Latest

E20 పెట్రోల్ పై ఢిల్లీలో వాహనదారుల నిరసనలు !
News· 5 Jul 2026

E20 పెట్రోల్ పై ఢిల్లీలో వాహనదారుల నిరసనలు !

ఢిల్లీలో E20 పెట్రోల్ (20% ఇథనాల్ బ్లెండింగ్) విధానానికి వ్యతిరేకంగా వాహనదారులు జంతర్ మంతర్ వద్ద మొదటిసారి రోడ్డుపైకి వచ్చి నిరసనలు చేపట్టారు. ఈ ఇంధనం వల్ల కార్ల మైలేజ్ భారీగా పడిపోతోందని, ఫ్యూయల్ సిస్టమ్స్ చోక్ (బ్లాక్) అయిపోతున్నాయని, ఇంజన్లు ఆగిపోతూ వేల రూపాయల రిపేర్ ఖర్చులు వస్తున్నాయని మోటారిస్ట్లు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం షుగర్ లాబీకి సపోర్ట్ చేస్తోందని విమర్శిస్తూ.. తమకు నచ్చిన ఫ్యూయల్ ఎంచుకునే ఛాన్స్ ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పెట్రోల్ కన్నా చవకైన ఇంధనమంటూ తెచ్చిన ఈ ఇథనాల్ కొత్త సమస్యలు తెచ్చి పెడుతోంది.

ఖమేనీ అంత్యక్రియలకు ముగ్గురు కుమారులు హాజరు !
World· 5 Jul 2026

ఖమేనీ అంత్యక్రియలకు ముగ్గురు కుమారులు హాజరు !

ఇరాన్ సుప్రీం లీడర్ అయతోల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు ఆయన ముగ్గురు కుమారులు (ముస్తఫా, మేసమ్, మసౌద్) హాజరయ్యారు. కానీ, ఆయన వారసుడిగా బాధ్యతలు చేపట్టిన మరో కుమారుడు మొజ్తబా ఖమేనీ మాత్రం రాలేదు. ఫిబ్రవరిలో జరిగిన దాడిలో మొజ్తబా గాయపడ్డారని, అందుకే భద్రతా కారణాల వల్ల ఆర్మీ (IRGC) ఆయనను బయటకు రావద్దని హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ టార్గెట్ చేసే ఛాన్స్ ఉండటంతోనే ఆయన రాలేదని సమాచారం.

సట్లెజ్ మూవీ కి మళ్లీ బ్రేక్-ZEE 5  ఓటీటీ నుంచి తొలగింపు
Cinema· 5 Jul 2026

సట్లెజ్ మూవీ కి మళ్లీ బ్రేక్-ZEE 5 ఓటీటీ నుంచి తొలగింపు

దిల్జీత్ దోసాంజ్ నటించిన 'సట్లెజ్' (Punjab 95) మూవీ రిలీజైన రెండు రోజులకే ZEE5 ఓటీటీ ప్లాట్‌ఫారమ్ నుండి డిలీట్ అయింది. సెన్సార్ బోర్డ్ (CBFC)తో మూడేళ్లు ఫైట్ చేసి, ఎన్నో కట్స్‌తో జూలై 3న స్ట్రీమింగ్‌కు వచ్చిన ఈ సినిమాను ఇండియాలో నిలిపివేస్తున్నట్లు ZEE5 ప్రకటించింది. క్రియేటివ్ విజన్‌కు తాము సపోర్ట్ చేస్తామని, ప్రస్తుత పరిణామాల వల్ల తాత్కాలికంగా తీసేసామని, త్వరలోనే లీగల్ ప్రొసీజర్ ద్వారా మళ్లీ తీసుకొస్తామని స్పష్టం చేసింది. దాంతో ఫ్యాన్స్ అప్‌సెట్ అవుతున్నారు. పంజాబ్‌కు చెందిన మానవ హక్కుల కార్యకర్త జస్వంత్ సింగ్ ఖల్రా జీవిత ఆధారంగా దీనిని తెరకెక్కించారు.

