Latest

RSS బ్యాక్‌గ్రౌండ్‌తో విద్యాశాఖ పగ్గాలు
Education· 26 Jul 2026

RSS బ్యాక్‌గ్రౌండ్‌తో విద్యాశాఖ పగ్గాలు

నీట్ పేపర్ లీక్ ఆందోళనలతో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం విద్యాశాఖ అదనపు బాధ్యతలను సీనియర్ బీజేపీ నేత ప్రహ్లాద్ జోషికి అప్పగించారు. విద్యార్థి దశ నుంచే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ భావజాలంతో ప్రజాజీవితాన్ని ప్రారంభించిన జోషి, కార్యకర్త స్థాయి నుంచి కేంద్రమంత్రిగా ఎదిగారు. ప్రస్తుతం వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, తదితర శాఖలను నిర్వహిస్తున్న ఆయనకు విద్యాశాఖ బాధ్యతలు కూడా దక్కాయి. దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనల మధ్య RSS నేపథ్యం ఉన్న నాయకుడికి విద్యాశాఖ బాధ్యతలు అప్పగించడంపై చర్చనీయాంశమైంది.

స్కూటీపై సరదా ప్రయాణం.. క్షణాల్లో విషాదం
Crime· 26 Jul 2026

స్కూటీపై సరదా ప్రయాణం.. క్షణాల్లో విషాదం

TG: హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. క్రికెట్ ఆడేందుకు ముగ్గురు యువకులు ఒకే స్కూటీపై వెళ్తుండగా, వేగంగా వచ్చిన టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహేష్ (17), లక్ష్మీతేజ (17) అక్కడికక్కడే మృతి చెందగా, మరో యువకుడు గాయపడ్డాడు. ప్రమాదం అనంతరం టిప్పర్ డ్రైవర్ వాహనాన్ని అక్కడే వదిలి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని టిప్పర్‌ను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

షాపింగ్ మాల్‌లో భారీ చోరీ
Crime· 26 Jul 2026

షాపింగ్ మాల్‌లో భారీ చోరీ

AP: విజయవాడ వన్‌టౌన్‌లోని పూనమ్ కలెక్షన్స్‌ షాపింగ్ మాల్‌లో రూ.30 లక్షల విలువైన నగదు, బంగారం చోరీ కలకలం రేపింది. పనిలో చేరిన నెలరోజులు కూడా కాకముందే నలుగురు పనివాళ్లు యజమాని నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని ఈ దోపిడీకి పాల్పడ్డారు. దుకాణానికి ఉద్దేశపూర్వకంగా తాళాలు వేయకుండా వదిలేసి, అర్ధరాత్రి లోపలికి ప్రవేశించి రూ.30 లక్షల నగదు, 300 గ్రాముల బంగారం దోచుకెళ్లారు. అనంతరం రాజస్థాన్‌కు పరారైనట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాలతో నిందితుల కోసం గాలిస్తున్నారు.

CM రేవంత్‌ రెడ్డికి MP రఘునందన్ సవాల్
Politics· 26 Jul 2026

CM రేవంత్‌ రెడ్డికి MP రఘునందన్ సవాల్

TG: 'జెన్ జీ' ఆశయాలకు అనుగుణంగా యువత చట్టసభల్లో అడుగుపెట్టడానికి వీలుగా శాసనసభ, లోక్‌సభకు పోటీ చేసే కనీస వయో పరిమితిని 25ఏళ్ల నుంచి 21కి తగ్గించాలని, రాజ్యాంగ సవరణ కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేస్తామని CM రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ MP రఘునందన్‌రావు తీవ్ర విమర్శలు చేశారు. జెన్‌జీకి నిజంగా ప్రాధాన్యం ఇస్తే ముందుగా కాంగ్రెస్‌లోనే ఓ యువ ఎమ్మెల్యేకు విద్యాశాఖ బాధ్యతలు అప్పగించాలని సవాల్‌ విసిరారు. GHMCకి యువ మేయర్‌ను చేయాలని సూచించారు.

