Latest

రైతులకు బిగ్ అప్డేట్!
Politics· 6 Aug 2026

రైతులకు బిగ్ అప్డేట్!

ఈ రోజు ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ మీటింగ్‌లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఊళ్లలో ఉండే పశువుల పేడ, వ్యవసాయ చెత్త నుంచి బయోగ్యాస్, క్లీన్ ఫ్యూయెల్ మరియు సేంద్రీయ ఎరువులు తయారు చేసే 'గోబర్ధన్' స్కీమ్‌కు రూ.23,731 కోట్ల బడ్జెట్‌తో కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు రైతులకు అదనపు ఆదాయం రానుంది. దీంతో పాటు రూ.8,970 కోట్లతో అసోంలో నిర్మించబోయే 4-లేన్ నేషనల్ హైవే ప్రాజెక్ట్‌కి కూడా కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది!

బస్ స్టాప్ వద్ద ఘోర ప్రమాదం
TG· 6 Aug 2026

బస్ స్టాప్ వద్ద ఘోర ప్రమాదం

TG: హైదరాబాద్ జగద్గిరిగుట్ట PS పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన బైక్ అదుపుతప్పి బస్ స్టాప్ సమీపంలో నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని సమీప ఆస్పత్రికి తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి పంపించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

తెలుగు రాష్ట్రాలకు IMD అలర్ట్.. పలు జిల్లాల్లో వర్షాలు!
News· 6 Aug 2026

తెలుగు రాష్ట్రాలకు IMD అలర్ట్.. పలు జిల్లాల్లో వర్షాలు!

తెలుగు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ (IMD) వర్ష సూచన జారీ చేసింది. తెలంగాణకు ఎల్లో అలర్ట్ ప్రకటించిన IMD.. హైదరాబాద్‌తో పాటు ఆసిఫాబాద్, మెదక్, ములుగు, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శ్రీకాకుళం, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని IMD వెల్లడించింది.

పార్లమెంట్ బయట వర్షంలో రాహుల్, ప్రియాంక!
Politics· 6 Aug 2026

పార్లమెంట్ బయట వర్షంలో రాహుల్, ప్రియాంక!

ఢిల్లీలో వర్షం పడుతున్న టైమ్‌లో పార్లమెంట్ బయట రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రత్యేకంగా కనిపించారు. మీటింగ్స్ ముగిసిన తర్వాత బయటకు వచ్చిన ఈ అన్నాచెల్లెళ్లు వర్షంలో తడుస్తూ కాసేపు డిస్కస్ చేసుకున్నారు. సెక్యూరిటీ వాళ్లు గొడుగులు పట్టుకోగా, వీరిద్దరూ వెదర్‌ని ఎంజాయ్ చేస్తూ చిట్‌చాట్ చేశారు. ఆ తర్వాత ఇతర లీడర్స్‌తో కలిసి ప్రియాంక గాంధీ అక్కడి నుంచి ముందుకు వెళ్లారు

బ్యాంక్‌లోనే కుప్పకూలిన వ్యక్తి
TG· 6 Aug 2026

బ్యాంక్‌లోనే కుప్పకూలిన వ్యక్తి

TG: కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి స్టేజ్ వద్ద ఉన్న SBI బ్యాంకులో జంగాపల్లి గ్రామానికి చెందిన అనుమండ్ల బాలయ్య (55) డబ్బులు జమ చేసేందుకు బ్యాంకుకు వచ్చారు. లావాదేవీలు నిర్వహిస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయాడు. వెంటనే బ్యాంక్ సిబ్బంది, స్థానికులు స్పందించి పరిశీలించగా గుండెపోటుతో మృతి చెందినట్లు గుర్తించారు. ఈ ఆకస్మిక ఘటనతో బ్యాంకులో ఉన్న ఖాతాదారులు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు.

భవిష్యత్ కార్యాచరణ ప్రకటించిన CJP
India· 6 Aug 2026

భవిష్యత్ కార్యాచరణ ప్రకటించిన CJP

CJP(Cockroach Janata Party) తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించింది. సెప్టెంబర్‌లో ‘క్యా బోల్తీ పబ్లిక్’ కార్యక్రమం నిర్వహిస్తామని ప్రతినిధులు తెలిపారు. దేశవ్యాప్తంగా సమస్యలు తెలుసుకోవాలని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఝార్ఖండ్‌లో జరుగుతున్న విద్యార్థుల ర్యాలీకి మద్దతుగా నిలిచేందుకు రాంచీ వెళ్లనున్నట్టు తెలిపారు.

