Latest
కేరళ డ్రైవర్ ఎమోషనల్ ఫేర్‌వెల్!
కేరళం KSRTC బస్సు డ్రైవర్ రిటైర్మెంట్ రోజు తన బస్సుకు ఎమోషనల్ ఫేర్‌వెల్ చెప్పారు. ఇడుక్కి కుమిలి డిపోకి చెందిన పౌల్ కురియన్ సెప్టెంబర్ 2న తన లాస్ట్ డ్యూటీ పూర్తి చేశారు. షిఫ్ట్ ముగిశాక బస్సును పార్క్ చేసి, స్టీరింగ్‌కు ముద్దుపెట్టుకుని సాల్యూట్ చేస్తూ ఎమోషనల్ అయ్యారు. KSRTC ఆఫీషియల్స్ షేర్ చేసిన ఈ వీడియో నెటిజన్ల మనసులను గెలుచుకుంది. ఆయన డెడికేషన్‌ను ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు.

కొండగట్టు గుట్టపై సెల్ టవర్..!
జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు అంజన్న ఆలయానికి వచ్చే భక్తులకు సెల్ సిగ్నల్ సమస్య ఉంది. భక్తులు, అధికారులు పలుమార్లు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఇండస్ సెల్ టవర్ సంస్థతో మాట్లాడి టవర్ ఏర్పాటుకు చొరవ తీసుకున్నారు. ఇప్పటికే టవర్ ఏర్పాటు పూర్తయ్యింది. రేపు ఎమ్మెల్యే ప్రారంభించనున్నారు. దీంతో కొండపై భక్తులకు మొబైల్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

ఇక మేము స్కూలుకు పోము..!
ఆ ఇద్దరు బాలికలు బడికి వెళ్లడం మానేశారు. గవర్నమెంటు ఇచ్చే పరిహారమూ వద్దన్నారు. కాల్స్ కి స్పందించడమూ మానేశారు. ఆగస్టు 6న కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఇద్దరు మైనర్ బాలికలు (8వ క్లాసు) హాస్టల్ నుంచి ఇంటికి వెళ్లేందుకు ఆటో ఎక్కారు. ఆ ఆటో డ్రైవర్ వంశీకిరణ్, ఆయన ఫ్రెండు సిద్దూ వారిని దారి మళ్లించి అత్యాచారం చేసినట్లు ఆరోపణలున్నాయని SP విద్యాసాగర్ నాయుడు చెప్పారు. POCSO కింద ఆ నిందితులను అరెస్ట్ చేశారు. అయితే ఈ ఘటన తర్వాత బాలికలు బడికి దూరమయ్యారు. చదువుతో కూడిన కలలకూ దూరమయ్యారు.

కిడ్నీ ప్రాబ్లమ్స్‌కు చెక్.. అదిరిపోయే 3 AI టూల్స్!
కిడ్నీ ప్రాబ్లమ్స్‌ను 1st స్టేజ్‌లోనే గుర్తించేందుకు IIT మద్రాస్, CMC వెల్లూర్ రీసెర్చర్స్ 3కొత్త AI టూల్స్ డెవలప్ చేశారు. 1. CKD రిస్క్ ప్రిడిక్షన్ మోడల్: మెడికల్ రిపోర్ట్స్‌ను ఎనలైజ్చేసి ఫ్యూచర్‌లో కిడ్నీ రిస్క్‌ను అంచనా వేస్తుంది. 2. CT స్కాన్ క్లాసిఫైయర్: కిడ్నీలో కణితులు, రాళ్లు, సిస్ట్‌లు ఉన్నాయో లేదో స్కాన్స్ లో ఐడెంటిఫై చేస్తుంది. 3. 3D ఇమేజింగ్ ప్లాట్‌ఫామ్: కణితుల సైజ్‌ను కచ్చితంగా మెజర్ చేస్తుంది. వీటితో స్టార్టింగ్ స్టేజ్‌లోనే ట్రీట్‌మెంట్ ఈజీ అవుతుందని ప్రొఫెసర్ శామ్యూల్ చెప్పారు.
ఏపీలో బస్సులో మంటలు.. డ్రైవర్ అప్రమత్తతతో అందరూ సేఫ్!
ఓ చిన్న షార్ట్ సర్క్యుట్. మంటలొచ్చాయ్. బస్సు మొత్తాన్ని కాల్చేసింది. చిన్న మంటొచ్చినప్పుడే డ్రైవర్ చూసి బస్సు ఆపేశారు. ప్యాసింజర్లను దించేశారు. దీంతో అందరూ సేఫ్. అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం మిడుతూరు వద్ద NH-44 పై 33 మంది ప్యాసింజర్లతో పోతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఈ ట్రాజెడీ జరిగింది. ఫైర్ ఇంజన్లు వచ్చినయ్. కానీ అప్పటికే బస్సు కాలిపోయింది. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. డ్రైవర్ టైముకు రెస్పాండ్ అవ్వడం అందరినీ కాపాడింది. ఇదే బిగ్ రిలీఫ్.

