Latest

సమ్మె విరమించిన జూనియర్‌ డాక్టర్లు.. Govt.కు కోర్టు ఆదేశం
AP· 25 Aug 2026

సమ్మె విరమించిన జూనియర్‌ డాక్టర్లు.. Govt.కు కోర్టు ఆదేశం

AP: 16 రోజులుగా కొనసాగుతున్న జూనియర్‌ డాక్టర్ల సమ్మెకు తెరపడింది. సమ్మెను విరమిస్తున్నట్లు జూనియర్‌ డాక్టర్లు హైకోర్టుకు తెలిపారు. తమ డిమాండ్లను పరిష్కరించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోర్టును కోరారు. ఈ డిమాండ్లపై రెండు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. జూనియర్‌ డాక్టర్ల సమ్మెను సవాలు చేస్తూ హైకోర్టులో పిల్‌ దాఖలైంది. ఈ నేపథ్యంలో జూనియర్‌ డాక్టర్ల సంఘానికి కోర్టు నిన్న నోటీసులు జారీ చేసింది. దీంతో రాష్ట్రంలో నిలిచిపోయిన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి

అమిత్ షా దిష్టిబొమ్మ దహనం
TG· 25 Aug 2026

అమిత్ షా దిష్టిబొమ్మ దహనం

TG : ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసిన స్టూడెంట్స్‌పై పోలీసులు పెల్లెట్ గన్స్‌తో దాడి చేయడాన్ని వ్యతిరేకిస్తూ మహబూబాబాద్‌లో యూత్ కాంగ్రెస్ లీడర్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా దిష్టిబొమ్మను తగలబెట్టారు. 19 ఏళ్ల స్టూడెంట్ కంటిచూపు కోల్పోవడం చాలా దారుణమని, దీనికి బాధ్యత వహిస్తూ అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అజ్మీర సురేష్ నాయక్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు జక్కిరెడ్డి, శివచరణ్ రెడ్డి పిలుపు మేరకు ఈ ప్రోగ్రామ్ జరిగింది.

వైర్లు కిందకు వేలాడుతున్నాయని హైవే బంద్
Local· 25 Aug 2026

వైర్లు కిందకు వేలాడుతున్నాయని హైవే బంద్

AP : అంబేద్కర్ కోనసీమ జిల్లా శివకోటి గ్రామం వద్ద హైవేపై రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. హైవేపై 132 KV కరెంట్ వైర్లు కిందకు వేలాడుతుండటంతో పెద్ద వాహనాలకు ముప్పు ఉందని రాకపోకలు ఆపేశారు. చించినాడ బ్రిడ్జ్ వర్క్ జరిగినప్పుడే ఈ వైర్ల పనులు పూర్తి చేసి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు. ప్రస్తుతం ఒక రోడ్ క్రాసింగ్ టవర్ పిల్లర్ పని పూర్తయింది. మిగతా టవర్ వర్క్ కూడా త్వరగా పూర్తిచేయాలనీ డిమాండ్ చేశారు.

కృతి సనన్‌ రాఖీ యాడ్‌పై దుమారం.. కంగనా షాకింగ్‌ కామెంట్స్‌
National· 25 Aug 2026

కృతి సనన్‌ రాఖీ యాడ్‌పై దుమారం.. కంగనా షాకింగ్‌ కామెంట్స్‌

కృతి సనన్‌ నటించిన రక్షా బంధన్‌ యాడ్‌పై సోషల్‌ మీడియాలో వివాదం చెలరేగింది. ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్‌ కోసం చేసిన ఈ యాడ్‌లో కృతి వేసుకున్న బట్టలపై కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇండియన్ ఫెస్టివల్‌ను ఇలా చూపించడం సరికాదని విమర్శించారు. దీనిపై బీజేపీ MP, నటి కంగనా రనౌత్‌ స్పందించారు. రాఖీ కట్టేందుకు బికినీ వేసుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తూ.. యాడ్‌ చాలా అసహ్యంగా ఉందని విమర్శించారు. ఈ వివాదంపై కృతి ఇప్పటివరకు రెస్పాండ్ అవ్వలేదు.

