Latest

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బొలెరో
AP: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణ పరిధిలోని ఊరందరు నేషనల్ హైవేపై రోడ్ యాక్సిడెంట్ జరిగింది. హైవేపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి చేపల లోడ్‌తో వెళ్తున్న బొలెరో వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బొలెరో వాహనం డ్రైవర్‌తో పాటు క్లీనర్ గాయపడ్డారు. గమనించిన స్థానికులు వెంటనే సమీప హాస్పిటల్‌కు తరలించారు. ఈ ప్రమాదంతో బొలెరో వాహనం ముందు భాగం నుజ్జు నుజ్జు అయింది. వాహనంలో ఉన్న చేపల లోడ్ రోడ్డుపై చిందరవందరగా పడిపోయింది.

అమెజాన్‌లో కత్తి తెప్పించుకుని ప్రేమోన్మాది దాష్టికం
TG: రాయదుర్గం ఇండ్ల బస్తీలో నివసించే కంచమీది గోవర్ధన్(23) అదే బస్తీకి చెందిన ఓ డిగ్రీ విద్యార్థిని(21)ని ప్రేమ పేరుతో వెంటపడుతున్నాడు. ఆమె రిజెక్ట్ చేయడంతో కక్ష పెట్టుకున్నాడు. విద్యార్థిని కుటుంబం తమ ఇంట్లోని ఫస్ట్ ఫ్లోర్‌లో ఉంటోంది. అతడు తెల్లవారుజామున 4 గంటలకు పక్కింటిపైకెక్కి ఆమె ఇంట్లోకి కత్తితో వచ్చాడు. కుటుంబ సభ్యులపై కత్తితో దాడి చేశాడు. ఇరుగుపొరుగు వారు వచ్చి ఆ ఉన్మాదిని పట్టుకుని బంధించి పోలీసులకు అప్పగించారు. జులాయిగా తిరిగే నిందితుడు అమెజాన్‌లో కత్తి తెప్పించుకున్నాడని, హత్యాయత్నం కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

ఇక వాట్సాప్‌లోనే మార్కుల మెమో
తెలంగాణలో విద్యను బలోపేతం చేసేందుకు CM రేవంత్ రెడ్డి కీలక సంస్కరణలు తీసుకువచ్చారు. విద్యార్థులకు మరింత వేగంగా, పారదర్శకంగా, సులభంగా సేవలను అందించేందుకు వాట్సాప్ ఆధారిత డిజిటల్ సేవలను అధికారికంగా ప్రవేశపెట్టారు. హైదరాబాద్‌లోని LB స్టేడియంలో గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో కలిసి CM ఈ సేవలను ప్రారంభించారు. వాట్సాప్ ద్వారానే ప్రోగ్రెస్ రిపోర్టులు, హాల్‌టికెట్లు, మార్కుల మెమోలు, SSC సర్టిఫికెట్లు పొందే అవకాశం కల్పించారు. త్వరలోనే అటెండెన్స్, స్కాలర్‌షిప్‌లు, యూనిఫామ్‌లు, పాఠ్యపుస్తకాల వివరాలు కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు.

కూతుళ్లే కొడుకులయ్యారు !
AP: బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం కే.జగన్నాథపురం గ్రామానికి చెందిన పిచ్చిక సత్యనారాయణ(52) తీవ్ర అనారోగ్యంతో మృతి చెందాడు. క్యాటరింగ్ పని చేస్తూ జీవనం సాగించే సత్యనారాయణకు మతిస్థిమితం లేని భార్య సత్యవతి ఉంది. మానసిక దివ్యాంగురాలైన సత్యవతికి సరైన వైద్యం అందక మతిస్తిమితం కోల్పోయింది. ఆయనకు ముగ్గురు కుమార్తెలు ప్రసన్న, జ్యోతిక, జ్యోత్స్నలు ఉన్నారు. అనారోగ్యంతో వాళ్ల నాన్న చనిపోవడంతో కుమార్తెలే అంత్యక్రియలు నిర్వహించారు.

