Latest

ట్రాక్టర్ ఢీకొని ఇద్దరు పిల్లలకు గాయాలు
News· 25 Jul 2026

ట్రాక్టర్ ఢీకొని ఇద్దరు పిల్లలకు గాయాలు

రాజస్థాన్‌లోని ఝలావార్ జిల్లా నయా తలాబ్ రోడ్డుపై ప్రమాదం జరిగింది. భారీ కరెంట్ స్తంభాలతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి పక్కనే ఉన్న దుకాణాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు పిల్లలు గాయపడ్డారు. వాళ్లను వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

పోలీసులపై చర్యలు తీసుకోవాలి: మాయావతి
Politics· 25 Jul 2026

పోలీసులపై చర్యలు తీసుకోవాలి: మాయావతి

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై BSP అధినేత మాయావతి స్పందించారు. దేశవ్యాప్తంగా స్టూడెంట్స్, యూత్ చేసిన ఉద్యమం వల్ల వచ్చిన ఈ నిర్ణయం సరైనదేనని, ఇది ఇంకా ముందే జరిగి ఉండాల్సిందన్నారు. జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా ప్రొటెస్ట్ చేసిన స్టూడెంట్స్‌పై బలప్రయోగం చేసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని, మహిళా నిరసనకారులతో అసభ్యంగా ప్రవర్తించిన పోలీసులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సికింద్రాబాద్ గార్డెన్ రెస్టారెంట్‌లో పరిశుభ్రత లోపాలు
TG· 25 Jul 2026

సికింద్రాబాద్ గార్డెన్ రెస్టారెంట్‌లో పరిశుభ్రత లోపాలు

TG: తెలంగాణ ఫుడ్ సేఫ్టీ ఫ్లయింగ్ స్క్వాడ్ సికింద్రాబాద్‌లోని గార్డెన్ రెస్టారెంట్‌ను చెక్ చేశారు. ఆ రెస్టారెంట్‌లో ఆహార భద్రత, పరిశుభ్రత లోపాలను గుర్తించింది. అపరిశుభ్రమైన వంటశాల, ఈగల బెడద, నిబంధనలకు విరుద్ధంగా ఆహార నిల్వ, పెస్ట్ కంట్రోల్ రికార్డులు లేవని అధికారులు గుర్తించారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ చట్టం–2006 ప్రకారం చర్యలు చేపట్టినట్లు ఫుడ్ సేఫ్టీ శాఖ తెలిపింది.

CJP దేశవ్యాప్త నిరసనలు బంద్..
Politics· 25 Jul 2026

CJP దేశవ్యాప్త నిరసనలు బంద్..

కాక్రోచ్ జనతా పార్టీ (CJP) తమ దేశవ్యాప్త నిరసనలను వెంటనే విరమిస్తున్నట్లు ప్రకటించింది. NEET పేపర్ లీక్ ఆత్మహత్యల బాధితుల కుటుంబాలకు అత్యధిక పరిహారం, విద్యార్థులపై ఫైల్ అయిన FIRల రద్దుతో పాటు భవిష్యత్తులో ఎలాంటి చర్యలు ఉండవని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అలాగే CJP ప్రతిపాదించిన 5 పాయింట్ల ఎగ్జామ్ రిఫార్మ్స్ చార్టర్‌ను పరిశీలించేందుకు ప్రభుత్వం అంగీకరించడంతో స్టూడెంట్స్ తమ ఆందోళనలను ముగించారు.

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా..చర్చలోకి రాజ్‌నాథ్ వ్యాఖ్యలు
Viral· 25 Jul 2026

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా..చర్చలోకి రాజ్‌నాథ్ వ్యాఖ్యలు

'ఇది UPA ప్రభుత్వం కాదు. ఇది NDA ప్రభుత్వం. మేము రాజీనామాలు చేయము' అని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గతంలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఎన్డీఏ ప్రభుత్వంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రాజ్‌నాథ్ సింగ్ చేసిన అప్పటి వ్యాఖ్యలకు ప్రస్తుతం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు మధ్య పోలికలు చూపుతూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

మంత్రి రాజీనామా.. అభిజీత్ రియాక్షన్ ఇదే!
Politics· 25 Jul 2026

మంత్రి రాజీనామా.. అభిజీత్ రియాక్షన్ ఇదే!

