Latest

‘రంభ ఊర్వశి మేనక'
Cinema· 11 Aug 2026

‘రంభ ఊర్వశి మేనక'

హీరో అల్లరి నరేష్, చంద్రమోహన్ చింతడ దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘రంభ ఊర్వశి మేనక' టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. వంశపారంపర్యంగా వచ్చిన ఒక కోరికల పుస్తకంతో రంభ, ఊర్వశి, మేనకలను భూమిపైకి పిలిచిన తర్వాత జరిగే కామెడీ చుట్టూ ఈ కథ ఉంటుంది. ఇందులో రాశి సింగ్, విష్ణు ప్రియ, సురభి, ప్రిషా సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై వస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 4న థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమవుతుంది.

మీతో మీరే మాట్లాడుకుంటారా? 👀
Science· 11 Aug 2026

మీతో మీరే మాట్లాడుకుంటారా? 👀

మనమే మనతో మాట్లాడుకుంటూ ఉండటం చూసి “నేను మాత్రమే ఇలా చేస్తున్నానా?” అనిపిస్తుందా? 😄 నిజానికి Self-talk అనేది చాలా సాధారణమైన విషయమే. మనతో మనం మాట్లాడుకోవడం వల్ల ఆలోచనలను సర్దుకోవడం, పనులను ప్లాన్ చేసుకోవడం, ఫోకస్ పెంచుకోవడం, టెన్షన్ తగ్గించుకోవడం, కష్టమైన పనికి మనల్ని మనమే మోటివేట్ చేసుకోవడం సాధ్యమవుతుందని రీసెర్చర్లు చెబుతున్నారు. ఇది మనసులోనే జరగొచ్చు.. కొన్నిసార్లు బయటకు మాట్లాడుకోవడం కూడా సహజమే. అయితే ఎప్పుడూ మనల్ని మనమే తక్కువ చేసుకునే Negative Self-talk మాత్రం మంచిది కాదు.

‘హనుమాన్’ సీక్వెల్‌లో ట్రెండింగ్ హీరోయిన్
Cinema· 11 Aug 2026

‘హనుమాన్’ సీక్వెల్‌లో ట్రెండింగ్ హీరోయిన్

ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా ‘జై హనుమాన్’ నుంచి ఓ క్రేజీ అప్‌డేట్ వైరల్ అవుతుంది. ‘హనుమాన్’ సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాలో కీలక పాత్రలో తేజ సజ్జ, కన్నడ స్టార్ రిషభ్ శెట్టి నటిస్తుండగా, ఈ మధ్యకాలంలో ట్రెండింగ్ అవుతున్న హీరోయిన్ 'వామికా గబ్బి' ఇందులో ఓ కీలక పాత్రలో నటించనుందని టాక్ వస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ పౌరాణిక సూపర్‌హీరో మూవీకి కీరవాణి మ్యూజిక్ అందించనున్నారు. దీనిపై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

శేరిలింగంపల్లిలో ‘హర్ ఘర్ తిరంగా’ వేడుకలు
TG· 11 Aug 2026

శేరిలింగంపల్లిలో ‘హర్ ఘర్ తిరంగా’ వేడుకలు

TG: వందేమాతరం గీతం 150 ఏళ్లు, 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు శేరిలింగంపల్లి మసీద్ బండ క్యాంపు కార్యాలయంలో బీజేపీ ఇంచార్జి రవికుమార్ యాదవ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ప్రతి ఒక్కరూ ఇళ్లపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి, ఆ సెల్ఫీని harghartiranga.comలో అప్‌లోడ్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

నల్లగండ్ల రేణుకా ఎల్లమ్మ ఆలయంలో బోనాల వేడుకలు
TG· 11 Aug 2026

నల్లగండ్ల రేణుకా ఎల్లమ్మ ఆలయంలో బోనాల వేడుకలు

TG: శేరిలింగంపల్లిలోని నల్లగండ్ల నేతాజీనగర్ రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో బోనాల పండుగ ఘనంగా జరిగింది. టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.జగదీశ్వర్ గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. నియోజకవర్గ ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు రఘునందన్‌రెడ్డి, మల్లికార్జున్ యాదవ్ పాల్గొన్నారు.

