Latest

'అఖండ' లుక్ కాపీ కొట్టారా?
వరుణ్ తేజ్ మూవీ 'కొరియన్ కనకరాజు' చుట్టూ ఇప్పుడు బిగ్ కాంట్రావర్సీ నడుస్తోంది. ఈ సినిమాలో కామెడియన్ సత్య సీనియర్ NTR ఐకానిక్ డైలాగ్‌ని స్పూఫ్ చేయడంపై ఆయన ఫ్యాన్స్ తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. అలాగే మురళీధర్ గౌడ్ క్యారెక్టర్ బాలకృష్ణ 'అఖండ' లుక్‌కి కార్బన్ కాపీలా ఉందంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ స్టార్ట్ అయ్యాయి. అయితే ఎవరినీ డిస్రెస్పెక్ట్ చేసే ఇంటెన్షన్ తమకు లేదని, కేవలం ఆడియెన్స్‌ను ఎంటర్‌టైన్ చేయడానికే ఆ ట్రెండింగ్ క్లిప్‌ని వాడామని హీరో వరుణ్ తేజ్, డైరెక్టర్ మేర్లపాక గాంధీ క్లారిటీ ఇచ్చారు.

8 ఏళ్ల తర్వాత బిగ్ ట్విస్ట్!
బీహార్‌కు చెందిన రాహుల్ 12 ఏళ్ల వయసులో స్నేక్ బైట్‌కు గురికాగా, చనిపోయాడని అనుకుని పేరెంట్స్ అతని బాడీని గంగా నదిలో వదిలేశారు. కానీ సరిగ్గా 8 ఏళ్ల తర్వాత ఆ అబ్బాయి ఇంటికి రిటర్న్ వచ్చి అందరికీ బిగ్ షాక్ ఇచ్చాడు. రివర్‌లో కొట్టుకుపోతున్న తనను ఒక సాధువు సేవ్ చేసి గోరఖ్‌పూర్ తీసుకెళ్లాడని రాహుల్ చెప్పాడు. ఒంటిపై ఉన్న గాయం గుర్తు ఆధారంగా ఫ్యామిలీ మెంబర్స్ అతనిని గుర్తుపట్టారు.

ఈ నెల 17 నుంచే AP అసెంబ్లీ సమావేశాలు!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు డేట్ ఫిక్స్ అయింది. ఈ నెల 17 నుంచి అసెంబ్లీ సెషన్స్ స్టార్ట్ కానున్నట్లు గవర్నర్ అబ్దుల్ నజీర్ శనివారం నోటిఫికేషన్ ఇచ్చారు. 17వ తేదీ ఉదయం 9 గంటలకు అసెంబ్లీ, 10 గంటలకు మండలి మీటింగ్స్ ప్రారంభమవుతాయి. అదే రోజు ఉదయం జరిగే BAC మీటింగ్‌లో అసెంబ్లీని ఎన్ని రోజులు రన్ చేయాలి, ఏమేం టాపిక్స్ డిస్కస్ చేయాలనే దానిపై డిసిషన్ తీసుకోనున్నారు.
డ్రోన్ కారు భలే ఉంది భయ్యా!
ఉత్తరాఖండ్‌కు చెందిన రవి తమ్తా అనే వ్యక్తి 'హపిడా స్కై' పేరుతో గాల్లో ఎగిరే ఒక కొత్త కారును తయారు చేశారు. ఒకరు మాత్రమే ప్రయాణించేలా, పూర్తిగా ఎలెక్ట్రిక్ తో నడిచేలా దీనిని డిజైన్ చేశారు. డ్రోన్ టెక్నాలజీని వాడుకొని తయారు చేసిన ఈ కారు టెస్టింగ్ సక్సెస్ అయింది. భవిష్యత్తులో మనం ట్రాఫిక్‌తో పనిలేకుండా గాల్లోనే ఈజీగా ప్రయాణించవచ్చని ఆయన చెప్పారు.

డేటింగ్ యాప్‌లో రూ.6 కోట్ల స్కామ్!
UP కి చెందిన పల్లవి సింగ్ అనే యువతి డేటింగ్ యాప్స్‌లో అబ్బాయిలని ట్రాప్ చేసి భారీ స్కామ్ చేసింది. పరిచయం పెంచుకుని, వాళ్ళతో క్లోజ్ గా ఉన్న ఫొటోలు, వీడియోలు సీక్రెట్ గా రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్‌కి దిగింది. ఇలా బెదిరించి ఏకంగా రూ.6 కోట్లు వసూలు చేసింది. ఎవరైనా ఎదురుతిరిగితే వాళ్లపై ఫేక్ కేసులు పెట్టి జైలుకి పంపేది. ఫైనల్ గా ఒక హైకోర్టు లాయర్ కంప్లైంట్ ఇవ్వడంతో ఈమె స్టోరీ బయటపడింది. ప్రస్తుతం పోలీసుల ఇన్వెస్టిగేషన్ నడుస్తోంది.

స్విమ్మింగ్‌లో తెలంగాణ అమ్మాయి గోల్డ్ మెడల్ రికార్డ్!
జైపూర్‌లో జరుగుతున్న 42వ సబ్-జూనియర్ నేషనల్ అక్వాటిక్ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ స్విమ్మర్ శివాని కర్రా గోల్డ్ మెడల్ సాధించింది. గర్ల్స్ 400 మీటర్ల ఫ్రీస్టైల్ కేటగిరీలో 4:38.47 సెకన్ల టైమింగ్‌తో అందరికంటే ముందుగా రేస్ ఫినిష్ చేసి ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. కేరళ, కర్ణాటక స్విమ్మర్ల నుంచి గట్టి కాంపిటీషన్ ఎదురైనప్పటికీ శివాని టాప్ ప్లేస్ దక్కించుకుంది. గచ్చిబౌలి స్టేడియంలో కోచ్ ఆయుష్ యాదవ్ వద్ద ట్రైనింగ్ తీసుకుంటున్న శివానిని తెలంగాణ స్విమ్మింగ్ అసోసియేషన్ ప్రత్యేకంగా అభినందించింది.
జనసేనకు బీజేపీ బిగ్ షాక్!
తెలంగాణలో వచ్చే ఎన్నికల్లోనూ జనసేనతో కానీ, వేరే ఏ పార్టీతోనూ కానీ పొత్తు ఉండదని రాష్ట్ర BJP అధ్యక్షుడు రాంచందర్ రావు స్పష్టం చేశారు. జాతీయ స్థాయిలో జనసేన NDAతో ఉన్నప్పటికీ, రాష్ట్రంలో మాత్రం BJP ఒంటరిగానే పోటీకి దిగుతుందన్నారు. పొత్తులపై జాతీయ నాయకత్వానిదే ఫైనల్ డిసిషన్ అని, తెలంగాణలో మాత్రం తమ స్టాండ్ సోలో ఫైటే అని క్లారిటీ ఇచ్చారు.

న్యాయం లేట్ గా ఎందుకు జరుగుతుంది అంటే?- CJP సూర్య కాంత్
ఇండోర్‌లో జరిగిన NALSA కాన్ఫరెన్స్‌లో సుప్రీంకోర్ట్ జడ్జి సూర్య కాంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. హాస్పిటల్‌లో పేషెంట్స్‌కి డాక్టర్స్ ఎలా కాన్ఫిడెన్స్ ఇస్తారో, న్యాయం కోసం వచ్చే పేదలు, మహిళలకు పారాలీగల్ వాలంటీర్లు కూడా అలాగే సపోర్ట్ చేయాలని ఆయన అన్నారు. లీగల్ ప్రాసెస్‌లో నోటీసులు, ఎవిడెన్స్ వల్ల కేసులు కాస్త లేట్ అవ్వొచ్చు. కానీ ఇప్పుడు సిస్టమ్ మారింది! 10-20 ఏళ్ల క్రితం లాగా కాకుండా, లేటెస్ట్ టెక్నాలజీ యూజ్ చేస్తూ పబ్లిక్‌కి చాలా ఫాస్ట్‌గా న్యాయం అందేలా కొత్త స్కీమ్స్ తెస్తున్నామన్నారు.

రియల్ లైఫ్‌లో సిలబస్ ఉండదు- ప్రధాని మోదీ
IIT ఢిల్లీ ప్రోగ్రామ్‌లో ప్రధాని<a href="https://x.com/narendramodi/status/2086079987908804678?s=20"> మోదీ</a> స్టూడెంట్స్‌కి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. కాలేజీ లైఫ్‌కి, బయట రియల్ లైఫ్‌కి చాలా తేడా ఉంటుందన్నారు. ఐఐటీ ఎగ్జామ్స్‌కి పక్కాగా సిలబస్ ఉంటుంది కానీ, రియల్ లైఫ్ ఎగ్జామ్‌లో ప్రతీదీ 'అవుట్ ఆఫ్ సిలబస్'గానే ఉంటుందని చెప్పారు. లైఫ్‌లో ఎదురయ్యే కొత్త ప్రాబ్లమ్స్‌కి సొల్యూషన్స్ వెతికేవారే సక్సెస్ అవుతారన్నారు. ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకునే అలవాటు వదులుకోవద్దని స్టూడెంట్స్‌ని మోటివేట్ చేశారు.
మోహన్‌లాల్ లైవ్ షో పోస్ట్‌పోన్.. రీజన్ ఇదే!
మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్‌కి ఆస్ట్రేలియా వీసా టైమ్‌కి రాకపోవడంతో సిడ్నీలో జరగాల్సిన ఆయన లైవ్ షో పోస్ట్‌పోన్ అయింది. వీసా ప్రాసెస్ లేట్ అవ్వడం వల్లే రాలేకపోయానని, ప్రస్తుతం సింగపూర్‌లో ఉన్నానని ఆయన తెలిపారు. ఏదో టెక్నికల్ ఇష్యూ వల్ల ఇలా జరిగిందని, ఫ్యాన్స్‌కి సారీ చెప్తూ ఒక వీడియో పోస్ట్ చేశారు. మోహన్ లాల్ లేకుండా షో చేయలేమని, త్వరలోనే న్యూ డేట్స్ అనౌన్స్ చేస్తామని ఈవెంట్ ఆర్గనైజర్స్ క్లారిటీ ఇచ్చారు.

ఊర్వశి రౌతేలా పోస్టులతో పాఠాలు.
పాప్ కల్చర్, బాలీవుడ్ గాసిప్స్, మీమ్స్ అంటే కేవలం కాలక్షేపం మాత్రమే కాదు. వాటి వెనుక లోతైన ఫిలాసఫీ, సోషియాలజీ ఉన్నాయని కొత్త తరం 'స్కాలర్-ఫ్లూయెన్సర్లు' చెబుతున్నారు. ఊర్వశి రౌతేలా పోస్టులు, కిమ్ కర్దాషియాన్ విజువల్స్, టీవీ సీరియళ్లను కూడా కేస్ స్టడీలుగా వాడుకుంటూ ప్రొఫెసర్లు, పరిశోధకులు రీల్స్ ద్వారా ఫిలాసఫీ, ఎకనామిక్స్ పాఠాలు చెబుతున్నారు. కష్టమైన కాన్సెప్టులను మీమ్స్‌తో ముడిపెట్టి 60 సెకన్ల వీడియోల్లోనే అర్థమయ్యేలా వివరిస్తున్నారు.
గుడిలో హుండీ దొంగతనం!
సంగారెడ్డి జిల్లా సదాశివపేట గురునగర్ కాలనీలోని భవానీ మాతా టెంపుల్‌లో దొంగతనం జరిగింది. మిడ్‌నైట్ (2:22AM) ఒక దొంగ సైలెంట్‌గా గుడిలోకి వెళ్లి హుండీని ఎత్తుకెళ్లాడు. ఆ తర్వాత హుండీలో ఉన్న క్యాష్ అంతా తీసేసుకుని, ఖాళీ హుండీని టెంపుల్ పక్కనే పడేసి అక్కడ నుంచి పారిపోయాడు. ఉదయాన్నే ఇది గమనించిన లోకల్ పీపుల్ పోలీస్‌లకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Social Battery అంటే ఏంటి?
ఫ్రెండ్స్‌తో ఔటింగ్, పార్టీ లేదా ఫంక్షన్‌కి వెళ్లాక.. “ఇంక చాలు, ఇంటికి వెళ్లాలి” అనిపిస్తుందా? 😮💨🔋 దీన్నే చాలామంది “సోషల్ బ్యాటరీ అయిపోయింది” అంటారు. అంటే నిజంగా బ్యాటరీ అయిపోవడం కాదు. 😅 ఎక్కువసేపు జనాలతో మాట్లాడటం, సోషల్ ఈవెంట్స్‌లో ఉండటం వల్ల మెంటల్‌గా అలసిపోయి, కొంతసేపు ఒంటరిగా ఉండాలనిపించడం. ఇది ఇంట్రోవర్ట్స్‌లో ఎక్కువగా కనిపించినా, ఎవరికైనా ఇలా అనిపించొచ్చు. కొద్దిసేపు ప్రశాంతంగా గడిపితే మళ్లీ ఫ్రెష్‌గా అనిపిస్తుంది. ఫోన్‌కి ఛార్జర్ ఎలా అవసరమో.. కొన్నిసార్లు మనకూ “మన Time” అంతే అవసరం!

ప్రభుదేవాకు రేర్ హానర్..
ఇండియన్ మైఖేల్ జాక్సన్ <a href="https://x.com/PDdancing/status/2085711918602547640?s=20">ప్రభూదేవా</a>కు USAలో అరుదైన గౌరవం దక్కింది. టెక్సాస్‌లోని 'సిటీ ఆఫ్ డల్లాస్' నుంచి ఆయన ఒక స్పెషల్ అవార్డ్ అందుకున్నారు. ఈ విషయాన్ని షేర్ చేస్తూ.. "నాపై ఇంత లవ్ అండ్ సపోర్ట్ చూపిస్తున్న ఫ్యాన్స్ అందరికీ బిగ్ థ్యాంక్స్, మీ ప్రేమే నా మెయిన్ స్ట్రెంగ్త్" అంటూ ఎక్స్ పోస్ట్‌లో రాసుకొచ్చారు.
చెరువులుగా మారిన రోడ్లు!
ఢిల్లీలోని సంగమ్ విహార్‌లో భారీ వర్షాలు పడటంతో రోడ్లన్నీ నీళ్లతో నిండిపోయాయి. దీనివల్ల జనాలు బాగా ఇబ్బంది పడ్డారు. కానీ కొందరు పిల్లలు మాత్రం రోడ్డుపై మోకాళ్ల వరకు నిలిచిన వర్షపు నీటిలోనే స్విమ్మింగ్ చేస్తూ జాలీగా ఆడుకున్నారు. ఒకవైపు జనాల ఇబ్బందులు, మరోవైపు రోడ్డుపై సరదాగా ఈత కొడుతూ ఎంజాయ్ చేస్తున్న ఈ పిల్లల వీడియో చూశాక మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.

పాలిటిక్స్‌లో Gen Z Voice ఎందుకు పెరుగుతోంది?
ఒకప్పుడు పాలిటిక్స్ అంటే పెద్దవాళ్ల విషయం అనుకునేవారు.. ఇప్పుడు Gen Z కూడా బలంగా మాట్లాడుతోంది..! 🗳️ సోషల్ మీడియా, డిజిటల్ క్యాంపెయిన్స్ వల్ల యువత తమ అభిప్రాయాలను నేరుగా వ్యక్తం చేస్తోంది. ఉద్యోగాలు, విద్య, AI, ఆర్థిక అవకాశాలు వంటి తమ జీవితాలను ప్రభావితం చేసే అంశాలపై ఎక్కువగా స్పందిస్తోంది. విశ్లేషకుల అంచనాల ప్రకారం 2029 ఎన్నికల నాటికి Gen Z భారతదేశంలో అతిపెద్ద ఓటర్ల వర్గాల్లో ఒకటిగా మారే అవకాశం ఉంది. దీంతో రాజకీయ పార్టీలు కూడా యువతను ఆకట్టుకునే విధంగా తమ వ్యూహాలను మార్చుకుంటున్నాయి.

PM ఫుడ్ సెక్యూరిటీ సీక్రెట్స్..
ప్రధాని మోదీ తినే ఆహారం వెనుక ఉండే ఫుడ్ సెక్యూరిటీ ఎంత టైట్‌గా ఉంటుందో తెలుసా? ఆయన సెక్యూరిటీ బాధ్యతలను కమాండెంట్ ఆఫీసర్ ఎం. రామకృష్ణ అండ్ టీమ్ పర్యవేక్షిస్తారు. మార్కెట్‌లో ఫ్రెష్ వెజిటబుల్స్ కొనడం దగ్గర్నుంచి కుకింగ్ పూర్తయ్యే వరకు ప్రతీదీ వీళ్ల కళ్లముందే జరుగుతుంది. ప్రధాని తినడానికి కంటే ముందే రామకృష్ణ తన టీమ్‌తో కలిసి ఆ ఫుడ్‌ని స్వయంగా టేస్ట్ చేసి క్వాలిటీ చెక్ చేస్తారు. ప్రధాని రక్షణ కోసం వీళ్లు తీసుకునే కేర్ ఇలా ఉంటుంది. ఇంకా డీటైల్ గా తెల్సుకోవలంటే <a href="https://x.com/tathvamasi6/status/2085984525012660650?s=20">లింక్(రెడ్ కలర్)</a> క్లిక్ చేయండి.

మహిళ అస్థిపంజరం..మరణించి రెండేళ్లు?
బెంగళూరులోని ఓ ఇంట్లో దక్షాయిని(57) అనే మహిళ అస్థిపంజరాన్ని పోలీసులు గుర్తించారు. ఆమె కుమారుడు 2005లో మరణించాడు. దీంతో ఆమెకు స్కిజోఫ్రేనియా వచ్చింది. 2017లో భర్త మరణించాక ఆమె ఒంటరిగా ఉంటోంది. రెండేళ్లుగా ఎవరితోనూ ఆమెకు సంబంధాలు లేవు. ఆమె సోదరుడు మహేష్ బసప్ప పోలీసులకు చెప్పడంతో వాళ్లు వచ్చి శవాన్ని గుర్తించారు. ఆమె మరణించి రెండేళ్లయ్యిందా అని అనుమానిస్తున్నారు.

రోడ్డుపై భారీ గుంత.. ల్యాడర్‌తో కిందకు దిగిన పార్టీ లీడర్!
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆగ్రాలోని కమలానగర్‌లో రోడ్డు కుంగిపోవడంతో భారీ గుంత ఏర్పడింది. ఆ టైమ్‌లో వెహికల్స్ రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. స్థానికులు ఇన్ఫర్మేషన్ ఇవ్వగా, అధికారులు అక్కడికొచ్చి వాహనాల రాకపోకలను ఆపేశారు. సమాజ్‌వాదీ పార్టీ లీడర్ నితిన్ కోహ్లీ అక్కడికి చేరుకున్నారు. నిచ్చెనతో గుంతలోకి దిగిన ఆయన.. ప్రభుత్వం, అధికారుల తీరుపై విమర్శలు చేశారు. వర్షాకాలంలో ఇలాంటి ఘటనలు ఎన్ని జరుగుతున్నా పట్టించుకోవడం లేదని, అభివృద్ధి పనుల్లో కరప్షన్ కారణంగానే ఇలాంటివి జరుగుతున్నాయని అన్నారు.

UPI ఛార్జీల రూమర్స్‌కి చెక్
UPI పేమెంట్స్‌పై ఎలాంటి ఛార్జీలు పడవని PhonePe CEO <a href="https://x.com/_sameernigam/status/2085983802778583313?s=20">సమీర్ నిగమ్</a> క్లారిటీ ఇచ్చారు. "ఇండియన్ యూజర్లకు UPI ఎప్పటికీ పూర్తి ఫ్రీగా అందుతుంది. యూజర్లు చేసే పేమెంట్స్‌కి ఒక్క రూపాయి కూడా ఛార్జ్ చేయరు" అని ఆయన ఎక్స్ (Twitter) పోస్ట్‌లో క్లియర్‌గా చెప్పారు. రీసెంట్‌గా ఛార్జీలపై వస్తున్న రూమర్స్‌కి ఈ ట్వీట్‌తో ఫుల్ స్టాప్ పడింది. కాబట్టి ఎలాంటి టెన్షన్ లేకుండా ఎప్పటిలాగే ఫ్రీగా UPI వాడుకోవచ్చు.

ట్రాఫిక్‌కు టాటా.. గాల్లో దూసుకెళ్లే ఎలక్ట్రిక్ వెహికల్!
దేశంలో పెరుగుతున్న ట్రాఫిక్ కష్టాలకు పరిష్కారంగా ఉత్తరాఖండ్ యువకుడు రవి తమ్తా సరికొత్త ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ వెహికల్‌ను డిజైన్ చేశాడు. అల్మోరా జిల్లా కాఫ్లిఖాన్ గ్రామానికి చెందిన రవి.. ‘హపిదా స్కైనెక్స్’ పేరుతో సింగిల్ సీటర్ ఎలక్ట్రిక్ పర్సనల్ ఫ్లయింగ్ వెహికల్‌ను డెవలప్ చేశాడు. అల్మోరా గ్రౌండ్‌లో దీన్ని సక్సెస్ఫుల్‌గా టెస్ట్ చేశాడు. పూర్తిగా ఎలక్ట్రిక్‌తో నడిచే ఈ వెహికల్ గ్రీన్ టెక్నాలజీతో పనిచేస్తుంది. రవి స్థాపించిన హపిదా స్కై ప్రైవేట్ లిమిటెడ్ స్టార్టప్ ద్వారా దీనిని డెవలప్ చేశారు.