Latest

నొప్పి నివారణకు సరికొత్త డివైజ్ 'క్యూరాపాడ్'!
Politics· 1 Jul 2026

నొప్పి నివారణకు సరికొత్త డివైజ్ 'క్యూరాపాడ్'!

కండరాలు, కీళ్ల నొప్పుల నుంచి తక్షణ ఉపశమనం అందించేందుకు 'క్యూరాపాడ్' అనే సరికొత్త వేరబుల్ పరికరం దేశంలో అందుబాటులోకి వచ్చింది. ఫిజియోథెరపీ, హీట్ ప్యాక్ కలయికతో పనిచేసే ఈ డివైజ్ కేవలం వెల్‌నెస్ గ్యాడ్జెట్ మాత్రమే కాదు; ఇది CDSCO ఆమోదం మరియు US FDA Class II రిజిస్ట్రేషన్ పొందిన సురక్షితమైన వైద్య పరికరం. ఫోటోబయోమాడ్యులేషన్ సాంకేతికత ద్వారా పనిచేసే ఈ పరికరంతో ఇప్పుడు ఇంట్లోనే క్లినికల్ తరహా థెరపీ పొందవచ్చు.

CM రేవంత్ రెడ్డికి RSP ఓపెన్ ఛాలెంజ్!
Politics· 1 Jul 2026

CM రేవంత్ రెడ్డికి RSP ఓపెన్ ఛాలెంజ్!

TG: తెలంగాణలో జరిగిన ₹2000 కోట్ల గురుకుల కుంభకోణం ఆరోపణలపై రేపు (జూలై 2) సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో బహిరంగ చర్చకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సిద్ధమయ్యారు. CM రేవంత్ రెడ్డి ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరిస్తూ తాము చర్చకు రెడీ అని ఆయన ప్రకటించారు. "మా తప్పు నిరూపిస్తే రాజీనామా చేస్తామన్న మంత్రులు సాక్ష్యాలతో చర్చకు రావాలి" అని ట్వీట్ చేశారు. మొదట ఉదయం 11 గంటలకు అనుకున్నా, ప్రెస్ క్లబ్ స్లాట్ బుకింగ్ ప్రాబ్లం వల్ల టైమింగ్‌ను మధ్యాహ్నం 12 గంటలకు మార్చారు.

జర్నలిస్ట్ KVR అరెస్ట్ అప్డేట్!▶
Viral· 1 Jul 2026

జర్నలిస్ట్ KVR అరెస్ట్ అప్డేట్!

హైదరాబాద్‌లో నిన్న రాత్రి అరెస్ట్ అయిన తెలంగాణ జర్నలిస్ట్ KVR కేస్‌లో లేటెస్ట్ అప్‌డేట్! పోలీసులు ఆయన్ని విజయనగరం జిల్లాలోని బొబ్బిలి రూరల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడ KVR స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసిన తర్వాత, బొబ్బిలి గవర్నమెంట్ హాస్పిటల్‌లో మెడికల్ ఎగ్జామినేషన్స్ పూర్తి చేశారు. ఈ ఫార్మాలిటీస్ అన్నీ అయిపోయాక, పోలీసులు ఆయన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేయనున్నారు. ఈ అరెస్ట్ ఇప్పుడు మీడియా సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

వర్షాకాలంలో ఈ తప్పులు చేయకండి!
Health· 1 Jul 2026

వర్షాకాలంలో ఈ తప్పులు చేయకండి!

వర్షాకాలం వచ్చేసింది కదా! ఈ సీజన్‌లో వాతావరణంలో తేమ వల్ల బ్యాక్టీరియా, వైరస్ చాలా ఫాస్ట్‌గా స్ప్రెడ్ అవుతాయి. దీనివల్ల జీర్ణ సమస్యలు, ఫుడ్ పాయిజనింగ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ. అందుకే రోడ్డు పక్కన అమ్మే చాట్, ముందే కట్ చేసిన ఫ్రూట్స్, పచ్చి సలాడ్స్, ఎక్కువ ఆయిల్ ఉన్న ఫుడ్స్‌ని అస్సలు ముట్టకండి. ఎప్పుడూ ఇంట్లో వండిన ఫ్రెష్ అండ్ హాట్ ఫుడ్ మాత్రమే తినండి. తినే ముందు హ్యాండ్ వాష్ మస్ట్! ఒకవేళ కడుపునొప్పి, వాంతులు, జ్వరం లాంటి సింప్టమ్స్ కనిపిస్తే అస్సలు లైట్ తీసుకోకుండా వెంటనే డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వండి. నీళ్లు బాగా తాగుతూ పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేయండి.

