స్పెయిన్, ఫ్రాన్స్ లలో కార్చిచ్చు భీభత్సం !
ఫ్రాన్స్, స్పెయిన్‌లలో దావానలం బీభత్సం సృష్టిస్తోంది. తీవ్రమైన ఉష్ణోగ్రతలు, వేగంగా వీచే గాలుల వల్ల అడవుల్లో మంటలు అదుపు తప్పి వేగంగా విస్తరిస్తున్నాయి. ప్రమాదం పొంచి ఉండటంతో ఇప్పటివరకు 2,70,000 మందికి పైగా ప్రజలు తమ ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పడానికి రాత్రింబవళ్లు శ్రమిస్తున్నప్పటికీ, అక్కడ పరిస్థితి చాలా తీవ్రంగా, ఆందోళనకరంగా మారింది.