వైభవంగా  అమీర్ ఖాన్, గౌరీ స్ప్రట్ ల వెడ్డింగ్▶
Cinema· 5 Jul 2026

వైభవంగా అమీర్ ఖాన్, గౌరీ స్ప్రట్ ల వెడ్డింగ్

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ (61) తన గాళ్ ఫ్రెండ్ , వ్యాపారవేత్త అయిన గౌరీ స్ప్రాట్‌ను వివాహం చేసుకున్నారు. రెండేళ్ళుగా డేటింగ్ లో ఉన్న ఈ జంట, జూలై 5న ముంబైలోని బాంద్రాలో అమీర్ ఖాన్ నివాసంలో అత్యంత వైభవంగా, సన్నిహితుల సమక్షంలో ఒకటయ్యారు. ఆ వెంటనే అమీర్ ఖాన్ PR ఏజెన్సీ ఈ వేడుక ఫస్ట్ పిక్ ను సోషల్ మీడియాలో పంచుకుంది. అధికారిక పత్రాలపై సంతకాలు చేసి, తమ వివాహాన్నిRegister చేసుకున్నారు. ఆమీర్ ఇద్దరి భార్యల పిల్లలు ఈ వేడుకకు హాజరు కాగా, గౌరీ తన ఆరేళ్ల కొడుకును కూడా ఈ వేడుకకు తీసుకొచ్చారు. మొత్తం 150 మంది అతిధులు అటెండ్ అయ్యారు.

ఫిలిం మేకింగ్ కి యూ ట్యూబర్స్  నయా డెఫినిషన్ !
Entertainment· 5 Jul 2026

ఫిలిం మేకింగ్ కి యూ ట్యూబర్స్ నయా డెఫినిషన్ !

ఫిలిం మేకింగ్ కి కొత్త డెఫినిషన్ ఇస్తున్నారు నేటి యూ ట్యూబర్స్. హాలీవుడ్ లో పెద్ద పెద్ద స్టూడియోలకి గట్టి షాకిస్తున్నారు ఈ యంగ్ స్టర్స్! 2026లో హర్రర్ సినిమాలు తీస్తూ, బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లు సాధిస్తున్నారు. స్టూడియో సిస్టమ్‌ను పక్కనబెట్టి, సొంతంగా కథలు రాస్తూ, డైరెక్ట్ చేస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. Talk to Me, Late Night with the Devil లాంటి సినిమాలు వీటికి బెస్ట్ ఎగ్జాంపుల్స్. డిజిటల్ స్క్రీన్ల నుండి థియేటర్ల వరకు ఈ క్రియేటర్స్ హవా నడుస్తోంది. హాలీవుడ్‌లో ఈ యూట్యూబ్ స్టార్స్ నిజంగా సరికొత్త ట్రెండ్‌కి తెరలేపారు.

ఒక్క పంచ్ తో పితృస్వామ్యానికి చెక్ !
General· 5 Jul 2026

ఒక్క పంచ్ తో పితృస్వామ్యానికి చెక్ !

భారత్‌లో మహిళలు మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ (MMA)లో వేగంగా రాణిస్తూ బరిలో ప్రత్యర్థులతో పాటు సమాజంలోని పితృస్వామ్య భావజాలాన్నీ సవాలు చేస్తున్నారు. కఠిన శిక్షణ, గాయాలు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ ఒత్తిళ్లు, మహిళల దూకుడుపై సామాజిక విమర్శలను ఎదుర్కొంటూనే ముందుకు సాగుతున్నారు. రితికా పూజారి, నబీలా బిర్జ్, పూజా తోమర్ వంటి ఫైటర్లు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటూ యువతులకు ధైర్యం, ఆత్మవిశ్వాసానికి కొత్త స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