MPపై గుడ్లు, కూరగాయలతో BJP కార్యకర్తలు దాడి!▶
Politics· 1 Jul 2026

MPపై గుడ్లు, కూరగాయలతో BJP కార్యకర్తలు దాడి!

పశ్చిమ బెంగాల్ నదియా జిల్లాలో TMC వర్కర్స్ మీటింగ్‌కు వెళ్లిన MP మహువా మోయిత్రాపై కొందరు నిరసనకారులు గుడ్లు, కూరగాయలతో దాడి చేశారు. ఈ దాడి వెనుక BJP హస్తం ఉందని, పోలీసుల ముందే వాళ్లు గూండాల్లా ప్రవర్తించినా పోలీసులు చూస్తూ ఊరుకున్నారని ఆమె తీవ్రంగా ఆరోపించారు. ఈ ఇన్సిడెంట్ వీడియోను మోయిత్రా సోషల్ మీడియాలో షేర్ చేయగా. ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో ఇది హాట్ టాపిక్‌గా మారింది.

ప్రశ్న రావణ్, KVR అరెస్ట్ అప్డేట్!
Politics· 1 Jul 2026

ప్రశ్న రావణ్, KVR అరెస్ట్ అప్డేట్!

అరెస్ట్ అయిన యూట్యూబర్ 'ప్రశ్న రావణ్'ను ఇవాళ సాయంత్రం 6 గంటలకు మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. నిన్న అర్ధరాత్రి తన లైవ్ ముగించుకుని ఒంటరిగా ఇంటికి వెళ్తున్న టైంలో పోలీసులు అతన్ని చుట్టుముట్టి అరెస్ట్ చేశారు. అయితే ఇప్పటివరకు రావణ్‌కి సంబంధించిన ఎలాంటి ఫొటోస్, వీడియోస్ బయటకి రాలేదు. మరోవైపు జర్నలిస్ట్ KVR ఏ పోలీస్ స్టేషన్‌లో ఉన్నారనే దానిపై క్లారిటీ లేకపోవడంతో ఆయన ఫ్యామిలీ తీవ్ర భయాందోళనల్లో ఉంది.

కూటమి ప్రభుత్వంపై ప్రశ్న రావణ్ సీరియస్ కామెంట్స్▶
Viral· 1 Jul 2026

కూటమి ప్రభుత్వంపై ప్రశ్న రావణ్ సీరియస్ కామెంట్స్

యూట్యూబర్ 'ప్రశ్న రావణ్' అరెస్ట్‌కి ముందే చేసిన ఒక పవర్‌ఫుల్ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆయన పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి సంచలన కామెంట్స్ చేశారు. "పవన్ కళ్యాణ్ ఐ స్టాండ్ ఆన్ మై వర్డ్స్! నేను మాట్లాడిన దాంట్లో ఒక్క అక్షరం కూడా వెనక్కి తీసుకోను. నన్ను భయపెట్టాలని చూస్తున్నారా? అరెస్ట్ చేస్తారా. చేసుకోండి, నేను దేనికైనా రెడీ" అంటూ ఓపెన్ ఛాలెంజ్ చేశారు. కూటమి ప్రభుత్వంపై కూడా ఆయన ఫుల్ ఫైర్ అయ్యారు.

తెలంగాణ అస్తిత్వంపై సాంగ్!▶
Viral· 1 Jul 2026

తెలంగాణ అస్తిత్వంపై సాంగ్!

తెలంగాణ యాస, భాషపై జరుగుతున్న దాడిని తీవ్రంగా ఖండిస్తూ.. తెలంగాణ ఉద్యమ కవి, సింగర్ ముక్కపల్లి శ్రీనివాస్ ఒక పవర్‌ఫుల్ సాంగ్ పాడారు. "తెలంగాణ యాస మా ఆత్మగౌరవం. భాష మా అస్తిత్వం, దానిపై ఎలాంటి దాడినైనా సహించం" అంటూ ఆయన పాడిన ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. తెలంగాణ లాంగ్వేజ్ లవర్స్ ఈ వీడియోని విపరీతంగా షేర్ చేస్తూ సపోర్ట్ ఇస్తున్నారు.

