డివైడర్‌పై బోల్తా పడిన ట్రావెల్స్ బస్సు

AP: కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం తేలప్రోలు వద్ద నేషనల్ హైవేపై YBM ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి డివైడర్‌పై బోల్తా పడింది. చెన్నై నుంచి విశాఖపట్నం వెళ్తున్న బస్సులో 26మంది ప్రయాణిస్తుండగా, 12 మంది గాయపడ్డారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. బస్సు బోల్తా పడిన వెంటనే వెనుక నుంచి వస్తున్న ఓ లారీ దానిని తప్పించబోయి ఢీకొట్టడంతో లారీ డ్రైవర్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.



