Latest

వర్క్‌షాప్ ఉద్యోగుల సమస్యలపై మంత్రి హామీ
Local· 13h ago

వర్క్‌షాప్ ఉద్యోగుల సమస్యలపై మంత్రి హామీ

కరీంనగర్ RTC వర్క్‌షాప్‌ జోనల్ పరిధిలో 12 ఏళ్ల తర్వాత జరిగిన ఎంప్లాయీస్ యూనియన్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఐక్యకూటమి ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో యూనియన్ గౌరవ అధ్యక్షుడు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో నాయకులు మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిశారు. వర్క్‌షాప్‌ ఉద్యోగుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లగా, పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.

'పండుగ వేళ శాంతిభద్రతలకు సహకరించండి'
Local· 13h ago

'పండుగ వేళ శాంతిభద్రతలకు సహకరించండి'

విజయదశమి సందర్భంగా నిజామాబాద్ జిల్లా ప్రజలకు పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ పండుగ స్ఫూర్తితో ప్రజలంతా ఐక్యత, సమగ్రతను కాపాడాలని ఆకాంక్షించారు. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా, మత విద్వేషాలకు తావివ్వకుండా పోలీసులకు సహకరించాలని కోరారు. ప్రజలు, పోలీసులు స్నేహభావంతో మెలగాలని సూచించారు.

'ఆనకట్టల వద్ద నీటి నిల్వకు ప్రభుత్వం కసరత్తు'
Local· 13h ago

'ఆనకట్టల వద్ద నీటి నిల్వకు ప్రభుత్వం కసరత్తు'

ఖమ్మం జిల్లా అమ్మగారి పల్లి వద్ద గోదావరి ఆనకట్టను పరిశీలించిన మంత్రి తుమ్మల, ఎల్ నినో ముప్పు దృష్ట్యా దసరా నుంచి దుమ్ముగూడెం వద్ద ఇసుక బస్తాలతో ఒక టీఎంసీ నీటిని నిల్వ చేస్తామన్నారు. పంటలను కాపాడటమే లక్ష్యమని చెబుతూ, నీటి కొరత వల్ల రైతులు వరి సాగు చేయకుండా తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని కోరారు.

తెలంగాణ ఆర్మీ మేజర్ భార్యపై గూఢచర్యం కేసు
National· 13h ago

తెలంగాణ ఆర్మీ మేజర్ భార్యపై గూఢచర్యం కేసు

తెలంగాణకు చెందిన ఓ మహిళపై జమ్మూ పోలీసులు గూఢచర్యం కేసు నమోదు చేశారు. జమ్మూలో పనిచేస్తున్న ఆర్మీ మేజర్ భార్య అయిన ఆమె, చైనా నిఘా వర్గాలకు రక్షణ రంగానికి సంబంధించిన సమాచారం అందించిందని అనుమానిస్తున్నారు.Chatgpt, Cloud AI హెల్ప్‌తొ డాక్యుమెంట్స్ తయారు చేసినట్లు ఎంక్వయిరీలో గుర్తించారు. ఆమెను అదుపులోకి తీసుకుని ఫోన్‌ను పరిశీలిస్తున్నారు. అయితే, బహిరంగంగా లభించే సమాచారాన్నే ఉపయోగించానని ఆమె చెబుతున్నట్లు సమాచారం.

"రక్త చరిత్ర వారిదే": CM చంద్రబాబు
AP· 13h ago

"రక్త చరిత్ర వారిదే": CM చంద్రబాబు

AP: ప్రతిపక్ష YCP రక్త చరిత్రకు పాల్పడుతూ.. తామే పాల్పడుతున్నామని అంటున్నారని CM చంద్రబాబు విమర్శించారు. రాజకీయ పార్టీ బాధ్యతతో ఉండాలన్న ఆయన.. తాము చెప్పిందే జరగాలనీ, లేదంటే.. దాడులకు పాల్పడే ధోరణి కరెక్ట్ కాదన్నారు. "అప్పుడు CECకి అనుకూలంగా ఓటు వేసి.. ఎన్నికల్లో ఓడిపోవడంతో.. ఇప్పుడు CEC నచ్చలేదా" అని చంద్రబాబు సెటైర్ వేశారు. Gen Zని తప్పుదారి పట్టించడం, కరడుగట్టిన నేరస్థులను పెంచి పోషించడం సరి కాదని చంద్రబాబు అన్నారు.

