Latest

ఆరుగురు MPలు.. ఒకే ఫ్రేమ్!
Politics· 30 Jul 2026

ఆరుగురు MPలు.. ఒకే ఫ్రేమ్!

తెలంగాణ BJP MP <a href="https://x.com/Arvindharmapuri/status/2082716347793084439?s=20">ధర్మపురి అర్వింద్</a> పార్లమెంట్ బిల్డింగ్ బయట మిగతా ఐదుగురు MPలతో కలసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. "పవర్ ఆఫ్ టుగెదర్‌నెస్" అంటూ పెట్టిన ఈ పోస్ట్ ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ మేటర్ ఏంటంటే.. ఈ ఫోటో లో ఉన్న ఆరుగురు MPలూ వేరే పార్టీల నుంచి BJPలోకి వచ్చినవారే అనే కామెంట్స్ కనిపిస్తున్నాయి!

'పని చేశాం' అన్నా సరిపోదట.. లెక్క కూడా చూపించాలట!
Politics· 30 Jul 2026

'పని చేశాం' అన్నా సరిపోదట.. లెక్క కూడా చూపించాలట!

"టైమ్‌కి పని చేశారా లేదా అన్నదే రూ.2 కోట్ల ఫైన్‌కు కారణమా?" ఇదే ఇప్పుడు Infosys companyపై చర్చ. ఫ్రాన్స్‌లో ఉద్యోగుల పని గంటలను రికార్డ్ చేసే సిస్టమ్ అక్కడి లేబర్ చట్టాలకు పూర్తిగా అనుగుణంగా లేదని అధికారులు గుర్తించారు. దీంతో కంపెనీకి సుమారు ₹2 కోట్ల జరిమానా విధించారు. అయితే సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్టు ఉద్యోగులతో ఎక్కువ గంటలు పని చేయించారని కాదు, అసలు ఇష్యూ టైమ్ రికార్డింగ్ సిస్టమ్ గురించే. ఈ నిర్ణయంపై ఏం చేయాలన్నది చూస్తున్నామని Infosys తెలిపింది.

పరుగు పందెంలో భారత్‌కు రెండు పతకాలు
Sports· 30 Jul 2026

పరుగు పందెంలో భారత్‌కు రెండు పతకాలు

మెన్ 100 మీటర్ల పరుగు పందెంలో మన ఇండియన్ పారా అథ్లెట్స్ దిలీప్ మహాదు గవిత్, మహమ్మద్ బాసిల్ మొదటి రెండు స్థానాల్లో నిలిచి గోల్డ్, సిల్వర్ మెడల్స్ గెలిచారు. గవిత్ 10.71 సెకన్లలో రేసు పూర్తి చేసి ఫస్ట్ ప్లేస్‌లో నిలవగా, బాసిల్ 10.83 సెకన్లతో సెకండ్ ప్లేస్‌ లో వచ్చాడు. ఈ గోల్డ్‌తో భారత్‌కు మూడు బంగారు పతకాలు వచ్చాయి. అంతకుముందు మీరాబాయి చాను వెయిట్‌ లిఫ్టింగ్‌లో, షర్మిలా ధనకర్ షాట్‌పుట్‌లో గోల్డ్ మెడల్స్ గెలిచారు.

రేపు సాయంత్రం రావిశాస్త్రి కథా పురస్కారాల అందజేత
TG· 30 Jul 2026

రేపు సాయంత్రం రావిశాస్త్రి కథా పురస్కారాల అందజేత

TG: ప్రఖ్యాత రచయిత రాచకొండ విశ్వనాథశాస్త్రి 104 వ జయంతి సందర్భంగా జులై 31న రావిశాస్త్రి కథాపురస్కారాలు అందించనున్నారు. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ నగరం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ‘ఉదయిని’ సాహిత్య సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ‘మెమొరీస్ ఆఫ్ మంగలిపల్లె’ పుస్తకానికి నరేష్కుమార్ సూఫీ, ‘గోడవతల’ పుస్తకానికి స్వర్ణకిలారి, ‘బొంబాయి పొట్టేలు’ పుస్తకానికి చరణ్ పరిమి, ‘ఒంటరితనపు కథలు’ పుస్తకానికి మహమ్మద్ గౌస్ ఈ పురస్కారాలు అందుకోనున్నారు.

పీఎం మోడీ రిజైన్.. ఇది నిజమేనా!
Politics· 30 Jul 2026

పీఎం మోడీ రిజైన్.. ఇది నిజమేనా!

సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ప్రధానిమంత్రి నరేంద్ర మోదీకి సంబంధించిన ఓ ఫేక్ రిజిగ్నేషన్‌ లెటర్‌ను ప్రభుత్వం గుర్తించి హెచ్చరించింది. 'ఈ లెటర్‌ ఫేక్ అని, ప్రధానమంత్రి అటువంటి లేఖను జారీ చేయలేదని, దానిపై ఆయన సంతకం చేయలేదని' స్పష్టం చేసింది. 'ఏదైనా సమాచారాన్ని నమ్మే ముందు అఫీషియల్ సోర్సులు ద్వారా సరిచూసుకోండి' అని PIB ఫ్యాక్ట్‌చెక్ 'X' లో పోస్ట్ చేసింది.

ఆరని బట్టలు వేసుకుంటున్నారా?
Health· 30 Jul 2026

ఆరని బట్టలు వేసుకుంటున్నారా?

వర్షాకాలంలో తడి బట్టలు సరిగ్గా ఆరకపోతే బ్యాక్టీరియా, ఫంగస్ వల్ల స్కిన్ అలర్జీలు, ఇన్ఫెక్షన్లు వచ్చే ఛాన్స్ 40% ఉంటుంది. ఈ సీజన్ లో జీన్స్, కాటన్ కాకుండా త్వరగా ఆరే పాలిస్టర్, నైలాన్ వాడటం బెటర్. బ్యాడ్ స్మెల్ పోవడానికి ఉతికే ముందు బేకింగ్ సోడా లేదా వెనిగర్ యూజ్ చేయాలి. బట్టలు ఆరిపోయాక ఐరన్ చేశాకే వేసుకోవడం, బీరువాలో కర్పూరం ఉంచడం వల్ల ఇన్ఫెక్షన్లను అరికట్టవచ్చు.

100 కోట్ల క్లబ్‌లో అఖిల్ ‘లెనిన్’..
Cinema· 30 Jul 2026

100 కోట్ల క్లబ్‌లో అఖిల్ ‘లెనిన్’..

హీరో అక్కినేని అఖిల్ తన కెరీర్‌లో సరికొత్త మైలురాయిని అందుకున్నారు. ఆయన నటించిన తాజా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘లెనిన్’ ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ వసూల్ సాధించి, అఖిల్ కెరీర్‌లోనే తొలి చిత్రంగా రికార్డు సృష్టించింది. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్-అన్నపూర్ణ స్టూడియోస్ కలసి నిర్మించిన ఈ చిత్రం మొదటి రోజు నుంచే సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళ్లింది.

సాయికృష్ణ కేసులో CI నాగరాజు విచారణ
Crime· 30 Jul 2026

సాయికృష్ణ కేసులో CI నాగరాజు విచారణ

AP: గాదె సాయికృష్ణ మిస్సింగ్ కేసు రాష్ట్రంలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి హైకోర్టులో తన కొడుకు కోసం వేసిన పిటిషన్‌ను తన అనుమతి లేకుండానే వెనక్కి తీసుకునేందుకు తన లాయర్ ప్రయత్నించారని చెప్పడం సెన్సేషన్ అయ్యింది. ఆ లాయర్‌ను తీసేసి ఈ కేసును CBIకి అప్పగించాలని మరో లాయర్‌తో పిటిషన్ వేశారు. మరోవైపు జైలులో ఉన్న CI నాగరాజును SIT అధికారులు వారం పాటు విచారించనున్నారు. కోర్టు ఆదేశాలతో రోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సీసీ కెమెరాల మధ్య విచారణ జరపనున్నారు.

సినిమా చూస్తుండగానే బాలీవుడ్ నటికి బిగ్ షాక్..
Crime· 30 Jul 2026

సినిమా చూస్తుండగానే బాలీవుడ్ నటికి బిగ్ షాక్..

