Latest

ఎంబీబీస్ చేయాలనుకునేవారికి గుడ్‌న్యూస్
TG: తెలంగాణలో ఎంబీబీస్ కోర్సులో చేరాలనుకునే విద్యార్థులకు నేషనల్ మెడికల్ కమిషన్ శుభవార్త చెప్పింది. బుధవారం ఎంబీబీస్ సీట్లకు సంబంధించి ఎన్‌ఎంసి నోటిఫికేషన్ విడుదల చేసింది. 2026-2027 విద్యా సంవత్సరానికి గానూ తెలంగాణలో ఏకంగా 810 ఎంబీబీస్ సీట్లను పెంచింది. అందులో ప్రభుత్వ మెడికల్ కాలేజీకు 110, ప్రైవేట్ కాలేజీలకు 600, డీమ్డ్ మెడికల్ యూనివర్సిటీలకు 100 సీట్లు అదనంగా కేటాయించింది. గత విద్యా సంవత్సరానికి రాష్ట్రంలో 8,840 ఎంబీబీస్ సీట్లు ఉండగా, పెరిగిన సీట్లతో మొత్తం 9,650కు చేరుకున్నాయి.

'జననాయగన్' రాక కన్ఫర్మ్!
గత సంక్రాంతికే రిలీజ్ కావాల్సిన తమిళనాడు సీఎం విజయ్ ‘జననాయగన్’ మూవీ సెన్సార్ సమస్య కారణంగా వాయిదా పడింది. మొత్తానికి సెన్సార్ పూర్తి చేసుకొని ఈనెల 23న విడుదలవుతున్నట్లు మూవీ టీం కన్ఫర్మ్ చేసింది. చిత్రబృందం ఇన్‌స్టాలో ఆఫిషియల్‌గా ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ న్యూస్‌తో తలపతి అభిమానుల్లో సందడి మొదలైంది.
గురుకులంలో నీటి కష్టాలు
TG: మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం గాంధీనగర్‌లోని సోషల్ వెల్ఫేర్ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినులు నీటి సమస్య తీర్చాలంటూ ధర్నా చేశారు. గత నెల రోజులుగా నీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం బాత్రూంలో శుభ్రం చేయడానికి కూడా నీరు లేక గురుకుల పాఠశాల సిబ్బంది తమను ఇబ్బంది పెడుతున్నారన్నారు. పది పది రూపాయలు చెల్లిస్తేనే రిపేర్ చేపిస్తామని HM చెప్పినట్లు వారు వాపోయారు. వెంటనే నీటి సమస్యను పరిష్కరించాలని రోడ్డుపై భైఠాయించి నిరసన తెలిపారు.

మళ్లీ తగ్గిన బంగారం రేట్
బంగారం రేట్ మరోసారి తగ్గింది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,43,290గా ఉంది. 22 క్యారెట్ల ధర రూ.1,31,350కి చేరింది. గ్లోబల్ మార్కెట్‌లో వచ్చిన మార్పులు, డాలర్ బలపడటం వల్ల గోల్డ్ రేట్స్ తగ్గాయని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. గోల్డ్ కొనాలనుకునేవారికి కాస్త రిలీఫ్ దొరికింది. మరోవైపు వెండి రేటు మాత్రం పెద్దగా మారలేదు. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.2.40 లక్షలుగా కొనసాగుతోంది.

వారం రోజులు..నో రెయిన్స్
TG: తెలంగాణలో వచ్చే వారం రోజుల పాటు పెద్దగా వర్షాలు పడే ఛాన్స్ లేదని వాతావరణశాఖ తెలిపింది. ఎల్‌నినో ఎఫెక్ట్, వాతావరణంలో మార్పుల వల్ల వర్షాలు తగ్గే అవకాశం ఉందని చెప్పింది. రాష్ట్రంలో ఎండలు మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో చాలామంది ఏసీలు, కూలర్లు వాడడం మొదలుపెట్టారు. అయితే..ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు.

రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్
టికెట్ బుకింగ్‌ను మరింత తేలిక చేస్తూ IRCTC వెబ్‌సైట్ కొత్త ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇకపై టికెట్ బుక్ చేసేటప్పుడు చిరాకు తెప్పించే యాడ్స్, పాప్-అప్ యాడ్స్ ఉండవు. దీనివల్ల తత్కాల్ టికెట్లను చాలా వేగంగా బుక్ చేసుకోవచ్చు. అన్ని క్లాసెస్ సీట్ల వివరాలు ఒకే స్క్రీన్‌పై కనిపిస్తాయి. రెగ్యులర్ ప్రయాణికుల వివరాలు ఆటోమేటిక్‌గా సేవ్ అవుతాయి. నిమిషానికి 1.5 లక్షల టికెట్లు బుక్ చేసేలా కెపాసిటీ పెంచారు. ఈ కొత్త బీటా వెర్షన్ లింక్ ప్రస్తుత IRCTC వెబ్‌సైట్‌లో ఉంది.