1000 స్కూల్స్ లిస్ట్ ఇవ్వండి.. కేజ్రీవాల్ సవాల్!
Education· 25 Aug 2026

1000 స్కూల్స్ లిస్ట్ ఇవ్వండి.. కేజ్రీవాల్ సవాల్!

పంజాబ్‌లోని ప్రభుత్వ స్కూళ్లపై BJP చేస్తున్న విమర్శలపై AAP కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా స్పందించారు. గుజరాత్‌లో 30 ఏళ్ల BJP పాలన, పంజాబ్‌లో 4-1/2 ఏళ్ల AAP పాలనలోని స్కూళ్లను పోల్చి చూద్దామని ఛాలెంజ్ చేశారు. పంజాబ్ నుండి 1,000 స్కూళ్లు, గుజరాత్ నుండి 1,000 స్కూళ్ల లిస్ట్ తీసుకొని స్వయంగా ఇన్స్పెక్షన్ చేసి ఏవి బెటర్‌గా ఉన్నాయో తేలుద్దామన్నారు. పంజాబ్ విద్యా వ్యవస్థను BJP కావాలనే బద్నామ్ చేస్తోందని మండిపడ్డారు.

KGBV హాస్టల్లో ‘వన మహోత్సవం’
Local· 25 Aug 2026

KGBV హాస్టల్లో ‘వన మహోత్సవం’

TG : కొమురం భీం జిల్లా గంగాపూర్ KGBV హాస్టల్లో వన మహోత్సవం ఘనంగా జరిగింది. 'వనం ఉంటేనే జీవనం' అనే నినాదంతో Students, Officers కలిసి మొక్కలు నాటారు. పర్యావరణాన్ని కాపాడటం, పచ్చదనం పెంచడం, కాలుష్యాన్ని తగ్గించి వర్షాలు పడేలా చూడటమే ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం. అడవుల నరికివేతను ఆపేందుకు 1950లోనే అప్పటి కేంద్ర మంత్రి వన మహోత్సవాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గంగాపూర్ సర్పంచ్ వెంకటేశం చారి, KGBV టీచర్లు, Students పాల్గొన్నారు.

ఇస్లాంలో హిజాబ్ తప్పనిసరి కాదు: అలహాబాద్ కోర్టు
Current Affairs· 25 Aug 2026

ఇస్లాంలో హిజాబ్ తప్పనిసరి కాదు: అలహాబాద్ కోర్టు

ప్రయాగ్‌రాజ్‌కు చెందిన ఓ స్టూడెంట్ స్కూల్ యూనిఫాంతోపాటు హిజాబ్ వేసుకునేందుకు పర్మిషన్ కోరుతూ వేసిన పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది. హిజాబ్ ధరించడం ఇస్లామిక్ సంప్రదాయంలో అతి ముఖ్యమైనది కాదని, అది తప్పనిసరి మతాచారం కాదని జస్టిస్ జె.జె.మునీర్, జస్టిస్ ఇంద్రజిత్ శుక్లాల ధర్మాసనం క్లారిటీ ఇచ్చింది. స్కూల్ యూనిఫాం రూల్స్ అందరికీ సమానంగా వర్తించాలని, వ్యక్తిగత ఇష్టాలకు అనుగుణంగా మార్చే హక్కు విద్యార్థులకు లేదని తేల్చి చెప్పింది. యూనిఫాంకు అదనంగా ఏదైనా జోడిస్తే డిసిప్లిన్ దెబ్బతింటుందంది.