యూట్యూబర్ 'ప్రశ్న రావణ్' అరెస్ట్!
AP· 1 Jul 2026

యూట్యూబర్ 'ప్రశ్న రావణ్' అరెస్ట్!

డిప్యూటీ CM పవన్ కళ్యాణ్‌ని తన వీడియోస్‌లో ప్రశ్నిస్తున్నాడని యూట్యూబర్ 'ప్రశ్న రావణ్'ని పిఠాపురం పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లో నిన్న అర్ధరాత్రి 12:30 గంటల సమయంలో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్ట్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.

బండి భగీరథ్ పోక్సో కేస్ అప్డేట్!
Legal· 1 Jul 2026

బండి భగీరథ్ పోక్సో కేస్ అప్డేట్!

బండి భగీరథ్ POCSO కేస్‌లో హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. భగీరథ్ బెయిల్ కోసం పెట్టుకున్న అప్లికేషన్‌పై విచారణను కోర్టు జూలై 3కి వాయిదా వేసింది. ఈ బెయిల్ మ్యాటర్‌పై బాధిత బాలికకి నోటీసులు పంపాలని హైకోర్టు ఆదేశించింది. జూలై 3న జరిగే నెక్స్ట్ హియరింగ్‌లో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

అర్ధరాత్రి ఎలక్ట్రిక్ బస్సులో చెలరేగిన మంటలు
Crime· 1 Jul 2026

అర్ధరాత్రి ఎలక్ట్రిక్ బస్సులో చెలరేగిన మంటలు

TG: కరీంనగర్ బస్ డిపో-2లో మంగళవారం అర్ధరాత్రి దాటాక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. డిపో ఆవరణలో పార్కింగ్ చేసిన TGSRTC ఎలక్ట్రికల్ ఎక్స్‌ప్రెస్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు బస్సు మొత్తానికి వ్యాపించి క్షణాల్లోనే వాహనం పూర్తిగా దగ్ధమైంది. ప్రమాద సమయంలో బస్సులో ప్రయాణికులెవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ బస్సుల్లో ఈ తరహా అగ్నిప్రమాదం జరగడం ఇది వరుసగా మూడోసారి.

గాదె సాయికృష్ణ కేస్: రిమాండ్ రిపోర్టులో షాకింగ్ నిజాలు!
Crime· 1 Jul 2026

గాదె సాయికృష్ణ కేస్: రిమాండ్ రిపోర్టులో షాకింగ్ నిజాలు!

గాదె సాయికృష్ణ మిస్సింగ్ కేసులో హెడ్‌కానిస్టేబుళ్లు అశోక్, నాని రిమాండ్ రిపోర్టులో పోలీసులు సంచలన విషయాలు బయటపెట్టారు. ఇన్వెస్టిగేషన్‌లో వాళ్ళు నిజాలు చెప్పలేదని, మొబైల్స్ అడిగితే నాగపూర్‌లో ఎవరో తెలియని వాళ్ళకి అమ్మేసామని అబద్ధాలు చెప్తున్నారని పోలీసులు వెల్లడించారు. మే 5న సాయికృష్ణ లొకేషన్ మార్కాపురంలో చూపించింది. కోర్టులో హాజరుపరిచే డేట్ కంటే ముందే నిందితుడిని బంధించారని, FIRలో ఉన్నవాళ్లంతా కలిసే సాయికృష్ణను మిస్ చేశారని రిపోర్టులో mention చేశారు. దీనిపై ఇంకా ఫుల్ ఎంక్వైరీ జరగాల్సి ఉంది.

భర్త శవం.. భార్యే విలన్!
Crime· 1 Jul 2026

భర్త శవం.. భార్యే విలన్!

నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం అంబం గ్రామంలో దారుణం జరిగింది. భార్య స్వరూప తన లవర్ తో కలిసి భర్త మహిపాల్ (29)ని దారుణంగా మర్డర్ చేసింది. ఆ తర్వాత అది హార్ట్ ఎటాక్, ఉరి వేసుకుని చనిపోయాడంటూ అబద్దాలతో డ్రామాలు ఆడింది. కానీ, శవం మెడపై లోతైన గాయం ఉండటంతో గ్రామస్తులకి డౌట్ వచ్చి పోలీసులకి కంప్లైంట్ చేశారు. కేసు ఫైల్ చేసిన పోలీసులు ఇన్వెస్టిగేషన్‌లో అసలు నిజం బయటపెట్టారు. నిందితులను అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేస్తున్నారు.