CM రేవంత్‌ రెడ్డికి EC నోటీసులివ్వాలి: BJP
Politics· 26 Jul 2026

CM రేవంత్‌ రెడ్డికి EC నోటీసులివ్వాలి: BJP

ఓటరు జాబితాలో పేరు లేకుంటే సంక్షేమ పథకాలు అందవని CM రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై BJP తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ వ్యాఖ్యలతో ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించింది. BJP ఎన్నికల వ్యవహారాల కమిటీ చైర్మన్ మర్రి శశిధర్‌రెడ్డికి, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి పి. సుదర్శన్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందుకు CMకి నోటీసులు జారీ చేయాలని, కేంద్ర ఎన్నికల సంఘం తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.

క్రాకర్స్ షోకు ఊహించని స్పందన
TG· 26 Jul 2026

క్రాకర్స్ షోకు ఊహించని స్పందన

TG: హైదరాబాద్ నెక్లెస్‌ రోడ్‌లో క్రాకర్స్ డీలర్స్ అసోసియేషన్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన భారీ క్రాకర్స్ షో విజయవంతంగా జరిగింది. దేశంలోనే అతిపెద్ద బాణాసంచా ప్రదర్శనను తిలకించేందుకు సుమారు 2లక్షల మంది తరలివచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. రంగురంగుల బాణాసంచా ఆకాశాన్ని అలంకరించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇదే సమయంలో సెక్రటేరియట్ సమీపంలో విద్యార్థులకు మద్దతుగా క్యాండిల్ ర్యాలీ కూడా జరగడంతో నెక్లెస్ రోడ్, ట్యాంక్‌బండ్, ఖైరతాబాద్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్‌ అయింది.

చితి మంటలు ఆరకముందే బూడిదను తవ్విన దుండగులు
TG· 26 Jul 2026

చితి మంటలు ఆరకముందే బూడిదను తవ్విన దుండగులు

TG: జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో అమానుష ఘటన వెలుగుచూసింది. ఓ మహిళ అంత్యక్రియలు ముగిసి కుటుంబసభ్యులు వెళ్లిన వెంటనే ఇద్దరు దుండగులు చితిపై నీళ్లు చల్లి మంటలను ఆర్పి బూడిదను సంచుల్లో నింపి తీసుకెళ్లారు. స్థానికులు గమనించి వెంటపడటంతో వారు బూడిదను వదిలేసి పరారయ్యారు. మహిళలు చనిపోతే ఆనవాయితీగా వారి మెడలో ధరించే నల్లపూసల ఆభరణం నుంచి ఓ బంగారు గుండు తీసి మృతురాలి నోట్లో పెట్టి చితికి నిప్పంటిస్తారు. సుమారు రూ.10వేల విలువైన బంగారు గుండు కోసం చితి బూడిదను తవ్వడం స్థానికులను కలచివేసింది.

పేపర్ లీక్‌లకు శాశ్వత పరిష్కారం కావాలి
Education· 26 Jul 2026

పేపర్ లీక్‌లకు శాశ్వత పరిష్కారం కావాలి

TG: నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంపై TRS చీఫ్ కల్వకుంట్ల కవిత స్పందించారు. మంత్రి రాజీనామా ఒక్కటే పరిష్కారం కాదని ఆమె స్పష్టంచేశారు. పేపర్ లీకేజీలకు శాశ్వత ముగింపు పలకాలంటే విద్యా వ్యవస్థలో సమగ్ర సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులకు నిజమైన న్యాయం జరగాలంటే మొత్తం వ్యవస్థను ప్రక్షాళన చేయాలని సూచించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పారదర్శకమైన పరీక్షల నిర్వహణకు కఠిన చర్యలు, బలమైన సంస్కరణలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని ఆమె కోరారు.