చిలాపూర్ ఉద్యోగుల సంఘానికి కొత్త కార్యవర్గం
Local· 13h ago

చిలాపూర్ ఉద్యోగుల సంఘానికి కొత్త కార్యవర్గం

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం చిలాపూర్ గ్రామ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ (ఈవ్స్) నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా కొప్పురపు నరసింహారెడ్డి, అధ్యక్షుడిగా పర్కాల ఎల్లయ్య, ప్రధాన కార్యదర్శిగా నరెడ్ల సత్తయ్య ఎంపికయ్యారు. ఉపాధ్యక్షులుగా మచ్చ సత్తయ్య, కొప్పురపు రాజిరెడ్డి, ఎర్రవెల్లి వీరయ్య, మహిళా కార్యదర్శిగా పవ్వాడి పూర్ణిమ, కోశాధికారిగా యాంసాని అశోక్ బాధ్యతలు చేపట్టనున్నారు.

ఎన్నికల వేళ 4,013 మందిపై బైండోవర్ కేసులు
Local· 13h ago

ఎన్నికల వేళ 4,013 మందిపై బైండోవర్ కేసులు

కర్నూలు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. జిల్లాలోని 43 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆదివారం వరకు 4,013 మందిపై 964 బైండోవర్ కేసులు నమోదు చేశారు. కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలో 221 మంది రౌడీషీటర్లతో సహా 773 మందిపై కేసులు నమోదు చేసి, ఎన్నికల్లో గొడవలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

నీట్ లీక్ కేసులో టీ స్టాల్ యజమాని
National· 13h ago

నీట్ లీక్ కేసులో టీ స్టాల్ యజమాని

NEET-UG 2026 పేపర్ లీక్ కేసులో పుణెలోని ‘మలక్ చాయ్’ టీ స్టాల్ యజమాని శేష్రావ్ బజరంగ్ సూర్యవంశీపై CBI ఛార్జ్‌షీట్ పైల్ చేసింది. ఈ కేసులో అతడిని 14వ నిందితుడిగా చేర్చింది. CBI ప్రకారం, మరో నిందితుడు శుభమ్ ఖైర్నార్‌తో కలిసి విద్యార్థులకు లీకైన ప్రశ్నపత్రం అందించడంలో అతడు పాత్ర పోషించాడు. నాసిక్‌లోని పంచక్ గ్రామానికి కనీసం 10 మంది విద్యార్థులను తీసుకెళ్లి, డబ్బులు చెల్లించేలా వారి ఒరిజినల్ సర్టిఫికెట్లను తన వద్ద ఉంచుకున్నట్లు ఆరోపణలున్నాయి.

కూటమి అభ్యర్థులను గెలిపించండి: చంద్రబాబు
AP· 13h ago

కూటమి అభ్యర్థులను గెలిపించండి: చంద్రబాబు

AP: ప్రజలు మెచ్చిన వాళ్లనే అభ్యర్థుల ఎంపిక చేశామన్నారు TDP చీఫ్ చంద్రబాబు. కూటమి అభ్యర్థులను గెలిపించాలన్న ఆయన.. అభివృద్ధి సహకరించాలని కోరారు. ఈసారి పట్టణ స్థానిక ఎన్నికల్లో మేయర్లు, ఛైర్‌పర్సన్లను నేరుగా ఎన్నుకునే విధానం తెచ్చామన్న CM.. BCలు, యువత, మహిళకు ప్రాధాన్యమిచ్చామనీ.. విద్యావంతులను అభ్యర్థులుగా నిలబెట్టామని అన్నారు. గంజాయి బ్యాచ్ వర్సెస్ విద్యావంతులు అన్నట్టుగా స్థానిక ఎన్నికల్లో పోటీ ఉందని చంద్రబాబు అన్నారు.

ఆయుష్ శాఖలో 8 పోస్టులు.. దరఖాస్తులు ప్రారంభం!
Local· 13h ago

ఆయుష్ శాఖలో 8 పోస్టులు.. దరఖాస్తులు ప్రారంభం!

జాతీయ ఆయుష్ మిషన్ పరిధిలో జగిత్యాల జిల్లాలో 8 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఈ వివరాలు తెలిపారు. మెడికల్ ఆఫీసర్లు, ఫార్మసిస్ట్, సైకలాజికల్ కౌన్సిలర్, యోగా ప్రొఫెషనల్, మల్టీపర్పస్ వర్కర్ తదితర పోస్టులు ఉన్నాయి. ఈ నెల 22 నుంచి 27వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. పూర్తి వివరాల కోసం జిల్లా అధికారిక వెబ్‌సైట్‌ను పరిశీలించాలని సూచించారు.

