డబ్బు తీసుకున్న క్షణంలోనే ACB షాక్

AP: అనకాపల్లి జిల్లాలో ACB అధికారులు మైన్స్ శాఖ సర్వేయర్ మురళీకృష్ణ అంబేద్కర్‌ను రూ.5 లక్షల లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఓ క్వారీ సర్వే రిపోర్ట్ నిమిత్తం మొత్తం రూ.15 లక్షలు డిమాండ్ చేసినట్లు బాధితుడు సందిన సునీల్ ACBని ఆశ్రయించారు. అధికారుల సూచనల మేరకు బాధితుడు రూ.5లక్షలు అడ్వాన్స్ అందజేస్తుండగా, ముందుగా మాటువేసిన ఏసీబీ అధికారులు సర్వేయర్‌ను అదుపులోకి తీసుకున్నారు. నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.



