Latest

హెల్తీ స్నాక్స్..
Health· 4 Aug 2026

హెల్తీ స్నాక్స్..

క్యాన్సర్ నివారణకు రోజూవారీ ఆహారంలో ఆరోగ్యకరమైన స్నాక్స్, ప్రాసెస్ చేయని, పోషకాలు నిండిన చిరుతిళ్లు తీసుకోవాలని ఆంకాలజిస్టులు సూచిస్తున్నారు. జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉంటూ, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రోస్టెడ్ బీన్స్, మసాలా పల్లీలు, రోస్టెడ్ సీడ్స్, మఖానా, వేయించిన శనగలు, ఓట్స్ అలాగే చిప్స్ కంటే పాప్‌కార్న్ తినడం చాలా మంచిదని నిపుణులు వివరిస్తున్నారు.

ఆగస్టు 8న ‘ద్రవిడ’ పుస్తకావిష్కరణ
TG· 4 Aug 2026

ఆగస్టు 8న ‘ద్రవిడ’ పుస్తకావిష్కరణ

TG: ద్రవిడ రాష్ట్రాలపై సాగుతున్న వివక్ష గురించి గొంతెత్తుతూ రచయితలు, సామాజికవేత్తలు రాసిన వ్యాసాలు ‘ద్రవిడ’ పేరుతో పుస్తకంగా రాబోతోంది. ఈ పుస్తకానికి కె.ఎన్.మల్లీశ్వరి, కాత్యాయని విద్మహే సంపాదకులుగా ఉన్నారు. ‘మలుపు’ ప్రచురణలు పబ్లిష్ చేసే ఈ పుస్తకాన్ని ఈనెల 8న సాయంత్రం 5.30 గంటలకు హైదరాబాద్ నగరంలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆవిష్కరిస్తారు. సభకు అధ్యక్షులుగా తిరునగరి దేవకీదేవి ఉంటారు. ముఖ్యఅతిథిగా నటుడు, సామాజికవేత్త ప్రకాశ్‌రాజ్ హాజరవుతారు.

వర్షాకాలంలో గ్యాడ్జెట్స్ సేఫ్‌గా ఉండాలంటే..
Infotainment· 4 Aug 2026

వర్షాకాలంలో గ్యాడ్జెట్స్ సేఫ్‌గా ఉండాలంటే..

వర్షాకాలంలో మన ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, తడిసిపోకుండా జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. బయటకు వెళ్లేటప్పుడు వీటిని వాటర్‌ప్రూఫ్ బ్యాగ్‌లో పెట్టుకోవడం లేదా జిప్‌లాక్ కవర్లు వాడితే సేఫ్టీ గా నీళ్లు పడకుండా ఉంటాయి. ఇంట్లో ఉన్నప్పుడు కూడా వర్షం చినుకులు పడేలా కిటికీల దగ్గర కానీ, తడి ఉన్న చోట కానీ ఫోన్లు పెట్టకండి. తేమ ఎక్కువగా ఉండే కిచెన్, బాత్‌రూమ్‌లకు కూడా వీటిని దూరంగా ఉంచడం మంచిది.

ఫ్రెండ్‌షిప్ డే విషాదం.. ఇంకా దొరకని ఇద్దరు
Crime· 4 Aug 2026

ఫ్రెండ్‌షిప్ డే విషాదం.. ఇంకా దొరకని ఇద్దరు

AP: విశాఖపట్నం పాతగంగవరం బీచ్‌లో ఫ్రెండ్‌షిప్ డే రోజున అలల్లో <a href="https://www.theclearcutnews.com/n/hVd9MDU">గల్లంతైన</a> యువతి నీతూ, యువకుడు దామోదర్ కోసం మూడో రోజూ గాలింపు కొనసాగుతోంది. నేవీ, బీచ్ లైఫ్‌గార్డ్స్, హెలికాప్టర్లతో విస్తృతంగా వెతుకుతున్నప్పటికీ వారి ఆచూకీ లభించలేదు. భారీ అలలు, ప్రతికూల వాతావరణం కారణంగా సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. ఆదివారం ఏడుగురు స్నేహితులు బీచ్‌కు వెళ్లగా, రాయిపై ఫోటోలు దిగుతున్న సమయంలో భారీ అల తాకి నీతూ సముద్రంలో పడిపోయింది. ఆమెను రక్షించేందుకు వెళ్లిన దామోదర్ కూడా గల్లంతయ్యాడు.

గుజరాత్‌లో YSRCP మాజీ MLA అరెస్ట్
Politics· 4 Aug 2026

గుజరాత్‌లో YSRCP మాజీ MLA అరెస్ట్

AP: గుంటూరు ఈస్ట్ మాజీ MLA, YSRCP నేత ముస్తఫాను గుజరాత్‌లో నూజివీడు పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరు వ్యక్తుల కిడ్నాప్, అక్రమ నిర్బంధం కేసులో ఆయన అండర్‌గ్రౌండ్‌లో ఉన్నారు. టెక్నాలజీ సాయంతో గుజరాత్‌లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రీసెంట్‌గా పొగాకు వ్యాపారితో పాటు ఇద్దరిని కిడ్నాప్ చేసిన ఘటనలో ముస్తఫా కొడుకుతో పాటు కొందరిపై కేసులు బుక్ చేశారు. ఈ కేసులో ముస్తఫా ఇన్‌వాల్వ్ అయినట్లు పోలీసులు గుర్తించారు. ఆయనపై కిడ్నాప్, బెదిరింపుల కేసులు పెట్టి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

నాగార్జునసాగర్ కాల్వలకు 60 ఏళ్లు
TG· 4 Aug 2026

నాగార్జునసాగర్ కాల్వలకు 60 ఏళ్లు

TG: నాగార్జునసాగర్ ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలకు ఇవాళ్టితో 59 ఏళ్లు పూర్తయ్యాయి. 1967 ఆగస్టు 4న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఈ ప్రాజెక్టును జాతికి అంకితమిస్తూ కాలువలకు నీటిని విడుదల చేశారు. జలాశయo నుండి ఆనకట్టకు కుడివైపు నుండి ప్రారంభమయ్యే కాలువకు ‘జవహర్’ కాలువ అని పేరు పెట్టారు. ప్రపంచంలోని అత్యంత పొడవైన కాలువలలో ఇదీ ఒకటి. జలాశయానికి ఎడమ వైపు నుంచి ప్రారంభమయ్యే కాలువకు ‘లాల్ బహదూర్’ కాలువ అని పేరు పెట్టారు.

బురదలో చిక్కుకున్న లగ్జరీ బస్సు
TG· 4 Aug 2026

బురదలో చిక్కుకున్న లగ్జరీ బస్సు

TG: హైదరాబాద్ ఉప్పల్‌లోని నల్లచెరువు కట్ట వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక RTC బస్‌స్టాండ్‌లో దారుణ పరిస్థితి నెలకొంది. వర్షంతో మొత్తం ప్రాంగణం బురదమయంగా మారడంతో తొర్రూరు డిపోకు చెందిన RTC సూపర్ లగ్జరీ బస్సు టైరు బురదలో కూరుకుపోయింది. బస్సు ముందుకు కదలకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చివరకు JCB సాయంతో బస్సును బయటకు తీశారు. తాత్కాలిక బస్‌స్టాండ్‌లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.

హాస్టల్‌లో విషాదం.. ఈతకు వెళ్లి విద్యార్థులు మృతి
News· 4 Aug 2026

హాస్టల్‌లో విషాదం.. ఈతకు వెళ్లి విద్యార్థులు మృతి

TG: జగిత్యాల జిల్లా మల్యాలలో దారుణ ఘటన జరిగింది. SC హాస్టల్‌లో చదువుతున్న ఇద్దరు స్టూడెంట్స్ హాస్టల్ వెనుక ఉన్న కుంటలో ఈతకు వెళ్లి మునిగి చనిపోయారు. మృతుల్లో నిజామాబాద్ జిల్లా మోర్తాడ్‌కు చెందిన 5th క్లాస్ స్టూడెంట్ విష్ణు(11), జగిత్యాలకు చెందిన 4th క్లాస్ స్టూడెంట్ సుశాంత్(10) ఉన్నారు. దీంతో అధికారులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టి మృతదేహాలను బయటకు తీశారు. మృతదేహాలను జగిత్యాల గవర్నమెంట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ఘటనపై పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.

బిడ్డ మరణాన్ని తట్టుకోలేక రోదిస్తున్న తల్లి డాల్ఫిన్
Infotainment· 4 Aug 2026

బిడ్డ మరణాన్ని తట్టుకోలేక రోదిస్తున్న తల్లి డాల్ఫిన్

వెస్ట్రన్ ఆస్ట్రేలియా తీరంలో చనిపోయిన తన రెండు వారాల పసికూనను మోస్తూ ఒక తల్లి డాల్ఫిన్ రోజుల తరబడి సముద్రంలో ఈదుతోంది. శీతాకాలంలో పుట్టిన ఈ పిల్ల డాల్ఫిన్ దురదృష్టవశాత్తూ కన్నుమూసింది. పరిశోధకుల సమాచారం ప్రకారం, తల్లి డాల్ఫిన్ వరుసగా తన చివరి నలుగురు పిల్లలను కోల్పోయిందని, తీవ్రమైన పురిటి శోకంతోనే బిడ్డ మృతదేహాన్ని వదలకుండా మోస్తుందని వెల్లడించారు. బిడ్డను కోల్పోయిన ఆ తల్లి డాల్ఫిన్‌కు మద్దతుగా మరో 14 డాల్ఫిన్లు దాని వెంటే పయనిస్తుండటం చూసేవారిని తీవ్రంగా కలచివేస్తోంది.

డివైడర్‌పై బోల్తా పడిన ట్రావెల్స్ బస్సు
Crime· 4 Aug 2026

డివైడర్‌పై బోల్తా పడిన ట్రావెల్స్ బస్సు

AP: కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం తేలప్రోలు వద్ద నేషనల్ హైవేపై YBM ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి డివైడర్‌పై బోల్తా పడింది. చెన్నై నుంచి విశాఖపట్నం వెళ్తున్న బస్సులో 26మంది ప్రయాణిస్తుండగా, 12 మంది గాయపడ్డారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. బస్సు బోల్తా పడిన వెంటనే వెనుక నుంచి వస్తున్న ఓ లారీ దానిని తప్పించబోయి ఢీకొట్టడంతో లారీ డ్రైవర్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

రానున్న మూడు రోజులు మోస్తరు వానలు
Infotainment· 4 Aug 2026

రానున్న మూడు రోజులు మోస్తరు వానలు

పసిఫిక్ మహాసముద్రంలో 'ఎల్‌నినో' పరిస్థితుల ప్రభావం వల్ల ఆగస్టు నెలలో సాధారణ కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ (IMD) తెలిపింది. రుతుపవన ద్రోణి ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ఒకే పేరు.. రెండు జీతాలు
TG· 4 Aug 2026

ఒకే పేరు.. రెండు జీతాలు

TG: జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం జింకలపల్లి గ్రామ పంచాయతీలో డబుల్ జీతాల వ్యవహారం వెలుగుచూసింది. టి.రవి అనే వ్యక్తి పేరుతో ఒకవైపు ట్రాక్టర్ డ్రైవర్‌గా, మరోవైపు మిషన్ భగీరథ వాటర్‌మన్‌గా నమోదు చేసి గత ఐదేళ్లుగా రెండు జీతాలు డ్రా చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఉద్యోగికి ఒక జీతం మాత్రమే ఇచ్చి, మరో జీతాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులు దుర్వినియోగం చేస్తున్నారని గ్రామస్థులు ఆరోపించారు. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్‌కు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.

RTC డ్రైవర్, శ్రామిక్ పోస్టుల రిజల్ట్స్ విడుదల
Jobs· 4 Aug 2026

RTC డ్రైవర్, శ్రామిక్ పోస్టుల రిజల్ట్స్ విడుదల

TG: RTCలో 1,743 డ్రైవర్, శ్రామిక్ పోస్టులకు రిజల్ట్స్ విడుదలయ్యాయి. మొత్తం 1,604 మంది కాండిడేట్లు సెలెక్ట్ అవ్వగా, అర్హులు లేకపోవడంతో 139 పోస్టులు ఖాళీగా మిగిలాయి. కాండిడేట్ రిజల్ట్స్, కటాఫ్ డీటెయిల్స్‌ను ఆఫిషియల్ <a href="https://www.tgprb.in/">వెబ్‌సైట్‌లో</a> చెక్ చేసుకోవచ్చు. సెలెక్టయిన వారు ఆగస్టు 7 నుంచి 11 వరకు ఆన్‌లైన్‌లో అటెస్టేషన్ ఫామ్ ఫిల్ చేసి, గెజిటెడ్ ఆఫీసర్ అప్రూవ్ చేసిన మూడు సెట్ల ఫామ్స్, సర్టిఫికెట్లను ఆగస్టు 17న సంబంధిత ఆఫీస్‌లో సబ్మిట్ చేయాలి.

ఆవలింతలు ఎందుకు వస్తాయి?
Health· 4 Aug 2026

ఆవలింతలు ఎందుకు వస్తాయి?

మనం అలసిపోయినప్పుడు లేదా బోర్ కొట్టినప్పుడు ఆవలింతలు రావడం వెనుక ఆసక్తికరమైన సైన్స్ ఉంది. మన మెదడు బాగా పనిచేసి వేడెక్కినప్పుడు దాన్ని తగ్గిచడానికి ఆవలింత 'కూలింగ్ మెకానిజమ్' లా పనిచేస్తుంది. ఊపిరితిత్తులలోకి ఒకేసారి ఎక్కువ గాలిని తీసుకెళ్లి శరీరానికి కావలసిన ఆక్సిజన్ ను అందిస్తుంది. సరైన నిద్ర లేకపోయినా లేదా ఆసక్తి లేని పని చేస్తున్నప్పుడు మెదడును మళ్లీ అలర్ట్‌గా మార్చడానికి ఆవలింతలు వస్తాయి. ఎదుటివారు ఆవలిస్తే మనకి కూడా ఆవలింత రావడం అనేది మన మెదడులోని 'మిర్రర్ న్యూరాన్స్' వల్ల జరుగుతుంది.

విద్యార్థినులను వేధించిన ఐదుగురు అరెస్ట్
Crime· 4 Aug 2026

విద్యార్థినులను వేధించిన ఐదుగురు అరెస్ట్

AP: విశాఖపట్నం జిల్లా భీమిలి గవర్నమెంట్ కాలేజీ వద్ద విద్యార్థినులను ఈవ్ టీజింగ్ చేసిన ఐదుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సమాచారం అందుకున్న వెంటనే CI దివాకర్ యాదవ్ ఆదేశాల మేరకు పోలీసులు స్పాట్‌కి చేరుకుని నిందితులను పట్టుకున్నారు. వారికి కౌన్సిలింగ్ ఇచ్చి, ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. అనంతరం వారిపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి తదుపరి విచారణ చేపట్టారు. ఇక నుంచి కాలేజీలు, పాఠశాలల చుట్టూ ప్రత్యేక నిఘా ఉంటుందని సీఐ తెలిపారు.

పాలిటిక్స్ కూడా Reel అయిపోయిందా?
Politics· 4 Aug 2026

పాలిటిక్స్ కూడా Reel అయిపోయిందా?

ఒకప్పుడు పాలిటిక్స్ అంటే సభలు, స్పీచెస్.. ఇప్పుడు రీల్స్, మీమ్స్ కూడా పొలిటికల్ వెపన్స్‌గా మారుతున్నాయి.📱👀 ఇండియాలో Gen Z రాజకీయ విషయాలు మాట్లాడటానికి ఇన్‌స్టాగ్రామ్ను కీలక ప్లాట్‌ఫామ్‌గా ఉపయోగిస్తున్నట్లు Economic Times రిపోర్ట్ చేసింది. ఇటీవల స్టూడెంట్ ప్రొటెస్ట్స్‌కు సంబంధించిన షార్ట్ వీడియోలు, రీల్స్ సోషల్ మీడియాలో భారీగా సర్క్యులేట్ అయ్యాయి. పొడవైన స్పీచ్ కంటే కొన్ని సెకన్ల రీల్‌తోనే లక్షల మందికి మెసేజ్ చేరుతోంది.

రష్యాలో బీచ్‌పై డ్రోన్ దాడి.. పిల్లలతో సహా ఏడుగురు మృతి
World· 4 Aug 2026

రష్యాలో బీచ్‌పై డ్రోన్ దాడి.. పిల్లలతో సహా ఏడుగురు మృతి

సౌత్ రష్యాలోని ఓ బీచ్‌పై డ్రోన్ ఎటాక్ జరగడంతో ముగ్గురు పిల్లలతోపాటు ఏడుగురు చనిపోయినట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఈ దాడిలో మొత్తం 40 మంది గాయపడగా, వారిలో 17 మంది హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారు. దాడి వెనుక ఉక్రెయిన్‌ ఉందని క్రాస్నోడార్ ప్రాంత గవర్నర్ వెనియామిన్ కొండ్రాత్యేవ్ ఆరోపించారు. అయితే ఈ ఘటనపై ఉక్రెయిన్ ఇప్పటివరకు రెస్పాండ్ కాలేదు. పౌరులపై కావాలనే దాడులు చేయడం లేదని ఇరు దేశాలు చెబుతున్నాయి. దాడికి ముందు ఎలాంటి సైరన్లు మోగలేదని స్థానికులు, టూరిస్టులు మీడియాకు తెలిపారు.

ఫైబర్ : జీర్ణక్రియ నుంచి బరువు తగ్గడం వరకు
Health· 4 Aug 2026

ఫైబర్ : జీర్ణక్రియ నుంచి బరువు తగ్గడం వరకు

ఆరోగ్యంగా ఉండడానికి పీచు పదార్థం (ఫైబర్) ఎంతో అవసరం. ఓట్స్, చియా సీడ్స్, పప్పు ధాన్యాలు, నల్ల శనగలు, పెసర్లు, బ్రాకోలీతో పాటు జామ, యాపిల్, బేరి వంటి పండ్లు తీసుకోవడం వల్ల శరీరానికి ఎక్కువగా ఫైబర్ లభిస్తుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా, బరువును అదుపులో ఉంచడానికి, కడుపు నిండినట్లు అనిపించి అతిగా తినకుండా సహాయపడుతుంది. ఫైబర్ ఉన్న ఆహారాన్ని రోజువారీ ఆహారంలో తీసుకోని ఆరోగ్యంగా ఉండండి.

పంట దిగుబడి రాక.. అప్పులు తీర్చలేక
AP· 4 Aug 2026

పంట దిగుబడి రాక.. అప్పులు తీర్చలేక

AP: మార్కాపురం జిల్లా పెద్దకందుకూరు గ్రామంలో అప్పుల భారంతో మనస్తాపానికి గురైన రైతు కోడావత్ పెద్ద రామయ్య (46) చికిత్స పొందుతూ మృతి చెందాడు. మూడు ఎకరాల సొంత భూమితో పాటు మరో మూడు ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేసిన ఆయనకు గత కొన్నేళ్లుగా పంట దిగుబడి రాక, గిట్టుబాటు ధరలు లేక తీవ్ర అప్పులు అయ్యాయి. మనస్తాపంతో గత నెల 23న పొలం వద్ద పురుగుల మందు తాగగా, కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు. గుంటూరులో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.

ఎంత సమయం నిద్రపోతున్నారో ఒక్కసారి చెక్ చేసుకోండి!
Health· 4 Aug 2026

ఎంత సమయం నిద్రపోతున్నారో ఒక్కసారి చెక్ చేసుకోండి!

రోజుకు కేవలం 5 గంటలు మాత్రమే నిద్రపోవడం వల్ల శరీరంలో శక్తి, సహనం తగ్గిపోతాయి. అంతేకాకుండా ఏకాగ్రత తగ్గడం, కండరాల రికవరీ మందగించడం, గాయపడే ప్రమాదం పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజుకు 8 గంటలు నిద్రపోతే శరీరానికి కావాల్సినంత బలం, పూర్తి ఎనర్జీ లభిస్తాయి. ఇది కండరాల పెరుగుదలకు తోడ్పడటమే కాకుండా రోగనిరోధక శక్తిని శక్తివంతంగా మారుస్తుంది. ఆరోగ్యంగా ఉండటానికి రోజుకి 8 గంటల నిద్ర చాలా అవసరం.

విన్‌ఫాస్ట్ కారులో లోపాలు.. రీఫండ్ కోసం కస్టమర్ డిమాండ్
General· 4 Aug 2026

విన్‌ఫాస్ట్ కారులో లోపాలు.. రీఫండ్ కోసం కస్టమర్ డిమాండ్

హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని షోరూంలో రూ.25 లక్షలకు కొన్న విన్‌ఫాస్ట్ VF7 ఎలక్ట్రిక్ కారులో లోపాలున్నాయని కస్టమర్ నల్లం ఫణి కుమార్ రాజా ఆరోపించారు. ఏసీ డ్రెయిన్ పైపు డిజైన్ లోపం వల్ల నీరు కార్పెట్ కింద నిలిచి ఫ్లోర్ తడిసిపోయిందని తెలిపారు. సర్వీస్ సెంటర్ ఇష్యూను పూర్తిగా సాల్వ్ చేయలేదని, కంపెనీకి చాలాసార్లు కంప్లైంట్ చేసినా రెస్పాండ్ కాలేదన్నారు.. కారును వెనక్కి తీసుకుని డబ్బును రీఫండ్ చేయాలని డిమాండ్ చేస్తూ, అవసరమైతే చట్టపరంగా పోరాటం చేస్తానని అన్నారు.