25రోజులైనా వీడని మిస్టరీ.. పోలీసుల స్పెషల్ ఆపరేషన్

AP: కాకినాడ జిల్లా తుని మండలం CH అగ్రహారం గ్రామానికి చెందిన చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి 25రోజుల క్రితం మిస్సైన విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఎలాంటి ఆచూకీ లభించలేదు. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు ఏకంగా 12 ప్రత్యేక బృందాలతో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఎలాంటి క్లూ దొరకకపోవడం ఆందోళన కలిగిస్తోంది. చిన్నారి ఫోటోతో కూడిన వాల్ పోస్టర్ల ద్వారా చుట్టుపక్కల జిల్లాలతోపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వీటిని అతికించారు. సమాచారం తెలిపిన వారికి రూ. లక్ష పారితోషికం ఇస్తామని ప్రకటించారు.