రాజస్థాన్ లో గర్భిణీలకు ఫేక్  ఇంజెక్షన్లు- 5గురి మృతి
News· 5 Jul 2026

రాజస్థాన్ లో గర్భిణీలకు ఫేక్ ఇంజెక్షన్లు- 5గురి మృతి

రాజస్థాన్‌లోని కోట ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవాల అనంతరం ఐదుగురు బాలింతలు మరణించగా, డెలివరీ టైమ్ లో వారికి ఇచ్చిన ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ పై అనుమానాలు వ్యక్తమయ్యాయి. పరీక్షల్లో సీసాల్లో ఔషధం బదులు నీరే ఉన్నట్లు తేలిందని అధికారులు వెల్లడించారు. అమృత్‌సర్‌కు చెందిన జాక్సన్ ల్యాబొరేటరీస్ తయారు చేసిన ఈ బ్యాచ్‌పై విచారణ కొనసాగుతోంది. 2023 నుంచే ఆ సంస్థపై తయారీ నిలిపివేత ఆదేశాలు ఉన్నప్పటికీ నకిలీ ఔషధాల సరఫరా కొనసాగిందన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.

వ్యసనాలతో బ్రెయిన్ డ్యామేజ్: నిపుణుల వార్నింగ్
Politics· 5 Jul 2026

వ్యసనాలతో బ్రెయిన్ డ్యామేజ్: నిపుణుల వార్నింగ్

మద్యం, డ్రగ్స్ లేదా స్క్రీన్ అడిక్షన్ ఏదైనా... అది మెదడు ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. వ్యసనాల వల్ల బ్రెయిన్‌లోని 'డోపమైన్' కెమికల్ విడుదల తారుమారై, ఆలోచనా శక్తి, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం తగ్గిపోతాయని ప్రముఖ వైద్యుడు రషిక్కారా అయ్యర్ అన్నారు.. మానసిక ఒత్తిడి, జ్ఞాపకశక్తి లోపించడం వంటి సమస్యలు వస్తాయి. మెదడులోని భావోద్వేగాలను కంట్రోల్ చేసే భాగాలపై ప్రభావం చూపడం వల్ల చిన్న చిన్న విషయాలకే కోపం, ఆందోళన,డిప్రెషన్ లాంటివి కలుగుతాయి. వ్యసనం అనేది మెదడుకు సంబంధించిన జబ్బు అని గుర్తించాలి. అడిక్షన్‌కు దూరంగా , మెదడు ను యాక్టివ్‌గా ఉంచుకోవడం ముఖ్యమని రషిక్కారా తెలిపారు.

సముద్రంలో చిక్కుకున్న మరో ఫిషింగ్ బోటు
AP· 5 Jul 2026

సముద్రంలో చిక్కుకున్న మరో ఫిషింగ్ బోటు

AP: సముద్రంలో ఇంజిన్ మొరాయించడంతో విశాఖకు చెందిన మరో ఫిషింగ్ బోటు ఒడిశాలోని పూరి సముద్ర జలాల్లో చిక్కుకుపోయింది. జూన్ 22న విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి వేటకు వెళ్లిన 9మంది మత్స్యకారులు బోటు ఇంజిన్ ఆగిపోవడంతో సముద్రంలోనే చిక్కుకుపోయారు. తాము సురక్షితంగా ఉన్నామని, తమను కాపాడాలని మత్స్యకారులు వీడియో సందేశం ద్వారా తమ కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తక్షణమే విశాఖ కలెక్టర్‌తో మాట్లాడారు. కలెక్టర్.. కోస్ట్‌గార్డ్ బృందాల సాయంతో మత్స్యకారులను రక్షించేందుకు ముమ్మర చర్యలు చేపట్టారు.

