లూలూ మాల్‌లో గన్ కలకలం

TG: హైదరాబాద్‌లోని KPHBలోని లూలూమాల్‌లో తుపాకీతో ఒక వ్యక్తి హల్‌చల్ చేశాడు. ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పార్కింగ్ స్థలంలో రెండు కుటుంబాల మధ్య వచ్చిన వివాదంలో ఒకరి వద్ద గన్ ఉండటంతో మాల్‌లోని కస్టమర్లు టెన్షన్ పడ్డారు. జూలై 12న రెండు కుటుంబాలకు మధ్య వాగ్వాదం జరిగింది. మహ్మద్ సిద్దిఖీ అనే వ్యక్తి జేబులో తుపాకీ ఉండటాన్ని గమనించిన ఓ కస్టమర్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సిద్ధిఖీని అదుపులోకి తీసుకున్నారు. భద్రతా నిబంధనలను ఉల్లంఘించినందుకు లూలూమాల్‌పై కేసు నమోదు చేశారు.