మొదటి విజయమిదే.. ఉద్యమం విరమిస్తున్నాం: CJP
India· 26 Jul 2026

మొదటి విజయమిదే.. ఉద్యమం విరమిస్తున్నాం: CJP

నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై కొనసాగిన ఆందోళనను CJP విరమిస్తున్నట్లు ప్రకటించింది. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో తొలి విజయం సాధించామని తెలిపింది. విద్యార్థులపై నమోదైన కేసులను ఎత్తివేయడానికి కేంద్రం అంగీకరించిందని, నీట్ పేపర్ లీక్ బాధిత కుటుంబాలకు పరిహారం అంశంపైన సానుకూల స్పందన లభించిందన్నారు. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌లతో జరిగిన సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కేసులు ఎత్తివేస్తామని, బాధిత కుటుంబాలకు పరిహారం అందిస్తామని కేంద్రం హామీ ఇచ్చింది.

క్షణాల్లో అగ్నికి ఆహుతైన దుకాణాలు
TG· 26 Jul 2026

క్షణాల్లో అగ్నికి ఆహుతైన దుకాణాలు

TG: నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని పుణ్యక్షేత్రం చెర్వుగట్టు గుట్టకింద అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. బొమ్మల దుకాణంలో మంటలు చెలరేగడంతో 17 దుకాణాలు, 15 తోపుడు బండ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. రెండు గ్యాస్ సిలిండర్లు పేలడంతో మంటలు మరింత ఉద్ధృతమయ్యాయి. గ్రామపంచాయతీ కార్యాలయానికీ మంటలు వ్యాపించి కీలక దస్త్రాలు కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. సుమారు రూ.2.5 కోట్ల ఆస్తినష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు. దుకాణాల్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇక AI సేవలు
Health· 26 Jul 2026

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇక AI సేవలు

AP: ప్రభుత్వ ఆస్పత్రుల్లో కృత్రిమ మేధ (AI) డాక్టర్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు CM చంద్రబాబు ప్రకటించారు. కర్నూలు జిల్లా ఆస్పరిలో సంజీవని పథకాన్ని ప్రారంభించిన ఆయన, ఆగస్టు నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని తెలిపారు. ఏఐ ఆధారిత వైద్యం, టెలిమెడిసిన్, రిమోట్ కేర్, డిజిటల్ హెల్త్ ప్రొఫైల్, అభా హెల్త్ ఐడీలతో వైద్యసేవలను మరింత ఆధునికీకరిస్తామని చెప్పారు. ఆధార్‌తో రాష్ట్రంలోని ఏ ప్రభుత్వ ఆస్పత్రిలోనైనా రోగి ఆరోగ్య వివరాలు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు.

21ఏళ్లు నిండితే ఎన్నికల్లో పోటీ.. CM సంచలన ప్రకటన
TG· 26 Jul 2026

21ఏళ్లు నిండితే ఎన్నికల్లో పోటీ.. CM సంచలన ప్రకటన

TG: 21 ఏళ్లు నిండిన యువతకు MLA, MPగా పోటీ చేసే అవకాశం కల్పించేందుకు రాజ్యాంగ సవరణ కోరుతూ తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేస్తామని CM రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన దాడికి నిరసనగా శనివారం రాత్రి HYDలో నిర్వహించిన సంఘీభావ కొవ్వొత్తుల ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఆగస్టు తొలి వారంలో అసెంబ్లీలో చర్చించి తీర్మానాన్ని కేంద్రానికి పంపనున్నట్లు తెలిపారు. 30 శాతం యువ జనాభాకు అవకాశం దక్కితే దేశ భవిష్యత్ మరింత బలోపేతమవుతుందని, కీలక శాఖల్లో యువత మంత్రులైతే ప్రపంచంతో పోటీ పడగలమన్నారు.

చిత్తూరు జిల్లాలో భారీగా బంగారం నిక్షేపాలు !
AP· 25 Jul 2026

చిత్తూరు జిల్లాలో భారీగా బంగారం నిక్షేపాలు !