ఇంట్లోకి వచ్చిన చిరుత.. CCTVలో షాకింగ్ దృశ్యాలు▶
AP· 5 Jul 2026

ఇంట్లోకి వచ్చిన చిరుత.. CCTVలో షాకింగ్ దృశ్యాలు

AP: తిరుపతిలో అర్థరాత్రి ఓ లెక్చరర్ ఇంట్లోకి చిరుత సంచారం.. స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కరకంబాడి రోడ్డులోని వెంకటాపురంలో లెక్చ‌ర‌ర్ బాలాజీ ఇంటి లోపల ఒక పెంపుడు కుక్క కట్టేసి ఉండగా దానిపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. ఇంతలో ఇంట్లో వాళ్లు కేకలు పెట్టడంతో చిరుత బయటకు పరుగులు తీసింది. దీనికి సంబంధించిన దృశ్యాలు CC TV కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతమూడు రోజులుగా చిరుత సంచరిస్తుండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు
AP· 5 Jul 2026

ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు

AP: ప్రముఖ యూట్యూబర్, ప్రశ్న రావణ్ అలియాస్ బచ్చలకూరి జోసెఫ్‌పై కృష్ణా జిల్లా గన్నవరం PS‌లో రాజద్రోహం కేసు నమోదైంది. జనసేన నేత గరికపాటి శివశంకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగానే FIR నమోదు అయింది. ఈ కేసులో భాగంగా పోలీసులు BNS సెక్షన్ 147, 148, 152 లతో పాటు, UAPA చట్టం కింద కేసులు నమోదు చేశారు. మరోవైపు తనపై నమోదైన అన్ని కేసులను ఒకేసారి విచారించాలని రావణ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

గల్లంతైన మత్స్యకారుల్లో ఐదుగురు క్షేమం
AP· 5 Jul 2026

గల్లంతైన మత్స్యకారుల్లో ఐదుగురు క్షేమం

AP: విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుంచి చేపల వేటకు వెళ్లి సముద్రంలో గల్లంతైన ఏడుగురు మత్స్యకారులలో ఐదుగురి ఆచూకీని అధికారులు గుర్తించారు. గల్లంతైన మత్స్యకారుల్లో కారె చిన్నయ్యను సముద్రంలో ప్రయాణిస్తున్న ఒక వాణిజ్య నౌక సిబ్బంది గుర్తించి సురక్షితంగా కాపాడారు. చిన్నయ్యతో పాటు మరో నలుగురు మత్స్యకారులు కూడా అదే ప్రాంతంలో ఉన్నారు. అయితే వారు వాణిజ్య నౌకపైకి ఎక్కలేకపోయినట్లు అధికారులు వెల్లడించారు. ఆచూకీ ఇంకా తెలియని మిగిలిన ఇద్దరి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.

రైల్వే ట్రాక్‌పై షాకింగ్ ఘటన
AP· 5 Jul 2026

రైల్వే ట్రాక్‌పై షాకింగ్ ఘటన

AP: ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం చేబ్రోలు రైల్వేస్టేషన్‌ సమీపంలో రైలు ఢీకొని నలుగురు మృతి చెందారు. మృతదేహాలు ఛిద్రమై గుర్తుపట్టలేనంతగా మారిపోయాయి. సమాచారం అందుకున్న తాడేపల్లిగూడెం రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని డెడ్‌బాడీలను పరిశీలించారు. నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వారై ఉంటారని.. వారంతా సూసైడ్ చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. మృతుల వయసు 30 నుంచి 35 ఏళ్ల మధ్యలో ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మంత్రి ఆరోపణలపై ప్రకాష్ రాజ్ ఫైర్▶
AP· 5 Jul 2026

మంత్రి ఆరోపణలపై ప్రకాష్ రాజ్ ఫైర్

AP: నటుడు ప్రకాష్‌రాజ్‌కు, యూట్యూబర్, ప్రశ్న రావణ్‌కు మధ్య చీకటి సంబంధాలు ఉన్నాయని కందుల దుర్గేష్ ఆరోపించిన విషయం తెలిసిందే. మంత్రి వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్‌ స్పందించారు. వేర్వేరు సందర్భాల్లో నేను చేసే ట్విట్లను, మాట్లాడుకున్న వాయిస్ మెసెజెస్‌తో సోషల్ మీడియాలో లీక్ చేసి ప్రశ్న రావణ్, నేను మాట్లాడుతున్నట్లు పెట్టిన ఆడియో అవాస్తవమని, దీన్ని ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రశ్నించే గొంతులను అణచివేయాలని అనుకోవడం సరికాదని ప్రకాష్ రాజ్ ఫైరయ్యారు. గాలి మాటలు సృష్టించి చేస్తున్న అక్రమ అరెస్టులను, దౌర్జన్యాన్ని తెలుగు ప్రజలు చూస్తున్నారన్నారు.