అది అరాచకాల ప్రభుత్వం: CM చంద్రబాబు
AP· 14h ago

అది అరాచకాల ప్రభుత్వం: CM చంద్రబాబు

AP: స్థానిక ఎన్నికలతో స్థానిక నాయకత్వం బలపడుతుందనీ, అందుకే ఆ ఎన్నికలకు ప్రాధాన్యం ఉంటుంది అన్నారు సీఎం చంద్రబాబు. 2024 జనరల్ ఎన్నికల్లో 94 శాతం స్ట్రైక్ రేట్‌, 57 శాతం ఓట్ షేర్‌తో గెలిచామన్న ఆయన.. గత YCP ప్రభుత్వ అరాచకాలకు వ్యతిరేకంగా ప్రజలు ఇచ్చిన తీర్పు అది అన్నారు. రాయలసీమ ఫ్యాక్షనిజం సినిమాలకు కంటెంటుగా మారిందన్న సీఎం.. ఇప్పుడు సీమలో జరుగుతున్న అభివృద్ధిని చూసి అసూయ పడే పరిస్థితి వచ్చిందన్నారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
Local· 14h ago

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

విశాఖపట్నం జిల్లా సబ్బవరం మండలం పల్లవానిపాలెం వద్ద నిన్న రోడ్డు ప్రమాదం జరిగింది. పెందుర్తికి చెందిన బోర రమణ (48) వాచ్మెన్గా పనిచేస్తూ ద్విచక్రవాహనంపై అనకాపల్లి వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందారు. మృతదేహాన్ని అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ప్రజావాణిలో 49 ఫిర్యాదులు.. కలెక్టర్ ఆదేశాలు!
Local· 14h ago

ప్రజావాణిలో 49 ఫిర్యాదులు.. కలెక్టర్ ఆదేశాలు!

వికారాబాద్ జిల్లా కలెక్టరేట్‌లోని ఐడీఓసీ సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి జరిగింది. జిల్లా కలెక్టర్ దీపక్ తివారి ప్రజల నుంచి 49 ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదుదారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తులను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రతి ఫిర్యాదుపై తీసుకున్న చర్యల వివరాలను సమర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, డీఆర్డీఓ శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ప్రజావాణి ఫిర్యాదులపై కలెక్టర్ ఆదేశాలు!
Local· 14h ago

ప్రజావాణి ఫిర్యాదులపై కలెక్టర్ ఆదేశాలు!

జగిత్యాల కలెక్టరేట్‌లో సోమవారం ప్రజావాణి కార్యక్రమం జరిగింది. జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులు స్వీకరించారు. మొత్తం 16 దరఖాస్తులు అందాయి. ప్రతి ఫిర్యాదుపై సమగ్ర విచారణ జరిపి నిర్ణీత సమయంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ కె.వై. ప్రసాద్, ఆర్డీవో మధుసూదన్, జిల్లా అధికారులు, వివిధ శాఖల అధికారులు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.

దేవాంగ సంఘం అధ్యక్షుడిగా వెంకటరమణ ఏకగ్రీవం!
Local· 14h ago

దేవాంగ సంఘం అధ్యక్షుడిగా వెంకటరమణ ఏకగ్రీవం!

గుంటూరు జిల్లా మంగళగిరిలో అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా బల్ల వెంకటరమణ మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా అల్లక తాతారావు, కోశాధికారిగా అల్లక నమశ్శివాయ ఎన్నికయ్యారు. దేవాంగ సామాజిక వర్గ అభివృద్ధికి, సంక్షేమానికి సమష్టిగా కృషి చేస్తామని వెంకటరమణ తెలిపారు. రాబోయే మంగళగిరి–తాడేపల్లి నగరపాలక సంస్థ ఎన్నికల్లో కూటమికి సంపూర్ణ మద్దతుగా పనిచేయాలని సమావేశంలో నిర్ణయించారు.

జలవనరులను పొదుపుగా వినియోగించుకోవాలి: తుమ్మల
Local· 14h ago

జలవనరులను పొదుపుగా వినియోగించుకోవాలి: తుమ్మల

భద్రాద్రికొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం అమ్మగారిపల్లి సమీపంలోని దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద నీటి నిల్వ పెంచేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. సోమవారం పినపాక ఎమ్మెల్యే, అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్‌, నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి ఆనకట్టను పరిశీలించారు. ఆనకట్ట పూర్తి నిల్వ సామర్థ్యం 0.8 టీఎంసీలు కాగా, ప్రస్తుతం సుమారు 0.5 టీఎంసీల నీటినే నిల్వ చేసుకునే పరిస్థితి ఉందని తెలిపారు.