రాజమౌళి అంటే ఎవరండి- GenZ ప్రాంక్
Politics· 11 Aug 2026

రాజమౌళి అంటే ఎవరండి- GenZ ప్రాంక్

నారా లోకేష్ కొంతమంది GenZ గర్ల్స్‌తో చిట్‌చాట్ చేస్తుండగా ఒక ఫన్నీ సీన్ జరిగింది. ఆయన సరదాగా తన ఫోన్‌ని అన్‌లాక్ చేసి చేతికి ఇవ్వగా, ఒక అమ్మాయి కాల్ లిస్ట్‌లో ఉన్న స్టార్ డైరెక్ట‌ర్ రాజమౌళికి కాల్ చేసింది. అంతేకాకుండా "రాజమౌళి అంటే ఎవరండి?" అంటూ ఆయనతోనే ప్రాంక్ చేసింది. అది చూసి లోకేష్ కూడా నవ్వు ఆపుకోలేక సైలెంట్‌గా ఉండిపోయారు. అస్సలు ఏం చేసినా GenZ స్టైలే వేరు అంటూ సోషల్ మీడియాలో ఈ వీడియో కింద కామెంట్స్ వస్తున్నాయి.

ఇంటర్నెట్‌లో “404” అనే Error ఎందుకు వస్తుంది?
Technology· 11 Aug 2026

ఇంటర్నెట్‌లో “404” అనే Error ఎందుకు వస్తుంది?

వెబ్‌సైట్ ఓపెన్ చేస్తుంటే ఒక్కసారిగా “404 Not Found” అని కనిపించిందా? 👀 ఇది మీ ఇంటర్నెట్ పనిచేయడం లేదని అర్థం కాదు. మీరు ఓపెన్ చేయాలనుకున్న వెబ్‌పేజ్‌ను సర్వర్‌లో కనుగొనలేకపోయినప్పుడు ఈ Error వస్తుంది. ఉదాహరణకు, ఒక వెబ్‌పేజ్ డిలీట్ అయి ఉండొచ్చు, దాని లింక్ మారి ఉండొచ్చు లేదా URL తప్పుగా టైప్ చేసి ఉండొచ్చు. అందుకే 404 అంటే సింపుల్‌గా చెప్పాలంటే.. “మీరు అడిగిన పేజ్ ఇక్కడ కనిపించలేదు” అన్నమాట. 💻

మసీదుబండ 100 ఫీట్ల రోడ్డు విస్తరణకు మోక్షం
TG· 11 Aug 2026

మసీదుబండ 100 ఫీట్ల రోడ్డు విస్తరణకు మోక్షం

TG: హైదరాబాద్ నగరం శేరిలింగంపల్లి పరిధిలోని మసీదుబండ 100 ఫీట్ల రోడ్డు విస్తరణకు స్థలాలు ఇచ్చేందుకు సమ్మతించిన బాధితులకు PAC చైర్మన్ అరెకపూడి గాంధీ అంగీకార పత్రాలు అందించారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో సీసీపీ వెంకన్న, నాయకుడు రాజు యాదవ్‌లతో కలిసి కార్యక్రమం నిర్వహించారు. బాధితులకు TDR ఇచ్చి న్యాయం చేయాలని అధికారులను కోరారు. దశాబ్దాల ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని, పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు.

2027లో మార్కెట్‌లోకి ప్లాస్టిక్ నోట్స్?
News· 11 Aug 2026

2027లో మార్కెట్‌లోకి ప్లాస్టిక్ నోట్స్?

కేంద్ర ప్రభుత్వం RBIకి ఒక బిగ్ అప్‌డేట్ ఇచ్చింది. ₹10, ₹20 వాల్యూ ఉండే ప్లాస్టిక్ నోట్ల పైలట్ ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. మొత్తం ₹3,000 కోట్ల విలువైన నోట్లతో ఫీల్డ్ ట్రయల్స్ స్టార్ట్ చేస్తున్నారు. ఈ ప్లాస్టిక్ నోట్స్ నార్మల్ పేపర్ నోట్ల కంటే 2.5 నుండి 4 టైమ్స్ ఎక్కువ లైఫ్ ఇస్తాయి. ప్రజెంట్ ఇవి నార్మల్ క్యాష్‌తో పాటే యూజ్‌లో ఉంటాయి, పాత నోట్లను రీప్లేస్ చేయరు. ఈ ట్రయల్స్ సక్సెస్ అయితే ఏప్రిల్ 2027 నుంచి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తారు.