మరోసారి PSకి CJP మార్చ్!
ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద CJP ప్రోటెస్ట్‌లో యాక్టివిస్ట్ నిషు ఆజాద్ తండ్రి సంజయ్‌పై దాడి చేసిన నిందితుడు స్వతంత్ర భరద్వాజ్, పొలిటికల్ లీడర్ల సపోర్ట్ వల్ల తాను జైలుకు వెళ్లలేదని ఒక <a href="https://www.instagram.com/p/Dc1EggoCB2n/?utm_source=ig_web_copy_link&igsi=NTc4MTIwNjQ2YQ==">పాడ్‌కాస్ట్‌లో</a> చెప్పడం పెద్ద సంచలనమైంది. దీనిపై రాహుల్ గాంధీ రెస్పాండ్ అవుతూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, నిషుకు సపోర్ట్ ఇచ్చారు. నిందితుడిపై కఠిన యాక్షన్ తీసుకోవాలని CJP లీడర్ సౌరవ్ దాస్ <a href="https://www.instagram.com/p/Dc1ZldFD9kU/?utm_source=ig_web_copy_link&igsi=NTc4MTIwNjQ2YQ==">ఈ రోజు ఉదయం</a> 10 గంటలకు పార్లమెంట్ స్ట్రీట్ PSకి మార్చ్‌కి పిలుపునిచ్చారు.

న్యూయార్క్ లో AI నిషేధం..!
న్యూయార్క్ స్కూల్స్ లో AI టూల్స్‌కు ఫుల్ స్టాప్ పడింది. ప్రీ-కేజి నుంచి 8వ తరగతి వరకు ఈ బ్యాన్ ఉంటుంది. 6lacs స్టూడెంట్స్ పై ఇంపాక్ట్ ఉంటుంది. 40+ AI టూల్స్‌ని వెంటనే ఆపేశారు. ఎమోషనల్ సపోర్ట్ చాట్‌బాట్లు అన్ని క్లాసుల్లో నిషేధం. స్పెషల్ నీడ్స్ కిడ్స్ కి మాత్రం ఎక్సెప్షన్ ఇచ్చారు. టీచర్లు లెసన్ ప్లానింగ్ కి AI వాడొచ్చు. కానీ గ్రేడింగ్ కి మాత్రం వాడొద్దు! 3-5 క్లాసులకు 30min, 6-8కు 45min స్క్రీన్ టైమ్ లిమిట్. హైస్కూల్ కిడ్స్ కి AI లిటరసీ క్లాసులుంటాయి. న్యూయార్కే ఈ డెసిషన్ తీసుకుంటే మన సంగతి?

సిరిసిల్లలో మరమగ్గాలు ఆగిపోయినయ్.. 4వ రోజు!
కాటన్ చీరలను తయారు చేసే 500 మరమగ్గాలు ఇప్పుడు పని చేస్తలేవు. సాంచాల సప్పుడు కూడా ఇనిపస్తలేదు. నాలుగు రోజులైంది. ఒక చీరపై వర్కరుకు, ఆసామికి రూ.17.50 చొప్పున కూలి పెంచాలని అక్కడి ఓనర్లను అడిగితే పట్టించుకోలే. రెండేళ్లకోసారి హైక్ ఇవ్వాలన్నది ఒప్పందం. 2yrs దాటి మరో 2yrs అయ్యింది. అందుకే వర్కర్లు, ఆసాములంతా కలిసి ఆగస్టు 31నుంచి strike లోకి వెళ్లారు. ''మేమేమన్న వాటాలడుగుతున్నమా? ఒక దిక్కు ధరలు పెరుగుతుంటే నాలుగేళ్ల నుంచి కూలీ పెంచట్లే. న్యాయమైనదే ఇవ్వాలంటున్న''మని CITU లీడర్ కోడం రమణ చెబుతున్నారు.

