్షణాల్లో పరిశీలించి యంత్రాలను సరిచేస్తుంది. దీనివల్ల చిప్స్ సూపర్ క్వాలిటీతో రావడమే కాక, వృథా 13 శాతం తగ్గిందంట. త్వరలోనే అన్ని ఫ్యాక్టరీలకూ దీనిని తెస్తున్నారు.

డంపింగ్ యార్డు ప్రతిపాదనను రద్దు చేయాలని మహా ధర్నా
TG· 12 Aug 2026

డంపింగ్ యార్డు ప్రతిపాదనను రద్దు చేయాలని మహా ధర్నా

TG: రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలోని సిద్ధాపూర్ డంపింగ్ యార్డు ప్రతిపాదనను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దాపూర్ డంపింగ్ యార్డ్ వ్యతిరేక పోరాట జాయింట్ యాక్షన్ కమిటీ (SDVP JAC) ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట మహాధర్నా నిర్వహించారు. వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు, స్థానికులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డంపింగ్ యార్డు హటావో.. సిద్ధాపూర్ బచావో అంటూ ధర్నా ప్రాంగణం మార్మోగింది. డంపింగ్ యార్డుతో దుర్వాసన, కాలుష్యం, భూగర్భ జలాల కలుషితమయ్యే ప్రమాదం ఉందన్నారు.

📚 గ్రంథపాలకుల దినోత్సవ శుభాకాంక్షలు!
Infotainment· 12 Aug 2026

📚 గ్రంథపాలకుల దినోత్సవ శుభాకాంక్షలు!

భారతీయ గ్రంథాలయ శాస్త్ర పితామహుడు ఎస్.ఆర్. రంగనాథన్ జయంతి సందర్భంగా ఆగస్టు 12న జాతీయ గ్రంథపాలకుల దినోత్సవాన్ని జరుపుకుంటాం. అక్షరాల ప్రపంచానికి దారి చూపుతూ, పుస్తకాల నిధిని కాపాడుతూ సమాజ చైతన్యంలో కీలక పాత్ర పోషిస్తున్న గ్రంథపాలకులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. 📚💐

ACP ఆఫీస్‌లో సడన్ షాక్.. కానిస్టేబుల్ మృతి
TG· 12 Aug 2026

ACP ఆఫీస్‌లో సడన్ షాక్.. కానిస్టేబుల్ మృతి

TG: హైదరాబాద్ LBనగర్ ACP కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ సాయికుమార్ మృతి కలకలం రేపింది. రెస్ట్‌రూమ్‌లో ఆయన ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. గత నెల నుంచి LBనగర్ పోలీస్‌స్టేషన్ నుంచి ACP కార్యాలయానికి అటాచ్‌మెంట్‌పై సాయికుమార్ విధులు నిర్వహిస్తున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. విషయం తెలుసుకున్న బంధువులు పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు.

ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగుల పోరుబాట
Jobs· 12 Aug 2026

ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగుల పోరుబాట

తెలంగాణలో నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం నిరుద్యోగ JAC ఆధ్వర్యంలో ఇవాళ హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో 11 గంటలకు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు. 25వేల పోస్టులతో మెగా DSC, గురుకుల, మోడల్ స్కూల్, JL, DL తదితర నోటిఫికేషన్లు విడుదల చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. పోలీస్ ఉద్యోగాల్లో పోస్టులు పెంచి 19 వేల CI, SI, కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్లు ఇవ్వాలని కోరారు. ఏజ్ రిలాక్సేషన్ పెంచాలని, ఉద్యోగ దరఖాస్తులకు ఎలాంటి ఫీజు లేకుండా అవకాశం కల్పించాలని కోరారు.

ఖేలో ఇండియాపై CM స్పెషల్ ఫోకస్
TG· 12 Aug 2026

ఖేలో ఇండియాపై CM స్పెషల్ ఫోకస్

TG: ఖేలో ఇండియా యూత్ గేమ్స్-2026 పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని CM రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లోని బోధి పెవిలియన్‌లో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఏర్పాట్లు, నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. డిసెంబరులో నిర్వహించే జాతీయస్థాయి పోటీలకు వివిధ రాష్ట్రాల క్రీడాకారులు రానున్న నేపథ్యంలో క్రీడా మైదానాలు, మౌలిక వసతులను మెరుగుపరచాలని సూచించారు. హైదరాబాద్‌లోని స్పోర్ట్స్ గ్రౌండ్స్ పరిస్థితిని పరిశీలించి శాశ్వత అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని చెప్పారు.