ట్రీట్‌మెంట్ అంటూ..మెడ కొరికిన డాక్టర్
TG: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన ఆరు నెలల గర్భిణికి ముఖం, మెడ మీద వాపు రావడంతో లోకల్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. అతను ట్రీట్‌మెంట్ పేరుతో ఆమె మెడను పళ్లతో దారుణంగా కొరికేశాడు. దీంతో ఆమె కండిషన్ క్రిటికల్ అయ్యింది. ఊపిరి కూడా తీసుకోలేని పరిస్థితిలో భద్రాచలం గవర్నమెంట్ హాస్పిటల్‌కు షిఫ్ట్ చేశారు. అక్కడి డాక్టర్స్ ఏమాత్రం లేట్ చేయకుండా వెంటిలేటర్‌పై ఉంచి, అడ్వాన్స్‌డ్ ట్రీట్‌మెంట్‌తో ఆమె ప్రాణాలు కాపాడారు.

జులై 20న ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్
ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ ఫీవర్ స్టార్ట్ అయింది. జూలై 20న న్యూజెర్సీ వేదికగా జరిగే ఈ మెగా క్లాష్‌లో లియోనెల్ మెస్సీ కెప్టెన్సీలోని అర్జెంటీనా, డిఫెన్స్‌తో దూసుకెళ్తున్న స్పెయిన్‌తో తలపడనుంది. సెమీస్‌లో ఫ్రాన్స్‌కు స్పెయిన్ చెక్ పెట్టగా ఇంగ్లాండ్‌పై 2-1 తేడాతో గెలిచి అర్జెంటీనా ఫైనల్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మ్యాచ్ గెలిస్తే బ్రెజిల్(1958, 1962) తర్వాత వరుసగా రెండు వరల్డ్ కప్‌లు కొట్టిన టీమ్‌గా అర్జెంటీనా హిస్టరీ క్రియేట్ చేస్తుంది. ఇది వాళ్ళ నాలుగో టైటిల్ అవుతుంది.
19వ రోజుకు చేరిన సోనమ్ వాంగ్‌చుక్ హంగర్ స్ట్రైక్
సామాజికవేత్త సోనమ్ వాంగ్‌చుక్ చేస్తున్న హంగర్ స్ట్రైక్ 19వ రోజుకు చేరింది. ఆయన దాదాపు 9 కిలోలు బరువు తగ్గారు. ప్రస్తుతం ఆయన బీపీ, షుగర్ లెవల్స్ పడిపోయాయని డాకర్లు తెలిపారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆరోగ్యానికి రిస్క్ పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. అయితే ఇప్పుడే హంగర్ స్ట్రైక్ ఆపనని వాంగ్‌చుక్ చెప్పారు. ఇంకా 2–4 రోజుల్లో చనిపోయే పరిస్థితి లేదని, తన కోసం టెన్షన్ పడొద్దని వీడియో రిలీజ్ చేశారు.

విద్యార్థి డైరీలో మత ప్రార్థనలు
TG: హైదరాబాద్ నగరంలోని సైదాబాద్ పరిధిలో ఉన్న సక్సెస్ స్కూల్ 2వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థికి కల్మా చదువుకుని రావాలని ఓ టీచర్ హోమ్ వర్క్ ఇచ్చింది. ఇది మాత్రమే కాకుండా మరికొన్ని మత ప్రార్థనలను కూడా నేర్చుకుని రావాలని విద్యార్థి డైరీలో రాసి పంపించింది. అయితే ఆ డైరీ చూసిన విద్యార్థి పేరెంట్స్ నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిన్న వయసులోనే విద్యార్థులపై మతపరమైన అంశాలను రుద్దే ప్రయత్నం చేయడం సరికాదని, అసలు హిందూ బాలుడికి కల్మా చదవాలని ఎలా నేర్పిస్తారని ఫైరయ్యారు. కల్మా హోమ్‌వర్క్ చేయాలని ఒత్తిడి చేసిన టీచర్‌ను వెంటనే తొలగించాలని ABVP నాయకులు డిమాండ్ చేశారు.

యువకుడు దారుణ హత్య
AP: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని మూలపేట గ్రామంలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పెదపూడి మండలం రామేశ్వరం గ్రామానికి చెందిన రాకేష్(28) తన అమ్మమ్మ అంత్యక్రియలకు మూలపేటకు వచ్చాడు. ఓ దుకాణం వద్ద రాకేష్ చెల్లితో కొందరు యువకులు అసభ్యకరంగా ప్రవర్తించారు. తన చెల్లిపై ఎందుకు కామెంట్ చేశారని రాకేష్ నిలదీయడంతో ఘర్షణ జరిగింది. అమ్మమ్మ ఖననం కోసం స్మశాన వాటికకు వెళ్లిన రాకేష్‌పై వంశీ అనే యువకుడు, మరో నలుగురు చాకులతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన రాకేష్‌ను పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందాడు.

మాజీ మంత్రిపై కేసు నమోదు
AP: కాకినాడ జిల్లా కిర్లంపూడిలో నిన్న ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. ముద్రగడ కుటుంబ సభ్యులు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడాన్ని తిరస్కరించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకుంది. అంత్యక్రియల సమయంలో గార్డ్ ఆఫ్ హానర్ నిర్వహించే క్రమంలో అంబటి రాంబాబు, YCP నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆందోళన చేశారు. తమ విధులకు ఆటకం కలిగించారని, తమను నెట్టివేశారని పోలీసులు ఫిర్యాదు చేయడంతో FIR నమోదైంది.

డ్రగ్స్ కేసులో MLC కొడుకు అరెస్ట్
TG: MLC, BRS పార్టీ నేత కుమారుడు భరత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ మంగళ్‌హాట్‌లో నిన్న రాత్రి డ్రగ్స్ తీసుకుంటుండగా భరత్ సహా మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల తాండూరు మాజీ MLA పైలట్ రోహిత్ రెడ్డి ఏకంగా డ్రగ్స్ పార్టీ నిర్వహించడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు ఎంపీ, టీడీపీ నేత సహా పలువురు ప్రముఖులు పట్టుబడ్డ విషయం తెలిసిందే. తాజా ఘటనతో మరోసారి డ్రగ్స్ కేసు చర్చనీయాంశమైంది.

BCల జోలికొస్తే తరిమికొడతాం
TG: యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు సభ్యురాలు పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్‌పై యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివచరణ్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫైరయ్యారు. హైదరాబాద్‌లోని LBనగర్ చింతలకుంటలో ఆమె నివాసానికి వెళ్లి ఈశ్వరమ్మకు సంఘీభావం తెలిపారు. అగ్రకుల అహంకారంతో నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. ఈశ్వరమ్మ ఒంటరిది కాదని, ఆమె వెంట BC, SC, ST, మైనార్టీలు అంతా ఉన్నారన్నారు. BC బిడ్డల జోలికొస్తే తరిమికొడతామని హెచ్చరించారు.

పోక్సో కేసులో కోర్ట్ సంచలన తీర్పు
TG: జగిత్యాల జిల్లా మెట్‌పల్లి PS పరిధిలో బాలికపై సామూహిక లైంగికదాడికి పాల్పడిన ఘటనలో ఐదుగురికి జగిత్యాల ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్ట్ జీవితఖైదు శిక్షను విధిస్తూ తీర్పునిచ్చింది. నిందితులు రాజేశ్(22), సాయికుమార్ (21), అనిల్ (19), శివ (19), వెంకటేశ్(22)లపై 2020 అక్టోబర్‌లో మెట్‌పల్లి PSలో పోక్సో కేసు నమోదు అయింది. కేసులో ఆధారాలు, సాక్ష్యాలను పరిశీలించిన కోర్టు ఐదుగురు నిందితులకు జీవిత ఖైదుతోపాటు ఒక్కొక్కరికి రూ.20 వేలు జరిమానా, బాధిత బాలికకు రూ.12 లక్షల పరిహారం చెల్లించాలని తీర్పునిచ్చింది.

అమెరికాలో AP యువతి మృతి
AP: పల్నాడు జిల్లాకు చెందిన మక్కెన ప్రసన్న (27) అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన కారు ప్రమాదంలో మృతి చెందింది. వినుకొండ మండలం ఉమ్మడివరం గ్రామానికి చెందిన మక్కెన వెంకటేశ్వర్లు, గోవిందమ్మల పెద్ద కుమార్తె ప్రసన్న 2022లో ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లింది. ఆమె ఇటీవలే MS పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉంది. న్యూజెర్సీలో తన ముగ్గురు స్నేహితులతో కలిసి కారులో వెళ్తుండగా వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో ప్రసన్న స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోగా, ఆమె స్నేహితులకు తీవ్ర గాయాలయ్యాయి.

యువ సంగ్రామ సభను సక్సెస్ చేయాలి
TG: నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. జూలై 18వ తేదీన BRS పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ స్టేడియంలో నిర్వహించనున్న యువ సంగ్రామ సభ ఏర్పాట్లను వారు పరిశీలించారు. అధికారంలోకి రాగానే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం, నిరుద్యోగ సమస్యలను విస్మరించిందన్నారు. నిరుద్యోగ యువత గొంతుకను ప్రభుత్వానికి బలంగా వినిపించేలా యువ సంగ్రామ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

అమెరికాలో తెలుగు యువకుడు మృతి
AP: విజయవాడకు చెందిన గడ్డం మణిచంద్ర తేజ (28) అమెరికాలో మృతి చెందాడు. హైదరాబాద్‌లోని ఇక్ఫాయ్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ పూర్తి చేసిన చంద్రతేజ 2022లో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీలో కోర్సు పూర్తయిన అనంతరం బోస్టన్‌లోని ఓ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. మసాచుసెట్స్ రాష్ట్రంలోని ఆరెంజ్ నగరంలో స్కైడైవింగ్ కోసం వెళ్లారు. గాల్లో ఎగిరిన తర్వాత పారాచూట్ కిందకు దిగే సమయంలో గాలి తీవ్రంగా వీయడంతో 30 అడుగుల ఎత్తు నుంచి కింద పడ్డాడు. తీవ్ర గాయాలైన అతడిని హాస్పిటల్‌కు తరలించేలోగా చనిపోయాడు.

429 ఎకరాల ప్రభుత్వ భూమి మాయం
TG: ధరణి పోర్టల్‌లో సాఫ్ట్‌వేర్ లొసుగులను ఆసరాగా చేసుకుని యాజమాన్య హక్కులు మార్చినట్లు ఫోరెన్సిక్ అధికారులు గుర్తించారు. మెదక్ జిల్లా శివ్వంపేట మండలం సికింద్లాపూర్‌లో 429ఎకరాల ఇనాం భూములను మాయం చేశారు. ఈ భూములపై పలువురు తమకు హక్కులు ఉన్నాయని రెవెన్యూ అధికారులకు దరఖాస్తులు చేసుకోవడం, కోర్టులో కేసులు వేశారు. అదే అదనుగా కొందరు మెదక్ జిల్లాలో పనిచేసిన కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, RDOలు, తహీసీల్దార్‌లతో కుమ్మక్కై ఈ భూములను పంపిణీ చేసినట్లు ప్రభుత్వం గుర్తించింది. బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు సిట్ ఏర్పాటుచేయాలని ఆదేశించింది.

విద్యుత్ ఉద్యోగుల మహా ధర్నా
AP: ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు తిరుపతిలోని APSPDCL కార్యాలయం ముందు మహా ధర్నా నిర్వహించారు. రెగ్యులరైజేషన్, పాత పెన్షన్ విధానం అమలు, PRC ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల మేరకు విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసి వారికి రూ.48 వేల వేతనాన్ని ఇవ్వాలని కోరారు. విధి నిర్వహణలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు రూ. 1 కోటి పరిహారం చెల్లించాలని కోరారు.

ముందుచూపు లేకపోతే నష్టమే
AP: రాష్ట్రంలో వాగులు, వంకలు, నీటి ఊటలు అడుగంటిపోయాయని, శ్రీశైలం, నాగార్జునసాగర్‌లకు కృష్ణా నది నుంచి నీటి ప్రవాహం తగ్గిందని CM చంద్రబాబు అన్నారు. NTR జిల్లా ఇబ్రహీంపట్నంలోని పవిత్ర సంగమం వద్ద ఆయన జల హారతి ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం లేకపోవడంతో రైతులు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసుకోవాలని సూచించారు. రిజర్వాయర్లలో నీళ్లు ఉన్నాయని ముందుచూపు లేకుండా పంటలు వేస్తే మొదటికే మోసం వస్తుందన్నారు. రైతులు ఈ ఏడాది ఆరుతడి పంటలు సాగు చేయాలని సూచించారు.