రోడ్డు కోసం గ్రామస్థుల ఆందోళన
Local· 25 Aug 2026

రోడ్డు కోసం గ్రామస్థుల ఆందోళన

TG: వరంగల్ జిల్లా నెక్కొండ మండలం చంద్రుగొండ గ్రామంలో సుమారు 30 మీటర్ల రహదారి పనులు పూర్తికాకపోవడంతో గ్రామస్థులు ధర్నాకు దిగారు. రెండు గంటలపాటు ఆందోళన చేసినా గ్రామ సర్పంచ్‌ సమస్య పరిష్కారానికి హాజరుకాకపోవడంపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 15 ఏళ్లలో గ్రామంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదని తెలిపారు. అధికార పార్టీ, ఎమ్మెల్యే, ప్రభుత్వం ఉన్నా చిన్న సమస్య పరిష్కారానికి ప్రజలు ధర్నా చేయాల్సి రావడం బాధాకరమన్నారు. పోలీసులు వచ్చి ధర్నా విరమింపజేశారని వార్డు సభ్యుడు బక్కి శివకృష్ణ తెలిపారు.

చెన్నారావుపేటలో స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ
Local· 25 Aug 2026

చెన్నారావుపేటలో స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ

TG: వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలో స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు సులభంగా అందించేందుకు స్మార్ట్‌ రేషన్‌ కార్డులు ఉపయోగపడతాయని తెలిపారు. ప్రజలు కార్డులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలి
Local· 25 Aug 2026

పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలి

TG: వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని 5వ డివిజన్‌లోని జూనియర్‌ కళాశాల ప్రాంగణంలో రాష్ట్ర ప్రభుత్వం అందించిన మొక్కలతో వనమహోత్సవం నిర్వహించారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో మున్సిపల్‌ చైర్మన్‌ పెండెం శ్రీలక్ష్మి రామానంద్‌ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని, భావితరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైస్‌ చైర్మన్‌, కమిషనర్‌, కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొని మొక్కలు నాటారు.

వెంకటాపురంలో స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ
Local· 25 Aug 2026

వెంకటాపురంలో స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ

TG: వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం వెంకటాపురం గ్రామంలో స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. సర్పంచ్‌ పొగాకు శోభారాణి వెంకటేశ్వర్లు కార్డుదారులకు స్మార్ట్‌ కార్డులను అందజేశారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె తెలిపారు. స్మార్ట్‌ కార్డులతో ప్రజలకు మరింత సౌకర్యం కలుగుతుందన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ ఛైర్మన్‌ ఇంగోలి రాజేశ్వరరావు, ఉపసర్పంచ్‌ మార్కెట్‌ రవి, వార్డు సభ్యులు, అధికారులు, కార్డుదారులు పాల్గొన్నారు.

‘జాంబీ రెడ్డి 2’లో ఉపేంద్ర.. షనాయా కపూర్‌ ఎంట్రీ
Entertainment· 25 Aug 2026

‘జాంబీ రెడ్డి 2’లో ఉపేంద్ర.. షనాయా కపూర్‌ ఎంట్రీ

‘జాంబీ రెడ్డి 2 NXT LVL’ టైటిల్‌ను మేకర్స్‌ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. తేజ సజ్జ మరోసారి హీరోగా కనిపించనున్నారు. హైదరాబాద్‌లో జాంబీలు విజృంభించే కథతో సీక్వెల్‌ సాగనుంది. కన్నడ స్టార్‌ ఉపేంద్ర మెయిన్ రోల్ లో నటించనుండగా.. షనాయా కపూర్‌ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. సుపర్ణ్‌ S. వర్మ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. 2027లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మూవీ మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు.

గ్యాస్ కోసం గిరిజన మహిళల అవస్థలు
Local· 25 Aug 2026

గ్యాస్ కోసం గిరిజన మహిళల అవస్థలు

AP: అనకాపల్లి జిల్లా రావికమతం మండలంలోని గిరిజన గ్రామాల మహిళలు గ్యాస్ సిలిండర్ల కోసం పడుతున్న ఇబ్బందులకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తున్నారు. చీమలపాడు పంచాయతీ పరిధిలోని జెడ్. జోగంపేటలో గ్యాస్ పంపిణీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని 10కి పైగా గ్రామాల మహిళలు కోరారు. ప్రస్తుతం సిలిండర్ల కోసం సుమారు 12 కిలోమీటర్ల దూరంలోని చీమలపాడు వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. బంగారు బంధాలు, కడగడ్డ, అజయ్‌పురం, జెడ్. జోగంపేట, గంగంపేట, నేరేడు బంధం తదితర గ్రామాల్లో 174 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని తెలిపారు.

