Latest

లైబ్రరీ ఫండ్స్ బకాయిలు..
News· 12 Aug 2026

లైబ్రరీ ఫండ్స్ బకాయిలు..

తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ గ్రంథాలయాల అభివృద్ధి కోసం విడుదల చేయాల్సిన నిధులు పూర్తిగా నిలిచిపోయాయి. స్థానిక సంస్థలైన మున్సిపాలిటీలు, పంచాయతీలు ప్రజల నుంచి వసూలు చేసే ఆస్తి పన్నుతో పాటు 8శాతం 'లైబ్రరీ సెస్'ను కూడా వసూలు చేస్తాయి. అయితే, ఈ విధంగా వసూలైన నిధులను మున్సిపాలిటీలు, పంచాయతీలు గ్రంథాలయ సంస్థలకు బదిలీ చేయడంలో ఆలస్యం చేస్తున్నాయి. దీని కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో రూ. 213 కోట్లు, తెలంగాణలో రూ. 302.49 కోట్ల మేర లైబ్రరీ సెస్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి.

తల్లి కాబోతున్న వేళ విషాదం..  ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత
TG· 12 Aug 2026

తల్లి కాబోతున్న వేళ విషాదం.. ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత

TG: ప్రసవం కోసం సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో చేరిన 9నెలల గర్భిణీ అనిత (33) మృతి చెందడం తీవ్ర విషాదం నింపింది. చౌటకూర్ మండలం బద్రిగూడెంకు చెందిన అనితను కుటుంబసభ్యులు ఈ నెల 10న ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతున్న ఆమెకు ఇవాళ తెల్లవారుజామున ఫిట్స్ రావడంతో మృతి చెందినట్లు వైద్యులు కుటుంబసభ్యులకు తెలిపారు. అయితే సరైన సమయంలో వైద్యం అందకపోవడం, వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే తమ కూతురు మృతి చెందిందని బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.

హైదరాబాద్‌కు 'ట్రంప్' టవర్స్
News· 12 Aug 2026

హైదరాబాద్‌కు 'ట్రంప్' టవర్స్

TG : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లోకి అమెరికాకు చెందిన ప్రముఖ 'ట్రంప్ ఆర్గనైజేషన్' అడుగుపెట్టింది. ట్రెబెకా డెవలపర్స్, స్థానిక ఇరా రియల్టీ భాగస్వామ్యంతో కోకాపేట్ గోల్డెన్ మైల్ రోడ్డులోని 4 ఎకరాల్లో 65 అంతస్తులతో రెండు ట్రంప్ టవర్లను నిర్మిస్తున్నారు. దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా రూ.1,800 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించే ఈ ప్రాజెక్టులో 450 లగ్జరీ అపార్ట్‌మెంట్లు, 16 పెంట్ హౌస్‌లు అందుబాటులోకి రానున్నాయి. ఈ ఏడాది చివర్లో పనులు ప్రారంభించి నాలుగేళ్లలో ప్రాజెక్టు పూర్తి చేయనున్నారు.

మళ్లీ పెరిగిన బంగారం ధరలు!
News· 12 Aug 2026

మళ్లీ పెరిగిన బంగారం ధరలు!

గత రెండు రోజుల నుంచి బంగారం ధరలు వరుసగా పెరుగుతూ కొనుగోలుదారులకు షాక్ ఇస్తున్నాయి. బుధవారం హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.1,040 పెరిగి రూ.1,54,860 వద్ద ట్రేడ్ అవుతుంది. అలాగే 22 క్యారెట్ల తులం బంగారంపై రూ.950 పెరిగి రూ.1,41,950 వద్ద, 18 క్యారెట్ల బంగారంపై రూ.770 పెరిగి రూ.1,16,140కి చేరింది. బంగారం ధరలు రోజురోజుకూ ఆకాశాన్ని తాకుతుండటంతో కొనేవారు భయపడుతున్నారు.

