Latest
పాదయాత్రకు హరీశ్ రావు రెడీ!
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు BRS సీనియర్ లీడర్ హరీశ్ రావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే తను ప్రజల్లోకి వెళ్లనున్నట్లు అనౌన్స్ చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా ‘బసవేశ్వర నుండి సంగమేశ్వర’ వరకు భారీ పాదయాత్ర చేపట్టబోతున్నట్లు క్లారిటీ ఇచ్చారు. ప్రాజెక్టుల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి అవలంబిస్తున్న తీరుపై మండిపడ్డ హరీశ్ రావు, కాంగ్రెస్ చేస్తున్న తప్పులను, వైఫల్యాలను ఈ యాత్ర ద్వారా ఎండగడతామని, ప్రజల హక్కుల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని స్పష్టం చేశారు.

OTT లోకి సమంత బ్లాక్‌బస్టర్ ‘మా ఇంటి బంగారం’!
₹100 కోట్ల కలెక్షన్స్‌తో సెన్సేషన్ క్రియేట్ చేసిన సమంత హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ ‘మా ఇంటి బంగారం’ ఇప్పుడు OTT కి రెడీ అయింది. నందిని రెడ్డి డైరెక్షన్‌లో వచ్చిన ఈ థియేట్రికల్ హిట్, కేవలం నెల రోజుల్లోనే డిజిటల్ స్క్రీన్స్ పైకి వస్తోంది. ప్రముఖ OTT ప్లాట్‌ఫామ్ ‘జియో హాట్ స్టార్’ లో జూలై 17 నుండి ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. గుల్షన్ దేవయ్య, గౌతమి కీలక పాత్రలు పోషించిన ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు డబుల్ ఫన్ అండ్ ఎక్సైట్‌మెంట్‌తో త్వరలోనే సీక్వెల్ కూడా రాబోతుందని మేకర్స్ కన్ఫర్మ్ చేశారు.
గుండుతో నిరసన.. AP పాలిటిక్స్‌లో ఒక్కసారిగా పెరిగిన హీట్!
ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (APGEF) వినూత్న రీతిలో నిరసన తెలిపింది. తమకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయడం లేదంటూ APGEF ప్రెసిడెంట్ వెంకట్రామిరెడ్డితో పాటు పలువురు ఉద్యోగులు గుండు చేయించుకున్నారు. "ఉద్యోగులకు చంద్రన్న బోడిగుండు" అంటూ ప్లకార్డులు పట్టుకొని తమ నిరసనను వ్యక్తం చేశారు. హామీల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఉద్యోగ సంఘాల నేతలు ఈ సందర్భంగా తీవ్రంగా ఆరోపించారు. ఈ గుండు నిరసన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

కేంద్రం, యూపీ ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు షాక్!
అయోధ్య రామాలయం విరాళాల చోరీ వ్యవహారంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఈ కేసులో ఇప్పటివరకు జరిగిన దర్యాప్తుపై నివేదిక ఇవ్వాలని ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఆదేశించింది. CBI ఎంక్వైరీ కోరుతూ దాఖలైన పిటిషన్లపై స్పందించాలని కేంద్రం, UP ప్రభుత్వంతో పాటు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌కు నోటీసులు జారీ చేసింది. జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఆదేశాలిచ్చింది. కాగా, ఈ కేసు తదుపరి విచారణను జులై 20వ తేదీకి వాయిదా వేశారు.

టిష్యూ పేపర్లు వైట్ కలర్‌లోనే ఎందుకు ఉంటాయో తెలుసా?
మనం డైలీ వాడే టిష్యూ పేపర్లు మోస్ట్లీ వైట్ కలర్‌లోనే ఎందుకు ఉంటాయో తెలుసా? దీని వెనుక కొన్ని ఇంట్రెస్టింగ్ రీజన్స్ ఉన్నాయి. టిష్యూలను కలప గుజ్జుతో తయారు చేసినప్పుడు అది బ్లీచింగ్ వల్ల వైట్‌గా మారుతుంది. వీటికి ఎక్స్‌ట్రా కలర్స్ యాడ్ చేస్తే కెమికల్స్ వల్ల స్కిన్ అలర్జీలు వచ్చే ఛాన్స్ ఉంది. అందుకే హెల్త్, ఎన్విరాన్మెంట్ సేఫ్టీ కోసం వీటిని వైట్‌గానే ఉంచుతారు. పైగా కలర్స్ కలపకపోవడం వల్ల తయారీ ఖర్చు తగ్గి, నీటిలో కూడా ఇవి ఈజీగా కరిగిపోతాయి.