పచ్చదనం కోసం అందరూ కదలాలి: ఎస్పీ జానకి షర్మిల
Local· 25 Aug 2026

పచ్చదనం కోసం అందరూ కదలాలి: ఎస్పీ జానకి షర్మిల

TG: పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వనమహోత్సవంలో భాగంగా సారంగాపూర్ మండలం ఆడెల్లి గ్రామంలో ఎస్పీ మొక్కలు నాటారు. రాష్ట్రవ్యాప్తంగా 16.03 కోట్ల మొక్కలు నాటాలనే లక్ష్యంలో ఇప్పటికే 9.06 కోట్ల మొక్కలు నాటినట్లు ఆమె తెలిపారు. మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రజలు వనమహోత్సవంలో భాగస్వాములు కావాలని కోరారు.

వర్షం పడితే ఫ్లైట్స్ ఎందుకు క్యాన్సిల్ అవుతాయి?
Current Affairs· 25 Aug 2026

వర్షం పడితే ఫ్లైట్స్ ఎందుకు క్యాన్సిల్ అవుతాయి?

వర్షాలు, తుఫాన్ల వల్ల ఢిల్లీలో 26విమానాలు క్యాన్సిల్ అవ్వగా, మరో 15 ప్లేన్స్ డైవర్ట్ అయ్యాయి. నిజానికి మోడర్న్ కమర్షియల్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు బ్యాడ్ వాతావరణంలో ప్రయాణించేలా అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో డిజైన్ చేస్తారు. పైలట్లకు బయటి విజిబిలిటీ తగ్గినా, కాక్‌పిట్‌లోని ఇన్‌స్ట్రుమెంట్స్ సాయంతో ఫ్లై చేసేలా స్పెషల్ ట్రైనింగ్ ఉంటుంది. విమానం చాలా ఎత్తులో ఉన్నప్పుడు వర్షంతో ప్రాబ్లమ్ ఉండదు. కానీ టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో బ్యాడ్ వెదర్ వల్ల రన్‌వే విజిబిలిటీ తగ్గి ఫ్లైట్ ఆపరేషన్స్ బాగా డిస్టర్బ్ అవుతుంటయి.

'ఇరుముడి’ పాపకి బిగ్ surprise!
Entertainment· 25 Aug 2026

'ఇరుముడి’ పాపకి బిగ్ surprise!

'ఇరుముడి' మూవీ సక్సెస్ మీట్ తర్వాత డైరెక్టర్ శివ నిర్వాణ చైల్డ్ ఆర్టిస్ట్ బేబీ నక్షత్రకు ఒక క్రేజీ సర్‌ప్రైజ్ ఇచ్చారు. కోలీవుడ్ స్టార్ హీరో, నేషనల్ అవార్డ్ విన్నర్ ధనుష్‌తో ఆమెకు వీడియో కాల్ మాట్లాడించారు. సినిమాలో నక్షత్ర పర్ఫార్మెన్స్ చూసి ఫిదా అయిన ధనుష్, 'ఎప్పుడైనా కలిసినప్పుడు నీ దగ్గర యాక్టింగ్ నేర్చుకోవాలి' అని సరదాగా అభినందించారు. స్టార్ హీరో నుంచి ఇలాంటి కాంప్లిమెంట్ రావడం చూసి నక్షత్ర ఫుల్ హ్యాపీ అయిపోయింది.