మళ్లీ హాస్టల్‌కు పంపుతారనే భయంతో బాలిక ఆత్మహత్య
TG· 12 Aug 2026

మళ్లీ హాస్టల్‌కు పంపుతారనే భయంతో బాలిక ఆత్మహత్య

TG: ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం సీతాగొంది గ్రామానికి చెందిన 11ఏళ్ల బాలిక మైనారిటీ హాస్టల్‌లో 5వ తరగతి చదువుతుంది. ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. రేషన్‌కార్డు eKYC కోసం పదిరోజుల క్రితం తల్లి ఆమెను ఇంటికి తీసుకొచ్చింది. అయితే తిరిగి హాస్టల్‌కు వెళ్లేందుకు బాలిక ఇష్టపడకపోవడంతో, ఆమెను హాస్టల్ నుంచి మాన్పించి TC తీసుకురావడానికి తల్లి అక్కడికి వెళ్లింది. ఈ సమయంలో బాలిక ఇంట్లోనే ప్రాణాలు తీసుకుంది. తిరిగి హాస్టల్‌కు పంపిస్తారనే భయంతోనే ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.

మనకు మనమే టిక్లింగ్ చేసుకుంటే ఎందుకు నవ్వుకోలేం? 🤔
Education· 12 Aug 2026

మనకు మనమే టిక్లింగ్ చేసుకుంటే ఎందుకు నవ్వుకోలేం? 🤔

మనకు మనమే టిక్లింగ్ చేసుకుంటే ఎందుకు పెద్దగా నవ్వు రాదు? కారణం మన మెదడు ముందుగానే మనం చేయబోయే పనిని అంచనా వేయడమే. మన చేతి కదలికతో వచ్చే స్పర్శను మెదడులోని సెరెబెల్లమ్ ముందే ఊహించి, ఆ అనుభూతిని కొంత తగ్గిస్తుంది. కానీ ఇంకొకరు టిక్లింగ్ చేస్తే ఎప్పుడు, ఎక్కడ తాకుతారో మనకు తెలియదు. అందుకే ఆ స్పర్శ కొత్తగా అనిపించి టిక్లింగ్ ఫీల్ ఎక్కువగా ఉంటుంది. పరిశోధనలు కూడా మనమే చేసుకునే స్పర్శకు మెదడు స్పందన తక్కువగా ఉంటుందని సూచిస్తున్నాయి. మరి మీకు మీరు టిక్లింగ్ చేసుకుంటే ఎలా అనిపిస్తుంది?

HCUలో డ్రగ్స్ కలకలం
Politics· 12 Aug 2026

HCUలో డ్రగ్స్ కలకలం

TG: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపింది. క్యాంపస్‌లో మత్తుపదార్థాల వినియోగం, విక్రయాలపై సమాచారం అందడంతో తెలంగాణ ఈగల్ టీమ్, పోలీసులు బుధవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పలువురు విద్యార్థులకు డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా, 17మందికి గంజాయి పాజిటివ్‌గా తేలినట్లు అధికారులు తెలిపారు. యూనివర్సిటీ విద్యార్థులకు గంజాయి సరఫరా చేస్తున్నట్లు అనుమానిస్తున్న ఓ డ్రగ్ పెడ్లర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అస్సాం నుంచి గంజాయి తీసుకొచ్చి క్యాంపస్‌లో విక్రయిస్తున్నట్లు గుర్తించారు.

యాక్షన్ సీన్స్ చేయడం అంత తేలిక కాదు!
Cinema· 12 Aug 2026

యాక్షన్ సీన్స్ చేయడం అంత తేలిక కాదు!

స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల తన కెరీర్, నిర్మాణ రంగంపై ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. సున్నితంగా ఉండే అమ్మాయి యాక్షన్ సీన్స్ చేస్తుంటే ప్రేక్షకులు ఒప్పుకోవడం అంత తేలిక కాదని, కానీ ‘ది ఫ్యామిలీ మ్యాన్’, ‘సిటాడెల్’ సిరీస్‌లలో తన యాక్షన్‌కు మంచి స్పందన వచ్చిందని ఆమె తెలిపారు. అలాగే నిర్మాణం వైపు రావడం వల్ల తనకు నచ్చిన పనులు చేసుకునే స్వేచ్ఛ దక్కిందన్నారు. తన ప్రొడక్షన్ హౌస్ ద్వారా ‘శుభం’, ‘మా ఇంటి బంగారం’ ప్రాజెక్టులు కూడా మంచి విజయాన్ని అందుకున్నాయని తెలిపారు.