అత్యాచారం కేసులో రిటైర్డ్ ఉద్యోగికి 21ఏళ్ల జైలుశిక్ష
TG: సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణానికి చెందిన వూసా వెంకటనారాయణ(84) రిటైర్డ్ ఉద్యోగి. హైదరాబాద్‌లోని చైతన్యపురి PS పరిధిలో స్థిరపడ్డాడు. ఆయన 2023లో మతిస్థిమితం సరిగాలేని ఓ బాలికకు బిస్కెట్లు, చాక్లెట్ల ఆశ చూపి తన ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కేసును విచారించిన రంగారెడ్డి జిల్లా ప్రత్యేక పోక్సో కోర్టు వెంకటనారాయణకు 21ఏళ్ల జైలుశిక్ష, రూ.30వేల జరిమానా విధించింది.

గాంధీ సరోవర్‌కు కేంద్ర రక్షణశాఖ గ్రీన్ సిగ్నల్
తెలంగాణ గవర్నమెంట్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు 83ఎకరాల భూములిచ్చేందుకు రక్షణశాఖ అనుమతి ఇచ్చింది. వర్కింగ్ పర్మిషన్ ఇస్తూ ఉత్తర్వులు జారి చేసింది. రక్షణశాఖ డిసిషన్‌పై CM రేవంత్ రెడ్డి, కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు 'ఎక్స్' వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. మూసీ అభివృద్ధిలో కీలక మైలురాయిని చేరుకున్నామన్నారు. నిరంతరం మంచినీటి ప్రవాహంతో మూసీ నదికి పునరుజ్జీవం కల్పిస్తామని, పర్యావరణ, సాంస్కృతిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని CM స్పష్టం చేశారు.

నిందితులకు శిక్ష పడేలా చేస్తాం: చంద్రబాబు
AP: విజయవాడకు చెందిన గాదె సాయికృష్ణ మిస్సింగ్ ఘటనలో నిందితులకు తప్పనిసరిగా శిక్ష పడేలా చేస్తామని సాయికృష్ణ తల్లి విజయలక్ష్మికి CM చంద్రబాబు భరోసా ఇచ్చారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు ఆఫీస్‌లో సాయికృష్ణ తల్లి, కుటుంబసభ్యులు చంద్రబాబును కలిసి తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ కేసును నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయించి బాధ్యులందరిపై కఠిన చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు. సాయికృష్ణ మిస్సింగ్ ఘటన, తర్వాత జరిగిన పరిణామాలను అడిగి తెలుసుకున్నారు. అన్నివిధాలా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

గడ్డి మందు నిషేధంపై హైకోర్ట్‌లో పిటిషన్
AP: పారాక్వాట్ డైక్లోరైడ్ 24% SL అనే గడ్డి మందు చాలా డేంజర్ అంటూ ఫిర్యాదులు రావడంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నిషేధించిన విషయం తెలిసిందే. ఇటీవల AP రాష్ట్ర వ్యవసాయశాఖ 60రోజులపాటు గడ్డిమందును నిషేధిస్తూ జారీ చేసిన GOను సవాల్ చేస్తూ ఫెర్టిలైజర్స్, సీడ్ డీలర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట నాగిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. పారాక్వాట్ తయారీ, పంపిణీ, విక్రయానికి అనుమతిచ్చేలా ఆదేశించాలని పిటిషన్‌లో నాగిరెడ్డి హైకోర్టును కోరారు. గవర్నమెంట్ ముందుగా తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా నిషేధం విధించిందని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నాడు.

ట్రంప్ కు ఇచ్చి పడేసిన మెలోనీ !
జీ7 సదస్సులో ట్రంప్ తో ఫోటో కోసం పాకులాడినట్లు అమెరికా అధ్యక్షుడు చేస్తున్న ప్రకటనలపై ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఫైర్ అయ్యారు. తానెప్పుడు ట్రంప్ తో ఫోటో కోసం పాకులాడలేదని, బతిమాలుకోలేదని, ఆఖర్మ తనకు పట్టలేదని అన్నారు. ట్రంప్ కు ఇలా మాట్లాడటం మామూలేనని మండి పడ్డారు. తాను గానీ, తన దేశం కానీ ఎవరి ముందూ ఇలాంటి చిల్లర వ్యవహారాల కోసం తల వంచమని, ప్రాధేయపడబోమని మెలోని స్పష్టం చేశారు. ట్రంప్ కామెంట్లు తమ ప్రధాని పరువు తీసేలా ఉన్నాయంటూ ఇటలీ ప్రభుత్వం కూడా సీరియస్ అయ్యింది.