జూనియర్ NTR పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ!
జులై 18న జూనియర్ NTR పొలిటికల్ అనౌన్స్‌మెంట్ చేయబోతున్నారంటూ వస్తున్న వార్తలపై క్లారిటీ వచ్చింది. ‘RAW NTR’ అఫీషియల్ టీమ్ దీనిపై స్పందిస్తూ అవన్నీ కేవలం రూమర్స్ మాత్రమేనని తేల్చి చెప్పింది. ఆ రోజు జరగబోయే #ఊరువాడ ఈవెంట్ కేవలం వారి కోర్ ఐడియా, విజన్‌ని రివీల్ చేయడానికి ప్లాన్ చేసిందే తప్ప, ఎలాంటి రాజకీయ ప్రకటనలు ఉండవని స్పష్టం చేశారు. ఫ్యాన్స్ కన్ఫ్యూజ్ అవ్వద్దని, మీడియా సంస్థలు ఫేక్ న్యూస్‌ని నమ్మవద్దని తేల్చి చెప్పేశారు.

బుక్ లవర్‌కి షాక్.. 10 వేల పుస్తకాలతో ఇల్లు ఖాళీ చేసే పరిస్థితి!
న్యూయార్క్‌కు చెందిన 31 ఏళ్ల బుక్ లవర్, పరిశోధకుడు మెండెల్ ఉమినర్ తన 600 చదరపు అడుగుల స్టూడియో అపార్ట్‌మెంట్‌లో ఏకంగా 10,000 పుస్తకాలు పెట్టుకున్నాడు. వాటి బరువు భవనం భద్రతకు, అగ్నిప్రమాదానికి ముప్పుగా మారొచ్చని యజమాని హెచ్చరించాడు. దీంతో పుస్తకాల సంఖ్య తగ్గించాలి లేదా ఇల్లు ఖాళీ చేయాలని చెప్పాడు. కానీ “ప్రతి పుస్తకం నా పనికే, ఇవే నా ప్రపంచం” అంటూ ఉమినర్ ఇల్లు ఖాళీ చేశాడు. ఈ బుక్ లవర్ స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అన్నామలై పార్టీతో పాటు మతం వదిలేశారా?
BJP తమిళనాడు లీడర్ అన్నామలై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. "నేను పక్కా హిందువునే, కానీ పబ్లిక్ సర్వీస్‌లోకి వచ్చినప్పుడు నా కులాన్ని, మతాన్ని ఇంట్లోనే వదిలేస్తా" అని స్టేట్‌మెంట్ ఇచ్చారు. పాలిటిక్స్‌లో అందరినీ సమానంగా చూడటమే తన రూట్ అని, ప్రజలందరికీ ఒకేలా సర్వీస్ చేయడమే తన మెయిన్ గోల్ అని క్లారిటీ ఇచ్చారు. గతంలో ఆయనపై మత రాజకీయాల విమర్శలు రాగా, ఈ తాజా కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

