1000 స్కూల్స్ లిస్ట్ ఇవ్వండి.. కేజ్రీవాల్ సవాల్!
పంజాబ్‌లోని ప్రభుత్వ స్కూళ్లపై BJP చేస్తున్న విమర్శలపై AAP కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా స్పందించారు. గుజరాత్‌లో 30 ఏళ్ల BJP పాలన, పంజాబ్‌లో 4-1/2 ఏళ్ల AAP పాలనలోని స్కూళ్లను పోల్చి చూద్దామని ఛాలెంజ్ చేశారు. పంజాబ్ నుండి 1,000 స్కూళ్లు, గుజరాత్ నుండి 1,000 స్కూళ్ల లిస్ట్ తీసుకొని స్వయంగా ఇన్స్పెక్షన్ చేసి ఏవి బెటర్‌గా ఉన్నాయో తేలుద్దామన్నారు. పంజాబ్ విద్యా వ్యవస్థను BJP కావాలనే బద్నామ్ చేస్తోందని మండిపడ్డారు.



