హైవేపై సడన్ షాక్.. రెండు ప్రమాదాల్లో 8మంది మృతి

హైదరాబాద్-ముంబయి నేషనల్ హైవేపై జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాలతో తీవ్ర విషాదం నెలకుంది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం సత్వార్ వద్ద యూటర్న్ తీసుకుంటున్న ఆటోను వేగంగా వచ్చిన ట్యాంకర్ ఢీకొట్టడంతో ఆరుగురు మృతిచెందారు. మృతుల్లో ఐదుగురు కూలీలు, ఆటో డ్రైవర్ ఉన్నారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. కోహీర్ మండలం వెంకటాపూర్ కూడలి సమీపంలో మరో ప్రమాదం జరిగింది. డివైడర్‌ను ఢీకొన్న కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న వాహనాలను ఢీకొట్టడంతో ఇద్దరు చనిపోయారు. పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