గొడ్డలికి గురయ్యే చెట్లకు సెకండ్ లైఫ్..! 🌱
రోడ్లు, నిర్మాణాల కోసం నరికి వేయాల్సిన భారీ చెట్లను బతికేలా మరోచోటికి తరలిస్తూ తెలంగాణకు చెందిన వ్యాపారవేత్త ఉదయ్ కృష్ణ పెద్ది రెడ్డి ప్రత్యేక మిషన్ చేపట్టారు. వేర్లతో సహా చెట్లను జాగ్రత్తగా తీసి ట్రైలర్లలో తరలించి గార్డెన్లు, కాలనీలు, శ్మశానాల్లో మళ్లీ నాటుతున్నారు. ఇప్పటివరకు వేలాది చెట్లను కాపాడారు. ఒక్కో చెట్టును సురక్షితంగా మార్పిడి చేయడానికి సుమారు 21 రోజులు పడుతుందని ఆయన చెబుతున్నారు.
సోనమ్ వాంగ్‌చుక్ దీక్షపై AAP MP సంజయ్ సింగ్ ఎమోషనల్ ట్వీట్!
సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష 14వ రోజుకు చేరింది. దేశ యువత భవిష్యత్తు కోసం 59 ఏళ్ల వయసులో ఆయన చేస్తున్న ఈ పోరాటంతో ఆరోగ్యం క్షీణించి, ఇప్పటికే 9 కేజీల బరువు తగ్గారు. అయితే దీనిపై నేషనల్ మీడియా సైలెంట్‌గా ఉండటంపై AAP MP సంజయ్ సింగ్ మండిపడ్డారు. పాలకుల భజన చేసే 'గోదీ మీడియా' చచ్చిపోయిందని, యువత సమస్యలు వారికి పట్టడం లేదని కామెంట్స్ చేశారు. యువశక్తి ఇకనైనా మేల్కొని జంతర్ మంతర్ చేరాలని పిలుపునిచ్చారు.

AP లో లోకల్ ఎలక్షన్స్.. డేట్ ఫిక్స్!
CM చంద్రబాబు APలో స్థానిక ఎన్నికలపై కీలక అప్‌డేట్ ఇచ్చారు. సెప్టెంబర్ మంత్ ఎండింగ్ లో లేదా అక్టోబర్‌లో ఈ ఎలక్షన్స్ నిర్వహించనున్నట్లు TDP నేతలతో జరిపిన జూమ్ మీటింగ్‌లో CM వెల్లడించారు. 'సర్' ప్రక్రియ పూర్తి కాగానే ఎన్నికలు ఉంటాయని, పార్టీ శ్రేణులు ఇప్పటి నుంచే సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అటు మున్సిపల్ ఎన్నికలు కూడా అదే టైమ్‌లో జరిగే ఛాన్స్ ఉందని, CM దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని మంత్రి నారాయణ కన్ఫర్మ్ చేశారు. పొలిటికల్ పార్టీస్ అలర్ట్ అవ్వాల్సిన టైమ్ వచ్చేసింది!

16వ రోజుకు చేరిన సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్ష!
ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలంటూ సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన నిరాహార దీక్ష 16వ రోజుకు చేరింది. దీనిపై CJP ఫౌండర్ అభిజీత్ దీప్కే స్పందిస్తూ.. ప్రభుత్వం దీన్ని 'ఈగో' సమస్యగా మార్చవద్దని, ఇక్కడ హ్యూమన్ లైవ్స్ ముఖ్యం అని ట్వీట్ చేశారు. తప్పును ఒప్పుకోవడం బలహీనత కాదు, అకౌంటబిలిటీకి నిదర్శనమని పేర్కొన్నారు. స్టూడెంట్స్ ప్రయోజనాల కోసం ప్రభుత్వం వెంటనే స్పందించి, బాధ్యతగా వ్యవహరించాలని ఆయన కోరారు. మరోవైపు, రోజురోజుకూ క్షీణిస్తున్న వాంగ్‌చుక్ హెల్త్ కండిషన్‌పై ఇప్పుడు అందరిలో తీవ్ర ఆందోళన మొదలైంది.

గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ డౌన్!
బంగారం, వెండి ప్రియులకు గుడ్ న్యూస్. సోమవారం ఉదయం బంగారం ధరలు కాస్త తగ్గాయి. హైదరాబాద్, విజయవాడల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.1,42,910 కాగా, 22 క్యారెట్ల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,31,000గా ఉంది. మరోవైపు సిల్వర్ రేట్ కూడా కిలోకు రూ.100 తగ్గి, రూ.2,39,900కు చేరింది. మార్కెట్ ఒడిదుడుకుల వల్ల ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. షాపింగ్‌కు వెళ్లే ముందు లైవ్ రేట్స్ చెక్ చేసుకోవడం బెస్ట్ ఆప్షన్.

కల్తీ ఫుడ్‌పై సింగిల్ క్లిక్‌తో చెక్!
హోటల్స్, రెస్టారెంట్లలో కల్తీ లేదా బ్యాడ్ ఫుడ్ ఉంటే ఇకపై ఈజీగా చెక్ పెట్టొచ్చు. దీనికోసం FSSAI 'ఫుడ్ సేఫ్టీ కనెక్ట్' యాప్‌ను తెచ్చింది. ఎక్కడైనా అపరిశుభ్రంగా కనిపిస్తే ఈ యాప్ ద్వారా కంప్లైంట్ చేయొచ్చు. రీసెంట్‌గా ఎక్స్‌పైరీ డేట్ ప్రొడక్ట్స్, కుళ్లిన గుడ్లు డెలివరీ చేస్తున్నారనే కంప్లైంట్స్‌తో స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌కు FSSAI నోటీసులు ఇచ్చింది. కస్టమర్ల హెల్త్‌తో ఆటలాడితే లీగల్ యాక్షన్ తప్పదని వార్నింగ్ ఇచ్చింది. యాప్ ద్వారా పబ్లిక్ కూడా అలెర్ట్‌గా ఉండాలని కోరింది.
ఇరాన్పై విరుచుకుపడుతున్న అమెరికా!
ఇరాన్‌పై అమెరికా దాడులను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లింది. అర్ధరాత్రి నుంచి మిస్సైళ్లు, బాంబులతో గట్టిగా ఎటాక్ చేస్తోంది. బందర్ అబ్బాస్ పోర్ట్, ఖెర్మ్ ఐలాండ్, మర్కాజీ ఏరియాల్లో భారీగా బ్లాస్ట్‌లు జరిగాయి. హార్ముజ్ దగ్గరున్న ఒక టెలికాం టవర్‌ని కూడా అమెరికా పేల్చేసింది. ఇంకోవైపు, కువైట్‌లోని యూఎస్ రాకెట్ సిస్టమ్ మిస్సైల్ లాంచర్స్ స్టోరేజీపై తాము కూడా కౌంటర్ ఎటాక్ చేశామని ఇరాన్ అనౌన్స్ చేసింది. దీంతో అక్కడ సిట్యువేషన్ చాలా సీరియస్‌గా మారింది.

ACP భార్య ఆత్మహత్య!
హైదరాబాద్‌లోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక సాడ్ ఇన్సిడెంట్ జరిగింది. చార్మినార్ డివిజన్ ACPగా పనిచేస్తున్న చంద్రశేఖర్ భార్య హేమలత ఇంట్లో సూసైడ్ చేసుకున్నారు. బృందావన కాలనీలోని తమ ఇంట్లో ఆమె సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ప్రాణాలు విడిచారు. సమాచారం అందుకున్న అల్వాల్ పోలీసులు వెంటనే స్పాట్‌కు చేరుకుని కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అయితే ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి గల అసలు కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

మార్నింగ్ షుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయా? ఈ తప్పులు చేయకండి!
డయాబెటిస్ ఉన్నవాళ్లకి మార్నింగ్ లేవగానే బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగడాన్ని 'డాన్ ఫినామినన్' అంటారు. దీన్ని కంట్రోల్ చేయడానికి హెల్త్ ఎక్స్‌పర్ట్స్ కొన్ని క్రేజీ టిప్స్ చెబుతున్నారు. ఉదయాన్నే ఒక గ్లాస్ వాటర్ తాగడం వల్ల డీహైడ్రేషన్ తగ్గి షుగర్ కంట్రోల్ అవుతుంది. రోజూ 30 నిమిషాలు వాకింగ్ లేదా యోగా చేయడం, నైట్ నిద్రకు 3 గంటల ముందే లైట్ డిన్నర్ ముగించడం చాలా ఇంపార్టెంట్. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అస్సలు స్కిప్ చేయకూడదు. టీ, కాఫీలను లిమిట్‌గా తీసుకుంటూ, రోజుకు 7-8 గంటలు పక్కాగా నిద్రపోతే ఉదయం పూట షుగర్ పెరగకుండా చూసుకోవచ్చు.

దోమలు మిమ్మల్నే కుడుతున్నాయా? అసలు రీజన్ ఇదే!
ఒకే గదిలో అందరూ ఉన్నా దోమలు కొందరినే ఎక్కువగా కుడతాయా? దీని వెనుక సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయంటున్నారు హెల్త్ ఎక్స్‌పర్ట్స్. మన బాడీ నుండి రిలీజ్ అయ్యే కార్బన్ డయాక్సైడ్, చెమటలోని లాక్టిక్ యాసిడ్ వాసనల వల్లే దోమలు ఎక్కువగా అట్రాక్ట్ అవుతాయి. ఎస్పెషల్లీ వర్కౌట్స్ చేసేవాళ్లు, బాడీ హీట్ ఎక్కువగా ఉన్నవాళ్లు, ప్రెగ్నెంట్ ఉమెన్‌ను ఇవి ఈజీగా గుర్తుపడతాయి. అంతేకాదు, రీసెర్చ్ ప్రకారం 'A' గ్రూప్ కంటే 'O' బ్లడ్ గ్రూప్ ఉన్నవాళ్లనే దోమలు ఎక్కువగా కుడతాయట. చర్మంపై ఉండే బ్యాక్టీరియా, జెనెటిక్స్ కూడా దీనికి మెయిన్ కారణాలు.

ఖమేనీ అంత్యక్రియలు: ఆ ‘మాస్క్ మ్యాన్’ మిస్టరీ వీడింది!
ఇరాన్ దివంగత సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల్లో బ్లాక్ మాస్క్, క్యాప్ ధరించి మొదటి వరుసలో కూర్చున్న మిస్టరీ వ్యక్తి ఎవరనేది ఎట్టకేలకు తేలింది. ఆయన ఖమేనీ పెద్ద మనవడు మహ్మద్ జవాద్ ఖమేనీ అని ఇరాన్ ఇంటర్నేషనల్ మీడియా వెల్లడించింది. ఖమేనీ వారసుడిగా భావిస్తున్న ఆయన కుమారుడు మోజ్తబానే ఆ మాస్క్ మ్యాన్ అని మొదట ప్రచారం జరిగింది. కానీ, ఫిబ్రవరి నాటి వైమానిక దాడుల్లో మహ్మద్ జవాద్ ముఖానికి తీవ్ర గాయాలు, కాలిన గాయాలు కావడంతోనే ఆయన ముఖం కనపడకుండా మాస్క్ ధరించినట్లు స్పష్టమైంది.

6 ఏళ్ల మనవరాలితో డ్రైవింగ్.. SIపై కేస్ ఫైల్!
హైదరాబాద్‌లోని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. హైదరాబాద్ కమిషనరేట్‌లో SIగా పనిచేస్తున్న పూజారి తిరుపతి.. గంధంగూడ రోడ్డుపై తన 6 ఏళ్ల మనవరాలికి కార్ డ్రైవింగ్ నేర్పిస్తూ దొరికిపోయారు. గంధంగూడ రోడ్డుపై చిన్నపిల్లకి డ్రైవింగ్ నేర్పించడంతో లోకల్స్ కార్ ఆపి SIని నిలదీశారు. ఇది ఆటోమేటిక్ కార్ అని, కంట్రోల్ తన చేతుల్లోనే ఉందంటూ SI కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు SIపై కేస్ ఫైల్ చేశారు.

ఆమిర్ ఖాన్ మ్యారేజ్ 'లవ్ జిహాద్'! - మంత్రి సంచలనం
బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ మూడో పెళ్లిపై మహారాష్ట్ర మంత్రి నితేష్ రాణే చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. ఆమిర్ ఖాన్‌ను 'లవ్ జిహాద్‌కు బ్రాండ్ అంబాసిడర్' అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందూ సమాజం ఇలాంటి వాళ్ల సినిమాలను చూడాలా వద్దా అని ఆలోచించుకోవాలంటూ పిలుపునిచ్చారు. ఇటీవల ఆమిర్ ఖాన్, గౌరీ స్ప్రాట్‌ను మూడో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ఇష్యూపై సోషల్ మీడియాలో నెగెటివ్, పాజిటివ్ కామెంట్స్‌తో పెద్ద డిబేట్ నడుస్తోంది.