అమెజాన్‌లో కత్తి తెప్పించుకుని ప్రేమోన్మాది దాష్టికం

TG: రాయదుర్గం ఇండ్ల బస్తీలో నివసించే కంచమీది గోవర్ధన్(23) అదే బస్తీకి చెందిన ఓ డిగ్రీ విద్యార్థిని(21)ని ప్రేమ పేరుతో వెంటపడుతున్నాడు. ఆమె రిజెక్ట్ చేయడంతో కక్ష పెట్టుకున్నాడు. విద్యార్థిని కుటుంబం తమ ఇంట్లోని ఫస్ట్ ఫ్లోర్‌లో ఉంటోంది. అతడు తెల్లవారుజామున 4 గంటలకు పక్కింటిపైకెక్కి ఆమె ఇంట్లోకి కత్తితో వచ్చాడు. కుటుంబ సభ్యులపై కత్తితో దాడి చేశాడు. ఇరుగుపొరుగు వారు వచ్చి ఆ ఉన్మాదిని పట్టుకుని బంధించి పోలీసులకు అప్పగించారు. జులాయిగా తిరిగే నిందితుడు అమెజాన్‌లో కత్తి తెప్పించుకున్నాడని, హత్యాయత్నం కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.



