స్విమ్మింగ్‌లో తెలంగాణ అమ్మాయి గోల్డ్ మెడల్ రికార్డ్!

జైపూర్‌లో జరుగుతున్న 42వ సబ్-జూనియర్ నేషనల్ అక్వాటిక్ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ స్విమ్మర్ శివాని కర్రా గోల్డ్ మెడల్ సాధించింది. గర్ల్స్ 400 మీటర్ల ఫ్రీస్టైల్ కేటగిరీలో 4:38.47 సెకన్ల టైమింగ్‌తో అందరికంటే ముందుగా రేస్ ఫినిష్ చేసి ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. కేరళ, కర్ణాటక స్విమ్మర్ల నుంచి గట్టి కాంపిటీషన్ ఎదురైనప్పటికీ శివాని టాప్ ప్లేస్ దక్కించుకుంది. గచ్చిబౌలి స్టేడియంలో కోచ్ ఆయుష్ యాదవ్ వద్ద ట్రైనింగ్ తీసుకుంటున్న శివానిని తెలంగాణ స్విమ్మింగ్ అసోసియేషన్ ప్రత్యేకంగా అభినందించింది.