ఇంటి ముందు హత్య.. గ్రామంలో హైటెన్షన్
Crime· 12 Aug 2026

ఇంటి ముందు హత్య.. గ్రామంలో హైటెన్షన్

AP: పల్నాడు జిల్లా దుర్గి మండలం ఓబులేసునిపల్లెలో దారుణ హత్య కలకలం రేపింది. ఇంటి బయట నిద్రిస్తున్న కొమ్ము ఇమ్మాన్యుయేల్(35)పై అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు గొడ్డలితో దాడి చేశారు. తీవ్ర గాయాలతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై సమాచారం అందుకున్న గురజాల DSP ఉమామహేశ్వరరావు సిబ్బందితో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. పాత కక్షలు, వ్యక్తిగత వివాదాల కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన దర్యాప్తు ముమ్మరం చేశారు.

యష్ 'టాక్సిక్' సీన్స్ కట్!
Cinema· 12 Aug 2026

యష్ 'టాక్సిక్' సీన్స్ కట్!

KGF హీరో యష్ నటిస్తున్న 'టాక్సిక్' సినిమాకు సెన్సార్ బోర్డు 'A' (అడల్ట్) సర్టిఫికేట్ ఇచ్చింది. ఈ సినిమా ఆగస్టు 26న థియేటర్లలోకి రానుంది. అయితే మనదేశ సెన్సార్ నిబంధనల ప్రకారం కొన్ని సీన్లను కట్ చేయడం లేదా మార్చడం చేస్తున్నారట. దీంతో ఇండియాలో చూసే వర్షన్ వేరు, విదేశాల్లో విడుదలయ్యే వర్షన్ వేరుగా ఉంటుందా అనే ప్రచారం నడుస్తుంది. దీనిపై చిత్ర యూనిట్ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.

విద్యార్థినులపై అనుచిత ప్రవర్తన.. అధికారులు సీరియస్
Crime· 12 Aug 2026

విద్యార్థినులపై అనుచిత ప్రవర్తన.. అధికారులు సీరియస్

AP: అనంతపురం జిల్లా యల్లనూరు ZP ఉన్నత పాఠశాలలో విద్యార్థినుల పట్ల అనుచితంగా ప్రవర్తించారనే ఆరోపణలపై ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడు శ్రీరామమూర్తిపై విద్యాశాఖ చర్యలు తీసుకుంది. విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించడంతో తల్లిదండ్రులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులపై విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టగా ఆరోపణలు నిజమని తేలింది. టీచర్‌ను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థినుల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని, ఇలాంటి ఘటనలను ఉపేక్షించబోమని అధికారులు స్పష్టం చేశారు.

ఆలియా నటనలో 'అమ్మ' పాత్రే టాప్: మహేష్ భట్!
Cinema· 12 Aug 2026

ఆలియా నటనలో 'అమ్మ' పాత్రే టాప్: మహేష్ భట్!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ నటనను దర్శకుడు, ఆమె తండ్రి మహేష్ భట్ మెచ్చుకున్నారు. 'హైవే', 'గంగూభాయి' చిత్రాల్లో ఆలియా నటన నన్ను ఆశ్చర్యపరిచింది. కానీ ఈరోజుల్లో ఆమె పోషిస్తున్న 'అమ్మ' పాత్రే అత్యుత్తమమైనది అని అన్నారు.<br>ఆలియా ఒకవైపు సినిమాలు చేస్తూనే, మరోవైపు భార్యగా, తల్లిగా బాధ్యతలు చక్కగా నిర్వర్తిస్తోందన్నారు. మనవరాలు 'రాహా' వచ్చిన తర్వాత ఇంట్లో కొత్త ఉత్సాహం వచ్చిందని, ఆమె తమ కుటుంబంలో ఒక ప్రత్యేకమైన వెలుగు అని చెప్పారు.