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో CJP నేత అభిజీత్ దీప్కే జంతర్ మంతర్ స్టేజ్ ముందు సంబరాలు చేసుకున్నారు. "DEMOCRACY WINS" అంటూ నిరసనకారులతో కలిసి విజయోత్సవ నినాదాలు చేశారు. పేపర్ లీక్స్ వివాదంలో విద్యార్థుల సుదీర్ఘ పోరాటానికి, ప్రజాస్వామ్యానికి ఇది దక్కిన విజయమని ఆయన ప్రకటించారు. ఫ్లెక్సీ పై ఆత్మహత్య చేసుకున్న స్టూడెంట్స్ ఫోటోలు ప్రదర్శిస్తూ విద్యావ్యవస్థలో మార్పు వచ్చే వరకు పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు.

కేసులు రద్దు.. జేపీ నడ్డా బిగ్ అనౌన్స్‌మెంట్!
Politics· 25 Jul 2026

కేసులు రద్దు.. జేపీ నడ్డా బిగ్ అనౌన్స్‌మెంట్!

కేంద్ర మంత్రులతో CJP స్పోక్స్ పర్సన్స్ భేటీ సక్సెస్ ఫుల్‌గా ముగిసింది. ఢిల్లీతో పాటు అన్ని రాష్ట్రాల్లో స్టూడెంట్స్‌పై ఫైల్ అయిన కేసులన్నింటినీ ఎత్తివేస్తామని కేంద్ర మంత్రి జేపీ నడ్డా హామీ ఇచ్చారు. భవిష్యత్తులో కేసుల పేరుతో స్టూడెంట్స్‌ని వేధించమని స్పష్టం చేశారు. అలాగే విద్యాశాఖలో త్వరలోనే కీలక మార్పులు తీసుకొస్తామని విద్యార్థి నేతలకు హామీ ఇచ్చారు

మూల్యం ఎవరు చెల్లిస్తారు?: కపిల్ సిబల్
Politics· 25 Jul 2026

మూల్యం ఎవరు చెల్లిస్తారు?: కపిల్ సిబల్

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ స్పందించారు. "ప్రధాన్ రాజీనామా చేశారు. కానీ దానికి ఎంత మూల్యం చెల్లించాల్సి వచ్చింది?" అంటూ ప్రశ్నించారు. శాంతియుతంగా ప్రొటెస్ట్ చేసిన స్టూడెంట్స్‌పై లాఠీచార్జ్ జరిగిందని, చాలామంది గాయపడ్డారని, కొందరి కళ్లలో పెలెట్స్ దిగాయని, 23 రోజుల పాటు నిరాహార దీక్షలు చేశారని గుర్తుచేశారు. ఈ మూల్యం ఎవరు చెల్లిస్తారు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

యువత ప్రభుత్వాన్ని మోకరిల్లేలా చేయగలరు: నటుడు ప్రకాష్ రాజ్
Viral· 25 Jul 2026

యువత ప్రభుత్వాన్ని మోకరిల్లేలా చేయగలరు: నటుడు ప్రకాష్ రాజ్

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై నటుడు ప్రకాశ్ రాజ్ సోషల్ మీడియా 'ఎక్స్'లో స్పందించారు. 'నా ప్రియమైన కాక్రోచ్‌స్. ప్రియమైన సోనమ్ వాంగ్‌చుక్‌కి, యువతకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ అభినందనలు. మీరు ఒక ప్రభుత్వాన్ని మోకరిల్లేలా చేయగలరని నిరూపించారు' అంటూ ఆయన పోస్టు చేశారు.

హవ్వ..ధర్మేంద్ర ప్రధాన్‌కు అమిత్ షా ప్రశంసలు!
Politics· 25 Jul 2026

హవ్వ..ధర్మేంద్ర ప్రధాన్‌కు అమిత్ షా ప్రశంసలు!

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నేపథ్యంలో దేశవ్యాప్తంగా సీజేపీ అభిమానులు, మద్దతుదారులు సంతోషంగా ఉండగా, మరోవైపు ధర్మేంద్ర ప్రధాన్‌కు ప్రశంసలు కురిపిస్తున్నారు బీజేపీ నేతలు. దేశ విద్యా వ్యవస్థలో ధర్మేంద్ర ప్రధాన్ చేసిన సేవలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రశంసించారు. విద్యారంగంలో అనేక మార్పులు, సంస్కరణలు తీసుకువచ్చారని అన్నారు.