బకెట్‌లో 160 డిటోనేటర్లు..
హైదరాబాద్ బొల్లారమ్ ఆర్మీ క్యాంప్ గోడ పక్కన ఒక ప్రైవేట్ ల్యాండ్‌లో బకెట్‌లో ఉన్న 160 ఎలక్ట్రికల్ డిటోనేటర్స్ దొరకడం పెద్ద షాకింగ్ న్యూస్ అయింది. రీసెంట్‌గా అక్కడ ఆర్మీ <a href="https://www.theclearcutnews.com/n/j7APUTj">వెపన్స్ దొంగతనం</a> అవ్వడంతో అందరిలో టెన్షన్ పెరిగింది. అయితే సైట్ డెవలప్‌మెంట్ వర్క్స్ కోసమే వీటిని తెచ్చారని, ఆ ఆయుధాల దొంగతనానికి దీనికి ఎలాంటి లింక్ లేదని డీసీపీ శ్రీధర్ క్లారిటీ ఇచ్చారు. కేర్‌లెస్‌గా డిటోనేటర్స్ వదిలేసిన ల్యాండ్ ఓనర్స్‌పై పోలీసులు కేస్ రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు.

పంది కిడ్నీతో 9 నెలలు జీవించిన వ్యక్తి
మనిషికి పంది కిడ్నీ.. అది కూడా జీన్ మార్పులు చేసినదైతే? అమెరికాకు చెందిన 66 ఏళ్ల టిమ్ ఆండ్రూస్‌కు జీన్ ఎడిట్ చేసిన పంది కిడ్నీని అమర్చగా, అది 271 రోజులు పనిచేసింది. ఈ సమయంలో ఆయనకు డయాలసిస్ అవసరం లేకపోవడం విశేషం. తర్వాత పంది కిడ్నీని తొలగించి, మానవ దాత కిడ్నీని విజయవంతంగా అమర్చారు. ఈ కేసు అవయవాల కొరత ఉన్న రోగులకు పంది అవయవాలను తాత్కాలిక ‘బ్రిడ్జ్’గా ఉపయోగించే అవకాశాన్ని చూపిస్తోంది. అయితే ఇది ఒక్క కేసు మాత్రమే.. మరిన్ని పరీక్షలు అవసరం. భవిష్యత్తులో అవయవ మార్పిడికి ఇది కొత్త మార్గం చూపొచ్చు.

ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు దిశగా ప్రయత్నాలు
ఉక్రెయిన్–రష్యా యుద్ధానికి ఎండ్ కార్డ్ పడుతుందా? మళ్లీ శాంతి చర్చలకు కదలిక మొదలైంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రతినిధులు స్టీవ్ విట్‌కాఫ్, జారెడ్ కుష్నర్ త్వరలో కీవ్, మాస్కోలో పర్యటించనున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు. ఇప్పటికే సమావేశాలకు తేదీలు ఫిక్స్ అయ్యాయని చెప్పారు. మరోవైపు రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా శాంతి ఒప్పందానికి అవకాశం ఉందని చెప్పారు. అయితే దాడులు ఇంకా కొనసాగుతుండటంతో ఈ చర్చలు నిజంగా యుద్ధానికి ముగింపు తీసుకొస్తాయా అనేది ఆసక్తిగా మారింది.

ఇస్రో GSLV F-17 సక్సెస్.. ఇది మన 'మూడో కన్ను'!
ISRO ఖాతాలో మరో సక్సెస్. శ్రీహరికోట నుంచి శుక్రవారం 2.55am కి GSLV-F17 రాకెట్ ద్వారా 2,367 కేజీల EOS-05 శాటిలైట్ను సక్సెస్ ఫుల్ గా ఆర్బిట్లోకి పంపింది. రాకెట్ నుంచి శాటిలైట్ డిటాచ్ కాగానే దాని సోలార్ ప్యానెళ్లు ఓపెన్ అయి, ఎఫెక్టివ్ గా పని స్టార్ట్ చేసింది. ఈ శాటిలైట్ 36K KM హైట్ లో geo synchronus orbit లో భూమితో ఈక్వల్ గా తిరుగుతూ, 30mints కి ఒకసారి Indiaతో పాటు పొరుగుదేశాల ఫోటో కూడా పంపుతుంది. ప్రకృతి డిజాస్టర్స్ నుంచి ప్రొటెక్షన్కు ఈ డేటా ఇంపార్టెంట్.. అందుకే ఇది మన మూడో కన్ను.