ప్రశ్న రావణ్‌ మరోసారి అరెస్ట్
AP· 5 Jul 2026

ప్రశ్న రావణ్‌ మరోసారి అరెస్ట్

AP: ఇప్పటికే నాలుగు వేర్వేరు కేసుల్లో అరెస్టై బెయిల్ పొందిన ప్రశ్న రావణ్‌ను తాజాగా ఐదోసారి పోలీసులు అరెస్ట్ చేశారు. డిప్యూటీ CM పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ప్రశ్న రావణ్‌పై రాష్ట్రవ్యాప్తంగా PSలలో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. పోలీసులు ఆయన్ను వరుసగా అరెస్టు చేస్తున్నారు. శుక్రవారం రాత్రి కృష్ణాజిల్లా మచిలీపట్నంలో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం మచిలీపట్నం నుంచి ఆయనను నక్కపల్లి రూరల్ సర్కిల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తాజాగా గన్నవరం స్టేషన్‌లో నమోదైన కేసులో ఆదివారం తెల్లవారుజామున రావణ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

హైకోర్టును ఆశ్రయించిన ప్రశ్న రావణ్
AP· 5 Jul 2026

హైకోర్టును ఆశ్రయించిన ప్రశ్న రావణ్

AP ప్రభుత్వం తనపై కక్ష సాధింపు చర్యలు చేపడుతుందని ప్రముఖ యూట్యూబర్, ప్రశ్న రావణ్ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన అన్ని కేసులను ఒకే కేసుగా విచారించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేసుల దర్యాప్తును CBIకి అప్పగించాలని ఆయన హైకోర్టును కోరారు. ప్రతివాదులుగా AP ప్రభుత్వం, DGPతో పాటు పలువురు జిల్లా SPలను చేర్చారు. యూట్యూబర్ రావణ్ దాఖలు చేసిన పిటిషన్‌పై రేపు విచారణ చేపట్టనున్నట్లు AP హైకోర్టు తెలిపింది.

విశాఖ తీరంలో టెన్షన్.. ఆ ఏడుగురి జాడే లేదు
AP· 5 Jul 2026

విశాఖ తీరంలో టెన్షన్.. ఆ ఏడుగురి జాడే లేదు

AP: విశాఖ తీరంలో వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారడంతో వీరు ప్రమాదంలో చిక్కుకున్నట్లు భావిస్తున్నారు. వీరు జూలై 1న విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుంచి బోటులో సముద్రంలోకి వేటకు వెళ్లారు. సముద్రం ఒక్కసారిగా మారడంతో తిరిగి హార్బర్‌కు వచ్చేందుకు నిర్ణయించుకున్నారు. నిన్న మత్స్యకారులు తమ కుటుంబసభ్యులకు ఫోన్ చేసి, మధ్యాహ్నం 3గంటల కల్లా విశాఖ ఫిషింగ్ హార్బర్‌కు చేరుకుంటామని చెప్పారు. ఇంకా రాకపోవడంతో ఆందోళన మొదలైంది.