కొడుకు ప్రేమకు విలన్‌గా మారిన కాంగ్రెస్ ఎమ్మెల్యే
News· 6 Aug 2026

కొడుకు ప్రేమకు విలన్‌గా మారిన కాంగ్రెస్ ఎమ్మెల్యే

ప్రేమ పెళ్లికి రెడీ అయిన కొడుకు మీద దాడి చేయించాడు కాంగ్రెస్ ఎమ్మెల్యే. ఈ విషయాన్ని ఆయన కొడుకే మీడియాకు వివరించారు. ‘తను లవ్ చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం తండ్రికి అస్సలు ఇష్టం లేదని, తమని విడదీయడానికే అనుచరులతో కాబోయే భార్య ఇంటిపై అటాక్ చేయించారని’ రాజేంద్రనగర్ కాంగ్రెస్ MLA ప్రకాష్ గౌడ్ కొడుకు సంతోష్ గౌడ్ వివరించారు. తండ్రి నుంచే తనకు, తనకు కాబోయే భార్య కుటుంబానికి ప్రాణహాని ఉందన్నారు. ఏ క్షణంలోనైనా తమపై దాడి జరగొచ్చని, తమకు పోలీస్ రక్షణ కల్పించాలని కోరారు.

'మెటా' యూ-టర్న్.. కంగనా ఏమన్నారంటే?
Politics· 6 Aug 2026

'మెటా' యూ-టర్న్.. కంగనా ఏమన్నారంటే?

ప్రధాని నరేంద్ర మోదీ ఫేస్‌బుక్ పోస్టును తొలగించిన ఘటనపై మెటా క్షమాపణ చెప్పడాన్ని BJP MP కంగనా రనౌత్ స్వాగతించారు. ఈ అంశాన్ని పరిశీలించిన పార్లమెంటరీ కమిటీలో తాను కూడా సభ్యురాలినని తెలిపారు. కమిటీ చైర్మన్ నిషికాంత్ దుబే మెటాను క్షమాపణ చెప్పాలని గట్టిగా డిమాండ్ చేశారని పేర్కొన్నారు. దేశ వ్యతిరేక శక్తులకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు ప్రోత్సాహం కల్పిస్తున్న అంశంపై ఆందోళన వ్యక్తం చేశామన్నారు. చివరకు మెటా తన తప్పును ఒప్పుకోవడం సంతోషకరమని కంగనా అన్నారు.

వంట మొదలుపెట్టగానే సిలిండర్ బ్లాస్ట్
TG· 6 Aug 2026

వంట మొదలుపెట్టగానే సిలిండర్ బ్లాస్ట్

TG: వనపర్తి జిల్లా పానుగల్ మండలం చిక్కేపల్లి గ్రామంలో సిలిండర్ పేలిన ఘటనలో వార్డు సభ్యురాలు రేణుక తీవ్రంగా గాయపడ్డారు. గురువారం ఉదయం వంట చేసేందుకు వంటగదిలోకి వెళ్లి సిలిండర్ ఆన్ చేయగానే ఒక్కసారిగా పేలడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చి వనపర్తి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న తహసీల్దార్ కార్తీక్‌రావు గ్రామానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై వివరాలు సేకరించారు.

తమిళనాడు అసెంబ్లీలోకి జపమాల ఎందుకు?
India· 6 Aug 2026

తమిళనాడు అసెంబ్లీలోకి జపమాల ఎందుకు?

తమిళనాడు అసెంబ్లీలోకి ఆర్థికమంత్రి మేరీ విల్సన్ క్రైస్తవ జపమాల తీసుకువరావడంపై బీజేపీ నేత తమిళిసై సౌందరరాజన్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. గతంలో తిరుపతి ఆలయంలో బడ్జెట్‌ను వెంకటేశ్వరస్వామి పాదాల వద్ద ఉంచినప్పుడు మధురై ఎంపీ సు.వెంకటేశన్ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారని గుర్తు చేశారు. అసెంబ్లీలోకి జపమాల తీసుకువచ్చినప్పుడు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని అన్నారు. హిందూ సంప్రదాయాలను లౌకికత్వానికి వ్యతిరేకంగా చూపే తిరుమావళవన్ కూడా ఈ విషయాన్ని సమర్థించారని పేర్కొన్నారు.