బంగారం ధరల్లో యూ టర్న్... తులంపై ఎంత పెరిగిందంటే..
బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. నిన్న ఒక్కరోజే బంగారం ధర తులంపై సుమారు రూ.3 వేలకుపైగా పెరిగింది. సెప్టెంబర్ 4న హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,55,360గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,42,410 వద్ద కొనసాగుతోంది. 18 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,16,520 వద్ద ట్రేడవుతోంది. ఢిల్లీలో 24 క్యారెట్ల ధర రూ.1,55,510గా ఉండగా, చెన్నైలో 18 క్యారెట్ల ధర రూ.1,20,110గా ఉంది. వెండి ధర రూ.2.50 లక్షల వద్ద కొనసాగుతోంది.

హాంకాంగ్‌పై భారత మహిళల జట్టు భారీ విజయం
మహిళల ఆసియా కప్ 2026లో భారత జట్టు హాంకాంగ్‌పై 137 పరుగుల తేడాతో భారీ విజయం సాధించి సెమీఫైనల్ బెర్త్ ఖాయం చేసుకుంది. దుబాయ్‌లో జరిగిన మ్యాచ్‌లో స్మృతి మంధాన 64 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్సర్లతో 124 పరుగులు చేయగా, భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 193 పరుగులు చేసింది. ఛేదనలో హాంకాంగ్ 16.2 ఓవర్లలో 56 పరుగులకు ఆలౌటైంది. ప్రేమా రావత్ 2 వికెట్లు తీయగా, నందిని శర్మతో సహా ఇతర బౌలర్లు రాణించారు. ఇప్పటికే థాయ్‌లాండ్‌ను ఓడించిన భారత్ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. తదుపరి మ్యాచ్ శనివారం పాకిస్తాన్‌తో జరగనుంది.

షర్టు జేబు ఎడమవైపే ఎందుకు ఉంటుందో తెలుసా?
మనం రోజూ వేసుకునే షర్టుల్లో ఓ కామన్ విషయం ఎప్పుడైనా గమనించారా? దాదాపు అన్ని షర్టుల్లో జేబు ఎడమవైపే ఉంటుంది. ఇది కేవలం డిజైన్ కోసం కాదు. దీని వెనక ఓ రీజన్ ఉంది. ప్రపంచంలో 85-90% మంది కుడిచేతితోనే పనులు చేస్తారు. అందుకే షర్టు జేబును ఎడమవైపు పెడితే, కుడిచేతితో అందులో ఉన్న పెన్, డబ్బులు, ఐడీ కార్డ్ లాంటి వాటిని ఈజీగా తీసుకోవచ్చు. ఇదే డిజైన్ తర్వాత స్టాండర్డ్‌గా మారిపోయి, ఇప్పటికీ చాలా షర్టుల్లో అలాగే కొనసాగుతోంది.

నిద్రలో మన శరీరం ఏం చేస్తుందో తెలుసా? 😴
మనకు నిద్ర అంటే రోజంతా చేసిన పనికి ఒక బ్రేక్‌లా అనిపిస్తుంది.. కానీ మనం నిద్రలోకి జారుకున్న వెంటనే శరీరం మాత్రం మరో షిఫ్ట్ మొదలుపెడుతుంది. మెదడు రోజంతా వచ్చిన సమాచారాన్ని ప్రాసెస్ చేస్తూ జ్ఞాపకాలను బలపరుస్తుంది. శరీరం కణజాలాల రిపేర్, హార్మోన్ల సమతుల్యత వంటి కీలక పనులను కొనసాగిస్తుంది. ఇదే సమయంలో గుండె వేగం, శ్వాస నెమ్మదిస్తాయి. అంటే నిద్రలో శరీరం లోపల రిపేర్, రీసెట్ పనులు జరుగుతూ ఉంటాయి. అందుకే మంచి నిద్ర మన మెదడు, శరీరాన్ని మరుసటి రోజుకు ఫ్రెష్‌గా సిద్ధం చేస్తుంది.

Digital Detox అంటే ఏమిటి?
లేవగానే ఫోన్, పడుకునే ముందు ఫోన్… నోటిఫికేషన్ ఫోన్! ఇలా స్క్రీన్ మన రోజులో ఎంత భాగమైందో మనకే తెలియదు. ఈ అలవాటుకు కాస్త బ్రేక్ ఇచ్చి, అవసరం లేని ఫోన్, సోషల్ మీడియా వాడకాన్ని తగ్గించడాన్నే "డిజిటల్ డిటాక్స్" అంటారు. అంటే ఫోన్‌ను పూర్తిగా వదిలేయడం కాదు… అవసరం లేని స్క్రీన్ టైమ్‌ను తగ్గించి, దృష్టిని నిజ జీవిత పనులపైకి మళ్లించడం. ఇలా చేస్తే ఫోకస్ పెరగడం, స్క్రీన్ అలవాటు తగ్గడం, మనసుకు ప్రశాంతత కలగడం వంటి ప్రయోజనాలు ఉండొచ్చు. టెక్నాలజీని వదిలేయడం కాదు.. దాన్ని కంట్రోల్ చేయడమే డిటాక్స్.

మన Feed మన అభిప్రాయాలను నిజంగానే మార్చగలదా?
మన ఫీడ్‌లో రోజూ కనిపించే పోస్టులు… మన అభిప్రాయాలపై ప్రభావం చూపగలవా? అవును, కొంతవరకు! మనం ఏ కంటెంట్‌ను చూస్తున్నాం, దేనికి స్పందిస్తున్నాం అనే దాని ఆధారంగా అల్గారిథమ్ మనకు ఇలాంటి పోస్టులనే మళ్లీ చూపిస్తుంది. దీంతో ఒకే రకమైన అభిప్రాయాలు పదే పదే కనిపిస్తూ, అవే నిజాల్లా అనిపించొచ్చు. 2026లో వచ్చిన ఒక పరిశోధనలో, Xలో అల్గారిథమిక్ ఫీడ్ వాడిన కొంతమంది వినియోగదారుల రాజకీయ అభిప్రాయాల్లో మార్పులు కనిపించాయి. అందుకే ఫీడ్ మన ఆలోచనలను పూర్తిగా నిర్ణయించదు… కానీ మనం రోజూ చూసేదాన్ని మాత్రం ప్రభావితం చేయగలదు.

అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు.. UAPA కేసు పెట్టాలని డిమాండ్
సంగారెడ్డి జిల్లాలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్‌ను అవమానిస్తూ హమారా ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు, పుస్తక కంటెంట్, సోషల్ మీడియా పోస్టులపై ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అనుముల తుకారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. అంబేద్కర్‌ను కించపరిచే ఈ కంటెంట్‌ను సమగ్రంగా పరిశీలించి, డిజిటల్ కంటెంట్‌ను తొలగించాలని, హమారా ప్రసాద్‌పై UAPA చట్టం కింద కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

శిశు మరణాలపై డీఎంహెచ్ఓ సమీక్ష.. కారణాల విశ్లేషణ తప్పనిసరి!
జగిత్యాల జిల్లాలో శిశు మరణాల నివారణకు అన్ని విభాగాలు సమన్వయంగా పనిచేయాలని డీఎంహెచ్ఓ డాక్టర్ జి. సుజాత సూచించారు. గురువారం సమీక్షలో హైరిస్క్ గర్భిణీల పర్యవేక్షణ, ప్రసవాలు, నవజాత శిశు సంరక్షణ, అత్యవసర రిఫరల్ సేవలపై చర్చించారు. ప్రతి మరణానికి కారణాలను విశ్లేషించి, పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డిప్యూటీ డీఎంహెచ్ఓలు డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ జైపాల్ రెడ్డి పాల్గొన్నారు.

లింగంపేట్‌కు గుడ్ న్యూస్.. రూ.4.50 కోట్ల బ్రిడ్జి!
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం లింగంపేట్‌లో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దుందుభి నదిపై రూ.4.50 కోట్లతో బ్రిడ్జి నిర్మిస్తామని ఆయన ప్రకటించారు. దీంతో గ్రామస్తుల రాకపోకలు సులభతరం కానున్నాయి. కార్యక్రమంలో కాంగ్రెస్ నేత మల్లికార్జున్ యాదవ్, సర్పంచ్ బాలస్వామి, డిప్యూటీ గోపి, కుమార్ నాగరాజు పాల్గొన్నారు.