Latest

హిందూ మతంలో విమర్శకు చోటుంది: ‘విజయవిహారం’ రమణమూర్తి
TG: హిందూ మతంలో విమర్శకు చోటు ఉంది కానీ, దుర్భాషలకు చోటు లేదని ‘విజయవిహారం’ రమణమూర్తి అన్నారు. ఆయనపై హిందూత్వ ఉన్మాది దాడిని ఖండిస్తూ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ మీటింగ్ నిర్వహించారు. ఇందులో ఆయన మాట్లాడుతూ ఎవరు ఎవరిపైనా దాడి చేయకూడదని కోరారు. మతోన్మాదాన్ని నిర్మూలించాలంటే మామూలు చర్చలు సరిపోవని, మతపెద్దల దగ్గరకు వెళ్ళి సంస్కరణపై చర్చించాలన్నారు.
ట్యాంకర్లతో వరి నారుకు నీరు
TG: ఎల్‌నినో ఎఫెక్ట్, రాష్ట్రంలో ఎండలు దంచికొడుతుండడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ట్యాంకర్ల ద్వారా నీరు తెచ్చి పంటలను కాపాడుకుంటున్నారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గంధంపల్లి గ్రామంలో రైతు బాలకృష్ణ తన వరి నారును బతికించడం కోసం ట్యాంకర్లతో పారిస్తున్నాడు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురవకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాటేందుకు సిద్ధం చేసిన వరి నారు ఎండిపోకుండా ఉండేందుకు ట్యాంకర్ల ద్వారా నీటిని తరలించి పోస్తూ పంటను కాపాడుకునేందుకు శ్రమిస్తున్నారు.

అప్పుడు రంగరాజన్‌పై..ఇప్పుడు నాపై: ‘విజయవిహారం’ రమణమూర్తి
TG: చిలుకూరి బాలాజీ ఆలయ ప్రధాన పూజారి రంగరాజన్‌పై దాడి చేసినప్పుడు, దాన్ని ఖండిస్తూ ఇక్కడికి వచ్చాననని..ఇవాళ తనపై జరిగిన దాడికి ఖండన తెలుపుతున్నారని ‘విజయవిహారం’ రమణమూర్తి తెలిపారు. ఆయనపై హిందూత్వ ఉన్మాది దాడిని ఖండిస్తూ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సభ నిర్వహించారు. ఇందులో ఆయన మాట్లాడుతూ లక్షలాది మంది చూస్తున్న లైవ్ ప్రోగ్రాంలో ఇలా దాడి చేసే ధైర్యం ఎక్కడి నుండి వచ్చిందో గమనించాలని అన్నారు.
సోనమ్ వాంగ్చుక్‌కు సపోర్ట్‌గా అతుల్ కుల్కర్ణి దీక్ష!
ఫేమస్ యాక్టర్ అతుల్ కుల్కర్ణి సోనమ్ వాంగ్చుక్ పోరాటానికి మద్దతుగా జూలై 16న తన నివాసంలోనే ఒకరోజు నిరాహార దీక్ష చేస్తున్నట్లు వీడియో ద్వారా అనౌన్స్ చేశారు. వాంగ్చుక్ పడుతున్న బాధను పంచుకోవడంతో పాటు, కేంద్ర ప్రభుత్వం తన సున్నితత్వాన్ని చాటుకుని వెంటనే చర్చలు జరపాలని ఆయన కోరారు. చర్చలు జరపడం అనేది ప్రజాస్వామ్యానికి ఆత్మ అంటూ పోస్ట్ చేశారు. ఈ నిరసనకు అందరూ సపోర్ట్ చేయాలని #DardSeDardKaRishta హ్యాష్ ట్యాగ్‌తో ఆయన పిలుపునిచ్చారు.

అమ్మవారి తాళిబొట్టు కూడా వదల్లేదు
AP: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురంలోని ఎల్లమ్మ టెంపుల్‌లో అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. ఆలయ ప్రధాన గేటు తాళాలు పగులగొట్టిన దొంగలు CCTV కెమెరాలను ధ్వంసం చేశారు. అమ్మవారి విగ్రహానికి ఉన్న 11 గ్రాముల బంగారు తాళిబొట్టుతో పాటు, ఆలయ ప్రాంగణంలో ఉన్న మినరల్ వాటర్ కాయిన్ బాక్స్‌ను ఎత్తుకెళ్లారు. ఆలయంలో ఏళ్ల తరబడి హుండీ లెక్కింపు చేపట్టకపోవడంతో అందులో భారీగా నగదు ఉన్నట్లు సమాచారం. దుండగులు ఆ హుండీని పగులగొట్టి నగదును దోచుకెళ్లారు. పోలీసులు క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సోనమ్ వాంగ్చుక్ దీక్షపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు!
సోనమ్ వాంగ్చుక్ హెల్త్ కండిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నీట్ పేపర్ లీక్ ఇష్యూపై విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్ చేస్తూ చేస్తున్న ఈ నిరాహార దీక్షలో ఆయన ఆరోగ్యం క్షీణించడంతో దాఖలైన PILపై కోర్టు స్పందించింది. ప్రతి పౌరుడి ప్రాణం విలువైందని, వాంగ్చుక్‌కు ప్రతిరోజూ వైద్య పరీక్షలు చేస్తూ అవసరమైన ట్రీట్‌మెంట్ అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆల్రెడీ ప్రభుత్వ డాక్టర్లు ఆయన హెల్త్‌ను రెగ్యులర్‌గా చెక్ చేస్తున్నారని సాలిసిటర్ జనరల్ కోర్టుకు కన్ఫర్మ్ చేశారు.

‘విజయవిహారం’ రమణమూర్తిపై దాడి దారుణం
TG: ‘విజయవిహారం’ రమణమూర్తిపై హిందూత్వ ఉన్మాది దాడి చేయడం దారుణమని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని సామాజికవేత్తలు తెలిపారు. రాజకీయాలకు, మతానికి, దేవుళ్ళకు ఎందుకు ముడి పెడుతున్నారని ప్రశ్నించారు. దాడి ఘటనకు ఖండనగా హైదరాబాద్ నగరంలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ‘కృష్ణుడి తలకాయ తీసేసి మోదీ తల పెట్టి అవమానిస్తున్నారు’ అని అడిగినందుకు చెప్పుతో దాడి చేస్తారా అని అసహనం వ్యక్తం చేశారు.
సోనమ్ వాంగ్చుక్ దీక్షకు యాక్టర్ సయాజీ షిండే సపోర్ట్!
18 రోజులుగా సోనమ్ వాంగ్చుక్ చేస్తున్న నిరాహార దీక్షకు నటుడు సయాజీ షిండే తన పూర్తి మద్దతు ప్రకటించారు. ఫ్యూచర్ జనరేషన్స్ కోసం ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతున్న వాంగ్చుక్ వాయిస్‌ను గవర్నమెంట్ వినాలని, వెంటనే చర్చలు జరపాలని ఆయన కోరారు. శాంతి మార్గంలో కూడా విప్లవం తేవచ్చని వాంగ్చుక్ మరోసారి ప్రూవ్ చేశారన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న పలువురు ప్రముఖులు కూడా వాంగ్చుక్‌కు సపోర్ట్‌గా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వాయిస్ రైజ్ చేస్తున్నారు.

ప్రోటీన్‌ను రీప్లేస్ చేస్తున్న పెప్టైడ్స్
హెల్త్ అండ్ ఫిట్‌నెస్ రంగంలో 'ప్రోటీన్' చాలా ముఖ్యమైనది. ప్రోటీన్ బార్లు, పౌడర్లు, స్నాక్స్ అంటూ మార్కెట్‌లో చాలా వస్తువులు దొరుకుతున్నాయి. ఇదంతా నిన్నటి వరకు. కానీ ఇప్పుడు ఆ స్థానాన్ని 'పెప్టైడ్స్’ రీప్లేస్ చేస్తున్నాయి. బరువు తగ్గాలన్నా, మెరిసే చర్మం కావాలన్నా, కండరాల రికవరీ జరగాలన్నా పెప్టైడ్స్ ముఖ్యం అంటూ సోషల్ మీడియాలో ప్రమోషన్ జరుగుతోంది. శరీరం కరెక్ట్‌గా పనిచేయడానికి ఇవి చాలా హెల్ప్ చేస్తాయని అంటున్నారు.

APలో మళ్ళీ రెండు లాక్అప్ డెత్ లు జరిగాయా?
APలో పోలీసుల తీరుపై వరుస ఘటనలు చర్చనీయాంశమవుతున్నాయి. నెల్లూరు జిల్లా మనుబోలులో బొల్లి ఏడుకొండలు పోలీస్ కస్టడీలో మృతిచెందగా, అది లాకప్ డెత్ అని కుటుంబం ఆరోపిస్తోంది. పోలీసులు మాత్రం ఆయన విషం తాగాడని చెబుతున్నారు. మరోవైపు పిడుగురాళ్లలో ఉర్దూ అకాడమీ లైబ్రేరియన్ షేక్ దరియా హుస్సేన్ ఆత్మహత్యకు పోలీసుల వేధింపులే కారణమని కుటుంబం ఆరోపిస్తోంది. రెండు ఘటనలపైనా పారదర్శక విచారణ జరిపి నిజాలు వెలుగులోకి తేవాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

భార్యే విలనా? హై-సెక్యూరిటీ ఇంట్లో డాక్టర్ హత్య!
కర్ణాటక ధార్వాడ్‌లోని ఓ హై-సెక్యూరిటీ అపార్ట్‌మెంట్‌లో డాక్టర్ కిరణ్ (45) కిరాతకంగా హత్యకు గురయ్యారు. ఆయన 8 ఏళ్ల కొడుకుపై కూడా కత్తితో దాడి జరగడంతో హాస్పిటల్‌లో క్రిటికల్ కండిషన్‌లో ఉన్నాడు. ఇన్సిడెంట్ టైంలో ఇంట్లోకి బయటి వ్యక్తులు ఎవరూ రాలేదని, కేవలం భార్య ప్రియాంక మాత్రమే ఉందని పోలీసులు కన్ఫర్మ్ చేశారు. బంధువుల ఫోన్లకు ఆమె పొంతన లేని ఆన్సర్స్ ఇవ్వడంతో ఈ కేసులో మరింత అనుమానాలు వ్యక్తమవుతున్నయి. ఫ్యామిలీ గొడవలే రీజన్ అని డౌట్ పడుతున్న పోలీసులు.. భార్యనే హత్య చేసి ఉంటుందనే కోణంలో విచారిస్తున్నారు.

కరోనా కలకలం.. ఎయిమ్స్‌లో ప్రత్యేక వార్డు
AP: గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రికి కొవిడ్ అనుమానిత లక్షణాలతో వచ్చిన ఓ వ్యక్తికి డాక్టర్స్ చికిత్స అందించారు. బాధితుడిని హోం ఐసోలేషన్‌లో ఉండాలని ఇంటికి పంపించారు. ఇటీవల జ్వరాల బారిన పడుతున్న బాధితుల సంఖ్య పెరుగుతుండటం, కొవిడ్ లక్షణాలు కనిపిస్తుండటంతో ఎయిమ్స్ డాక్టర్స్ ముందస్తు చర్యలు చేపట్టారు. ఎయిమ్స్ ఆసుపత్రిలో ప్రత్యేకంగా ఫీవర్ వార్డును ఏర్పాటు చేశారు. వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు, జ్వరంతో వచ్చే రోగులకు ఇక్కడే ప్రత్యేక వైద్యసేవలు అందించేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎయిమ్స్‌లో కరోనా కలకలం రేపడంతో గుంటూరు (GGH) వైద్యులు అలెర్ట్ అయ్యారు.
'కల్మా' హోంవర్క్‌పై రాజాసింగ్ ఫైర్
TG: హైదరాబాద్ సైదాబాద్‌లోని సక్సెస్ స్కూల్ విద్యార్థులకు టీచర్ 'కల్మా' హోంవర్క్ ఇవ్వడంపై గోషామహల్ MLA రాజాసింగ్ ఫైరయ్యారు. కొన్ని శక్తులు ఉగ్రవాద ఆలోచనలతోనే స్కూళ్లు, కాలేజీలు, మాల్స్, అలాగే హిందూ సముదాయాలపై ఈ విధంగా దాడులు, ప్రయోగాలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు తెలంగాణలో ఏం జరుగుతోందంటూ అధికారులను, ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విద్యాసంస్థల్లో చిన్నారులపై ఇలాంటి మతపరమైన బోధనలు ఏంటని ప్రశ్నించారు. సక్సెస్ స్కూల్‌పై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్, విద్యాశాఖ అధికారులు ఆ స్కూల్ గుర్తింపును రద్దు చేయాలన్నారు.

తెలంగాణ అంగన్‌వాడీల్లో బ్రేక్‌ఫాస్ట్!
తెలంగాణలోని అన్ని అంగన్‌వాడీల్లో వచ్చే నెల (ఆగస్టు) నుంచి బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్ అమలు చేయాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. ఆల్రెడీ భద్రాద్రి కొత్తగూడెం, ఆసిఫాబాద్ జిల్లాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ పథకాన్ని టెస్ట్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. చిన్నారులకు హై-క్వాలిటీ ఫుడ్ అందించడమే తమ గవర్నమెంట్ మెయిన్ గోల్ అని సీతక్క స్పష్టం చేశారు. ఒకవేళ పాలు, గుడ్లు, ఇతర సరకుల సప్లైలో నాణ్యత లోపిస్తే సదరు కాంట్రాక్టర్లను వెంటనే బ్లాక్ లిస్ట్‌లో పెడతామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

పోక్సో కేసు నిందితుడి ఆత్మహత్య
TG: కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం చింతామన్‌పల్లి గ్రామానికి చెందిన రంగబోయిన సందీప్ (23) గ్రామ శివారులోని ఓ చెట్టుకు ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. గతంలో పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న సందీప్ ఇటీవలే జైలుకు వెళ్లి బెయిల్‌పై బయటకు వచ్చాడు. అప్పటి నుంచి బాలిక తల్లిదండ్రులు తనను బెదిరిస్తున్నారని తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. బాధిత బాలిక కుటుంబసభ్యుల నుంచి బెదిరింపులతోనే తమ కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని యువకుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

13 ఏళ్ల కబ్జాకు చెక్.. HYDRA భారీ యాక్షన్
TG: రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ డివిజన్‌లోని వెంకటాద్రినగర్‌లో 1200 గజాల పార్కు స్థలం గత13 ఏళ్ల నుంచి కబ్జాకు గురైంది. వెంకటాద్రి నగర్ కాలనీ వాసుల సుదీర్ఘ పోరాటం ఫలిచింది. స్థలాన్ని కబ్జాదారుల నుంచి హైడ్రా స్వాధీనం చేసుకుంది. పార్క్ స్థలాన్ని కాపాడాలని కాలనీవాసుల విజ్ఞప్తి మేరకు TPCC ప్రచార కమిటీ ఛైర్మన్, ఎల్బీనగర్ ఇంఛార్జ్ మధు యాష్కి గౌడ్, మల్కాజ్గిరి మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశాల మేరకు హైడ్రా చర్యలు చేపట్టింది. కబ్జాకు గురైన ఆ స్థలాన్ని హైడ్రా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు.

వేస్ట్ ఫుడ్ బయటపడేస్తే హోటళ్లు సీజ్
TG: హైదరాబాద్ హబ్సిగూడలోని సుబ్రభాత్, అమరావతి హోటళ్లను మల్కాజ్‌గిరి కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి తనిఖీ చేశారు. హోటళ్లు, రెస్టారెంట్లలో మిగిలిపోయిన వ్యర్థ ఆహార పదార్థాలను బయట పారబోసినా, పశువుల ఫారాలకు పంపినా..వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రెస్టారెంట్లు తడి వ్యర్థాల ప్రాసెసింగ్ కోసం సొంతంగా ఇన్‌సీటు బయోగ్యాస్ ప్లాంటును ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్లాంటు లేని హోటళ్లు జీహెచ్ఎంసీ వ్యర్థాల ప్రాసెసింగ్ సెంటర్లకు మాత్రమే పంపాలని సూచించారు.

ప్రభాస్ ‘ఫౌజీ’ సినిమాపై అప్‌డేట్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ అందింది. హను రాఘవపూడి డైరెక్షన్‌లో ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా ‘ఫౌజీ’. ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ టీమ్ నుండి కొత్త అప్‌డేట్ వచ్చింది. సినిమాని డిసెంబర్ 3న వరల్డ్ వైడ్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు.
పురిటినొప్పులతో విలవిలలాడినా పట్టించుకోలేదు
TG: భద్రాద్రికొత్తగూడెం జిల్లా మాతా శిశు కేంద్రంలో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రసవం కోసం వచ్చిన గర్భిణీని డాక్టర్స్ పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశారు. పురిటినొప్పులు ఎక్కువై నిల్చున్న చోటే ఆ మహిళ బిడ్డకు జన్మనిచ్చింది. శిశువు కిందపడడంతో తీవ్ర గాయాలయ్యాయి. బిడ్డ పుట్టాక కూడా 10 నిమిషాల వరకు వైద్యులు రాలేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఘటనను చూసి ఇతర రోగులు భయాందోళనకు గురయ్యారు. పోలీసులు హాస్పిటల్‌కు వచ్చి విచారణ చేపట్టగా, వారికి వైద్యులు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు.

గొంతులో ఆహారం అడ్డుపడుతోందా?
ఆహారం లేదా నీరు మింగేటప్పుడు గొంతులో అడ్డుపడినట్లు అనిపిస్తుందా? మింగడం కష్టంగా ఉంటోందా? దీన్ని ‘డిస్ఫేజియా’ అని డాక్టర్లు అంటున్నారు. ఇది చిన్న ప్రాబ్లమ్‌గా కనిపించినా, కొన్నిసార్లు తీవ్రమైన హెల్త్ ఇష్యూస్ రావచ్చని హెచ్చరిస్తున్నారు. వృద్ధులు, నరాల సంబంధిత వ్యాధులు ఉన్నవారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుందంటున్నారు. రోజూ ఆహారం గొంతులో ఇరుక్కోవడం, దగ్గు, ఛాతీలో అసౌకర్యం, బరువు తగ్గడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్ని కలవాలంటున్నారు.

లంచ్ బ్యాగ్ శుభ్రంగా ఉండాలంటే చిట్కాలివే
మనం రోజూ బయటకి తీసుకెళ్లే లంచ్ బ్యాగ్‌లు జిడ్డుగా మారుతుంటాయి. వాటిని క్లీన్‌గా ఉంచేందుకు, చిన్న గిన్నెలో చెంచా వెనిగర్, చెంచా నీళ్లు పోసి బాగా కలిపి దానిలో పత్తిని ముంచి, దాంతో తుడిస్తే లంచ్ బ్యాగ్ పైన ఉన్న జిడ్డు పోతుంది. దీంతోపాటు మగ్గులో గ్లాస్ వేడినీళ్లు పోసి, చెంచా డిష్ వాషింగ్ లిక్విడ్ కలిపి అందులో పాత టూత్‌బ్రష్‌ను ముంచి బ్యాగ్ జిప్‌ను తుడవాలి. దీంతో బ్యాగ్ కొత్తగా మెరుస్తుంది.