మా ఫ్యామిలీని చంపేస్తామంటున్నారు- అభిజీత్ దీప్కే
CJP ఫౌండర్ అభిజీత్ దీప్కే షాకింగ్ కామెంట్స్ చేశారు. తాను BJPలో చేరకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని, ఫ్యామిలీకి కూడా గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని తెలిపారు. దీనిపై ఆల్రెడీ అధికారులకు కంప్లైంట్ చేసినట్లు చెప్పారు. ఇదే క్రమంలో పెల్లెట్ గన్స్ వినియోగంపై హోంమంత్రి అమిత్ షా క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. డెమోక్రసీలో ఇలాంటి థ్రెట్స్ రావడం ఆందోళనకరమని ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.



