విద్యార్థినులను వేధించిన ఐదుగురు అరెస్ట్

AP: విశాఖపట్నం జిల్లా భీమిలి గవర్నమెంట్ కాలేజీ వద్ద విద్యార్థినులను ఈవ్ టీజింగ్ చేసిన ఐదుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సమాచారం అందుకున్న వెంటనే CI దివాకర్ యాదవ్ ఆదేశాల మేరకు పోలీసులు స్పాట్‌కి చేరుకుని నిందితులను పట్టుకున్నారు. వారికి కౌన్సిలింగ్ ఇచ్చి, ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. అనంతరం వారిపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి తదుపరి విచారణ చేపట్టారు. ఇక నుంచి కాలేజీలు, పాఠశాలల చుట్టూ ప్రత్యేక నిఘా ఉంటుందని సీఐ తెలిపారు.