ఆక్వా రైతులకు ప్రభుత్వం భరోసా: అచ్చెన్నాయుడు
AP· 12 Aug 2026

ఆక్వా రైతులకు ప్రభుత్వం భరోసా: అచ్చెన్నాయుడు

AP: రాష్ట్రంలోని ఆక్వా రంగాన్ని దేశానికే రోల్ మోడల్‌గా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో నిర్వహించిన ఆక్వా రైతు మహాసభలో ఆయన మాట్లాడారు. రొయ్యల మేత ధరలను తగ్గించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించిందన్నారు. మేత తయారీ పరిశ్రమలు, రైతులు, అధికారులు, ప్రతినిధులతో కమిటీ ఏర్పాటు చేసి, ధరల్లో మార్పులు చేయాలంటే అందరి ఆమోదం తీసుకునే విధానం తీసుకొచ్చామని చెప్పారు.

రైతుల కోసం కమాండ్ కంట్రోల్ రూమ్
AP· 12 Aug 2026

రైతుల కోసం కమాండ్ కంట్రోల్ రూమ్

AP: ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో సాగునీటి కంటే తాగునీటి సరఫరాకే ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. విజయవాడ పౌరసరఫరాలశాఖ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఏలూరు జిల్లాలో సాధారణం కంటే 74శాతం తక్కువ వర్షపాతం నమోదైనా వరిసాగు 400శాతం పెరగడంపై ఆందోళన వ్యక్తంచేశారు. తక్కువ నీటితో పండే పంటల వైపు రైతులను ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని నివారించేందుకు ప్రత్యేక కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

హైవేపై సడన్ షాక్.. రెండు ప్రమాదాల్లో 8మంది మృతి
TG· 12 Aug 2026

హైవేపై సడన్ షాక్.. రెండు ప్రమాదాల్లో 8మంది మృతి

హైదరాబాద్-ముంబయి నేషనల్ హైవేపై జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాలతో తీవ్ర విషాదం నెలకుంది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం సత్వార్ వద్ద యూటర్న్ తీసుకుంటున్న ఆటోను వేగంగా వచ్చిన ట్యాంకర్ ఢీకొట్టడంతో ఆరుగురు మృతిచెందారు. మృతుల్లో ఐదుగురు కూలీలు, ఆటో డ్రైవర్ ఉన్నారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. కోహీర్ మండలం వెంకటాపూర్ కూడలి సమీపంలో మరో ప్రమాదం జరిగింది. డివైడర్‌ను ఢీకొన్న కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న వాహనాలను ఢీకొట్టడంతో ఇద్దరు చనిపోయారు. పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

PF ఖాతాదారులకు బిగ్ అలర్ట్..
News· 11 Aug 2026

PF ఖాతాదారులకు బిగ్ అలర్ట్..

ఆన్‌లైన్ ద్వారా PF సేవల వినియోగం పెరగడంతో, సైబర్ నేరగాళ్లు అసలైన సైట్‌ను పోలిన నకిలీ వెబ్‌సైట్లు, లింకులతో మోసాలకు పాల్పడుతున్నారని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) తెలిపింది. PF బ్యాలెన్స్, క్లెయిమ్,KYC పేరుతో వచ్చే అనుమానాస్పద లింక్‌లను క్లిక్ చేయవద్దని స్పష్టం చేసింది. సైబర్ మోసగాళ్లకు UAN, ఆధార్, పాన్, బ్యాంక్ వివరాలు, పాస్‌వర్డ్ లేదా OTP సమాచారాన్ని అందిస్తే అకౌంట్లో ఉన్న డబ్బు క్షణాల్లో మాయమయ్యే ప్రమాదముందని, కేవలం అధికారిక పోర్టల్ ద్వారానే సేవలు పొందాలని సూచించింది.