వింత పురుగుల దాడి.. 19మంది స్టూడెంట్స్‌కు అస్వస్థత
Politics· 1 Jul 2026

వింత పురుగుల దాడి.. 19మంది స్టూడెంట్స్‌కు అస్వస్థత

AP: చిత్తూరు జిల్లా కార్వేటినగరం మండలం డీఎంపురం ZP ఉన్నత పాఠశాలలో చెట్టుపై నుంచి పడిన వింత పురుగులు కుట్టడంతో 19మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దద్దుర్లు, మంట రావడంతో విద్యార్థులను వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్‌కు తరలించారు. విద్యార్థులు చెట్ల కింద ఆడుకుంటుండగా ఈ ఘటన జరిగింది. అయితే కుట్టిన పురుగులు వింతగా ఉండటంతో ప్రజలు టెన్షన్ పడుతున్నారు. ఈ ఘటనతో పాఠశాలకు సెలవు ప్రకటించారు. ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో యాసిడ్ పురుగులు రోవ్ బీటిల్స్ బెడద తీవ్రంగా పెరిగిపోయిన సంగతి తెలిసిందే.

టుడే గోల్డ్ రేట్స్!
Politics· 1 Jul 2026

టుడే గోల్డ్ రేట్స్!

బంగారం కొనాలనుకునే వారికి గుడ్‌న్యూస్! మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. మంగళవారం ఉదయం 10 గంటల సమయానికి హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.1,40,780 కి చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,29,050 గా ఉంది. అయితే, గోల్డ్ రేట్స్ ఎప్పటికప్పుడు మారుతుంటాయి కాబట్టి, మీరు షాపింగ్‌కి వెళ్లే ముందు ఒకసారి కరెంట్ లైవ్ ప్రైస్ చెక్ చేసుకోవడం బెస్ట్.

KTRను కలిసిన జెన్-జీ యువతులు
TG· 1 Jul 2026

KTRను కలిసిన జెన్-జీ యువతులు

TG: రాజకీయాలపై మక్కువతో, సమాజంలో మార్పు తీసుకురావాలనే సంకల్పంతో ఉన్న నలుగురు జెన్ జీ యువతులు KTRను కలిశారు. ఉన్నత చదువుల కోసం సిద్ధమవుతున్న నలుగురు హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ను కలిసి మాట్లాడారు. లండన్‌లోని కింగ్స్ కాలేజీలో చదవనున్న సరయు, నల్సార్ లా యూనివర్సిటీకి చెందిన లాస్య, సింబయాసిస్ లా స్కూల్ విద్యార్థిని రేవతి, సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీకి చెందిన అశ్విని.. తాము భవిష్యత్తులో రాజకీయ నేతలుగా ఎదగాలని నిర్ణయించుకున్నట్లు వివరించారు. సమాజంలో మార్పు కోసం నలుగురు ఆడబిడ్డలు రాజకీయాల్లోకి రావాలనుకోవడంపై KTR అభినందించారు.

ORR పై కాల్పుల కలకలం
TG· 1 Jul 2026

ORR పై కాల్పుల కలకలం

TG: హైదరాబాద్ నగర శివారులోని ORRపై కాల్పుల ఘటన కలకలం రేపింది. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ శ్రీకాంత్ తన అనుచరులతో కలిసి రంగారెడ్డి జిల్లా బొంగులూరు గేట్ ఎగ్జిట్ నంబర్-12 వద్ద ఒక DCM వాహనంలో ఉన్నట్లు రికార్డు అయింది. నల్గొండ జిల్లా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ వింగ్ పోలీసులు శ్రీకాంత్‌ను పట్టుకునేందుకు వెళ్లగా, నిందితులు లొంగిపోవడానికి బదులుగా పోలీసులపై కత్తులతో దాడిచేశారు. ఒక CCS హెడ్ కానిస్టేబుల్ తలకు తీవ్ర గాయమైంది. ఆత్మరక్షణ కోసం గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపి నిందితులను హెచ్చరించారు. అయినప్పటికీ వినకపోవడంతో శ్రీకాంత్ కాళ్లపై కాల్పులు జరిపి వారిని అరెస్ట్ చేశారు.