చిత్తూరు జిల్లా గుడిపల్లి మండల పరిధిలోని చిగురు గుంట, బి. సానత్తం ప్రాంతాల్లోని మైనింగ్ బ్లాక్ లలో సుమారు 22 లక్షల టన్నుల బంగరం ముడి ఖనిజం ఉన్నట్లు ప్రాధమిక సర్వేల్లో తేలింది. ఇక్కడి ముడిఖనిజాన్ని శుద్ధి చేస్తే సగటున 5.64 గ్రాముల మేలిమి బంగారం దొరికే వీలుంది.ఇది ప్రభుత్వానికి ఆదాయ వనరుగా మారడేమ కాక, స్థానికులకు ఉపాధి కూడా కల్పిస్తుందని అధికారులు అంటున్నారు.దీనిని ఏపీ ఎండీసీకే దక్కేలా చూడాలని చంద్రబాబు ఆదేశించారు.

అవుట్ లుక్ జర్నలిస్టుపై పెల్లెట్ల వర్షం
News· 25 Jul 2026

అవుట్ లుక్ జర్నలిస్టుపై పెల్లెట్ల వర్షం

జంతర్ మంతర్ ప్రొటెస్టులను కవర్ చేయడానికి వెళ్లిన అవుట్ లుక్ జర్నలిస్టు(28) ఒకరు పెల్లెట్ గన్స్ బారిన పడి ఆస్పత్రి పాలయ్యారు. ఆయన ఒంట్లో కనీసం 25 నుంచి 30 పెల్లెట్లు దిగబడ్డాయి. డాక్టర్లు వాటిని సర్జరీ చేసి మాత్రమే తీయగలమని, కానీ బయటకు తీస్తే ఇంకా డేంజర్ అనీ అంటున్నారు. ప్రస్తుతానికి వాటిని అతని బాడీలో అలా ఉండనివ్వడమే బెటర్ అని తేల్చారు.పెల్లెట్ గన్స్ వాడే పర్మిషన్ ఎవరిచ్చారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

స్పెయిన్, ఫ్రాన్స్ లలో  కార్చిచ్చు భీభత్సం !
World· 25 Jul 2026

స్పెయిన్, ఫ్రాన్స్ లలో కార్చిచ్చు భీభత్సం !

ఫ్రాన్స్, స్పెయిన్‌లలో దావానలం బీభత్సం సృష్టిస్తోంది. తీవ్రమైన ఉష్ణోగ్రతలు, వేగంగా వీచే గాలుల వల్ల అడవుల్లో మంటలు అదుపు తప్పి వేగంగా విస్తరిస్తున్నాయి. ప్రమాదం పొంచి ఉండటంతో ఇప్పటివరకు 2,70,000 మందికి పైగా ప్రజలు తమ ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పడానికి రాత్రింబవళ్లు శ్రమిస్తున్నప్పటికీ, అక్కడ పరిస్థితి చాలా తీవ్రంగా, ఆందోళనకరంగా మారింది.

మేం రాజకీయాలకు దూరం- సీజేపీ
News· 25 Jul 2026

మేం రాజకీయాలకు దూరం- సీజేపీ

భవిష్యత్తులో తమ పార్టీ పొలిటికల్ పార్టీగా మారబోదని,తాము రాజకీయాల్లోకి రాం అని సీజేపి నేతలు క్లారిటీ ఇచ్చారు. విద్యార్ధుల హక్కులు, పరీక్షల నిర్వహణలో ట్రాన్స్ పరెన్సీ, విద్యావ్యవస్థలో సంస్కరణలు తేవడం వరకే తమ పాత్ర అని స్పష్టం చేశారు. తమ ఉద్యమానికి ఎన్ని రాజకీయ పార్టీలు మద్దతు పలికినా, తమ ఉద్యమాలెప్పుడూ స్వతంత్రంగానే సాగుతాయని ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు.

కాలం చెల్లినవి వాడకం నైతిక నియమాలకు విరుద్ధం !
News· 25 Jul 2026

కాలం చెల్లినవి వాడకం నైతిక నియమాలకు విరుద్ధం !

ప్రజాస్వామ్యంలో నిరసనకారులపై గడువు ముగిసిన టియర్ గ్యాస్ ప్రయోగించడం తీవ్ర నైతిక ఉల్లంఘన అని 'ది వైర్' పత్రిక కథనం పేర్కొంది. కాలం చెల్లిన రసాయనాలు విషపూరితంగా మారి శ్వాసకోశ, కంటి సమస్యలను కలిగిస్తాయి. ప్రజల హక్కులు పరిరక్షించాల్సిన ప్రభుత్వాలు చట్టాల్లోని లొసుగులను వాడుకుంటూ ఇలాంటి ప్రమాదకర చర్యలకు దిగడం ప్రజాస్వామ్య సూత్రాలకే పెద్ద ముప్పు.

ఢిల్లీలో తెరుచుకున్న మెట్రో స్టేషన్లు !
News· 25 Jul 2026

ఢిల్లీలో తెరుచుకున్న మెట్రో స్టేషన్లు !

జంతర్ మంతర్ నిరసనల కారణంగా మూసేసిన ఢిల్లీ మండి హౌస్, సెంట్రల్ సెక్రటేరియట్, మెట్రో స్టేషన్లు తిరిగి ఓపెన్ అయ్యాయి. భద్రతా కారణాలతో నిర్వాహకులు వాటిని ముసేశారు. అయితే న్యూఢిల్లీ మెట్రో స్టేషన్ ను మాత్రం మళ్లీ ఆదేశాలు వచ్చే వరకూ మూసే ఉంచుతారు. సేఫ్టీ రీజన్స్ వల్ల ఆంక్షలు అమల్లో ఉన్నాయని డీఎం రైల్వే తెలిపింది.

రాజీనామాలు కాదు , సంస్కరణలు కావాలి-వాంగ్చుక్
News· 25 Jul 2026

రాజీనామాలు కాదు , సంస్కరణలు కావాలి-వాంగ్చుక్

కేవలం రాజీనామాలతోనే దేశ నిర్మాణం జరగదని, విద్యా రంగంలో బలమైన సంస్కరణలు అత్యవసరమని సామాజిక వేత్త సోనమ్ వాంగ్చుక్ అన్నారు. 26 రోజుల నిరాహార దీక్ష విరమించిన ఆయన, ప్రజాస్వామ్య పోరాటంలో గెలిచిన యువతకు అభినందనలు తెలిపారు. భయం, అన్యాయం లేకుండా ప్రేమ, నిజాయితీలతో కూడిన పాలన సాగాలని ఆకాంక్షించారు.

కాలం చెల్లిన టియర్ గ్యాస్ షెల్స్ వాడారు !
News· 25 Jul 2026

కాలం చెల్లిన టియర్ గ్యాస్ షెల్స్ వాడారు !

చలో సంసద్ నిరసనల్లో పాల్గొన్న స్టూడెంట్స్ పై పోలీసులు కాలం చెల్లిన టియర్ గ్యాస్ షెల్స్ వాడారనే వార్తలు కలవరపెడుతున్నాయి. శివం పరాసర్ అనే ఇన్ స్టా అక్కౌంట్ హోల్డర్ ఒక వీడియో షేర్ చేస్తూ అక్కడున్న టియర్ గ్యాస్ షెల్ ను చూపించాడు. దానిపై ఆ టియర్ గ్యాస్ షెల్ 2022లో తయారయినదిగానూ, ఎక్స్ పైరీ డేట్ 2025తో ముగిసినట్లుగానూ ఉంది. వాడేసిన టియర్ గ్యాస్ షెల్స్ విడుదల చేసే టాక్సిన్స్ చాలా ప్రమాదకరమని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

కొత్త విద్యా మంత్రిగా ప్రహ్లాద్ జోషీ  !
News· 25 Jul 2026

కొత్త విద్యా మంత్రిగా ప్రహ్లాద్ జోషీ !

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో, కేంద్ర ప్రభుత్వం ప్రహ్లాద్ జోషిని కొత్త విద్యాశాఖ మంత్రిగా నియమించింది. నీట్ పరీక్షల వివాదం, వరుస నిరసనల నేపథ్యంలోనే ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. కీలక సమయంలో విద్యా రంగంలో సంస్కరణలు తేవడం, విద్యార్థుల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ప్రహ్లాద్ జోషికి ఈ ముఖ్యమైన బాధ్యతలను అప్పగించారు.