అందుకే మాట్లాడలేకపోయాను: మమతా బెనర్జీ
Politics· 11 Aug 2026

అందుకే మాట్లాడలేకపోయాను: మమతా బెనర్జీ

తన వెహికల్ పై రాళ్లతో ఎటాక్ జరగడంతో తీవ్రమైన చెస్ట్ పెయిన్ వచ్చిందని, రెండు రోజుల పాటు అసలు మాట్లాడలేకపోయానని పశ్చిమ బెంగాల్ మాజీ CM మమతా బెనర్జీ తెలిపారు. ఆ దాడిలో తన కళ్లద్దాలు కూడా పగిలిపోయాయని చెప్పారు. పోలీసులు ఎవరిని అరెస్ట్ చేసినా చేయకపోయినా అది వారి డ్యూటీ అని, కానీ తమ పార్టీ వర్కర్స్‌పై అటాక్స్ చేస్తే ఊరుకోబోమని ఆమె హెచ్చరించారు. తాము పీస్ నే కోరుకుంటున్నామని ఆమె మీడియాతో చెప్పారు.

పెద్ద మనసుతో క్షమించండి- జానీ మాస్టర్
Cinema· 11 Aug 2026

పెద్ద మనసుతో క్షమించండి- జానీ మాస్టర్

తెలుగు ఫిలిం అండ్ టీవీ డాన్సర్స్ అసోసియేషన్ వివాదంపై డాన్స్ మాస్టర్ జానీ స్పందించారు. తెలిసీ తెలియక జరిగిన తప్పులను పెద్ద మనసుతో క్షమించాలని ఇండస్ట్రీ పెద్దలను కోరారు. ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్‌తో సమస్యలు సాల్వ్ అయ్యాయని చెప్పారు. ప్రొడ్యూసర్స్ ఇచ్చిన డబ్బులు డాన్సర్లకు పూర్తిగా అందడం లేదనేదే తన బాధ అని, ఈ విషయాన్ని చిరంజీవి గారితో పాటు ఇండస్ట్రీ పెద్దలు అర్థం చేసుకున్నారని తెలిపారు. తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించాలని, అందరితో కలిసి సమస్యను పరిష్కరించుకుంటామని జానీ చెప్పారు.

రీఎంట్రీలో రోజా హిట్..
Cinema· 11 Aug 2026

రీఎంట్రీలో రోజా హిట్..

సినీ, రాజకీయ రంగాల్లో తనదైన ముద్ర వేసిన సీనియర్ నటి రోజా మళ్లీ వెండితెరపై రీఎంట్రీ ఇచ్చారు. ఆమె కీలక పాత్రలో నటించిన తమిళ చిత్రం ‘అన్బే డయానా’ జులైలో థియేటర్లలో విడుదలై మంచి విజయంతో పాటు కలెక్షన్లు సాధించింది. చాలా కాలం తర్వాత రోజా నటించిన ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ అక్కడ సూపర్ హిట్‌గా నిలిచింది. తెలుగులో థియేటర్ రిలీజ్ కాకపోయినప్పటికీ, త్వరలోనే ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతుండటంతో ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మీ పిల్లలకు మీరు Safe Placeగా ఉన్నారా..? ❤️
parenting· 11 Aug 2026

మీ పిల్లలకు మీరు Safe Placeగా ఉన్నారా..? ❤️

పిల్లలు పెద్దయ్యాక వాళ్లు ఎలా ఉంటారో.. వాళ్లను చిన్నప్పటి నుంచి మనం ఎలా పెంచామన్నదానిపైనే చాలా వరకు ఆధారపడి ఉంటుంది. వాళ్లు చేసే ప్రతి తప్పును కరెక్ట్ చేయడం కంటే వాళ్లు చెప్పేది వినడం, చిన్న ప్రయత్నాలను అప్రిషియేట్ చేయడం, ప్రశ్నలకు పేషెన్స్‌తో సమాధానం చెప్పడం, ప్రేమతో సపోర్ట్ చేయడం ముఖ్యం. అన్నింటికంటే పిల్లలు తప్పు చేసినప్పుడు దాక్కునే వ్యక్తిగా కాకుండా, ఏం జరిగినా ముందుగా గుర్తొచ్చే సేఫ్ ప్లేస్‌గా ఉండాలి. ఎందుకంటే మన దగ్గర వాళ్లకు దొరికే భద్రతే.. రేపు ప్రపంచాన్ని ఎదుర్కొనే ధైర్యంగా మారుతుంది.