కేసీఆర్ హయాంలోనే అభివృద్ధి జరిగింది: పోచారం
TG· 11 Aug 2026

కేసీఆర్ హయాంలోనే అభివృద్ధి జరిగింది: పోచారం

TG: కేసీఆర్ హయాంలోనే అభివృద్ధి జరిగిందంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. అన్నం పెట్టినవాళ్లను మర్చిపోలేనన్నారు. పదవి, డబ్బు కోసం తను పార్టీ మారలేదని, కొందరి వల్లే తను పార్టీ మారాల్సి వచ్చిందని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారాల్సి వచ్చిందన్నారు. ప్రస్తుతం నిధుల కోసం ఫోన్ చేస్తే ఎవరూ స్పందించడం లేదన్నారు. తను కాంగ్రెస్ కండువా కప్పుకోలేదని, జాతీయ జెండా మాత్రమే కప్పుకున్నానని తెలిపారు.

హిమాచల్‌లో భారీ వర్షాలు.. 157 మంది మృతి
News· 11 Aug 2026

హిమాచల్‌లో భారీ వర్షాలు.. 157 మంది మృతి

హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రంలో వర్షాలు, కొండచరియలు, సడన్ ఫ్లడ్స్‌తో తీవ్ర నష్టం ఏర్పడింది. జూన్‌ 30 నుంచి ఆగస్టు 9 వరకు వర్షాల కారణంగా 157 మంది మృతి చెందగా, 257 మంది మిస్ అయ్యారని స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్స్‌ సెంటర్‌ తెలిపింది. ఇందులో 68 మంది వరదలు, కొండచరియల కారణంగా, 89 మంది రోడ్డు యాక్సిడెంట్స్‌లో చనిపోయారు. 259 రోడ్స్ క్లోజ్ అవ్వగా, దాదాపు రూ.886 కోట్ల నష్టం వచ్చినట్లు అంచనా వేస్తున్నారు. ఎక్కువగా మండి జిల్లాలో 120 రోడ్లు మూసుకుపోయాయి.

Phone Cameraలో ఇక కొత్త టెక్నాలజీ! 📱
Technology· 11 Aug 2026

Phone Cameraలో ఇక కొత్త టెక్నాలజీ! 📱

మీ Phone కెమెరా ఇంకా మెరుగవ్వబోతోందా? 👀 TSMC, Sony కలిసి కొత్త తరం ఇమేజ్ సెన్సర్ల తయారీ కోసం జపాన్‌లో $4.69 బిలియన్ల జాయింట్ వెంచర్ ప్రకటించాయి. ఈ సెన్సర్లు ప్రధానంగా స్మార్ట్‌ఫోన్స్ కోసం ఉపయోగించనున్నారు. Sony సెన్సర్ డిజైన్, టెక్నాలజీని చూసుకోగా.. TSMC తయారీ బాధ్యతలు చేపట్టనుంది. జపాన్‌లోని కుమామోటోలో ఈ సంస్థ పనిచేయనుంది. పెద్ద ఎత్తున ఉత్పత్తి 2029లో ప్రారంభం కావచ్చని కంపెనీలు తెలిపాయి. అంటే భవిష్యత్తులో మన Phone కెమెరాల్లో మరింత అడ్వాన్స్‌డ్ సెన్సర్లు వచ్చే అవకాశం ఉంది.

సెక్యూరిటీ గార్డ్ మీదికి దూసుకెళ్లిన కార్!
News· 11 Aug 2026

సెక్యూరిటీ గార్డ్ మీదికి దూసుకెళ్లిన కార్!

బెంగళూరులో ఒక షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. అర్ధరాత్రి 1:42 గంటలకు ఒక వైట్ కార్ ఫుల్ స్పీడ్‌తో రాగా, సెక్యూరిటీ గార్డ్ గేట్ తీయబోతుండగానే అతని మీదికి దూసుకెళ్లింది. ఆ గార్డ్ లాస్ట్ సెకండ్‌లో స్పీడ్‌గా పక్కకు జంప్ చేయడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. కార్ ఇంపాక్ట్‌కు అతడు కిందపడ్డా సీరియస్ ఇంజరీస్ కాలేదు. ఈ భయంకరమైన యాక్సిడెంట్ విజువల్స్ సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి.