ఆస్పత్రిలోనే బాలింత సూసైడ్
TG· 12 Aug 2026

ఆస్పత్రిలోనే బాలింత సూసైడ్

TG: నల్గొండ జిల్లా మునుగోడు మండలం చీకటిమామిడి గ్రామానికి చెందిన మమత (27) ప్రసవం కోసం నల్గొండ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది. ప్రసవం అనంతరం ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్న ఆమె బుధవారం తెల్లవారుజామున వార్డు నుంచి బయటకు వచ్చి హాస్పిటల్ ఆవరణలో చెట్టుకు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. వరుసగా నలుగురు ఆడపిల్లలే పుట్టడంతో కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయని, అత్తింటి వేధింపులే మమత ఆత్మహత్యకు కారణం అని ఆమె బంధువులు ఆరోపించారు.

AI తో చిప్స్!
Infotainment· 12 Aug 2026

AI తో చిప్స్!

మనం ఎంతగానో ఇష్టపడే ‘ప్రింగిల్స్’ చిప్స్ ఇప్పుడు మరింత రుచిగా, అసలు విరిగిపోకుండా రాబోతున్నాయి. ఇందుకోసం కంపెనీ AI టెక్నాలజీని వాడుతుంది. పోలాండ్‌లోని ఫ్యాక్టరీలో సీమెన్స్ కంపెనీతో కలిసి సుమారు రూ. 40 కోట్లు ఖర్చు చేసి ఈ కొత్త సిస్టమ్‌ను తెచ్చారు. పిండి తేమ, బంగాళదుంపల నాణ్యత లాంటి 200 విషయాలను ఈ AI క్షణాల్లో పరిశీలించి యంత్రాలను సరిచేస్తుంది. దీనివల్ల చిప్స్ సూపర్ క్వాలిటీతో రావడమే కాక, వృథా 13 శాతం తగ్గిందంట. త్వరలోనే అన్ని ఫ్యాక్టరీలకూ దీనిని తెస్తున్నారు.

డంపింగ్ యార్డు ప్రతిపాదనను రద్దు చేయాలని మహా ధర్నా
TG· 12 Aug 2026

డంపింగ్ యార్డు ప్రతిపాదనను రద్దు చేయాలని మహా ధర్నా

TG: రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలోని సిద్ధాపూర్ డంపింగ్ యార్డు ప్రతిపాదనను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దాపూర్ డంపింగ్ యార్డ్ వ్యతిరేక పోరాట జాయింట్ యాక్షన్ కమిటీ (SDVP JAC) ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట మహాధర్నా నిర్వహించారు. వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు, స్థానికులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డంపింగ్ యార్డు హటావో.. సిద్ధాపూర్ బచావో అంటూ ధర్నా ప్రాంగణం మార్మోగింది. డంపింగ్ యార్డుతో దుర్వాసన, కాలుష్యం, భూగర్భ జలాల కలుషితమయ్యే ప్రమాదం ఉందన్నారు.

📚 గ్రంథపాలకుల దినోత్సవ శుభాకాంక్షలు!
Infotainment· 12 Aug 2026

📚 గ్రంథపాలకుల దినోత్సవ శుభాకాంక్షలు!