చిరు లీక్స్ రిపీట్..
Cinema· 11 Aug 2026

చిరు లీక్స్ రిపీట్..

వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’ సక్సెస్ మీట్‌లో మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ వేడుకలో చిరు మరోసారి తన ‘చిరు లీక్స్’తో అభిమానులకు క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. దర్శకుడు బాబీ కాంబినేషన్‌లో వస్తున్న తన 158వ చిత్రానికి ‘కదిరి నరసింహుడు’ అనే టైటిల్ రానున్నట్లు హింట్ ఇచ్చారు. అంతేకాకుండా, ఆగస్టు 22న తన పుట్టినరోజు సందర్భంగా #Mega158 టైటిల్ టీజర్‌ను విడుదల చేయనున్నట్లు తెలిపారు.

మెగా ఫ్యామిలీ లక్కీ చార్మ్!
Cinema· 11 Aug 2026

మెగా ఫ్యామిలీ లక్కీ చార్మ్!

మెగాస్టార్ చిరంజీవి ‘కొరియన్ కనకరాజు’ మూవీ సక్సెస్ మీట్‌లో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. దాదాపు 7 ఇయర్స్ తర్వాత వరుణ్ తేజ్‌కి ఈ సినిమాతో హిట్ వచ్చి, ఆడియన్స్ నుంచి మంచి టాక్ వచ్చింది. అయితే ఈ సక్సెస్‌ని తన ఖాతాలో వేసుకోవద్దని, రీసెంట్‌గా పుట్టిన కొడుకు 'వాయువ్ తేజ్' అకౌంట్‌లో వేయాలని వరుణ్‌కి చిరు ఫన్నీగా చెప్పారు. వాయువ్ తమ ఫ్యామిలీకి లక్కీ చార్మ్ అని, వాడు వచ్చిన టైమ్‌కే ఈ హిట్ రావడం చాలా హ్యాపీగా ఉందన్నారు.

సత్య మిమిక్రీ టాలెంట్‌పై చిరు కామెంట్స్?
Cinema· 11 Aug 2026

సత్య మిమిక్రీ టాలెంట్‌పై చిరు కామెంట్స్?

కామెడీ నటుడు సత్యపై మెగాస్టార్ చిరంజీవి ‘కొరియన్ కనకరాజు’ మూవీ ఈవెంట్‌లో ప్రశంసలు కురిపించారు. సత్య సినిమాలు తాను వరుసగా చూస్తుంటానని, అతని కామెడీని మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుందని చెప్పారు. "సత్య నువ్వు ఈ ఈవెంట్ లైవ్ చూస్తున్నావని తెలుసు, ముందు షూటింగ్‌కి వెళ్లు" అంటూ ఫన్నీగా అన్నారు. ఎలాంటి లిమిట్స్ లేకుండా యాక్ట్ చేసే సత్య టాలెంట్, మిమిక్రీ స్కిల్స్ అతని మెయిన్ పవర్ అని.. తన ఫ్యాన్ ఇంత గొప్ప స్థాయికి రావడం చాలా గర్వంగా ఉందంటూ చిరు మాట్లాడారు.

MLA పోచారం శ్రీనివాస్ బయటపెట్టిన కాంగ్రెస్ సీక్రెట్!
Politics· 11 Aug 2026

MLA పోచారం శ్రీనివాస్ బయటపెట్టిన కాంగ్రెస్ సీక్రెట్!

కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరాల్సి వచ్చిందో BRS మాజీ నేత పోచారం శ్రీనివాస్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. నిధుల కోసం తన కొడుకుని రేవంత్ రెడ్డి తమ్ముడి వద్దకు పంపగా, "BRS ఎమ్మెల్యేలకు ఒక్క రూపాయి కూడా ఫండ్స్ ఇవ్వం.. కాంగ్రెస్‌లో చేరితేనే పనులు జరుగుతాయి" అని చెప్పినట్లు వెల్లడించారు. అభివృద్ధి పనుల బిల్లుల కోసం కేడర్, ప్రజల నుంచి ప్రెజర్ పెరగడంతోనే నియోజకవర్గ సంక్షేమం కోసం తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీ మారానని చెప్పారు.