బాలీవుడ్ నటి, నిర్మాత కీర్తి కుల్హారీ సైబర్ మోసానికి గురయ్యారు. ముంబైలోని ఒక మల్టీప్లెక్స్‌లో సినిమా చూస్తుండగా, ఆమె క్రెడిట్ కార్డు ద్వారా ఏరోమెక్సికో ఎయిర్‌లైన్స్‌లో 2,525 డాలర్ల విదేశీ లావాదేవీ జరిగినట్లు మెసేజ్ వచ్చింది. ఓటీపీ ఎవరికీ షేర్ చేయకపోయినా, నిమిషాల వ్యవధిలోనే 4 ఇల్లీగల్ లావాదేవీల ద్వారా రూ. 2.43 లక్షలకు పైగా మాయమైపోయాయి.కీర్తి ఫిర్యాదుతో అంబోలి పోలీసులు, సైబర్ సెల్ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మా తప్పు లేదంటోంది.. కానీ ₹47 వేల కోట్లు మాత్రం ఇస్తోంది!
World· 30 Jul 2026

మా తప్పు లేదంటోంది.. కానీ ₹47 వేల కోట్లు మాత్రం ఇస్తోంది!

"తప్పు చేయలేదంటోంది అయినా ₹47 వేల కోట్లు ఎందుకు చెల్లిస్తోంది?" ఇదే ఇప్పుడు Johnson &amp; Johnsonపై చర్చ. అమెరికాలో టాల్క్ ఆధారిత బేబీ పౌడర్, ఇతర ఉత్పత్తులు అండాశయ క్యాన్సర్‌కు కారణమయ్యాయని చెబుతూ వేలాది మంది మహిళలు కేసులు వేశారు. అయితే తమ ఉత్పత్తులు సురక్షితమేనని కంపెనీ చెబుతోంది. అయినప్పటికీ, 76 వేల కేసుల పరిష్కారం కోసం 5.5 బిలియన్ డాలర్లు (సుమారు ₹47–48 వేల కోట్లు) చెల్లించే ప్రతిపాదన చేసింది. అయితే ఇది తప్పు ఒప్పుకోవడం కాదని, కోర్టు పోరాటానికి ముగింపు పలకడానికేనని స్పష్టం చేసింది.

మా ఫ్యామిలీని చంపేస్తామంటున్నారు- అభిజీత్ దీప్కే
Politics· 30 Jul 2026

మా ఫ్యామిలీని చంపేస్తామంటున్నారు- అభిజీత్ దీప్కే

CJP ఫౌండర్ అభిజీత్ దీప్కే షాకింగ్ కామెంట్స్ చేశారు. తాను BJPలో చేరకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని, ఫ్యామిలీకి కూడా గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని తెలిపారు. దీనిపై ఆల్రెడీ అధికారులకు కంప్లైంట్ చేసినట్లు చెప్పారు. ఇదే క్రమంలో పెల్లెట్ గన్స్ వినియోగంపై హోంమంత్రి అమిత్ షా క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. డెమోక్రసీలో ఇలాంటి థ్రెట్స్ రావడం ఆందోళనకరమని ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

రాణి భారతి ఈజ్ బ్యాక్..
Cinema· 30 Jul 2026

రాణి భారతి ఈజ్ బ్యాక్..

ఓటీటీలో పొలిటికల్ థ్రిల్లర్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ‘మహారాణి’ సిరీస్, బాలీవుడ్ స్టార్ నటి హుమా ఖురేషి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ పాపులర్ పొలిటికల్ డ్రామా ఐదో సీజన్‌ మొదలైంది. గత నాలుగు సీజన్లు మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో, ఈసారి కథ మరింత రసవత్తరంగా ఉండబోతుంది. రాణి భారతిగా హుమా ఖురేషి చేసే మైండ్ గేమ్స్, రాజకీయంలో వేసే ఎత్తుగడలు మరోసారి ప్రేక్షకుల ముందుకి రానున్నాయి.