కృష్ణలంక CI నాగరాజుపై హత్యానేరం కేసు
AP: రౌడీషీటర్ గాదె సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా CI నాగరాజుపై హత్యానేరం కేసు నమోదు చేశారు. ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసిన విజయవాడ కృష్ణలంక PSలోనే ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసులో దర్యాప్తు అధికారిగా (IO) ACP దైవప్రసాద్‌ను, CP రాజశేఖరబాబు నియమించారు. వారు కృష్ణలంకలోని తల్లి విజయలక్ష్మి వాంగ్మూలం తీసుకున్నారు. సుమారుగా 2 గంటలపాటు వారి నుంచి వివరాలు సేకరించారు. అనంతరం కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని అక్కడి సిబ్బందిని విచారించారు.

భూవివాదాలు లేని తెలంగాణే లక్ష్యం: పొంగులేటి
TG: భూసమస్యలు, భూవివాదాలు లేని తెలంగాణను నిర్మించాలనే లక్ష్యంతో ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా సాగు భూములను రీసర్వే చేయించాలనే కీలక నిర్ణయం తీసుకుందని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రెవెన్యూ అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫెరెన్స్‌లో మంత్రి మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా రీసర్వే కార్యక్రమాన్ని వచ్చే నెల నుంచి దశలవారీగా నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉన్న 10,954 రెవెన్యూ గ్రామాల్లో రీసర్వే చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి అంగుళం భూమికి స్పష్టమైన హద్దులు, ప్రతి సర్వే నంబరుకు భూధార్, ప్రతి రైతుకు భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

100 మంది అంబేడ్కర్లు రావాలి: CM రేవంత్ రెడ్డి
TG: ఆనాడు ఒక్క అంబేడ్కర్ వస్తేనే ప్రపంచానికి దిక్సూచి అయ్యారు. తెలంగాణ దళిత, గిరిజన, బలహీన వర్గాల నుంచి 100 మంది అంబేడ్కర్లు రావాలని, ఆ శక్తి మీలో ఉందని విద్యార్థులకు CM రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో ప్రభుత్వ, రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుతున్న 27.50 లక్షల మంది విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ‘యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్’ పంపిణీ కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. కిట్ల పంపిణీని హైదరాబాద్‌లోని LB స్టేడియంలో గవర్నర్‌తో కలిసి రేవంత్ రెడ్డి ప్రారంభించారు.

ఊబకాయులకు గుడ్ న్యూస్ ఈ జ్యూస్ !
శరీరంలో వాపులు తగ్గడానికి టమాటో, సోయాబీన్ దివ్యౌ షధంగా పనిచేస్తాయని రిసెర్చ్ లు చెబుతున్నాయి. టమాటో, సోయాబీన్ జ్యూస్ ని నెల్లాళ్లపాటు తాగిన వారిని పరిశీలించినప్పుడు ఈ మార్పు బయటపడింది.టమాటోలో ఉండే లైకోపీన్ ఇందుకు కారణమని గుర్తించారు. అలాగే సోయాబీన్స్ లోని ఐసో ఫ్లేవన్స్ కూడా ఇందుకు కారణమని శాస్త్రవేత్తలు తెలిపారు. అమెరికాలోని ఒహయో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ న్యూస్ షేర్ చేశారు. సో వాపులున్నవారు, ఊబకాయులు కూడా ఈ జ్యూస్ తాగితే మంచిది.
యోగా డే ఏర్పాట్లపై బాబా రాం దేవ్ తో చంద్రబాబు భేటీ
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని యోగా గురువు బాబా రామ్‌దేవ్ , పతంజలి అధినేత ఆచార్య బాలకృష్ణన్ మర్యాదపూర్వకంగా కలిశారు. యోగా డేలో పాల్గొనేందుకు రాష్ట్రానికి వచ్చిన బాబా రామ్‌దేవ్, బాలకృష్ణన్ సీఎం ఆహ్వానం మేరకు వారి నివాసానికి వచ్చారు. ఈ సందర్భంగా వారితో యోగా డే కార్యక్రమం నిర్వహణపై ముఖ్యమంత్రి చర్చించారు.