ఎన్నికల వేళ పోలీసుల పెట్రోలింగ్!
Politics· 14h ago

ఎన్నికల వేళ పోలీసుల పెట్రోలింగ్!

తూర్పు గోదావరి జిల్లా స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరిగేందుకు సీతానగరం పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు గ్రామాల్లో సోమవారం పెట్రోలింగ్ నిర్వహించినట్లు ఎస్సై ఎల్. శ్రీనునాయక్ తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై నిఘా ఉంచామన్నారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయవద్దని, గొడవలకు దూరంగా ఉండి పోలీసులకు సహకరించాలని ప్రజలను కోరారు.

గుడివాడ మున్సిపల్ ఎన్నికలు నిలుపుదల▶
Local· 14h ago

గుడివాడ మున్సిపల్ ఎన్నికలు నిలుపుదల

కృష్ణా జిల్లా గుడివాడ మున్సిపాలిటీ ఎన్నికలపై కోర్టు వివాదాలు కొనసాగుతుండటంతో ఎన్నికల ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయింది. గతంలో టీడీపీ నాయకులు కోర్టును ఆశ్రయించడంతో ఎన్నికలు నిలిచిపోయాయి, అప్పట్లో వైసీపీ అధికారంలో ఉండటంతో ఎన్నికలు నిర్వహించలేదు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించే తరుణంలో వైసీపీ నాయకులు గ్రామాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ కోర్టుకు వెళ్లారు. దీంతో గుడివాడ మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ వాయిదా పడింది.

కారుపై పడ్డ విద్యుత్ స్తంభం
Local· 14h ago

కారుపై పడ్డ విద్యుత్ స్తంభం

ప్రకాశం జిల్లా సంతనూతలపాడులో సోమవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఒంగోలులో వెళ్లే రహదారిలో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జిని ఒంగోలు నుంచి వేగంగా వెళుతున్న కారు బలంగా ఢీ కొట్టింది. దీంతో కారు ముందు భాగం ధ్వంసంమైంది. పక్కనే ఉన్న విద్యుత్ స్తంభం కారుఫై పడి ఆగింది. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉండగా ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రాణహాని జరగలేదు.

డేటా సెంటర్లా? కరవు, కాలుష్యమా?
Current Affairs· 14h ago

డేటా సెంటర్లా? కరవు, కాలుష్యమా?

ఏ రాష్ట్రాల్లో వర్షపాతం లోటు, నీటి కొరత బాగా ఉందో, అక్కడే డేటా సెంటర్లు వస్తున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో వర్షాలు సరిగా పడట్లేదు. ఇక్కడే AI డేటా సెంటర్ల బూమ్ కనిపిస్తోంది. ఒక 100 మెగావాట్ సెంటర్ రోజుకి దాదాపు 20 లక్షల లీటర్ల నీరు వాడుతుంది. ఇది వేల కుటుంబాల రోజువారీ అవసరానికి సమానం. 2025లో దేశవ్యాప్తంగా 150 బిలియన్ లీటర్లను వాడారు. 2030కి 358 బిలియన్లు వాడతారని అంచనా.

రంగోలీతో అదరగొడుతున్న రీసర్వే డిప్యూటీ తహసీల్దార్
AP· 14h ago

రంగోలీతో అదరగొడుతున్న రీసర్వే డిప్యూటీ తహసీల్దార్

విజయనగరం జిల్లా గంట్యాడ మండల రీసర్వే డిప్యూటీ తహసీల్దార్‌ నాగలక్ష్మి తనలోని స్పెషల్ టాలెంట్‌తో ఆకట్టుకుంటున్నారు. 2013లో జూనియర్ అసిస్టెంట్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన ఆమె, కలెక్టరేట్, ఎస్.కోట, చీపురుపల్లి ప్రాంతాల్లో పనిచేసి ఇప్పుడు గంట్యాడలో డ్యూటీ చేస్తున్నారు. సాధారణంగా నేలపై ముగ్గులు వేస్తుంటారు, కానీ నీటిపై రంగులతో రంగవల్లులు తీర్చిదిద్దడం నాగలక్ష్మి ప్రత్యేకత. రంగులు నీటిపై చెదిరిపోకుండా ఒక్కో ఆకారాన్ని డిజైన్ చేస్తూ ప్రశంసలు అందుకంటున్నారు.