KV రెడ్డి అరెస్ట్‌పై కవిత ఫైర్▶
Politics· 1 Jul 2026

KV రెడ్డి అరెస్ట్‌పై కవిత ఫైర్

TG: జర్నలిస్ట్ KV రెడ్డి అరెస్ట్‌ను తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత తీవ్రంగా ఖండించారు. AP పోలీసులు KV రెడ్డిని లాక్కొని వెళ్తుంటే హృదయ విదారకంగా ఏడుస్తున్న ఆయన భార్య, చిన్న పిల్లలను తెలంగాణ పోలీసులు అడ్డుకొని సహకరించడం సిగ్గుచేటు అని ఫైరయ్యారు. ఒకే కేసులో ఇది వరకే కేవీ రెడ్డిని అరెస్ట్ చేసిన AP పోలీసులు ఇప్పుడు మళ్లీ అదే కేసులో అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం అని అన్నారు. వెంటనే కేవీ రెడ్డిని విడుదల చేయాలని, ఆయన కుటుంబానికి తెలంగాణ రక్షణ సేన పార్టీ అండగా ఉంటుందన్నారు.

అర్ధరాత్రి జర్నలిస్టుల అరెస్ట్▶
TG· 1 Jul 2026

అర్ధరాత్రి జర్నలిస్టుల అరెస్ట్

TG: హైదరాబాద్‌లో అర్ధరాత్రి వేళ AP పోలీసులు తెలంగాణకు చెందిన జర్నలిస్టులు KV రెడ్డి, స్వతంత్ర జర్నలిస్ట్ ప్రశ్న రావణ్‌లను అరెస్ట్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, కుటుంబసభ్యులకు కనీస సమాచారం అందించకుండా జర్నలిస్టులను వారి ఇళ్ల నుంచి బలవంతంగా లాక్కెళ్లారు. KV రెడ్డిని అక్రమంగా అరెస్టు చేస్తుండగా అడ్డుకున్న భార్యతో పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు. దీంతో ఆమె సరూర్‌నగర్ PSలో ఫిర్యాదు చేశారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని జర్నలిస్టు సంఘాలు డిమాండ్ చేశాయి.

25రోజులైనా వీడని మిస్టరీ.. పోలీసుల స్పెషల్ ఆపరేషన్
AP· 1 Jul 2026

25రోజులైనా వీడని మిస్టరీ.. పోలీసుల స్పెషల్ ఆపరేషన్

AP: కాకినాడ జిల్లా తుని మండలం CH అగ్రహారం గ్రామానికి చెందిన చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి 25రోజుల క్రితం మిస్సైన విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఎలాంటి ఆచూకీ లభించలేదు. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు ఏకంగా 12 ప్రత్యేక బృందాలతో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఎలాంటి క్లూ దొరకకపోవడం ఆందోళన కలిగిస్తోంది. చిన్నారి ఫోటోతో కూడిన వాల్ పోస్టర్ల ద్వారా చుట్టుపక్కల జిల్లాలతోపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వీటిని అతికించారు. సమాచారం తెలిపిన వారికి రూ. లక్ష పారితోషికం ఇస్తామని ప్రకటించారు.

ఉచిత కరెంట్ కాంగ్రెస్ పార్టీ పేటెంట్
TG· 1 Jul 2026

ఉచిత కరెంట్ కాంగ్రెస్ పార్టీ పేటెంట్

TG: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని CM రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 30నెలల పాలనలో రూ.1.75 లక్షల కోట్లు వెచ్చించి రైతులు ఆత్మగౌరవంతో బతికేలా చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్ శిల్పకళావేదికలో సీఎం రైతుభరోసా నిధులు విడుదల చేసి మాట్లాడారు. వ్యవసాయాన్ని పండుగలా తీర్చిదిద్దామని, ఈ ప్రజా ప్రభుత్వాన్ని కంచె వేసి కాపాడుకునే బాధ్యత మీదేనని CM రైతులను ఉద్దేశించి అన్నారు. ఉచిత కరెంట్ కాంగ్రెస్ పార్టీ పేటెంట్. ఇప్పటి వరకు దీనికోసం రూ.30 వేల కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు.