Latest

సింపుల్ వర్కౌట్.. షాకింగ్ హెల్త్ బెనిఫిట్స్!
స్కిప్పింగ్ వల్ల బాడీకి ఎన్నో అమేజింగ్ బెనిఫిట్స్ ఉన్నాయి. రోజువారీ స్కిప్పింగ్ వల్ల బాడీ కోఆర్డినేషన్ పెరగడమే కాకుండా, యాంకిల్ ఇంజూరీస్ రిస్క్ తగ్గుతుంది. ఇది మేజర్ క్యాలరీస్‌ను బర్న్ చేస్తూ వెయిట్ లాస్‌కు సూపర్ హెల్ప్ అవుతుంది. బోన్ డెన్సిటీ, బ్రీతింగ్ కెపాసిటీని ఇంప్రూవ్ చేయడంతో పాటు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. వీటన్నింటికీ మించి మెంటల్ హెల్త్‌ను బూస్ట్ చేసి స్ట్రెస్ తగ్గిస్తుంది. సో, ఈ సింపుల్ ఎక్సర్‌సైజ్‌ను మీ డైలీ రొటీన్‌లో యాడ్ చేసుకోండి.

బ్రేకింగ్: ముద్రగడ పద్మనాభం కన్నుమూత!
ప్రముఖ రాజకీయ నాయకుడు, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం (73) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్‌లోని సింధు హాస్పిటల్‌లో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ముద్రగడ మృతి పట్ల AP, తెలంగాణ రాజకీయ నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు.

మహేష్ బాబు ఇంట పెళ్లి సందడి!
సూపర్‌స్టార్ మహేశ్ బాబు మేనల్లుడు, మాజీ MP గల్లా జయదేవ్ చిన్న కుమారుడు సిద్ధార్థ్ గల్లా త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. తన కొరియన్ గర్ల్‌ఫ్రెండ్ హ్యే-ఇన్ కిమ్ తో సిద్ధార్థ్ ఎంగేజ్‌మెంట్ ఇటలీలో గ్రాండ్‌గా జరిగింది. ఇరు కుటుంబాల సమక్షంలో జరిగిన ఈ నిశ్చితార్ధ వేడుకకు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నమ్రతా శిరోద్కర్ ఈ బ్యూటిఫుల్ పిక్స్‌ను షేర్ చేస్తూ కొత్త జంటకు బెస్ట్ విషెస్ చెప్పారు.

స్టాండప్ కమెడియాన్ సమయ్ రైనాకు భారీ జరిమానా
స్టాండప్ కమెడియాన్ సమయ్ రైనాకు రూ.10 లక్షల జరిమానా విధించారు. సమయ్ రైనా షో 'ఇండియాస్ గాట్ లేటెంట్' రెండవ సీజన్‌లో 'స్పైనల్ మస్కులర్ అట్రోఫి'(SMA)తో బాధపడుతున్న రెండు నెలల పసికందుకు రూ.16 కోట్ల ఇంజెక్షన్ అవసరమా అని మాట్లాడాడు. షోతోపాటు సమయ్ రైనాపై క్యూర్ SMA ఫౌండేషన్ పిటిషన్ వేయగా కోర్టు SMA బాధితులకు అండగా ఉండాలని ఆదేశించింది. తాను అండగా ఉన్నానని తప్పుడు వాంగ్మూలం ఇవ్వగా సుప్రీంకోర్టు అతనికి రూ.10 లక్షల జరిమానా విధించింది.

ఓటర్ల గడువు పొడిగింపు
AP: ఏపీలో ఓటర్ల లిస్ట్ సవరణ గడువు నేటితో ముగియనుండగా ఎలక్షన్ కమిషన్ గడువు తేదీని జులై 24 వరకు పొడిగించింది. కొన్ని చోట్ల ఇంకా పని పెండింగ్ ఉండటంతో ఏపీ ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ చేసిన రిక్వెస్ట్ మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త షెడ్యూల్ ప్రకారం జూలై 31న డ్రాఫ్ట్ ఓటర్ల లిస్ట్ వస్తుంది. ఆగస్టు 30 వరకు లిస్ట్‌పై అభ్యంతరాలు చెప్పొచ్చు. అక్టోబర్ 3న ఫైనల్ ఓటర్ల లిస్ట్ రిలీజ్ చేస్తారు.

కడియం శ్రీహరిపై ఢిల్లీకి చేరిన కొండా సురేఖ ఫిర్యాదు!
తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, స్టేషన్ ఘన్‌పూర్ MLA కడియం శ్రీహరిల మధ్య గ్యాప్ మరింత పెరిగింది. తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ కడియం వివాదాల్లోకి లాగుతున్నారంటూ పార్టీ స్టేట్ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్‌కు సురేఖ కంప్లైంట్ చేశారు. ఆల్రెడీ CM రేవంత్, PCC చీఫ్‌లకు కంప్లైంట్ చేసిన సురేఖ, రీసెంట్ గా ఢిల్లీ లెవెల్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ ఇష్యూ హాట్ టాపిక్‌గా మారింది. అయితే చిన్న విషయాలను లైట్ తీసుకోవాలని సురేఖకు నటరాజన్ సజెస్ట్ చేశారు.
ప్రశ్న రావణ్ కేసు: సగం విజయం సాధించాం!
యూట్యూబర్ రావణ్ కేసులో సగం విజయం దక్కిందని ఆయన తరఫు లాయర్ పొన్నవోలు సుధాకర్ సంచలన కామెంట్స్ చేశారు. రావణను శుక్రవారం ట్రయల్‌కు హాజరుపరచాలంటూ అపోజిషన్ వేసిన పిటిషన్‌ను వారే వెనక్కి తీసుకున్నట్లు ఆయన తెలిపారు. పాత పిటిషన్‌తో లాభం లేదని గ్రహించే ఈ కొత్త పిటిషన్ డ్రామాలు ఆడుతున్నారని, తన కెరీర్‌లో ఇలా పిటిషన్ వేసి, ఆర్గ్యుమెంట్స్ అయ్యాక విత్ డ్రా చేసుకోవడం ఇదే ఫస్ట్ టైమ్ అని ఆయన సెటైర్స్ వేశారు. త్వరలోనే పూర్తి విజయం తమదేనని ధీమా వ్యక్తం చేశారు.

CM విజయ్ కోసం వెనక్కి తగ్గిన కొడుకు!
తమిళనాడు CM విజయ్ కొడుకు జాసన్ సంజయ్ డైరెక్టర్‌గా పరిచయమవుతున్న ఫస్ట్ సినిమా ‘సిగ్మా’ రిలీజ్ పోస్ట్‌పోన్ అయినట్లు టాక్. సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న ఈ మూవీని జూలై 31న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ విజయ్ మోస్ట్ అవేటెడ్ మూవీ ‘జన నాయగన్’ జూలై 24న వస్తుండటంతో, తండ్రి సినిమాకు లైన్ క్లియర్ చేయడానికి సంజయ్ తన సినిమాను ఆగస్టుకు వాయిదా వేసుకున్నట్లు సమాచారం. మరోవైపు సంజయ్ త్వరలోనే హీరోగా కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు కోలీవుడ్‌లో న్యూస్ వైరల్ అవుతోంది.

సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
తమిళనాడు ప్రభుత్వ వైద్య కేంద్రాల్లో 'అవుట్ పేషెంట్' నమోదు, అపాయింట్‌మెంట్‌లను వేగంవంతం చేసేందుకు సీఎం విజయ్ కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. 'నలం టిఎన్' అనే సమగ్ర డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ను ఈరోజు ప్రారంభించారు. 9619222999 నంబర్‌తో ఏఐ వాట్సాప్ చాట్‌బాట్‌కు ‘Hi’ అని మెసేజ్ పంపితే బుకింగ్ ప్రక్రియ ప్రారంభించవచ్చని, దీంతో హాస్పిటల్లో క్యూల్లో నిలబడాల్సిన అవసరం ఉండదని వెల్లడించారు. చెన్నై, చెంగల్‌పట్టుతో సహా 22 జిల్లాల్లో ఈ డిజిటల్ ప్లాట్‌ఫారమ్ పైలట్ ప్రాతిపదికన అందుబాటులో ఉందని ప్రభుత్వం తెలిపింది.
ఆస్ట్రేలియాలో భారతీయ ట్రక్ డ్రైవర్లపై జాత్యహంకారం
ఆస్ట్రేలియాలో భారతీయ ట్రక్ డ్రైవర్లను లక్ష్యంగా చేసుకుని తీవ్ర విద్వేష వ్యాఖ్యలు చేసిన ఆడియో వైరల్‌గా మారింది. "భారతీయులను చంపాలి.. మహిళలను బానిసలుగా అమ్మాలి" వంటి వ్యాఖ్యలు తీవ్ర ఆగ్రహానికి దారితీశాయి. కొంతమంది డ్రైవర్లు రోజూ జాత్యహంకారాన్ని ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు. భద్రత కోసం ఉపయోగించే UHF రేడియోలను కూడా చాలామంది ఆఫ్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఘటనపై భారతీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

