కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా: దిల్లీలో వేడెక్కిన రాజకీయం

కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో దిల్లీ రాజకీయాల్లో పరిణామాలు మారనున్నాయి. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండేకు దిల్లీ పెద్దల నుంచి పిలుపు వచ్చినట్లు సమాచారం. మరో గంటలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ దిల్లీకి చేరుకోనున్నారు. నేతలకు వరుసగా దిల్లీ నుంచి పిలుపులు రావడంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ భేటీల అనంతరం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.