ACBకి చిక్కిన GPO
Crime· 6 Aug 2026

ACBకి చిక్కిన GPO

TG: జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం ఆత్మకూరు గ్రామంలో గ్రామ పరిపాలన అధికారి (GPO) రాజేష్ రూ.5 వేల లంచం తీసుకుంటూ ACBకి రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కాడు. పాస్‌బుక్‌లో తప్పుగా నమోదైన పేరును సరిచేయాలంటే రూ.5వేల లంచం ఇవ్వాలని గ్రామానికి చెందిన మల్లేష్‌ను డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. అధికారుల సూచనల మేరకు లంచం ఇస్తుండగా ముందుగా మాటువేసిన అధికారులు రాజేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

50 గంటలు నిద్రపోకుండా Live stream
News· 6 Aug 2026

50 గంటలు నిద్రపోకుండా Live stream

అస్సాం వరద బాధితులను ఆదుకోవడానికి యూట్యూబర్ నిశ్చయ్ మల్హాన్ తన కుటుంబంతో కలిసి 50 గంటల పాటు నిద్రపోకుండా వరుసగా లైవ్‌స్ట్రీమ్ చేసి, రూ. 70 లక్షల ఫండ్స్ కలెక్ట్ చేశారు. వాళ్ల ఫ్యామిలీ కూడా సొంతంగా 16 లక్షల రూపాయలు డొనేట్ చేసింది. ఈ డబ్బునంతా అస్సాం వరద బాధితుల హెల్ప్ కోసం ఇస్తున్నారు. నిద్రను కూడా పక్కనపెట్టి బాధితుల కోసం కష్టపడిన ఈ ఫ్యామిలీని ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా మెచ్చుకుంటున్నారు.

మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు
Politics· 6 Aug 2026

మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు

AP: YSRCP నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై అరండల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో కేసు ఫైల్ అయ్యింది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌పై ఫేక్ ప్రచారం చేశారంటూ గుంటూరు జిల్లా TDP అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు కంప్లైంట్‌ చేశారు. రాజకీయ విద్వేషాలను రెచ్చగొట్టేలా, ప్రజాశాంతికి భంగం కలిగించే ఉద్దేశంతో వీడియో పోస్టు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు BNS సెక్షన్లు 356, 353, 352, 61(2), 3(5) కింద కేసు బుక్ చేసి దర్యాప్తు ప్రారంభించారు.

17 నుంచి 20 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు
AP· 6 Aug 2026

17 నుంచి 20 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు

AP: ఈనెల 17 నుంచి 20వ తేదీ వరకు ఏపీ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందులో వివిధ అంశాల మీద చర్చించాలని తీర్మానించింది. విశాఖలో మురికివాడల అభివృద్ధికి కొత్త పథకానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మూడు సహకార షుగర్ ఫ్యాక్టరీల లిక్విడేషన్‌కు నిర్ణయం తీసుకుంది.

తెహల్కా మాజీ ఎడిటర్‌కు 10 ఏళ్ల జైలు శిక్ష
India· 6 Aug 2026

తెహల్కా మాజీ ఎడిటర్‌కు 10 ఏళ్ల జైలు శిక్ష

తెహల్కా మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్‌ను గోవా బెంచ్(బాంబే హైకోర్ట్) రేప్ కేసులో దోషిగా నిర్ధారించింది. ఆయనకు 10 ఏళ్ల జైలు శిక్షతోపాటు రూ.5 లక్షల జరిమానా విధించింది. 2013లో గోవాలో జరిగిన తెహల్కా ఈవెంట్‌లో ఎలివేటర్‌లో మాజీ కొలీగ్‌పై అత్యాచారం చేశాడని ఆయన మీద కేసు నమోదైంది. దీనిపై విచారించిన ట్రయల్ కోర్టు 2021లో ఆయన్ని నిర్దోషిగా విడుదల చేసింది. ఈ తీర్పును హైకోర్టు కొట్టేసింది. రెండు వారాల్లో తేజ్‌పాల్ లొంగిపోవాలని ఆదేశించింది.

డబ్బు తీసుకున్న క్షణంలోనే ACB షాక్
Crime· 6 Aug 2026

డబ్బు తీసుకున్న క్షణంలోనే ACB షాక్

AP: అనకాపల్లి జిల్లాలో ACB అధికారులు మైన్స్ శాఖ సర్వేయర్ మురళీకృష్ణ అంబేద్కర్‌ను రూ.5 లక్షల లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఓ క్వారీ సర్వే రిపోర్ట్ నిమిత్తం మొత్తం రూ.15 లక్షలు డిమాండ్ చేసినట్లు బాధితుడు సందిన సునీల్ ACBని ఆశ్రయించారు. అధికారుల సూచనల మేరకు బాధితుడు రూ.5లక్షలు అడ్వాన్స్ అందజేస్తుండగా, ముందుగా మాటువేసిన ఏసీబీ అధికారులు సర్వేయర్‌ను అదుపులోకి తీసుకున్నారు. నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.