బెంగళూరు డాక్టర్‌పై కేసు నిలిపేసిన హైకోర్టు
Crime· 30 Jul 2026

బెంగళూరు డాక్టర్‌పై కేసు నిలిపేసిన హైకోర్టు

బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చిన ఒక జంటను వేధించాడని బెంగళూరుకు చెందిన 'డాక్టర్ నాగేంద్రపై' పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణను కర్ణాటక హైకోర్టు ఆపేసింది. అసలు నిజనిజాలు తెలుసుకోకుండా పోలీసులు తొందరపడి కేసు ఎలా రాశారని కోర్టు తప్పుబట్టింది. ఒక పౌరుడు అక్రమంగా ఉంటున్న వాళ్లను గుర్తిస్తుంటే, తిరిగి అతనిపైనే కేసు పెట్టడం సరికాదని జడ్జ్ చెప్పారు. నగరంలో అక్రమంగా ఉంటున్న వాళ్లను పట్టుకుని ప్రభుత్వం చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. విచారణను ఆగస్టు 6కు వాయిదా వేశారు.

పోకిరీలుగా మారిన అమ్మాయిలు..అబ్బాయిల కంప్లైంట్!
Politics· 30 Jul 2026

పోకిరీలుగా మారిన అమ్మాయిలు..అబ్బాయిల కంప్లైంట్!

UPలోని వారణాసి కాంట్ రైల్వే స్టేషన్ దగ్గర రోడ్డుపై ఆకతాయి పనులు చేస్తూ జనాన్ని ఇబ్బంది పెడుతున్నారిద్దరు. అయితే వాళ్లు అబ్బాయిలు కాదు..అమ్మాయిలు. అటుగా వెళ్లే మగవాళ్లను ఆపి, అసభ్యంగా మాట్లాడుతూ వాళ్లకు ఇబ్బంది కలిగిస్తున్నారు. వాళ్ల కంప్లైంట్‌తో 'యాంటీ రోమియో స్క్వాడ్' స్పాట్‌కి వెళ్లి జీవిక(42), రుబియా(28)లను కస్టడీలోకి తీసుకున్నారు. పబ్లిక్ ప్లేస్‌లో బిహేవియర్ సరిగ్గా లేనందుకు BNS సెక్షన్ 296 కింద కేస్ బుక్ చేశారు.

ప్రభుత్వం గుడ్ న్యూస్.. రూ.50కే కిలో బియ్యం
Infotainment· 30 Jul 2026

ప్రభుత్వం గుడ్ న్యూస్.. రూ.50కే కిలో బియ్యం

AP: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. నాణ్యమైన బియ్యాన్ని తక్కువ రేటుకే ప్రజలకు అందించాలని నిర్ణయం తీసుకుంది. ఆగస్ట్ 1వ తేదీ నుంచి ఈ పథకాన్ని మొదలుపెట్టనుంది. బీపీటీ సూపర్ ఫైన్ బియ్యంను కిలో రూ.52కు, గ్రేడ్-1 పచ్చి బియ్యం కేజీ రూ.50కు ఇవ్వనుంది. రైతు బజార్లు, ప్రత్యేక కౌంటర్ల ద్వారా ప్రజలు సబ్సిడీపై వీటిని కొనుగోలు చేయవచ్చు. ప్రతీఒక్కరూ దీనిని ఉపయోగించుకోవాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ తెలిపింది.

దుల్కర్ అభిమానులకు గుడ్ న్యూస్..
Cinema· 30 Jul 2026

దుల్కర్ అభిమానులకు గుడ్ న్యూస్..

దుల్కర్ సల్మాన్ హీరోగా, కయడు లోహర్ హీరోయిన్‌గా, నహాస్ హిదాయత్ దర్శకత్వంలో వస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమా 'ఐ యామ్ గేమ్'. జూలై 28న విడుదల కావాల్సిన సినిమా ట్రైలర్ సాంకేతిక కారణాల వల్ల ఆలస్యమైంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను ఈరోజు సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా ఆగస్టు 20, 2026న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.

