ఖేలో ఇండియాపై CM స్పెషల్ ఫోకస్

TG: ఖేలో ఇండియా యూత్ గేమ్స్-2026 పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని CM రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లోని బోధి పెవిలియన్‌లో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఏర్పాట్లు, నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. డిసెంబరులో నిర్వహించే జాతీయస్థాయి పోటీలకు వివిధ రాష్ట్రాల క్రీడాకారులు రానున్న నేపథ్యంలో క్రీడా మైదానాలు, మౌలిక వసతులను మెరుగుపరచాలని సూచించారు. హైదరాబాద్‌లోని స్పోర్ట్స్ గ్రౌండ్స్ పరిస్థితిని పరిశీలించి శాశ్వత అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని చెప్పారు.



