బురదలో చిక్కుకున్న లగ్జరీ బస్సు

TG: హైదరాబాద్ ఉప్పల్‌లోని నల్లచెరువు కట్ట వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక RTC బస్‌స్టాండ్‌లో దారుణ పరిస్థితి నెలకొంది. వర్షంతో మొత్తం ప్రాంగణం బురదమయంగా మారడంతో తొర్రూరు డిపోకు చెందిన RTC సూపర్ లగ్జరీ బస్సు టైరు బురదలో కూరుకుపోయింది. బస్సు ముందుకు కదలకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చివరకు JCB సాయంతో బస్సును బయటకు తీశారు. తాత్కాలిక బస్‌స్టాండ్‌లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.