మెగా వరుస హిట్లు.. ఇక మిగిలింది ఆ ఒక్కడే!
Cinema· 11 Aug 2026

మెగా వరుస హిట్లు.. ఇక మిగిలింది ఆ ఒక్కడే!

బాక్సాఫీస్ దగ్గర మెగా హీరోలు వరుస హిట్లతో సందడి చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ‘ఓజి’, చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’, రామ్ చరణ్ ‘పెద్ది’ వంటి సినిమాలతో భారీ విజయాలు అందుకోగా, ఇటీవల వరుణ్ తేజ్ కూడా ‘కొరియన్ కనకరాజు’తో సాలిడ్ కమ్‌బ్యాక్ ఇచ్చాడు. ఇక మెగా ఫ్యామిలీ నుంచి బాక్సాఫీస్ బరిలో దిగేందుకు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ సిద్ధమవుతున్నాడు. తన కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘సంబరాల ఏటి గట్టు’ సినిమాతో ఆయన కూడా కచ్చితంగా బ్లాక్‌బస్టర్ కొడతారని మెగా అభిమానులు ఎదురుచూస్తున్నారు.

పాతబస్తీ మెట్రోకు స్పీడ్ పెంచండి.. CM రేవంత్‌రెడ్డి ఆదేశాలు
News· 11 Aug 2026

పాతబస్తీ మెట్రోకు స్పీడ్ పెంచండి.. CM రేవంత్‌రెడ్డి ఆదేశాలు

TG: హైదరాబాద్ పాతబస్తీ మెట్రో పనులపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈరోజు MCRHRDలో అధికారులతో రివ్యూ చేశారు. మెట్రో ఫేజ్-2 పనులను వేగవంతం చేయాలని సూచించారు. MGBS-చాంద్రాయణగుట్ట 7.5 కి.మీ కారిడార్‌కు సంబంధించిన రోడ్ వైడెనింగ్, పెండింగ్ ల్యాండ్ అక్విజిషన్ పనులను త్వరగా కంప్లీట్ చేయాలని ఆదేశించారు. మెట్రో పనులకు టెండర్ ప్రాసెస్‌ను వీలైనంత స్పీడ్‌గా స్టార్ట్ చేయాలని, రద్దీకి అనుగుణంగా ఎక్స్‌ట్రా కోచ్‌లు కొనాలని సూచించారు.

ప్రభుత్వ స్కూళ్లపై బిగ్ ప్లాన్!- అభిజీత్ దీప్కే
Politics· 11 Aug 2026

ప్రభుత్వ స్కూళ్లపై బిగ్ ప్లాన్!- అభిజీత్ దీప్కే

CJP ఫౌండర్ అభిజీత్ దీప్కే గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం దేశవ్యాప్త క్యాంపెయిన్ ప్రకటించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గ్రామీణ స్కూళ్లలోని తాగునీరు, కరెంట్, వాష్‌రూమ్స్ వంటి కనీస సదుపాయాలపై పేరెంట్స్ సోషల్ ఆడిట్ చేసి వీడియోలు తీయాలని పిలుపునిచ్చారు. పాఠశాలలను బాగుచేసే సర్పంచులకు CJP సోషల్ మీడియాలో క్రెడిట్ ఇస్తామని, తన స్వగ్రామం హంగోలీ నుండి ఈ మార్పును తానూ స్వయంగా ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు.

‘Why I Am Not a Hindu’  పుస్తకానికి 30 ఏళ్లు
Infotainment· 11 Aug 2026

‘Why I Am Not a Hindu’ పుస్తకానికి 30 ఏళ్లు

దళిత-బహుజన వర్గాల గొంతుకగా ప్రొ.కంచ ఐలయ్య రాసిన ‘Why I Am Not a Hindu’ పుస్తకానికి 30 ఏళ్లు పూర్తయ్యాయి. కుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా, శ్రమను, సమానత్వాన్ని, సామూహిక జీవన విలువలను గౌరవించే దళితబహుజన సంస్కృతిని ప్రాధాన్యం ఇచ్చిన పుస్తకంగా ఈ రచన పేరు తెచ్చుకుంది. అదే స్థాయిలో వివాదాస్పదంగానూ మారింది. 18వ తేదీ మంగళవారం హైదరాబాద్ నగరంలోని లామకాన్‌లో కంచ ఐలయ్యతో ముఖాముఖి నిర్వహిస్తున్నారు. ఇందులో స్పీకర్స్‌గా ప్రొ.జ్యోతిర్మయశర్మ, గీతారామస్వామి, పల్లికొండ మణికంఠ ఉంటారు.