హీరో నాని మూవీ మళ్లీ వాయిదా?
నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబోలో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ది ప్యారడైజ్’ రిలీజ్ డేట్ మళ్లీ మారినట్లు టాక్. షూటింగ్ పెండింగ్ ఉండటం, ప్రమోషన్స్‌కి టైమ్ లేకపోవడంతో ఈ సినిమాను సెప్టెంబర్ 24కు వాయిదా వేసినట్లు సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది. గతంలో మార్చి, ఆ తర్వాత ఆగస్టు 21న రిలీజ్ అనుకున్నా కుదరలేదు. ఇందులో నాని ‘జడల్’ అనే పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో నటిస్తున్నారు. అయితే ఈ పోస్ట్‌పోన్‌పై మేకర్స్ నుండి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.
నాగ్-సామ్ పాత యాడ్స్.. కొత్త మీమ్ వైరల్!
నాగార్జున, సమంత నటించిన పాత డిటర్జెంట్ యాడ్స్‌ను కలిపి నెటిజన్లు ఫన్నీ వీడియో రూపొందించారు. "ఇక్కడే గొడవ మొదలైనట్టువుంది" అనే క్యాప్షన్‌తో ఈ మీమ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో సరదాగా చేసిందని, వారి వ్యక్తిగత జీవితంతో ఎలాంటి సంబంధం లేదని తెలుస్తోంది.

ఈ వారం OTTలో వినోదాల జాతర
జూలై 13 నుంచి 18 వరకు ఓటీటీ ప్రేక్షకులకు వినోదాల పండుగ కానుంది. ఈ వారం తెలుగు చిత్రం 'మా ఇంటి బంగారం'తో పాటు ఇతర భాషల సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్ కానున్నాయి. నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్, జీ5, ప్రైమ్ వీడియో వేదికలపై రొమాంటిక్, థ్రిల్లర్, ఫ్యామిలీ డ్రామా, హారర్, కొరియన్ ఫాంటసీ కంటెంట్ విడుదల కానుంది. 'ది ఈస్ట్ ప్యాలెస్', 'ది డెవిల్', 'ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు', 'హార్ట్‌స్టాపర్ ఫరెవర్', 'రెడీ ఆర్ నాట్ 2' వంటి చిత్రాలు, సిరీస్‌లు ప్రేక్షకులను అలరించనున్నాయి. రమ్యకృష్ణ హోస్ట్‌గా 'సెకండ్ లవ్' రియాలిటీ షో కూడా ఈ వారమే స్ట్రీమింగ్ కానుంది.

కేతన్ హత్య..మోదీకి తల్లి లేఖ
పూణెలో జరిగిన రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలంటూ అతని తల్లి రాఖీ అగర్వాల్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. పెళ్లి ఇష్టం లేని కాబోయే భార్య సియా గోయల్ తన ప్రియుడితో కలిసి కేతన్‌ను లోహగడ్ కోటపై నుండి తోసి హత్య చేసిన సంగతి తెలిసిందే. తనకు సానుభూతి వద్దని, కేసు ఇన్వెస్టిగేషన్‌ను వేగవంతం చేసి చట్టప్రకారం న్యాయం చేయాలని ఆమె కోరారు. కొడుకు మరణంతో తమ ఫ్యామిలీ మొత్తం రోడ్డున పడిందని లేఖలో తెలిపారు.

తల్లీబిడ్డల అనుమానాస్పద మృతి
AP: వినుకొండ మండలం విఠంరాజుపల్లిలో అదనపు కట్నం వేధింపుల కారణంగా ఒకే ఇంట్లో ముగ్గురు అనుమానాస్పదంగా మృతి చెందారు. భారతి(24) అనే మహిళతోపాటు ఆమె కుమారులు తేజేష్ రెడ్డి(6), హేమనాథ నాగిరెడ్డి(4) చనిపోయి పడి ఉన్నారు. పెళ్లయినప్పటి నుంచి భర్త, అత్తమామలు కట్నం కోసం ఆమెను వేధిస్తున్నట్లు సమాచారం. మంచంపై ఉన్న ఇద్దరు పిల్లలను ఊపిరాడకుండా చేసి చంపి, భారతి ఉరివేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మేనమామ కంప్లైంట్‌తో పోలీసులు కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.

టెట్ ఫలితాల్లో ప్రభుత్వ టీచర్లు ఫెయిల్
TG: నిన్న విడుదలైన తెలంగాణ టెట్ ఫలితాల్లో ప్రభుత్వ టీచర్లు 37.29 శాతం అర్హత సాధించారు. పరీక్షకు హాజరైన 23,623 వేల మంది ఉపాధ్యాయుల్లో 14,814 వేల మంది ఫెయిలయ్యారు. ఆగస్ట్‌లోపు టెట్‌లో ఉత్తీర్ణత సాధించపోతే వారి ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంది. దీంతో ఇన్ సర్వీస్ టీచర్లలో టెన్షన్ మొదలైంది.

వాహనాలలో రక్షణగా ట్రాకింగ్ డివైజర్లు
ఊరెళ్ళడానికి జీపు, మినీ బస్సు లాంటి వాహనాల్లో ప్రయాణిస్తుంటే అందులో ప్రయాణికులు ఎక్కువగా లేకపోయినా..వాహన సిబ్బంది ప్రవర్తన ఇబ్బందిగా ఉన్నా టెన్షన్‌గా ఫీలవుతాం. ఆ టైంలో పోలీసులు, రవాణాశాఖ అధికారులను అప్రమత్తం చేయడానికి వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ డివైజర్ ఉపయోగపడుతుంది. దాన్ని నొక్కితే పోలీసులకు, రవాణాశాఖ అధికారులకు తెలిసి, వారిని అప్రమత్తం చేస్తుంది.

లూలూ మాల్‌లో గన్ కలకలం
TG: హైదరాబాద్‌లోని KPHBలోని లూలూమాల్‌లో తుపాకీతో ఒక వ్యక్తి హల్‌చల్ చేశాడు. ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పార్కింగ్ స్థలంలో రెండు కుటుంబాల మధ్య వచ్చిన వివాదంలో ఒకరి వద్ద గన్ ఉండటంతో మాల్‌లోని కస్టమర్లు టెన్షన్ పడ్డారు. జూలై 12న రెండు కుటుంబాలకు మధ్య వాగ్వాదం జరిగింది. మహ్మద్ సిద్దిఖీ అనే వ్యక్తి జేబులో తుపాకీ ఉండటాన్ని గమనించిన ఓ కస్టమర్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సిద్ధిఖీని అదుపులోకి తీసుకున్నారు. భద్రతా నిబంధనలను ఉల్లంఘించినందుకు లూలూమాల్‌పై కేసు నమోదు చేశారు.
సోనమ్ వాంగ్‌చుక్ దీక్షపై AAP MP పవర్‌ఫుల్ పోస్ట్!
సోనమ్ వాంగ్‌చుక్ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష 17వ రోజుకు చేరింది. దీనిపై AAP MP సంజయ్ సింగ్ రియాక్ట్ అవుతూ, PM మోదీ, మీడియా మౌనాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. X ప్లాట్‌ఫామ్‌లో ఒక పవర్‌ఫుల్ పోయం షేర్ చేస్తూ, "పోరాటం ఇంకా ముగియలేదు, ఈ టైమ్‌లో సైలెంట్‌గా ఉండేవాళ్లు కూడా దోషులే" అని విమర్శించారు. ఆయన ప్రాణాలకేదైనా రిస్క్ వచ్చే వరకు వెయిట్ చేస్తున్నారా అంటూ ఘాటుగా ప్రశ్నించారు.

HMDA చీఫ్ ఇంజినీర్ ఇంట్లో ACB దాడులు
TG: హైదరాబాద్‌లో HMDA చీఫ్ ఇంజినీర్ రవీందర్ ఇంట్లో ACB అధికారులు సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని ఆరోపణలు రావడంతో అధికారులు ఆయన ఇల్లు, కార్యాలయం, సన్నిహితుల ఇళ్లలోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు. నగరంలో 15 ప్రాంతాల్లో ఒకేసారి సోదాలు చేపట్టారు. ఇప్పటికే ఆయన ఇంట్లో నోట్ల కట్టలు, వివిధ ఆస్తి పత్రాలు గుర్తించినట్లు సమాచారం. ఇటీవల DSP భీమ్ రెడ్డి అక్రమాస్తులకు సంబంధించి సోదాల సమయంలో సుమారు రూ.300 కోట్లకు పైగా ఆస్తులు, పెట్టుబడులు, బంగారు నగలు, నగదు బయటపడిన సంగతి తెలిసిందే.
కేజ్రీవాల్ సంచలన ట్వీట్!
ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద లడఖ్ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షకు అరవింద్ కేజ్రీవాల్ మద్దతు ప్రకటించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. "వాంగ్‌చుక్ గారు, మీరు దేశానికి ఒక హెరిటేజ్. దయచేసి మీ హంగర్ స్ట్రైక్ ముగించండి" అని కేజ్రీవాల్ రిక్వెస్ట్ చేశారు. అలాగే, జూలై 16 సాయంత్రం 5 గంటలకు స్వయంగా జంతర్ మంతర్‌కు వెళ్లి వాంగ్‌చుక్‌ను కలిసి తన సపోర్ట్ అందిస్తానని ట్విట్టర్ (X)లో ట్వీట్ చేశారు.