హైవేపై అదుపుతప్పిన కారు.. పొలాల్లో బోల్తా
AP· 6 Aug 2026

హైవేపై అదుపుతప్పిన కారు.. పొలాల్లో బోల్తా

AP: తిరుపతి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అక్కాచెల్లెలు మృతి చెందారు. బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న చిన్నగొట్టిగల్లు మండలంలోని బోడిరెడ్డి గారిపల్లెకి చెందిన అనిల్‌కుమార్ తన భార్య మానస, మరదలు గౌతమితో కలిసి స్వగ్రామానికి కారులో బయలుదేరారు. వి.కోట మండలం రామాపురం సమీపంలో కారు అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. గౌతమి అక్కడికక్కడే మృతిచెందగా, తీవ్రంగా గాయపడిన మానసను ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయింది. అనిల్‌కుమార్ గాయాలతో చికిత్స పొందుతున్నారు.

పెద్దపులి సంచారం.. గ్రామంలో భయం భయం
AP· 6 Aug 2026

పెద్దపులి సంచారం.. గ్రామంలో భయం భయం

AP: నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం సింగవరం గ్రామంలో పెద్దపులి సంచారం కలకలం రేపింది. గ్రామ శివారులోని చెరువు సమీపంలో ఆవుల మందపై పెద్దపులి దాడి చేయడంతో రెండు ఆవులు అక్కడికక్కడే మృతి చెందాయి. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. పులి అడుగుజాడలను గుర్తించి దాడి చేసినది పెద్దపులేనని ప్రాథమికంగా నిర్ధారించారు. పులి ఇంకా పరిసర ప్రాంతాల్లో సంచరించే అవకాశం ఉన్నందున గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా అడవి లేదా చెరువు ప్రాంతాలకు వెళ్లొద్దని సూచించారు.

కొత్త రేషన్‌ కార్డుల పంపిణీ
News· 6 Aug 2026

కొత్త రేషన్‌ కార్డుల పంపిణీ

తెలంగాణ ప్రభుత్వం ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 1.05 కోట్ల కొత్త లామినేటెడ్ రేషన్ కార్డులను ఇవ్వాలని నిర్ణయించింది. సంగారెడ్డిలో సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనుండగా, అదే సమయంలో రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కార్డుల పంపిణీ జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులకు ఆర్డర్స్ ఇచ్చారు.

ఒక్కో యాడ్‌కి 10 కోట్లు!
Cinema· 6 Aug 2026

ఒక్కో యాడ్‌కి 10 కోట్లు!

సినిమా బాక్సాఫీస్ కలెక్షన్ల కంటే ఎలాంటి కాంట్రవర్సీలు లేకుండా మంచి ఇమేజ్ ఉన్న యాక్టర్స్ కే ఎక్కువ బ్రాండ్ యాడ్స్ వస్తున్నాయని 'క్రోల్' లేటెస్ట్ రిపోర్ట్ చెబుతుంది. ఈ లిస్ట్‌లో బాలీవుడ్ హీరో షారూఖ్ ఖాన్ టాప్‌లో నిలిచారు. ఒక్కో బ్రాండ్ యాడ్ కోసం ఆయన రికార్డు స్థాయిలో రూ.10 కోట్లు దాకా ఛార్జ్ చేస్తున్నారని రిపోర్ట్ తెలిపింది. షారూఖ్ తర్వాత రణ్‌వీర్ సింగ్, విరాట్ కోహ్లీ, ఆలియా భట్, దీపికా పదుకోణె లాంటి సెలబ్రిటీలు భారీ బ్రాండ్ వాల్యూతో టాప్ ప్లేస్‌లలో ఉన్నారు.

టీవీకే రైతులను మోసం చేసింది: ఉదయనిధి స్టాలిన్
India· 6 Aug 2026

టీవీకే రైతులను మోసం చేసింది: ఉదయనిధి స్టాలిన్

పూర్తి రుణమాఫీ ఇస్తామని మాట ఇచ్చిన టీవీకే ఇప్పుడు పాక్షికంగా అమలు చేసి రైతులను మోసం చేసిందని తమిళనాడు అసెంబ్లీ ప్రతిపక్షనేత ఉదయనిధి స్టాలిన్ ఆరోపించారు. డెల్టా రైతులు ఇబ్బంది పడుతున్నారని, అందుకే ప్రభుత్వ వ్యతిరేకంగా నల్ల చొక్కాలు వేసుకుని నిరసన తెలిపామని అన్నారు. మేకెదాటు డ్యామ్‌కు నీళ్లు ఇవ్వం అని క్లారిటీ ఇచ్చిందని, సీఎం విజయ్‌ని కర్ణాటకకు రావద్దని కూడా చెప్పారని అన్నారు. ఈ విషయంపై అన్ని పార్టీల సమావేశం పెట్టాలని కోరారు.