ఫ్రాన్స్ అధ్యక్షుడికి మోడీ కలంకారీ మహాభారత పెయింటింగ్ కానుక
భారత ప్రధాని మోదీ ఫ్రాన్స్ అధ్యక్షుడికి అందించిన ఈ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక కలంకారీ పెయింటింగ్ భారతీయ కళావైభవానికి ప్రతీక. సాంప్రదాయ పెన్ డ్రాయింగ్ పద్ధతిలో, సుమారు ఆరు నెలల పాటు శ్రమించి దీనిని రూపొందించారు. మహాభారత ఘట్టాలతో పాటు, ముఖ్యంగా అర్జునుడికి శ్రీకృష్ణుడు భగవద్గీతను బోధించే దృశ్యం ఇందులో హైలైట్. నైతిక నాయకత్వం, శాంతి, మానవ గౌరవం వంటి సార్వత్రిక విలువలను చాటిచెప్పే ఈ కళాఖండం అంతర్జాతీయంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

కళ్లకు పని పెట్టండి... మీ లైఫ్ బాగుటుంది
ఉరుకులు, పరుగుల డిజిటల్ యుగంలో యూత్‌కి ‘స్లో లుకింగ్’ (నిదానంగా గమనించడం) ఒక అద్భుతమైన లైఫ్ హ్యాక్‌లా పనిచేస్తుంది. ఏదైనా కళాఖండాన్ని, వస్తువును లేదా ప్రకృతిని కనీసం పది నిమిషాల పాటు ఏకాగ్రతతో నిశితంగా చూడటం వల్ల మెదడు చురుగ్గా మారుతుంది. ఇది మీలో ఒత్తిడిని తగ్గించి, సృజనాత్మకతను (Creativity), జ్ఞాపకశక్తిని మరియు ఫోకస్‌ను అద్భుతంగా పెంచుతుంది. కేవలం పైపైన చూసి దాటిపోకుండా, లోతుగా గమనించడం అలవాటు చేసుకుంటే జీవితంలో నిర్ణయాలు కూడా మెరుగవుతాయి!

నెటిజన్ల మనసు దోచిన స్విగ్గీ డెలివరీ బాయ్ !
"ముస్లిం డెలివరీ బాయ్‌ని పంపకండి" అంటూ జైపూర్‌లో ఓ కస్టమర్ స్విగ్గీ యాప్‌లో పెట్టిన వివక్షాపూరిత మెసేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే, ఈ ద్వేషాన్ని పక్కనబెట్టి.. తన రోజువారీ ప్రయాణాల్లో జైపూర్ ప్రజలు తనపై చూపిస్తున్న అపారమైన ప్రేమ, ఆదరణే నిజమైన భారతీయుల తత్వమని సదరు డెలివరీ బాయ్ అఫ్తాబ్ ఖాన్ గట్టిగా చాటిచెప్పాడు. మనుషుల మధ్య మతం కంటే మంచితనమే గొప్పదని నిరూపించిన ఈ వార్త నెటిజన్ల మనసులను గెలుచుకుంటోంది.

ఫెయిల్యూర్స్ నుంచే సక్సెస్ కు పునాదులు- ఇంద్రనూయి
విజయాల కంటే అపజయాలే వ్యాపార సామ్రాజ్యాలకు అసలైన దిక్సూచి! తప్పుల నుండి నేర్చుకుంటూ, విఫలమైన చోట నుంచే విజయ తీరాల వైపు ప్రయాణాన్ని ప్రారంభిం చడమే నిజమైన నాయకత్వ లక్షణం.ఫెయిల్ స్మార్టర్ అనే ఈ కొత్త పుస్తకం వ్యాపార ప్రపంచంలో విఫలమైన వ్యూహాలను ఎలా విజయవంత మైన అవకాశాలుగా మార్చుకోవచ్చో అద్భుతంగా విశ్లేషించింది. ఓటములను చూసి వెనకడుగు వేయరాదన్న మెసేజ్ ను ఈ బుక్ బాగా వివరిస్తోంది.పెప్సీ కంపెనీ మాజీ సీఈఓ ఇంద్రనూయీ రాసిన ఈ బుక్ ఈ తరానికి మంచి ఇన్స్ పిరేషన్ గా ఉంటుంది. సో బుక్ లవర్స్.. ఎంజాయ్ రీడింగ్ దిస్ బుక్ !

యూఎస్ ఆధ్వర్యంలో 30 దేశాల్లో వందల్లో బయో ల్యాబ్స్ !
ప్రపంచవ్యాప్తంగా 30కి పైగా దేశాల్లో ప్రమాదకర వ్యాధికారక క్రిములపై పరిశోధనలు సాగిస్తున్న 120 కంటే ఎక్కువ బయోల్యాబ్‌లకు అమెరికా దీర్ఘకాలంగా నిధులు సమకూరుస్తోందని యూఎస్ నేషనల్ ఇంటెలిజెన్స్ (DNI) సంచలన ఆధారాలు బయటపెట్టింది. ముఖ్యంగా ఉక్రెయిన్‌లోని ల్యాబ్‌లు రష్యా యుద్ధం వల్ల ముప్పులో ఉన్నాయని, రష్యా చేతికి చిక్కితే తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదముందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఉక్రెయిన్, అమెరికా చాలా కాలం క్రితమే ఈ జాయింట్ రిసెర్చ్ మొదలు పెట్టినట్లు అయితే అవి మానవాళి ప్రయోజనాలకోసమే ఉద్దేశించినవనీ ఉక్రెయిన్ గతంలో చెప్పుకుంది,
ఇటలీ PM మెలోని నాతో ఫోటో కోసం బేగ్ చేసింది: ట్రంప్
అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్, ఇటలీ PM జార్జియా మెలోని మధ్య స్టేట్‌మెంట్స్ వార్ పీక్స్‌కు చేరింది. "మెలోని నా దగ్గరకు వచ్చి ఒక ఫోటో కోసం బతిమిలాడింది (beg చేసింది)" అంటూ ట్రంప్ చేసిన కామెంట్స్‌పై ఇటలీ PM ఫుల్ సీరియస్ అయ్యారు. ట్రంప్ వ్యాఖ్యలు అన్నీ అబద్ధాలని, USA ప్రెసిడెంట్ తన మిత్రదేశాల పట్ల ఇలా ప్రవర్తించడం విచారకరమని మండిపడ్డారు. శత్రువుల దగ్గర సాఫ్ట్‌గా ఉండే ట్రంప్ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలని. "నేను కానీ, నా ఇటలీ దేశం కానీ ఎవరినీ బతిమిలాడవు" అంటూ మెలోని స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు.
మెడల్ తగిలించడానికి ట్రంప్ తిప్పలు? నవ్వు ఆపుకోలేకపోయిన ఆర్మీ ఆఫీసర్!
అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ అధికారిక కార్యక్రమంలో ఒక ఆసక్తికరమైన ఫన్నీ ఘటన చోటుచేసుకుంది. వైట్ హౌస్‌లో జరిగిన ఓ ప్రోగ్రామ్‌లో ఆర్మీ మేజర్ నికోలస్ డోకరీకి ప్రెసిడెంట్ ట్రంప్ అత్యున్నత 'మెడల్ ఆఫ్ ఆనర్' బహుకరించారు. అయితే, ఆ మెడల్‌ను ఆఫీసర్ కోటుకు తగిలించే క్రమంలో ట్రంప్ కాస్త ఇబ్బంది పడటంతో హాల్‌లోని వారంతా ఒక్కసారిగా నవ్వేశారు. దీనిపై ట్రంప్ కూడా కూల్‌గా స్పందిస్తూ.. "నేను దీన్ని కాస్త డిఫరెంట్‌గా, ఇంకాస్త నీట్‌గా తగిలిస్తాను, ఇది ఇక అస్సలు ఊడిపోదు" అంటూ ఫన్నీగా కామెంట్ చేశారు. ప్రెసిడెంట్ ట్రంప్‌కు సంబంధించిన ఈ క్రేజీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.