KKR జట్టులోకి మళ్లీ 'టెన్ డస్కటే'
Sports· 30 Jul 2026

KKR జట్టులోకి మళ్లీ 'టెన్ డస్కటే'

టీమిండియా అసిస్టెంట్ కోచ్ పదవి వదిలేసి 'టెన్ డస్కటే' మళ్లీ KKR జట్టులోకి వచ్చాడు. ఇంతకుముందు అతను ఇదే జట్టుకు ఫీల్డింగ్ కోచ్‌గా పనిచేశాడు. ఇప్పుడు అతనికి 'హెడ్ ఆఫ్ క్రికెట్ స్ట్రాటజీ' బాధ్యతలు ఇచ్చారు. ఆట గురించి అతనికి బాగా తెలుసని ఆ అనుభవం తమ జట్టుకు పనికొస్తుందని KKR మేనేజ్‌మెంట్‌ చెప్పింది.

వాగులు, వంతెనల వద్ద భద్రత కట్టుదిట్టం
TG· 30 Jul 2026

వాగులు, వంతెనల వద్ద భద్రత కట్టుదిట్టం

TG: కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా పోలీస్ యంత్రాంగం <a href="https://www.theclearcutnews.com/n/oGAcrp9">హైఅలర్ట్</a> ప్రకటించింది. జిల్లా ఎస్పీ నితికా పంత్ కాగజ్‌నగర్ పెద్దవాగు, దహెగాం, పెంచికల్‌పేట్ ప్రాంతాల్లో వరద ముంపు ప్రాంతాలను స్వయంగా పరిశీలించారు. వాగులు, వంతెనల వద్ద పోలీసులు, SDRF బృందాలు అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. లైఫ్ జాకెట్లు, లైఫ్ బాయ్స్, తాళ్లు సిద్ధంగా ఉంచాలని సూచించారు. ప్రమాదకర ప్రాంతాలకు ప్రజలు వెళ్లొద్దన్నారు.

'కంగనా రనౌత్' దిష్టిబొమ్మను ఎత్తుకెళ్లిన పోలీస్!
Politics· 30 Jul 2026

'కంగనా రనౌత్' దిష్టిబొమ్మను ఎత్తుకెళ్లిన పోలీస్!

Gen Z పై MP కంగనా రనౌత్ చేసిన వివాదాస్పద కామెంట్స్‌పై లక్నోలో ప్రొటెస్టర్స్, ఆమె దిష్టిబొమ్మను దహనం చేసేందుకు రెడీ అవ్వగా, అక్కడే ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్ ఊహించని షాక్ ఇచ్చారు. ఆ దిష్టిబొమ్మను లాక్కుని, వారు తగలేయకుండా విపరీతమైన స్పీడ్‌తో పరుగులు తీస్తూ ఎత్తుకెళ్లిపోయారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది.

వందేమాతరం బిల్లుకు లోక్‌సభ ఆమోదం
India· 30 Jul 2026

వందేమాతరం బిల్లుకు లోక్‌సభ ఆమోదం

జాతీయ గేయం ‘వందేమాతరం’ గౌరవాన్ని కాపాడేందుకు ఉద్దేశించిన కీలక బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్‌ ఈనెల 24న రాజ్యసభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. బుధవారం సుదీర్ఘ చర్చ అనంతరం రాజ్యసభ ఆమోదించింది. ఇవాళ మూజువాణి ఓటుతో లోక్‌సభ ఈ బిల్లును ఆమోదించింది. ఇకపై వందేమాతరాన్ని అవమానించినా, ఎవరైనా పాడుతున్న టైంలో ఆటంకం కలిగించినా చట్టప్రకారం నేరంగా పరిగణిస్తారు.

నా రాజకీయ కోరిక ఏంటో అప్పుడే చెబుతా: జగ్గారెడ్డి
Politics· 30 Jul 2026

నా రాజకీయ కోరిక ఏంటో అప్పుడే చెబుతా: జగ్గారెడ్డి

TG: కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ఓ సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'నాకు సీఎం కావాలనే కోరిక లేదు. సీఎం పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి లైన్లో ఉన్నారు. కానీ నాకు మరో బలమైన రాజకీయ కోరిక ఉంది. నా మనసులోని మాటలన్నీ నవంబర్‌లో బయటపెడతాను. అప్పుడే నా రాజకీయ కోరిక ఏమిటో చెబుతాను' అని జగ్గారెడ్డి అన్నారు. జగ్గారెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయల్లో చర్చకు దారితీశాయి.