భారతీయ గ్రంథాలయ శాస్త్ర పితామహుడు ఎస్.ఆర్. రంగనాథన్ జయంతి సందర్భంగా ఆగస్టు 12న జాతీయ గ్రంథపాలకుల దినోత్సవాన్ని జరుపుకుంటాం. అక్షరాల ప్రపంచానికి దారి చూపుతూ, పుస్తకాల నిధిని కాపాడుతూ సమాజ చైతన్యంలో కీలక పాత్ర పోషిస్తున్న గ్రంథపాలకులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. 📚💐

ACP ఆఫీస్‌లో సడన్ షాక్.. కానిస్టేబుల్ మృతి
TG· 12 Aug 2026

ACP ఆఫీస్‌లో సడన్ షాక్.. కానిస్టేబుల్ మృతి

TG: హైదరాబాద్ LBనగర్ ACP కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ సాయికుమార్ మృతి కలకలం రేపింది. రెస్ట్‌రూమ్‌లో ఆయన ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. గత నెల నుంచి LBనగర్ పోలీస్‌స్టేషన్ నుంచి ACP కార్యాలయానికి అటాచ్‌మెంట్‌పై సాయికుమార్ విధులు నిర్వహిస్తున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. విషయం తెలుసుకున్న బంధువులు పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు.

ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగుల పోరుబాట
Jobs· 12 Aug 2026

ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగుల పోరుబాట

తెలంగాణలో నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం నిరుద్యోగ JAC ఆధ్వర్యంలో ఇవాళ హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో 11 గంటలకు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు. 25వేల పోస్టులతో మెగా DSC, గురుకుల, మోడల్ స్కూల్, JL, DL తదితర నోటిఫికేషన్లు విడుదల చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. పోలీస్ ఉద్యోగాల్లో పోస్టులు పెంచి 19 వేల CI, SI, కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్లు ఇవ్వాలని కోరారు. ఏజ్ రిలాక్సేషన్ పెంచాలని, ఉద్యోగ దరఖాస్తులకు ఎలాంటి ఫీజు లేకుండా అవకాశం కల్పించాలని కోరారు.

ఖేలో ఇండియాపై CM స్పెషల్ ఫోకస్
TG· 12 Aug 2026

ఖేలో ఇండియాపై CM స్పెషల్ ఫోకస్

TG: ఖేలో ఇండియా యూత్ గేమ్స్-2026 పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని CM రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లోని బోధి పెవిలియన్‌లో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఏర్పాట్లు, నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. డిసెంబరులో నిర్వహించే జాతీయస్థాయి పోటీలకు వివిధ రాష్ట్రాల క్రీడాకారులు రానున్న నేపథ్యంలో క్రీడా మైదానాలు, మౌలిక వసతులను మెరుగుపరచాలని సూచించారు. హైదరాబాద్‌లోని స్పోర్ట్స్ గ్రౌండ్స్ పరిస్థితిని పరిశీలించి శాశ్వత అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని చెప్పారు.

ఆక్వా రైతులకు ప్రభుత్వం భరోసా: అచ్చెన్నాయుడు
AP· 12 Aug 2026

ఆక్వా రైతులకు ప్రభుత్వం భరోసా: అచ్చెన్నాయుడు

AP: రాష్ట్రంలోని ఆక్వా రంగాన్ని దేశానికే రోల్ మోడల్‌గా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో నిర్వహించిన ఆక్వా రైతు మహాసభలో ఆయన మాట్లాడారు. రొయ్యల మేత ధరలను తగ్గించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించిందన్నారు. మేత తయారీ పరిశ్రమలు, రైతులు, అధికారులు, ప్రతినిధులతో కమిటీ ఏర్పాటు చేసి, ధరల్లో మార్పులు చేయాలంటే అందరి ఆమోదం తీసుకునే విధానం తీసుకొచ్చామని చెప్పారు.

రైతుల కోసం కమాండ్ కంట్రోల్ రూమ్
AP· 12 Aug 2026

రైతుల కోసం కమాండ్ కంట్రోల్ రూమ్

AP: ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో సాగునీటి కంటే తాగునీటి సరఫరాకే ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. విజయవాడ పౌరసరఫరాలశాఖ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఏలూరు జిల్లాలో సాధారణం కంటే 74శాతం తక్కువ వర్షపాతం నమోదైనా వరిసాగు 400శాతం పెరగడంపై ఆందోళన వ్యక్తంచేశారు. తక్కువ నీటితో పండే పంటల వైపు రైతులను ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని నివారించేందుకు ప్రత్యేక కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.