భద్రాచలంలో యూత్ కాంగ్రెస్ నాయకుల నిరసన
Local· 25 Aug 2026

భద్రాచలంలో యూత్ కాంగ్రెస్ నాయకుల నిరసన

TG: నీట్ పేపర్ లీకేజీపై నిరసన తెలిపిన విద్యార్థులపై పెలెట్ గన్ దాడిని ఖండిస్తూ భద్రాద్రికొత్తగూడెం జిల్లా యూత్ కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు చీకటి కార్తీక్ ఆధ్వర్యంలో, తెలంగాణ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ ఆవరణలో నిరసన నిర్వహించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు చెందిన యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

గ్రామాన్ని పచ్చదనంతో నింపేసిన జనం
Local· 25 Aug 2026

గ్రామాన్ని పచ్చదనంతో నింపేసిన జనం

TG : నిర్మల్ జిల్లా ముధోల్ మండలం చింతాల గ్రామంలో 'వన మహోత్సవం' కార్యక్రమంలో భాగంగా మెగా ప్లాంటేషన్ డ్రైవ్ నిర్వహించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు స్కూల్ ఆవరణతో పాటు రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దొడ్డికింది సర్వేశ్, ఉపసర్పంచ్ పీసర సాయినాథ్ గౌడ్, టీచర్లు, స్టూడెంట్స్, ఉపాధి హామీ కూలీలు పాల్గొని మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటాలని కోరారు.

పాడుబడ్డ గదిలో మృతదేహం
Local· 25 Aug 2026

పాడుబడ్డ గదిలో మృతదేహం

AP: సత్యసాయి జిల్లాలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. చిలమతూరు మండలం కనిశెట్టిపల్లి గ్రామ శివారులో NH-44 పక్కన ఉన్న పాడుబడ్డ గదిలో గుర్తుతెలియని వ్యక్తి ఉరివేసుకుని మృతిచెందినట్లు పోలీసులు గుర్తించారు. సుమారు రెండు రోజుల క్రితమే కొబ్బరిపీచు తాడుతో ఉరివేసుకుని మృతిచెందినట్లు తెలిపారు. మృతుడు ఎరుపు రంగు టీషర్ట్, నల్ల ప్యాంటు ధరించి ఉన్నాడు. ఘటనాస్థలంలో లభించిన బ్యాగులో షాంపూ, డియో, టూత్‌పేస్ట్ మాత్రమే ఉండగా ఎలాంటి గుర్తింపు కార్డులు లభించలేదు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

కాలనీవాసుల సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే
Local· 25 Aug 2026

కాలనీవాసుల సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే

TG: ప్రజల వద్దకే వెళ్లి సమస్యలు తెలుసుకోవడమే లక్ష్యంగా మదీనాగూడలో ‘వన్ డే–వన్ వార్డ్’ కార్యక్రమం నిర్వహించారు. మైత్రినగర్ పార్క్‌లో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ వి. జగదీశ్వర్ గౌడ్, కమిషనర్ సృజనతో పాటు అధికారులు పాల్గొన్నారు. మదీనాగూడ, హఫీజ్‌పేట్ ప్రాంతాల కాలనీవాసులతో నేతలు ముఖాముఖి మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. రోడ్లు, పారిశుద్ధ్యం, డ్రైనేజీ తదితర సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పరిష్కార చర్యలు చేపట్టాలన్నారు.

పొలాల్లోకి దూసుకెళ్లిన బస్సు!
Local· 25 Aug 2026

పొలాల్లోకి దూసుకెళ్లిన బస్సు!

AP : విజయనగరం జిల్లా రేగిడి మండలం తునివాడ దగ్గర తమ్మినాయుడు కాలేజీ & స్కూల్ బస్సు అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఆ టైమ్‌లో బస్సులో 7 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఈ యాక్సిడెంట్‌లో 9వ తరగతి చదువుతున్న పల్లి మిధున అనే అమ్మాయికి గాయాలవ్వగా, మిగతా పిల్లలంతా సేఫ్‌గా బయటపడ్డారు. బస్సు కండిషన్ అస్సలు బాలేదని ముందే మేనేజ్‌మెంట్‌కి చెప్పానని డ్రైవర్ అంటున్నాడు. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో పేరెంట్స్ ఊపిరి పీల్చుకున్నారు.