పాలిటిక్స్‌లోకి ధనుష్?
Politics· 11 Aug 2026

పాలిటిక్స్‌లోకి ధనుష్?

హీరో ధనుష్ రాజకీయాల్లోకి వస్తున్నారంటూ తమిళనాడులో పెద్ద చర్చ నడుస్తుంది. ‘ఆల్ ఇండియా ధనుష్ ఫ్యాన్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్’ కోయంబత్తూరులోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొత్త సంక్షేమ సంఘాలను ఏర్పాటు చేసి, సభ్యులను చేర్చుకోవాలని పిలుపునిచ్చింది. జిల్లా అధ్యక్షుడు జి. శంకర్ నాయకత్వంలో ఈ కార్యక్రమాలను వేగవంతం చేయాలని, ఆ సంఘం జాతీయ కార్యదర్శి బి. రాజా నోటీసును సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ విషయంపై ధనుష్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినా, ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతుంది.

యువతిపై రేప్..క్షమాపణలు కోరిన నిందితుడు
Crime· 11 Aug 2026

యువతిపై రేప్..క్షమాపణలు కోరిన నిందితుడు

అహ్మదాబాద్‌లో ఓ బిల్డింగ్ టెర్రస్‌పై యువతిని అత్యాచారం చేసిన సెక్యూరిటీ గార్డును పోలీసులు అరెస్టు చేశారు. అతను నాలుగు రోజుల క్రితమే ఉద్యోగంలో చేరాడు. యువతి గొంతు నొక్కి, అత్యాచారం చేసి, ఆమెను టెర్రస్‌పై లాక్ చేసి పారిపోయినట్టు పోలీసులు తెలిపారు. పోలీసులు అతణ్ని పట్టుకోగానే “ఏక్ బార్ మాఫ్ కర్ దో. ఫిర్ సే నహీం కరూంగా”(ఒక్కసారి క్షమించండి. మళ్లీ చేయను) అని క్షమాపణలు కోరుతున్న వీడియో వైరల్ అయ్యింది.

లారీ బోల్తా.. కోళ్ల కోసం ఎగబడ్డ జనాలు
AP· 11 Aug 2026

లారీ బోల్తా.. కోళ్ల కోసం ఎగబడ్డ జనాలు

AP: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం భాకరాపేట ఘాట్‌రోడ్డులో కోళ్ల లారీ అదుపుతప్పి బోల్తాపడింది. భాకరాపేట నుంచి తిరుపతి వైపు వెళ్తుండగా ఈ ఇన్సిడెంట్ జరిగింది. లారీ బోల్తాపడటంతో అందులోని కోళ్లు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. దీంతో కోళ్లను ఎత్తుకెళ్లేందుకు స్థానికులు, వాహనదారులు పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చారు. రోడ్డుపై పడిపోయిన కోళ్లను బస్తాల్లో నింపుకుని కొందరు తీసుకెళ్లారు. ప్రమాదంతో ఘాట్‌రోడ్డుపై కొంతసేపు రాకపోకలకు ఇబ్బందులు కలిగాయి.

ట్రంప్ హెయిర్ స్టైల్ చేంజ్?
Politics· 11 Aug 2026

ట్రంప్ హెయిర్ స్టైల్ చేంజ్?

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కొత్త హెయిర్ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. లాస్ వేగాస్‌లో కనిపించిన ఆయన జుట్టు మునుపటి కంటే మరింత బ్రైట్‌గా, నిండుగా కనిపించడంతో నెటిజన్స్ విపరీతంగా AI ఫోటోలు, మీమ్స్‌తో ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. అయితే ట్రంప్ మాత్రం తన హెయిర్ స్టైల్‌ను ఒక 'వర్క్ ఆఫ్ ఆర్ట్' అని చెప్తూ గర్వంగా మాట్లాడారు. దశాబ్దాలుగా ఆయన హెయిర్ పొలిటికల్ కల్చర్‌లో ఒక స్పెషల్ టాపిక్‌గా నడుస్తోంది.