ఆందోళన విరమించిన సీజేపీ
Politics· 25 Jul 2026

ఆందోళన విరమించిన సీజేపీ

కేంద్ర మంత్రులు జితేంద్ర సింగ్, జేపీ నడ్డాలతో సీజేపీ లీడర్లు జరిపిన చర్చలు ఫలించాయి. ప్రభుత్వం ఒప్పందాలను నిర్ణీత సమయంలోగా అమలు చేస్తుందనే నమ్మకంతో ఆందోళన విరమిస్తున్నట్లు సీజేపీ నేత సౌరవ్ దాస్ ప్రకటించారు. ఇరువర్గాల మధ్య పరస్పర ఒప్పందం కుదరింది.

Lavender Marriage అంటే ఏంటి?
General· 25 Jul 2026

Lavender Marriage అంటే ఏంటి?

లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్ తెలుసు.. మరి Lavender Marriage అంటే ఏంటో తెలుసా? లవ్ లేదా ఫిజికల్ అట్రాక్షన్ కంటే ఫ్యామిలీ ప్రెజర్, సమాజం లేదా ప్రైవసీ కోసం పరస్పర అంగీకారంతో చేసుకునే పెళ్లి. గతంలో LGBTQ+ వ్యక్తులు తమ సెక్సువల్ ఐడెంటిటీని దాచుకోవడానికి ఇలాంటి మ్యారేజ్‌లను ఎంచుకునేవారు. ఇప్పుడు ఫ్యామిలీ ప్రెజర్, కెరీర్, పర్సనల్ రీజన్స్ వల్ల కూడా కొందరు ఈ నిర్ణయం తీసుకుంటున్నారు. ఇవి కూడా చట్టపరంగా సాధారణ మ్యారేజ్‌లాగే చెల్లుబాటు అవుతాయి.

విద్యార్థులు సాధించిన గొప్ప విజయం: మహేష్ కుమార్ గౌడ్
TG· 25 Jul 2026

విద్యార్థులు సాధించిన గొప్ప విజయం: మహేష్ కుమార్ గౌడ్

TG: సెంట్రల్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం విద్యార్థులు సాధించిన గొప్ప విజయమని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీతోపాటు ఇతర విపక్షాలు చేసిన పోరాటం ఫలితంగానే ఆయన రాజీనామా చేశారని గౌడ్ అన్నారు.

ఇంకా 2 డిమాండ్లు మిగిలే ఉన్నాయి- రాహుల్ గాంధీ
Politics· 25 Jul 2026

ఇంకా 2 డిమాండ్లు మిగిలే ఉన్నాయి- రాహుల్ గాంధీ

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై రాహుల్ గాంధీ స్పందిస్తూ.. విద్యార్థులందరికీ కంగ్రాట్స్ చెప్పారు. అయితే తమ పోరాటంలో ఇంకా రెండు డిమాండ్లు పెండింగ్‌లో ఉన్నాయని స్పష్టం చేశారు. విద్యార్థులకు ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలని, విద్యార్థులపై హింసకు పాల్పడిన వారిపై యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగబద్ధంగా పోరాడి భయాన్ని వీడాలని, ఈ ప్రభుత్వాన్ని సాగనంపే టైమ్ వచ్చిందని రాహుల్ పిలుపునిచ్చారు.

ఫుడ్ కూడా ఆపేస్తున్నారా? : రానా అయ్యూబ్
Politics· 25 Jul 2026

ఫుడ్ కూడా ఆపేస్తున్నారా? : రానా అయ్యూబ్

జర్నలిస్ట్ రానా అయ్యూబ్ జంతర్ మంతర్‌లో జరుగుతున్న CJP ఉద్యమంపై స్పందించారు. కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న కొన్ని న్యూస్ ఛానళ్లు ‘పాకిస్థాన్, చైనా నుంచి ఫుడ్ వస్తోంది’ అంటూ ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. మరోవైపు నిరసనకారుల కోసం వస్తున్న ఫుడ్ ప్యాకెట్లను దిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారని విమర్శించారు. ‘ఇది చాలా బాధాకరం’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

యువతను ఎవరూ ఆపలేరు: ప్రియాంక గాంధీ
Politics· 25 Jul 2026

యువతను ఎవరూ ఆపలేరు: ప్రియాంక గాంధీ

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా స్పందించారు. "దేశ యువత ఇప్పుడు మాట్లాడింది.. ఇక వాళ్ల గొంతును ఎవరూ అణిచివేయలేరు. ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే" అంటూ ప్రియాంక వ్యాఖ్యానించారు. NEET-UG పేపర్ లీక్, ఎగ్జామ్ రిఫార్మ్స్ కోసం రాహుల్ గాంధీ రెండేళ్లుగా నిరంతరం పోరాడుతున్నారని, అదే సీజేపీకి స్ఫూర్తిగా మారిందన్నారు. స్టూడెంట్స్ రైట్స్ కోసం కాంగ్రెస్, NSUI, యూత్ కాంగ్రెస్ కలిసి దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని నిర్మించాయని చెప్పారు.

కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవి ఆయనకేనా!
Politics· 25 Jul 2026

కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవి ఆయనకేనా!

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవి ఎవరిని వరిస్తుందనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. కేంద్ర నాయకత్వం నుంచి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండేలకు దిల్లీ నుంచి ఆహ్వానం అందినట్లు సమాచారం. ఫడ్నవిస్‌కు కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవి దక్కే అవకాశముందని, మహారాష్ట్రలో ముఖ్యమంత్రి మార్పు కూడా ఉండొచ్చని శివసేన(ఉద్ధవ్ ఠాక్రే వర్గం) నేత సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు.

E20 ఇథనాల్‌పై ఆగస్టు 4న రవాణాదారుల నిరసన
Politics· 25 Jul 2026

E20 ఇథనాల్‌పై ఆగస్టు 4న రవాణాదారుల నిరసన

సీజేపీ నిరసనలకు ఫలితం దక్కిన వేళ..దిల్లీ టాక్సీ, ట్రాన్స్‌పోర్టర్స్, టూర్ ఆపరేటర్ల సంఘాల నిరసనలు మొదలుకానున్నాయి. ఇథనాల్ కలిపిన పెట్రోల్ వినియోగాన్ని వ్యతిరేకిస్తూ ఆగస్టు 4న పార్లమెంటు వరకు పాదయాత్ర చేయనున్నట్లు ప్రకటించాయి. E20 ఇంధనం వల్ల మైలేజీ తగ్గడం, ఇంజిన్ పనితీరు దెబ్బతినడం, మెయింటెనెన్స్ ఖర్చులు పెరగడంపై వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. ఒకవైపు పెట్రోల్ ధరలు పెంచుతూ,మరోవైపు ఇథనాల్ కలిపిన ఇంధనాన్ని ఎందుకు ఇస్తున్నారంటూ రవాణాదారులు ఆవేదన చెందుతున్నారు

కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా: దిల్లీలో వేడెక్కిన రాజకీయం
Politics· 25 Jul 2026

కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా: దిల్లీలో వేడెక్కిన రాజకీయం

కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో దిల్లీ రాజకీయాల్లో పరిణామాలు మారనున్నాయి. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండేకు దిల్లీ పెద్దల నుంచి పిలుపు వచ్చినట్లు సమాచారం. మరో గంటలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ దిల్లీకి చేరుకోనున్నారు. నేతలకు వరుసగా దిల్లీ నుంచి పిలుపులు రావడంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ భేటీల అనంతరం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Gen Z పవర్.. జంతర్ మంతర్ లో వేడుకల హోరు!
Politics· 25 Jul 2026

Gen Z పవర్.. జంతర్ మంతర్ లో వేడుకల హోరు!

కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా వార్తతో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులు భారీగా వేడుకలు జరుపుకున్నారు. వేలాది మంది Gen Z విద్యార్థులు ఒకచోట చేరి డాన్సులు చేస్తూ, జాతీయ జెండాలు ఊపుతూ తమ సంతోషాన్ని పంచుకున్నారు. సుదీర్ఘ పోరాటం తర్వాత లభించిన ఈ విజయాన్ని స్టూడెంట్స్ పండగలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

ధర్మేంద్ర ప్రధాన్..గతంలోనూ వివిధ శాఖలు
Politics· 25 Jul 2026

ధర్మేంద్ర ప్రధాన్..గతంలోనూ వివిధ శాఖలు

విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసిన ధర్మేంద్ర ప్రధాన్ గతంలో కేంద్రంలో వివిధ మంత్రిత్వ శాఖల్లో పనిచేశారు. పెట్రోలియం శాఖ, ఉక్కు శాఖ, నైపుణ్యాభివృద్ధి శాఖలకు మంత్రిగా ఉన్నారు. 2021 నుండి ఎడ్యుకేషన్ మినిస్టర్‌గా బాధ్యతలు చేపట్టి ఎన్టీఏ(NTA) మార్పులపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలో నీట్ పరీక్షల ఏర్పాట్లపై వచ్చిన ఆరోపణలు ఆయన కెరీర్‌కు మచ్చగా మారాయి. తాజాగా ఆయన చేత రాజీనామా చేయించి సీజేపీ తన పోరాటానికి విజయాన్ని సాధించింది.