ఫేక్ సాలరీ స్లిప్స్‌తో SBIకి టోకరా
Crime· 5 Jul 2026

ఫేక్ సాలరీ స్లిప్స్‌తో SBIకి టోకరా

TG: ఫేక్ సాలరీ స్లిప్స్, తప్పుడు గుర్తింపు పత్రాలు సమర్పించి మేడిపల్లి SBI బ్రాంచ్ నుంచి రూ.10 లక్షల పర్సనల్ లోన్ పొంది మోసానికి పాల్పడిన ఓ నర్సింగ్ అధికారిణిపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. సనత్‌నగర్‌లోని ESIC సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో సీనియర్ నర్సింగ్ అధికారిణిగా పనిచేస్తున్నట్లు ప్రతిభ అనే మహిళ 2023 ఏప్రిల్‌లో పర్వతాపూర్ SBI బ్రాంచ్‌లో రూ.10లక్షల పర్సనల్ లోన్‌ తీసుకుంది. బ్యాంకు అంతర్గత విచారణలో మోసం బయటపడటంతో మేడిపల్లి పోలీసులకు బ్యాంక్ అధికారులు ఫిర్యాదు చేశారు. మేడిపల్లి పోలీసులు నర్సింగ్ అధికారిణిపై క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సాయికృష్ణను లాకప్‌లోనే చంపేశారు: అంబటి
Politics· 5 Jul 2026

సాయికృష్ణను లాకప్‌లోనే చంపేశారు: అంబటి

AP: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విజయవాడ గాదె సాయికృష్ణ లాకప్‌డెత్ కేసును CBIకి అప్పగించాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కేసులో చాలా అనుమానాలు ఉన్నాయన్నారు. సాయికృష్ణను లాకప్‌లోనే చంపి డెడ్‌బాడీ కూడా మాయం చేశారని ఆయన ఆరోపించారు. కేసు భూస్థాపితం చేయాలని CI నాగరాజు చూశారని, జగన్ సాయికృష్ణ తల్లిని పరామర్శించే వరకూ కేసు నమోదు చేయలేదని ఫైరయ్యారు. జగన్ వెళ్లకపోయి ఉంటే కేసు రిజిస్టర్ కూడా అయ్యేదికాదని అన్నారు. CI నాగరాజు ఈ కేసులో వాస్తవాలు బయటకు రాకుండా చేశారని ఆరోపించారు.

ప్రిన్సిపల్ నిర్లక్ష్యంతో స్టూడెంట్ మిస్సింగ్
Local· 5 Jul 2026

ప్రిన్సిపల్ నిర్లక్ష్యంతో స్టూడెంట్ మిస్సింగ్

TG: ఖమ్మం జిల్లా కారేపల్లి మైనారిటీ గురుకుల పాఠశాలలో మైనర్ విద్యార్థిని మిస్సింగ్ ఘటన విద్యార్థుల భద్రతపై ఆందోళనకు దారితీసింది. హాస్టల్ నుంచి బయటకు వెళ్లిన విద్యార్థిని తిరిగి రాకపోవడంతో అధికారులు పాఠశాలలో విస్తృతంగా విచారణ నిర్వహించారు. విద్యార్థులను పంపించే విషయంలో పాటించాల్సిన నిబంధనలను అమలు చేయకపోవడం, పర్యవేక్షణ లోపమే ఈ ఘటనకు కారణమని విజిలెన్స్ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. పోలీసులు విద్యార్థిని ఆచూకీ గుర్తించి భరోసా కేంద్రానికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

హైవేపై ఘోర ప్రమాదం.. నలుగురు స్పాట్‌డెడ్
TG· 5 Jul 2026

హైవేపై ఘోర ప్రమాదం.. నలుగురు స్పాట్‌డెడ్

TG: నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామ శివారులోని హైదరాబాద్-విజయవాడ హైవేపై అతివేగంగా వచ్చిన ట్రావెల్స్ బస్సు ఎదురుగా ఉన్న కారును బలంగా ఢీకొట్టింది. కారులో ఉన్న నలుగురు స్పాట్‌లో ప్రాణాలు కోల్పోగా, కారు డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న చిట్యాల పోలీసులు తీవ్రంగా గాయపడిన కారు డ్రైవర్‌ను సమీపంలోని హాస్పిటల్‌కు తరలించారు. నేషనల్ హైవేపై భారీగా వాహనాలు నిలిచిపోగా, పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ప్రమాదం ధాటికి కారు పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది.